నీటిపై నియంత్రణను నిలదీయాలె..


Sat,October 17, 2015 01:41 AM

మన నీటి హక్కులపై ఉన్న నియంత్రణ గురించి ప్రజలకు తెలిసినపుడే, అదొక రాజకీయ అంశంగామారి కేంద్రంపై ఒత్తిడి పెరిగి న్యాయం జరిగే అవకాశం ఉంటది. డ్రాఫ్ట్ బిల్లులోనే నదులపై పెట్టిన బోర్డులను వ్యతిరేకించిన కేసీఆర్ దూరదృష్టిని మనం అభినందించాలి. అపుడు తెలంగాణ బిల్లు ఆగిపోతుందేమోననే భయం ఉండిన మాట నిజం. ఇపుడు కేసీఆర్ ప్రభుత్వమే వాటి రద్దు కోసం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు శ్రీకారం చుట్టాలె. అలాగే నదుల అనుసంధానంపై తెలంగాణకు ఉన్న అనుమానాలను కేంద్రం నివృత్తి చేయాలనే ఒత్తిడి కూడా కొనసాగించాలె.

srinu


తెలంగాణలో వ్యవసాయ సంక్షోభానికి సాగునీటి కొరతే డ్బ్భై శాతం కారణం. విభజన బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు నియమించి మన నీటి హక్కులపై నియంత్రణ విధించారు. దేశంలో నదుల అనుసంధానం పేర మన నీటి హక్కులు గాలి లో దీపంలా మారుతున్నాయి. భవిష్యత్తు నీటి హక్కులకు సంబంధించి ఇవి భయంకర వాస్తవాలు.

ముందుగా కృష్ణా, గోదావరి నదులపై యాజమా న్య బోర్డుల గురించి చర్చిద్దాం. ఈ బోర్డులు విభజన చట్టంలోని సెక్షన్ 9లో ఉన్నాయి. దీని ప్రకారం రెండు రాష్ర్టాల నీటి వాడకం, కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలను ఈ బోర్డుల అనుమతులతో జరగాలి. ఏమైనా వివాదాలుంటే వాటి పైన అపెక్స్ కౌన్సిల్(కేంద్ర జలవనరుల మంత్రి, రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులు) తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ బోర్డులు రెండు రాష్ర్టాలకు వర్తిస్తాయన్నట్లేగానీ, పరోక్షంగా అవి తెలంగాణ నీటి హక్కులను నియంత్రిచడానికి మాత్రమే ఏర్పడ్డాయి. ఎందుకంటే తెలంగాణ ఎగువ రాష్ట్రం కావడం, అలాగే రెండు నదుల్లో ఉన్న నీటి వాటాను అది పూర్తి గా వాడుకోలేకపోవడం. రెండు నదుల్లో కలిపి 1200 టీఎంసీలకుపైగా తెలంగాణ నీటి హక్కులు కలిగివున్నది. కృష్ణాలో 298 టీఎంసీల నికర జలాలపై హక్కులు కలిగివుండి కూడా అందులో 20శాతం మించి వాడుతున్నది లేదు. నాగార్జునసాగర్, శ్రీశైలం ఉమ్మడి ప్రాజెక్టులు. కేటాయింపులు లేకున్నా, రాయలసీమలో మిగులు జలాల పేర అనేక ప్రాజెక్టులు నిర్మాణమైయ్యాయి.

పులిచింతల పూర్తయింది. కానీ తెలంగాణకు చెందిన ప్రాజెక్టులు అనేకం పూర్తికాలేదు. కొత్తగా నిర్మించాల్సినవి చాలా ఉన్నాయి. అలాగే గోదావరిలో 912 టీఎంసీల నికర జలాలపై హక్కులు కలిగి వుండి అందులోనూ 20శాతం మించి వాడుకుంటున్నది లేదు. అంటే రెండు నదుల్లో దాదాపు 800 టీఎంసీల నికర జలాలను తెలంగాణ అనేక ప్రాజెక్టులు నిర్మించి వాడుకోవాలి. అలాంటపుడు రెండు నదులపై పెట్టిన యాజమాన్య బోర్డులు ఎవరి హక్కులను నియంత్రిచడానికి? నికర జలాలపై హక్కులు కలిగి ఉన్న తెలంగాణ పక్క రాష్ట్రం అనుమతి తీసుకొని ప్రాజెక్టులు నిర్మించుకోవాలనే నియంత్రణను ఏమందాం? మన నీటి హక్కులను మరొకరు నియంత్రించడం ఎంతవరకు సబబు?

