సీమాంధ్ర రాజకీయం: తప్పటడుగులు


Sat,December 26, 2015 01:08 AM

ఒక ప్రభుత్వ పరిపాలనా సీడ్ క్యాపిటల్ పనులు జరుగుతుంటే, ఆ ప్రాంతానికి అన్నిరంగాలు తమంతట తామే వస్తా యి. కానీ బాబు అలా కాకుండా ప్రభుత్వ, ప్రైవేటు పరంగా జరిగేవి అన్నిటికీ తానే బాధ్యత తీసుకున్నా రు. రైతుల నుంచి 35 వేల ఎకరాల పచ్చని పంటపొలాలను లాగేసుకున్నారు. వాటిని సింగపూర్, జపాన్ లాంటి విదేశీ, స్వదేశీ సంస్థలకు అప్పగించబోతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే రాజధాని నిర్మాణాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు ప్రభుత్వం రియలెస్టేట్ వ్యాపారం చేస్తున్నది.

srinivas


యాభై ఎనిమిదేళ్ల ఉమ్మడి రాష్ట్రం లో సీమాంధ్ర పెట్టుబడి రాజకీయాల ప్రభావం ఎక్కువ. సహజంగా ఆ ప్రాం త రాజకీయాలు వ్యాపారులు, సినిమా లు, కులాలు, ఫ్యాక్షన్ల ప్రభావంలోనే కొనసాగాయి. సైద్ధాంతిక రాజకీయాలు మొదటి నుంచి తక్కువే. అగ్నికి అజ్యం పోసినట్లు 1995 నాటి చంద్రబాబు రాజకీయ అభద్రతా భావం సీమాంధ్ర రాజకీయాలను మరింత డబ్బుమయం చేశాయి. బాబు డబ్బు రాజకీయం అప్పట్లో కొంత తెలంగాణపైన పడినా.. సీమాంధ్రతో పోలిస్తే మాత్రం తక్కువేనని చెప్పాలి. మొదటి నుంచి తెలంగాణ సైద్ధాంతిక రాజకీయాలకు నిలయం. అందుకే, కులాలు, సిని మాలు పెట్టుబడుల ప్రభావం తెలంగాణలో చాలా తక్కువ. తెలంగాణలో ఏమాత్రమైనా రాజకీయాలు డబ్బు ప్రభావానికి లోనవుతున్నాయంటే.. అది ఒకప్పుడు చంద్రబాబు ప్రవేశపెటిన డబ్బు రాజకీయమే. మొన్నటి సాధారణ ఎన్నికల్లో దేశంలో అత్యంత ఖరీదైన ఎన్నికల జాబితాలో అవశేష ఆంద్రప్రదేశ్ ఒక రాష్ట్రంగా నమోదైందంటే.. అక్కడి రాజకీయాలపై పెట్టుబడి శక్తుల ప్రభావం ఎలా ఉంటున్నదో అర్థం చేసుకోవచ్చు.

బ్యాంకులకు బాకీ పడిన వందలాది కోట్ల అప్పులకు ఎగనామం పెట్టిన వారి జాబితా ఈ మధ్య మీడియాలో వచ్చింది. సీమాంధ్ర నేతలు అనేకులు ఆ జాబితాలో ఉన్నారు. బ్యాంకుల అప్పు కట్టని ఒక సీమాంధ్ర నేత ఏకంగా కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. పెట్టుబడి+రాజకీయం కలిసి రాజ్యమేలుతు న్న సీమాంధ్ర రాజకీయాలకు అంతకుమించి ఇంకేం చెప్పగలం? నిజం చెప్పాలంటే, సీమాంధ్రలో సిని మా, కుల రాజకీయాలతో అక్కడ పెట్టుబడి రాజకీయాలు బతుకుతున్నాయి తప్ప పేద, సగటు ప్రజలు బతుకుతున్నది లేదు.
బాబు పెట్టుబడి రాజకీయాలకు, జగన్మోహన్‌రెడ్డి ప్రత్యామ్నాయ పెట్టుబడి రాజకీయ శక్తిగా అవశేష ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగాయి. నిజానికి, జగన్ నేతృత్వంలోని వైసీపీనే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చాలా మేరకు భావించా రు. అందుకు కారణం ఒకప్పటి వైఎస్సార్ సంక్షేమ పాలన జగన్ గెలిస్తేనే సాధ్యమనే నమ్మకం ప్రజల్లో ఉండింది. కానీ, సినిమా, కుల రాజకీయాలు, కొత్త రాజధాని బాబుకే సాధ్యమనే లాజిక్కులు చివరికి పైచేయి సాధించి, కొద్దిపాటి తేడాతో చంద్రబాబునే అదృష్టం వరించింది. అయినా ఏడాదిన్నరలో చంద్రబాబు పాలన వైఫల్యాలలో కూరుకుపోతున్నా.. నిర్మాణాత్మక పాత్ర పోషించడంలో విపక్ష నేత జగన్ సఫలమవుతున్నాడని చెప్పడం అసాధ్యం.

