సుస్థిరతకు భంగం కలిగించవద్దు


Tue,December 15, 2015 12:32 AM

తెలంగాణలో ఇజాలకు కాలం చెల్లింది. ప్రాంత వివక్షను ఎదిరించి అస్తిత్వాన్ని సాధించుకున్న తెలంగాణలో బీఫ్ పండుగ, గోపూజ లాంటి ఇజాల పోటీ పండుగలకు ప్రజలు ప్రాధాన్యమివ్వరనే విషయాన్ని
వారు మర్చిపోతున్నారు. పదే పదే వాటిని ముందుకు తెచ్చే ప్రయత్నాలు అదేపనిగా ఎందుకు జరుగుతున్నాయో... తెలియనంతటిఅమాయకులు కారు తెలంగాణ ప్రజలు!

తెలంగాణలో అనేక ఇజాలు బతికాయి. అయినా తెలంగాణ తన అస్తి త్వ సాధన కోసం ఆరు దశాబ్దాలు పోరాడాల్సి వచ్చింది. అంటే, ఆ విభి న్న ఇజాలతో తెలంగాణ పొందిన చైత న్యం మాటేమోగానీ, అవే ఇజాలు తెలంగాణను ఇతరులకు అప్పగించి తమ భావవ్యాప్తికి నిరంతరం ఆరాటపడ్డాయి. వాటి భావవ్యాప్తి కోసం ఒక ప్రాంత అస్తిత్వాన్నే పణంగా పెట్టిన చరిత్ర ఆయా ఇజాలది. అది లెఫ్టిజమా, రైటిజమా అని విడదీసి చెప్పే కన్నా ఆ రెండు ఇజాలూ రాజకీయంగా తెలంగాణకు చేసిన అపకారాల ఫలితం వల్లనే తెలంగాణ దశాబ్దాల తరబడి తన అస్తిత్వం కోసం పోరాడాల్సి వచ్చింది. 1950వ దశకంలో విశాలాంధ్ర నినాదంతో లెఫ్టిస్టులు చేసిన ప్రతిపాదన ఫలితాన్ని దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజలు ఎంత చేదు జీవితాన్ని అనుభవించారు? అలాగే, దేశంలో రైటిస్టు రాజకీయాలు మొదటి నుంచీ సీమాంధ్రులకు కొమ్ము కాస్తూ వచ్చిన వైనమూ తెలంగాణకు అంతే చేదు జీవితాన్ని అందించిది. అంటే ఈ రెండు ఇజాల వల్ల తెలంగాణకు జరిగిన అనర్థాన్ని వెల కట్టడం సాధ్యం కాకపోవచ్చు.

రాజకీయంగా ఈ రెండు ఇజాలు భిన్నమైనవే అయినా... సీమాంధ్ర రాజకీయశక్తులకు మాత్రం ఆ రెండు ఇజా లూ తెలంగాణలో కరటక-దమనకుల్లాగా బాగా ఉపయోగపడ్డాయి. ఆ విషయంలో మాత్రం లెఫ్ట్, రైటుకు తేడా లేకుండా పోయింది. 1969 నాటి తొలిదశ తెలంగాణ ఉద్యమాన్ని అప్పటి జనసంఘ్ వ్యతిరేకించింది. అలాగే 1971లో జరిగిన జైఆంధ్రా ఉద్యమాన్ని సమర్థించింది. అట్లాగే కామ్రేడ్లు తొలి తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి తెలంగాణ అస్తిత్వ డిమాండ్ ఎప్పుడు వచ్చినా, ఆ భిన్న ఇజాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అడ్డంగా నిలబడి సీమాంధ్ర రాజకీయశక్తులకు అండగా నిలిచిన చరిత్రను ఎవరూ కాదనలేరు. పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనేంత భిన్నత్వం కలిగిన ఆ రెండు ఇజాలు తెలంగాణ ఏర్పాటును మాత్రం 1990 దశకం దాకా వ్యతిరేకిస్తూ రావడాన్ని ఇక్కడ గుర్తు చేసుకోక తప్పడంలేదు. (ఎక్స్‌ట్రీం లెఫ్ట్‌లిస్టులు కొందరు 1996 నుంచే తెలంగాణ ఏర్పాటును డిమాండ్ చేశారు. వారు తమ ఇజం భావవ్యాప్తి కోసమే ఆ డిమాండ్‌ను ఆసరా చేసుకున్నారనే వారు కూడా ఉన్నారు) కమ్యూనిస్టులు(సీపీఎం తప్ప), బీజేపీ, మలిదశ ఉద్యమం చరమాంకానికి చేరుకున్నాకగానీ సమర్థించలేకపోయాయి.

