కేజ్రీపై తగ్గుతున్న క్రేజీ


Sun,January 3, 2016 12:55 AM

తన పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మరల్చడానికే సాధ్యంకాని డిమాండ్లతో ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదాకావాలని, లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలు కుదించడంపై కేజ్రీవాల్ రాద్ధాంతం చేస్తున్నారు.తన పాలనా వైఫల్యాలకు కేంద్రమే కారణమనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నారు. కేజ్రీవాల్ వ్యవహారశైలి చూశాక ఆయనపై ప్రజలకు మునుపున్న క్రేజీ తగ్గముఖం పడుతున్న మాట కాదనలేనిది. అలాగే ఆప్ పార్టీని ఆయన ఒక సంప్రదాయ పార్టీగా మార్చేశారనడంలోనూ అనుమానం లేదు.

srinivas


ఢిల్లీలో రెండోసారి అధికారం చేపట్టిన నాటి నుంచి పత్రికల్లో కేజ్రీవాల్ వివాదాల వార్త లేని రోజు లేదు. కేంద్రంతో నిత్య ఘర్షణే కేజ్రీవాల్ ఎజెండాగా మారిందా? రాజకీయ ఆరోపణ, ప్రత్యారోపణలు అవసరానికి మించి కేజ్రీవాల్ రోజూ కొనసాగిస్తుండటమేపై ప్రశ్నకు కార ణం.అవినీతిపై పోరాటం కోసం, జన్‌లోక్‌పాల్ కోసం, నీతివంతమైన పాలన కోసం, సగటు మనిషి (ఆమ్ ఆద్మీ) సమస్యలే తమ ఎజెండాగా పుట్టుకొచ్చిన పార్టీ అది. ఢిల్లీ ప్రజలు సంప్రదా య రాజకీయపార్టీలతో విసిగిపోయి మార్పు కోసం కొత్త రాజకీయాన్ని కోరుకున్నారు. అయితే ఆప్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నది.

కేజ్రీవాల్ పాలనపై ప్రజల్లో మునుపటి క్రేజీ తగ్గుముఖం పడుతున్నదా? ఇలాంటి కీలక ప్రశ్న ఎందుకు ఉదయస్తున్నది? ఆయనకు అవినీతిపై పోరా టం కన్నా వైరుద్ధ్య రాజకీయాలపైనే ఎక్కువ మక్కువ పెరుతుండటం, కేంద్రంతో ఆయన రోజూ ఘర్షణపడుతుండటం, మారిన ఆయన తీరువల్ల ఆమ్ ఆద్మీపార్టీ రోజురోజుకూ ఓ సంప్రదాయ పార్టీగా మారిపోతున్నది. దీంతో ఆయన పట్ల గతంలో ప్రజల్లో ఉన్న క్రేజీ తగ్గుముఖం పడుతున్నదా అనే అనుమానం రావడంలో ఆశ్చర్యం లేదు.

అరవింద్ కేజ్రీవాల్ ఒకప్పటి ఐఆర్‌ఎస్ బ్యూరోక్రాట్. ఉద్యోగం వదిలి సామాజిక ఉద్యమాల్లోకి వచ్చారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. కొత్త రాజకీయాన్ని ఆశిస్తున్న ప్రజల నాడిని పసిగట్టాడు. అన్నా హజారే ఢిల్లీలో చేపట్టిన దీక్షలో కీలకపాత్ర పోషించాడు. అవినీతికి దివ్య ఔషధం జన్‌లోక్‌పాల్ బిల్లు మాత్రమే అని అన్నా హజారేతో పాటు, కేజ్రీవాల్ పేరూ అప్పట్లో బాగా పాపులరైంది. అది చాలనుకున్నట్లున్నారు. అవినీతిని అరికట్టాలన్నా, జన్‌లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందాలన్నా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాల్సిందే అని కేజ్రివాల్, ఆయన సహచరులు డిసైడైపోయారు. ఆమ్ ఆద్మీ పేరుతో పార్టీ స్థాపించారు. ప్రముఖ సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ లాంటి వారు అనేకులు ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించిన వారిలో ఉన్నారు. ఝాడూ(చీపురు) ఎన్నికల గుర్తుగా, టోపీ ఆమ్‌ఆద్మీ కార్యకర్త గుర్తుగా దేశంలో ఒక రకమైన పొలిటికల్ క్రేజీని అప్పట్లో సృష్టించగలిగారు.