అప్పట్లో విభజన డ్రాఫ్ట్ బిల్లుపై కేంద్రం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) అన్ని పార్టీల నుంచి అభిప్రాయాలను కోరింది. తెలంగాణలో బతుకుతున్న అన్ని పార్టీలూ తమ అభిప్రాయాలను లిఖిత పూర్వకంగా ఇచ్చాయి. కానీ అందులో ఒక్క టీఆర్‌ఎస్ తప్ప ఏపార్టీ కూడా రెండు నదులపై యాజమాన్య బోర్డులను పెట్టడాన్ని వ్యతిరేకించలేదు. పరోక్షంగా ఆ బోర్డులను సమర్థించాయి. ఇరు రాష్ర్టాల నడుమ నదుల నీటిపై వివాదాల నివారణకు నియంత్రణ బోర్డులు ఉండటం మంచిదే అన్నాయి. కానీ అవి తెలంగాణ నీటి హక్కులను హరిస్తాయని అభ్యంతరం చెప్పలేదు. ఒక్క టీఆర్‌ఎస్ మాత్రమే తెలంగాణ నీటి హక్కులను హరిస్తాయని రెండు నదులపై యాజమాన్య బోర్డుల ఏర్పాటును వ్యతిరేకించింది.

కనీసం ఏ సరిహద్దులు లేని, ఏ వివాదాలు లేని గోదావరి నదిపైన నైనా యాజమాన్య బోర్డు పెట్టవద్దని ఆరోజు కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. రాష్ట్రపతికి, ప్రధానికి విన్నవించారు. ఆ బోర్డులను అన్ని పార్టీలు సమర్థిస్తుంటే టీఆర్‌ఎస్ వాదన ఒంటరిదైంది. తెలంగాణలో బతుకుతున్న మిగతా పార్టీలు ఆరోజే అభ్యంతరం చెప్పి ఉంటే, యాజమాన్య బోర్డు ల ఏర్పాటుపై అప్పట్లోనే పునరాలోచన తప్పక జరిగి ఉండేది. వ్యవహారం ఇంతదాకా వచ్చేది కాదు. ఇవాళ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవాలని కృష్ణాబోర్డుకు, కంతనపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టులను అడ్డుకోవాలని గోదావరి బోర్డుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖలు రాస్తున్నాడంటే అందుకు ఎవరు కారకులో ప్రతిపక్ష నేతలే జవాబు చెప్పాలె.

అనేక రాష్ర్టాల్లో ప్రహించే నదుల నీటి పంపకానికి ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ఏ రాష్ట్రం ఒక ప్రాజెక్టు కట్టాల న్నా కేంద్ర జల సంఘంతోపాటు, మరో 18 శాఖల అనుమతులు కావాలి. ఇన్ని విధానాలు ఇప్పటికే అమలులో ఉండగా వాటన్నిటికీ అదనంగా యాజమాన్య బోర్డుల పేర నదులపై నియంత్రణ పెట్టడం బహుశా దేశంలోనే చాలా అరుదు. ఈ నియంత్రణ తెలంగాణ నీటి వాటను నియంత్రిచడానికే . ఎందుకంటే రెండు నదులలో నీటివాటాను ఏపీ ఇప్పటికే వాడుకుంటున్నది. గోదావరిపై పోలవరం ప్రాజెక్టును కేంద్రమే చేపట్టింది. అంతేకాదు మిగులు జలాల పేర తెలంగాణ వాటాను సైతం పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ అక్రమంగా వాడుకుంటున్నది. కాబట్టి ఈ యాజమాన్య బోర్డులు తెలంగాణపైనే పెత్తనం చేయనున్నాయి. కాబట్టి రెండు నదులపై ఉన్న యాజమాన్య బోర్డులను రద్దు చేయాలనే డిమాండ్‌ను తెలంగాణ నిరంతరం ఎలుగెత్తాలి.