అవి మనసారా సమర్థించాయా, పరిస్థితుల కారణంగా సమర్థించాయా, తమ ఇజాల భావవ్యాప్తి కోసం సమర్థించాయా అనే ది.. తెలంగాణ పట్ల ఆ ఇజాలు కలిగివున్న చరిత్రను చూస్తే ఎవరికైనా సులభంగా అర్థమవుతుంది. ఆ రెం డు ఇజాలు చరమాంకంలో ఎందుకు సమర్థించా యి? తెలుసుకోవలసిన విషయం. ఒకటి- 2009లో చిదంబరం ప్రకటన చేసే వరకు గోడమీది పిల్లులుగా వ్యవహరించాయి. ఆ తర్వాత, ప్రజల ఆకాంక్షను కాదంటే తెలంగాణలో ఉనికిని కాపాడుకోవడం అసాధ్యమనుకున్నాయి. సీమాంధ్ర ఆధిపత్య రాజకీయాలకు ఇంకా తమ సేవలందించడం సాధ్యం కాదనుకున్నాయి. కేసీఆర్ నేతృత్వంలో టీఆర్‌ఎస్ రూపంలో తెలంగాణ తన స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని చాటుకోవడం వల్ల,తెలంగాణ ఇక రాకతప్పదనే దశకు ఉద్యమం చేరుకున్నపుడు గానీ ఆ రెండు ఇజాలు ఉద్యమాన్ని సమర్థించక తప్పలేదు. అలాగే ఉద్యమాన్ని తమ ఇజాల భావ వ్యాప్తికి కూడా ఉపయోగించకోవచ్చని భావించాయి. ఆ చరిత్రనంతా తిరిగి ఇపుడు ఎందుకు చెప్పుకోవలసి వస్తున్నది అనేదే కీలక ప్రశ్న. తెలంగాణ వచ్చింది. ప్రజలు తమ అస్తిత్వ పార్టీకి అధికారం అప్పగించారు. ఇంతకాలం తమ ఇజాలతో ఆంధ్రాధిపత్య రాజకీయాలకు సేవలందించినవారు, వచ్చిన తెలంగాణను సుఖంగా బతకనివ్వగలరా?
ఓవైపు బీఫ్ పండుగ, మరోవైపు గోపూజలకు చదువుల తల్లి ఉస్మానియాను కేంద్రం చేసుకొని ఆ రెండు ఇజాలు ఎందుకు పోటీ పడ్డాయి? మొత్తంమీద ఉద్రిక్తత సఖాంతమైనందుకు సంతోషం. ఎవరి ఆహారపు అలవాట్లను ఎవరు కాదన్నా అది ముమ్మాటికి చట్టవిరుద్ధమే. అందులో ఎవరికీ అనుమానం లేదు. కానీ దాన్ని బహిరంగంగా మరొకరికి వ్యతిరేకంగా అన్నట్లు ప్రదర్శించాలనుకోవడమే సరికాదు.