కానీ జగన్‌లో అధికారం దక్కలేదనే అసహనం పెరిగిపోయి విపక్ష పాత్ర పోషించడంలో విఫలమవుతున్నాడనే వ్యాఖ్య తరచూ విశ్లేషకుల నుంచి వినబడుతున్నది. చంద్రబా బు కూడా ఇలాంటి అసహన రాజకీయాలకు పాల్పడి తనకు తానే ప్రజలకు దూరమైన సంఘటనను కూడా ఇక్కడ చెప్పుకోవాలి. 2004లో చంద్రబాబుకు ఎదురైన ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. విపక్షంలో కూర్చున్న మరుసటి రోజు నుంచే చంద్రబాబు బలమైన కారణాలు లేకుండానే అప్పటి వైఎస్ ప్రభుత్వం పై విమర్శల దాడికి దిగాడు. అకారణ, అసహన చం ద్రబాబు ధోరణిని చూసి అప్పట్లో ప్రజలు అసహ్యించుకున్నారు.

విపక్ష నేతగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజ ల ముందుకు తీసుకెళ్లే కన్నా, అధికారం పోయిందనే అసహనాన్నే చంద్రబాబులో ప్రజలు గమనించారు. దానితో చంద్రబాబు 2009లోనూ ఓటమిని ఎదుర్కోకతప్పలేదు. కాబట్టి అధికారం దక్కలేదనే అసహనాన్ని పక్కనబెట్టి విధానపరంగా ప్రభుత్వాన్ని ప్రజల ముందు నిలబెట్టినపుడే విపక్షానికి ప్రజల నుంచి మన్నన లభిస్తుంది. ఈ విశ్లేషణ అంతా ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే.. ఏడాదిన్నర చంద్రబాబు పాలనపై విపక్ష నేత సరైనవిధంగా స్పందించగలుగుతున్నాడా, లేక కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో అధికారం చేజారిందనే అసహనంలో పడి తప్పటడుగులు వేస్తున్నాడా అనేది కీలక ప్రశ్న.
ఏడాదిన్నర కాలంలో, ఏపీ అసెంబ్లీ ఏనాడూ సవ్యంగా జరగలేదు. వ్యక్తిగత దూషణలతోనే ముగిశాయి. చంద్రబాబు వైఫల్యాలను విధాన పరంగా నిలదీయడం కన్నా, వ్యక్తిగత విమర్శలను జోడించి చెప్పడంలోనే వైసీపీ ఎక్కువగా ఆసక్తి చూపుతున్నది.

అది విపక్షం బలహీనతగా మారి, ప్రభుత్వ వైఫల్యాలు మరుగున పడిపోతున్నాయి. ఉదాహరణకు, ఈ మధ్య అసెంబ్లీలో కాల్‌మనీపై జరిగిన చర్చలో విపక్ష శాసన సభ్యురాలు రోజా అధికార పక్ష సభ్యులపై అస భ్య పదజాలంతో దూషించందనే కారణంతో స్పీకర్ ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. స్పీకర్ పక్షపాతంతో రోజాను సస్పెండ్ చేశారంటూ స్పీకర్‌పై వైసీపీ అవిశ్వాసం ప్రవేశపెడతానంటున్నది. అసలు కాల్‌మనీ అంశం పక్కకుపోయి, అధికార, విపక్షాల వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యం పెరిగింది. ఇది ఎవరికి లాభమో విపక్షనేత జగన్ ఆలోచించారా లేదా తెలియదు. కాల్‌మనీ వ్యవహారం ఎంత కనుమరుగై తే, అధికారపక్షానికి అంత మేలు. ఏపీలో కాల్‌మనీ కీచకుల వెనుక అధికార పక్షానికి సంబంధం కలిగిన వారు ఉండటంలో ఆశ్చర్యం లేదు.