ఢిల్లీ ఎన్నికలనే ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఆ పార్టీ పుట్టిందనే వాళ్లూ ఉన్నారు. 2013 ఢిల్లీ ఎన్నికల్లో రెండో పెద్దపార్టీగా అధికారం చేపట్టి, 49 రోజుల తర్వాత తనంతట తానే ప్రభుత్వం నుంచి వైదొలగడాన్ని ఢిల్లీ ప్రజలు సైతం తప్పుపట్టారు. ఆ తదుపరి లోక్‌సభ ఎన్నికలలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క లోక్‌సభ స్థానం కూడా గెలవలేకపోయింది. ఆ తదుపరి జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలలో చీపురుతో ఊడ్చినట్లుగా 67 స్థానాలు ఆప్ పార్టీ గెలుచుకుని ఒక సంచలనమే సృష్టించింది. కానీ ఏకోన్ముఖ ఫలితాలతో కేజ్రీవాల్ ఆలోచనల్లో కొన్ని మార్పులు కొట్టొచ్చినట్లు కనిపించాయి, కనిపిస్తున్నాయి.

దేశంలో కమ్యూనిస్టుపార్టీలు, భారతీయ జనతాపార్టీ తప్ప దాదాపు మిగిలిన అన్నిపార్టీలలోనూ జోడు పదవుల సంప్రదాయం కొనసాగుతున్నది.అవన్నీ సంప్రదాయ పార్టీలుగానే చెలామణిలో ఉంటూ ప్రజాదరణ పొందుతుండటం వేరే విష యం. కానీఅలాంటి సంప్రదాయ పార్టీలకు అతీతమైనదిగా ప్రజలకు ప్రజెంట్ చేయబడిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా ఉండాలి? కేజ్రీవాల్ ఇవాళ ఢిల్లీకి ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఆమ్ ఆద్మీపార్టీకి జాతీయ కన్వీనర్ కూడా. ఒకే వ్యక్తి రెండు పదవులను నిర్వహించడం అంత సులభం కాదని ఆయన సహచరులు సలహా ఇచ్చారు. ఏదో ఒక పదవిని వదలితే పార్టీకి మేలు జరుగుతుందన్న ఆయన సహచరుల సలహాను ఆయన పట్టించుకోలేదు. పైగా తన జోడు పదవులను ప్రశ్నించిన వారిని పార్టీ నుంచి బయటికి పంపించారు.

యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ వంటి సామాజిక, రాజకీయ మేధావులను ఇంటికి పంపించిన అరవింద్ కేజ్రీవాల్‌లో ఇవాళ నీతివంతమైన రాజకీయం ఏమేరకు బతికి ఉందనుకోవచ్చు? ఆ ప్రశ్న సగటు మనిషి (ఆమ్ ఆద్మీ)కి కలగడం సహజం. నీతిని గాలికి వదలి కొందరు నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు కలిగిన వారిని కూడా కేజ్రీవాల్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉండటం గమనార్హం. వివిధ కేసుల్లో ఐదుగురు ఆప్ ఎమ్మెల్యేలు అరెస్టయ్యారు. ఒక ఆప్ ఎమ్మెల్యే(అఖిలేశ్ త్రిపాఠి)పై 21 కేసులు ఉన్నాయట.