హర్యానాలో ఒక మైనారిటి వ్యక్తి పశు మాంసం తిన్నందుకు హత్య చేశారని.. కర్ణాటక ముఖ్యమంత్రి బహిరంగంగా బీఫ్ తింటే నరికేస్తామన్నారని&దేశంలో జరుగుతున్న అలాంటి సంఘటనలన్నిటికీ వ్యతిరేకంగా ఓయూలో బీఫ్ పండుగ జరపాలనుకున్నామని నిర్వాహకులు వివరణ ఇచ్చారు. ఎక్కడ కర్ణాటకా.. ఎక్కడ హర్యానా.. ఎక్కడ తెలంగాణ? ఉత్తర బారతంలో ఉన్న హర్యానాకు, శాంతికాముక తెలంగాణకు ఎక్కడైనా పొంతన ఉందా? సంఘటన జరిగిన దగ్గర అలాంటి నిరసన తెలిపితే దానికో అర్థం ఉంటుంది. కానీ, బీఫ్ పంచాయతీ ఏనాడూ లేని తెలంగాణలో ఆ పంచాయతీ పెడితే దాని పరమార్థం ఏమిటందాం? అత్త మీది కోపం దుత్త మీద తీసినట్లు& ఎద్దుకూర పంచాయతీని తెలంగాణపై రుద్దే ప్రయత్నం మంచిది కాదు. ఎవరిపైనో ఉన్న వ్యతిరేకతను ఆసరా చేసుకొని, దాన్ని మరెక్కడో ప్రదర్శించడమంటే.. దాంట్లో మరో పరమార్థం కూడా ఉండి ఉందంటే తప్పుకాదు! తెలంగాణ ప్రభుత్వానికి శాంతి భద్రతల సమస్యను సృష్టించిపెట్టాలనే రాజకీయ అక్కసు కూడా అందులో ఇమిడి ఉండే అవకాశాన్ని ఎలా కాదంటాం?

బీఫ్ పండుగకు వ్యతిరేకంగా ఇంకో ఇజం వారు గోపూజకు సిద్ధమయ్యారు. వ్యవసాయాన్ని యాంత్రికంగా మార్చి, పశు సంపదను సర్వనాశనం చేస్తున్న పాలకులే గోరక్షణ గురించి మాట్లాడుతుండటం ఈ దేశంలో జరిగే విచిత్రాలలోకెల్ల అత్యంత విచిత్రం. గోవు జపం ఈదేశంలో ఓట్ల కోసం తప్ప వాటిని బతికించడానికి జరుతున్నదా? ఒకవేళ జరిగితే.. వాటి సంతతిని ఈ దేశ రైతు కాపాడగలడు తప్ప గోశాలలు కాపాడలేవు. గోశాలల పేర కొందరు బతకొచ్చు తప్ప గో సంతతి బతకదు. గోసంపదను రక్షించగలిగే రైతు ను ఈ దేశ పాలకులు ఏదారి పట్టించారో పరిపూర్ణనాందస్వామి లాంటివారే ఈ సమాజానికి చెప్పాలి. అలాంటి పాలకులపై యద్ధం ప్రకటించకుండా స్వామీజీలు ఎన్ని గోపూజలు చేసినా ఒరిగేదేమిటి? దేశం నిండా పశువధశాలలకు అనుమతులిస్తున్న పాలకులే గోరక్షణ పేర ఓట్లు దండుకోవడం ఎంత నికృష్ట కార్యమో చెప్పడానికి మాటలు చాల వు. ఈ విషయం, బీఫ్ పండుగకు వ్యతిరేకంగా గోపూజకు నడుంకట్టినవారికి తెలియదనుకుందామా? ఎద్దుకూర పండుగైనా, గోపూజైనా, అవి ఇజాల ప్రేరితాలు తప్ప, తెలంగాణ సగటు ప్రజల నుంచి వచ్చిన ఉద్వేగాలు కావు.

1969 ఉద్యమాన్ని దెబ్బతీయడానికి నాడు కాసుబ్రహ్మానందరెడ్డి తెలంగాణలో మతవాదులను తట్టిలేపి అడ్డుకోవాలనుకున్నాడు. అలాగే సమైక్య రాష్ట్రం లో తెలంగాణకు చెందిన ముఖ్యమంత్రులను దించేయడానికి మతఘర్షణలకు ఆజ్యం పోశారు. తమ ఆధిపత్యం కోసం ఎంతకైనా తెగించిన సమైక్యపాలకుల ఛాయలు మనల్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నా యా? వచ్చిన తెలంగాణను మరో విఫల ప్రయోగం చేయాలనే శత్రు శక్తులకు.. కొన్ని ఇజాలు మరోసారి పావులుగా మారుతున్నాయా? ఇవన్నీ సగటు తెలంగాణ పౌరుడి మదిలో మెదులుతాయి. అయినా.. ఇది మునుపటి అమాయకపు తెలంగాణ కాదనే విషయాన్ని ఆ రెండు ఇజాలు మరిచిపోతున్నట్లున్నాయి.