పెట్టుబడి రాజకీయాలకు శ్రీకారం చుట్టినవాడు చంద్రబాబు కాబట్టి పార్టీ సంబధీకులే కాల్‌మనీ వ్యాపారంలో ఎక్కువగా ఉన్నారు. అందుకు తగిన సాక్షాలుగా కాల్‌మనీ కేసు లో నిందితులతో చంద్రబాబు దిగిన ఫొటోలను జగ న్ అసెంబ్లీలో ప్రదర్శించారు. అదే సమయంలో అధికారపక్ష సభ్యులూ మనీ లెండర్ వ్యాపారులు కొం దరు జగన్‌తో దిగిన ఫొటోలను కూడా చెల్లుకు చెల్లు అన్నట్లుగా ప్రదర్శించారు. సీమాంధ్రలోని పెట్టుబడి రాజకీయాల నుంచి పుట్టుకొచ్చిందే కాల్‌మనీ వ్యాపారమని చెప్పడానికి అసెంబ్లీలో ఇరు పక్షాలు ప్రదర్శించుకున్న ఫొటోలే బలమైన సాక్షం. అయితే, కాల్‌మనీ వ్యాపారాన్ని పసిగట్టి అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాన్ని విపక్ష నేతగా జగన్ ఎండగట్టాల్సిందే. ఆ విషయంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాల్సిందే. కానీ, అదం తా పక్కదారి పట్టేలా, తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేనే అసభ్యపదజాలనికి పాల్పడి అందివచ్చిన అవకాశాన్ని చాలా మేరకు బూడిదలో పోసిన పన్నీరులా చేయలేదందామా? నిజంగా రోజా చేసిన మేలును చంద్రబాబు మనసులోనే అభినందించారేమో! అధికారం దక్కలేదనే అసహనంలో పడి వ్యక్తిగత విమర్శలకు అలవాటుపడితే.. అది అధికార పక్షానికే కొంత మేలు చేస్తుంది. ఇలాంటి తప్పటడుగులతోనే విపక్ష పాత్రలో వైసీపీకి ఏడాదిన్నర కాలం గడిచిపోయింది. ఈ కాలంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఏ మేరకు చేరవేయగలిగిందనేదే వైసీపీ పనితీరుకు గీటురాయి .

ఇకపోతే, రాజధాని ఎక్కడ ఉండాలనే విషయంలోనూ వైసీపీ వైఖరి సరిగా లేదనే చెప్పాలి. జగన్మోహన్‌రెడ్డి వ్యూహాత్మకంగా కోస్తా ప్రజల ఆదరణను దృష్టి లో ఉంచుకొని విజయవాడ-గుంటూరు మధ్య (అమరావతి)కి అంగీకరించి ఉండవచ్చు. కానీ, ఒక రాజధాని పచ్చని పంట పొలాలను చెరిపేసి నిర్మించాలని తీసుకున్న నిర్ణయాన్ని నిర్దంద్వంగా ఆయన వ్యతిరేకించి ఉండాల్సింది. కోస్తాలో ఏటా నాలుగు తుఫాన్లు తప్పక వస్తాయి. రాజధాని ప్రాంతం కూడా తుఫాను తాకిడి ప్రాంతంలోకే వస్తుంది. అలాంటి అమరావతి ఏ మేరకు సురక్షితమో.. సింగపూర్ నిర్మాతలకు, చంద్రబాబుకు తప్ప ఎవరికీ తెలియదు. 35 వేల ఎకరాల పంట పొలాలను విధ్వంసం చేసి ఒక రాజధాని నిర్మాణం చేపట్టిన చంద్రబాబు నిర్ణయాన్ని ఏ పర్యావరణవేత్తగానీ, ఆహారభద్రతను కోరుకునే ఏ పాలకుడుగానీ సమర్థించలేడు. ఆ మాత్రం కూడా పట్టకుం డా కేవలం కోస్తా ప్రజల మన్ననలను కాపాడుకోవడానికి అన్నట్లుగా బాబు నిర్ణయానికి అప్పట్లో జగన్ అంగీకారం తెలపడమే పెద్ద తప్పటడుగు.