జన్‌లోక్‌పాల్ బిల్లును కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ అసెంబ్లీలో ఆమోదించుకుంది. ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపింది. నిజానికి అది పార్లమెంటు ఆమోదిస్తేనే అమల్లోకి వస్తుందనే విషయం తెలిసిందే. అయినా ఆ బిల్లును తమ రాష్ట్ర ప్రభుత్వం తనకు తానే ఆచరిస్తుందని కేజ్రీవాల్ చెప్పారు. నా ఇంట్లో సీబీఐ సోదా చేస్తే నాలుగు మఫ్లర్లు తప్ప మరేమీ దొరకవని కేజ్రీవాల ఈ మధ్య వ్యాఖ్యానించారు. తన గొప్పతనం గురించి చెప్పుకోవడం కాదు, తన ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధుల గురించి కూడా కేజ్రీవాల్ చెప్పిఉంటే బాగుండేదేమో! తన క్యాబినెట్‌లోకి నకిలీ డిగ్రీలు కలిగిన వారిని మంత్రులుగా తీసుకోవడం, కొందరు ఎమ్మెల్యేలు నేరారోపణలు కలిగి ఉండటంపై కేజ్రీవాల్ ఏమైనా చర్యలు తీసుకున్నారా? అలాంటపుడు జన్‌లోక్‌పాల్ లాంటి బిల్లులను తమకు తామే ఆచరిస్తున్నామని చెప్పుకోవడంలోని చిత్తశుద్ధిని సామాన్యుడు శంకించడా? ఒకప్పుడు లాలు ప్రసాద్ యాదవ్ అవినీతిని ఎండగట్టిన కేజ్రీవాల్, ఇపుడు స్వయాన అదే లాలును పట్నా గాంధీ మైదానంలో ఆలింగనం చేసుకోవడాన్ని చూసి నెటిజన్ల నుంచి సామాన్యుల దాకా ఆశ్చర్యపోయారు.

కేజ్రీవాల్ పొలిటికల్ డైరీలో ఇపుడు అవినీతిపై పోరాటం కన్నా, ఫక్తూ రాజకీయానిదే ప్రథమ ప్రాధాన్యం. కేజ్రీవాల్‌లో నిక్కచ్చితనం పోయి వ్యక్తిగతం పెరిగిందనడానికి పై విషయాలన్నీ ఉదాహరణలు. అకౌంటబిలిటీ ఇతరులకే తప్ప తనకు వర్తించదని కేజ్రీవాల్ నిరూపించుకున్న సంఘటన గురించి ఇక్కడ చెప్పుకోవాలి. కేజ్రీవాల్ ఉంటున్న ఇంటి విద్యుత్ బిల్లుల విషయం సమాచారహక్కు కింద బయటకొచ్చింది. 2014 జూన్ నెలకు కేజ్రీవాల్ అధికారిక ఇంటి బిల్లు రూ.1.35 లక్షలు. ఈ విధంగా కేజ్రీవాల్‌లో సామాన్యుడు కనిపిస్తున్నాడా, లేక సంప్రదాయ పాలకుడు కనిపిస్తున్నాడా?

ఆమ్ ఆద్మీపార్టీ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు చాలానే ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి మంచినీరు ప్రతి కుటుంబానికి 20 లీటర్లు ఉచితం, విద్యుత్తు 400 యూని ట్ల లోపు వాడే వారికి 50శాతం ఉచితం అనే వాగ్దానాలు అమలులోకి తెచ్చారు. ఇంకా మిగిలిన అనేక హామీలలో తప్పడడుగులు తప్పడం లేదు. అసలు ఊసెత్తని వాగ్దానాలు మరికొన్ని మురుగుతున్నాయి. కొత్త రాజకీయం సాధ్యమయ్యే వాగ్దానాలే చేస్తుందని ఎవరైనా ఆశిస్తారు. కానీ ఆప్ పార్టీ వాగ్దాన భంగాలకు గురవడాన్ని ఎలా అర్థంచేసుకోగలం? ఇచ్చిన హామీలలో మేము కనీసం 40-50 శాతంవచ్చే నాలుగేళ్లలో నెరవేరుస్తామని ఆపార్టీ చెపుతున్నది. అంటే సంప్రదాయ పార్టీల వలె కేజ్రీవాల్ కూడా 50 శాతం సాధ్యం కాని వాగ్దానాలు చేశారని ఆయనే ఒప్పుకుంటున్నట్లు గదా!

కేజ్రీవాల్ ఢిల్లీకి పూర్తి రాష్ట్రస్థాయి హోదా కావాలనుకున్నా, శాంతిభద్రతలు ఢిల్లీ రాష్ట్ర పరిధిలోకి రావాలన్నా, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అధికారాలకు కత్తెర పెట్టాల న్నా... అతను ఒంటరి పోరాటం చేస్తే సాధ్యమయ్యేది కాదు. పై డిమాండ్లన్నీ సాధించుకోవాలంటే దేశంలో ఉన్న 29 రాష్ర్టాల మద్దతును కూడగట్టాలి. ఆ పని కేజ్రీవాల్ ఏనాడైనా చేశాడా? చేస్తున్నాడా? రాద్ధాంతం చేయడం, తన కొత్త రాజకీయానికి ముసుగేసుకోవడంలో భాగమే కావచ్చనే సామాన్యుడి సంశయాన్ని పూర్తిగా కొట్టేయలగలమా?