తెలంగాణలో ఇజాలకు కాలం చెల్లింది. ప్రాంత వివక్షను ఎదిరించి అస్తిత్వాన్ని సాధించుకున్న తెలంగాణలో బీఫ్ పండుగ, గోపూజ లాంటి ఇజాల పోటీ పండుగలకు ప్రజలు ప్రాధాన్యమివ్వరనే విషయాన్ని వారు మర్చిపోతున్నారు. పదే పదే వాటిని ముందు కు తెచ్చే ప్రయత్నాలు అదేపనిగా ఎందుకు జరుగుతున్నాయో... తెలియనంతటి అమాయకులు కారు తెలంగాణ ప్రజలు! ఇవాళ తెలంగాణకు కావలసింది ఇజాల భావజాలకులు కాదు, ప్రాంత భావకులు కావాలె. ప్రాంతభావ రాజకీయాలు తప్ప ఇజాల రాజకీయాలు ఇవాళ చెల్లని రూపాయి లాంటివనే విషయాన్ని గమనించాలె. సగటు తెలంగాణ వ్యక్తి వచ్చిన తెలంగాణలో వేగవంతమైన అభివృద్ధితో తమ బతుకుల్లో మార్పురావాలని కోరుకుంటున్నాడు. అంతేతప్ప కాలం చెల్లిన ఇజాల చేష్టలలో పడి జరగాల్సిన అభివృద్ధికి అంటంకంగా మారాలని కోరుకోవటం లేదు. తెలంగాణ రాజకీయ సుస్థిరతను సాధించుకుంటున్న వేళ ఇది. దాని అస్తిత్వ రాజకీ యం స్థిరీకరించబడితే, జరుగుతున్న పంపకాలలోగానీ, నిరంతరం ఉండే నీటి పంపకాలలోగానీ ఏమీ చేయలేమనే ఆలోచన పక్క రాష్ట్ర దాయాది రాజకీయశక్తులకు ఎప్పుడూ ఉండటం సహజం. అలాంటి శక్తులకు ఉపయోగపడతాయా, లేక తెలంగాణ ప్రజలకు ఉపయోగపడతాయా అనే వివేచన ఆ రెండు ఇజాలకు ఉండాల్సిన సమయమిది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తప్ప ఇంకా పూర్తి పంపకాలు జరుగలేదు.

kalluri


ఇలాంటి దశలో తెలంగాణ తిరుగులేని రాజకీయ సుస్థిరతను కలిగి ఉండాలి. సమర్థుడైన ముఖ్యమంత్రి ఉండాలి. ఆ రెండింటినీ ఇవాళ తెలంగాణ కలిగి వున్నది. అలాంటి బలమైన రాజకీయ సుస్థిరతను కలిగి, సమర్థుడైన పాలకుడిని కలిగి ఉన్న తెలంగాణ దూర దృష్టితో దృఢంగా పనిచేయగలుగుతుంది. అలాంటి కీలక సమయంలో ఇలాంటి ఇజాల పండగలతో ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రభుత్వానికి తలనొప్పులు కలిగించాలనుకోవడం ఎవరి ప్రయోజనాల కోసం? ఆం ధ్రాధిపత్య రాజకీయ శక్తులకు తప్ప, అవి తెలంగాణ ప్రయోజనాలకు ఉపయోగపడగలవా? దేశమంతా ఎలా ఉన్నా.. తెలంగాణలో మాత్రం ఆ రెండూ.. తమ చేష్టల ద్వారా కాలం చెల్లిన ఇజాలుగా తమకు తామే ముద్ర వేసుకుంటున్నాయనడంలో సందేహం లేదు.

1122

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