ఏపీకి కొత్త రాజధాని బాధ్యత (సీడ్ క్యాపిటల్) తమదేనని విభజన చట్టంలో కేంద్రం మాటిచ్చింది. దాని ప్రకారమే రాజధాని ఎక్కడ, ఎలా నిర్మించాలి అనే విషయంపై కేంద్రం ఓ కమిటీ వేసింది. ఆ కమిటీ నాలుగు ప్రాంతాలను గుర్తించింది. కానీ బాబు ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టును పక్కనబెట్టి, సింగపూర్‌కు ఆ బాధ్యతను అప్పగించి రాజధాని స్థలాన్ని, దాని డిజైన్‌ను ఎంపిక చేశారు. దానితో ఏపీ రాజధాని విషయంలో తమకో బరువు తగ్గినట్లు కేంద్రం భావించిం ది. అలా సీడ్ సిటీ నిర్మాణం బాధ్యతను కేంద్రానికే అప్పగించి ఉంటే, ఈ పాటికి పరిపాలనా భవనాల నిర్మాణం సగానికిపైగా జరిగి ఉండేది. ఒక ప్రభుత్వ పరిపాలనా సీడ్ క్యాపిటల్ పనులు జరుగుతుంటే, ఆ ప్రాంతానికి అన్నిరంగాలు తమంతట తామే వస్తా యి. కానీ బాబు అలా కాకుండా ప్రభుత్వ, ప్రైవేటు పరంగా జరిగేవి అన్నిటికీ తానే బాధ్యత తీసుకున్నా రు.

రైతుల నుంచి 35 వేల ఎకరాల పచ్చని పంటపొలాలను లాగేసుకున్నారు. వాటిని సింగపూర్, జపాన్ లాంటి విదేశీ, స్వదేశీ సంస్థలకు అప్పగించబోతున్నా రు. ఒకరకంగా చెప్పాలంటే రాజధాని నిర్మాణాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు ప్రభుత్వం రియలెస్టేట్ వ్యాపారం చేస్తున్నది. పరిపాలన జరగడానికి ఒక రాజధాని కావాలి. అలాంటి రాజధానికి ప్రైవేటు రం గం తనంతట తానుగా విస్తరిస్తుంది. ప్రైవేటు సంస్థలు రైతుల నుంచి నేరుగా భూములు కొనుగోలు చేసుకుంటాయి. కానీ ఇక్కడ ప్రభుత్వమే రైతుల నుంచి భూములు లాగేసుకొని దళారీ పాత్రను ఎందుకు పోషిస్తున్నదనేదే ప్రశ్న. సీడ్ క్యాపిటల్ (ప్రభుత్వ పాలన సౌకర్యాలు) నిర్మాణం కేంద్రం బాధ్యత కాగా, దాన్ని కాదని తానే బరువెత్తుకోవడంలోని చంద్రబా బు పరమార్థమేమిటో? రాజధాని విషయంలో తప్పు చేసిన జగన్ పైన వివరించిన విషయాలన్ని ఇప్పు డిప్పుడు మాట్లాడుతున్నారు. కానీ ఏం లాభం? దానితో 35 వేల ఎకరాల పంటపొలాలు రక్షించబడడమే కాకుండా, ఏటా నాలుగు తుఫాన్ల తాకిడి వల్ల జరిగే అనర్థాన్ని కూడా అడ్డుకోగలిగేవారు. ప్రత్యామ్నాయంగా కరువు కాటకాలకు నిలయమైన రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని కోరి ఉండాల్సింది. దాని వల్ల కోస్తా ప్రజలు దూరమవుతారేమోననే జగన్ భ్రమలో ఎంతమాత్రం నిజం లేదు.

కేవ లం అమరావతికి చేరువలో ఉన్న రెండు జిల్లాలోని కొంత ప్రాంత వాసులు మాత్రమే ప్రజలు కాదనే విషయాన్ని జగన్ మర్చిపోయారు. వెనుకబడిన ప్రాం తంలో రాజధాని ఏర్పడితే ఏ ప్రాంత ప్రజలైనా హర్షిస్తారు తప్ప తప్పుపట్టరని జగన్ తెలుసుకోలేకపోయా రు. అంతా తిరోగమనం, తప్పటడుగులు! నిఖార్సైన ప్రతిపక్షంగా వైసీపీ ప్రజల మన్ననలు పొందేందుకు సమ యం మాత్రం ఉన్నది. తెలంగాణ అస్తిత్వ రాజకీయాలకు, సీమాంధ్ర పెట్టుబడి రాజకీయాలకు ఉండే తేడా ఏమిటో చంద్రబాబు వైఫల్యాలు-జగన్ తప్పటడుగులను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది.

2282

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