పై విషయాలన్నీ చూశాక కేంద్రంతో కేజ్రీవాల్ ఎందుకు నిత్య ఘర్షణకు దిగుతున్నారో చాలా సులభంగా అర్థం కాగలుగుతుంది. దేశానికి ఢిల్లీ రాజధాని. అది రాష్ట్రంగా అవతరించినా అక్కడి శాంతిభద్రతలకు సంబంధించిన పోలీసు వ్యవస్థ కేంద్రం చేతిలోనే ఉండటం రాజ్యాంగబద్ధమే. ఢిల్లీని కేజ్రీవాల్ ఒక రాష్ట్రంగానే చూస్తున్నారు. కానీ 127 కోట్ల భారతీయులకు, అలాగే అది యావద్ ప్రపంచదేశాలకు భారతదేశ రాజధాని అనే విషయాన్ని కేజ్రీవాల్ ఎందుకు మరిచిపోతున్నారు? ఢిల్లీ శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని ఎందుకు అడుగుతున్నారు? ఢిల్లీ రాజధానిలో ఉండే లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను కుదించాలని ఎందుకు పదే పదే డిమాండ్ చేస్తున్నారు? ఢిల్లీకి పూర్తి రాష్ట్రస్థాయి హోదా కోరడం తప్పుకాకపోవచ్చు. కానీ దేశ భద్రత రీత్యా ఢిల్లీకి పూర్తి రాష్ట్రస్థాయి హోదా కల్పించడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. కాబట్టి అది అసాధ్యమనే విషయం కేజ్రీవాల్‌కు తెలియదనుకుందామా? మొన్నటిదాకా కేజ్రీవాల్‌పై ఢిల్లీ ప్రజలకు ఎంత క్రేజీ ఉండిందో, నరేంద్ర మోదీపై కూడా అంతే క్రేజ్ ఉండింది. అందుకే మోదీయే తన ప్రత్యర్థిగా కేజ్రీవాల్ రాజకీయం సాగిస్తున్నారు.

తన పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మరల్చడానికే సాధ్యంకాని డిమాండ్లతో ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదాకావాలని, లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలు కుదించడంపై కేజ్రీవాల్ రాద్ధాంతం చేస్తున్నారు. తన పాలనా వైఫల్యాలకు కేంద్రమే కారణమనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నారు. కేజ్రీవాల్ వ్యవహారశైలి చూశాక ఆయనపై ప్రజలకు మునుపున్న క్రేజీ తగ్గముఖం పడుతున్న మాట కాదనలేనిది. అలాగే ఆప్ పార్టీని ఆయన ఒక సంప్రదాయ పార్టీగా మార్చేశారనడంలోనూ అనుమానం లేదు. అందుకే, సింపుల్‌గా చెప్పాలంటే.. కేజ్రీ సైతం ఆ తాను ముక్కే అని సామాన్యుడికి ఈపాటికే అర్థమైపోయి వుంటుంది.

-కొసమెరుపు
అవినీతి పోరాటం పేర, మార్పు పేర, కొత్త రాజకీయం పేర దేశంలో గత దశాబ్ద కాలంగా అనేకపార్టీలు పుట్టుకొచ్చాయి. క్రమేణా అవి సంప్రదాయపార్టీలుగా, సంప్రదాయ నాయకులుగా మారిపోతూనే ఉన్నారు. రేపు మరెవరైనా మార్పు పేరున నిజాయితీ రాజకీయం చేయడానికి వచ్చినా ప్రజలు మళ్లీ నమ్మని పరిస్థితులు దేశంలో రోజు రోజుకు పెరుగుతుండటం దురదృష్టకర పరిణామం. ఏది ఏమైనా మంచి రాజకీయం దేశంలో బతకాలని మాత్రం కోరుకుందాం.

1222

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