కేంద్రం చేపడుతున్న నదుల అనుసంధానం వల్ల తెలంగాణకు ఏం జరగనుందో చూద్దాం. దక్షిణాదిలో ని మహానది(ఒడిషా)లో 360టీఎంసీలు, గోదావరి(తెలంగాణ)లో 530టీఎంసీల మిగులు జలాలున్న ట్లు కేంద్రం భావిస్తున్నది. ఈ మిగులు జలాలను కృష్ణా, కావేరీ నదులకు మళ్లించి అనుసంధానం చేయాలనుకుంటున్నది. ఈ మిగులు జాలాలను తెలంగాణలోని ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్‌కు, పులిచింతలకు తరలించాలని భావిస్తున్నది. ఈ నిర్ణయాన్ని ఒడిషా, తెలంగాణ రాష్ర్టాలు వ్యతిరేకిస్తుండగా, ఏపీ, తమిళనాడు సమర్థిస్తున్నాయి. నిజంగానే తెలంగాణ ప్రవహించే గోదావరిలో మిగులు జలాలున్నాయా? నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, నిర్మించాల్సి న ప్రాజెక్టులు పూర్తయితే గోదావరిలో తెలంగాణకు కేటాయించిన నికర జలాలే కాదు మిగులు జలాలు సైతం సరిపోయే అవకాశం లేదు. చెరువుల పునర్నిర్మాణం, వాటర్‌గ్రిడ్‌లు నికర జాలాలతో పాటు వరద జలాలపై అధారపడి ఉన్నాయి.

బచావత్ ట్రిబ్యునల్ చేసిన పంపకాల్లో తెలంగాణ గోదావరిలో మిగులు జలాలు ఉన్నట్లు లేదు. కాకపోతే ఏటా జూన్-అక్టోబర్ మధ్య కాలంలో వచ్చే వరదలను దృష్టిలో ఉంచుకొని వాటినే మిగులు జలాలుగా పరిగణిస్తున్నారేమో తెలియదు. ఏటా భారీ వర్షాలతో వరదలు రావచ్చు రాకపోవచ్చు. అలాంటి నమ్మకంలేని వరద జలాలను నమ్ముకొని నదుల అనుసంధానం చేపడుతున్నారంటే నమ్మడమెలా? తెలంగాణ నికర జలాలనే తన్నుకుపోరని గ్యారంటీ ఎక్కడ? ఇవాళ కేంద్రం వరద జలాల ను మిగులు జాలాలుగా లెక్కిస్తున్నదనుకున్నా, గోదావరిలో సుమారు 190 టీఎంసీలు మాత్రమే వరద జలాలుంటాయి. మరి తెలంగాణ గోదావరిలో 530 టీఎంసీల మిగులు జలాలున్నట్లు కేంద్రం ఏ లెక్కన భావిస్తున్నట్లు? గోదావరిలో తెలంగాణకు 912 టీఎంసీల నికర జలాల కేటాయింపు ఉన్నది. అందులో గోదావరిపై తెలంగాణలో నిర్మాణమై వాడుకలో ఉన్న ప్రాజెక్టులకు 271 టీఎంసీల కేటాయింపులున్నాయి. పాక్షికంగా వాడుకలో ఉన్న ప్రాజెక్టులు, నిర్మాణలో ఉన్న ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు సుమారు 145 టీఎంసీలు. తెలంగాణకు కేటాయించిన నికర జలాల నుంచి నిర్మించిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల నీరు సుమారు 416 టీఎంసీలను తీసివేయగా 584 టీఎంసీలు మిగులుతున్నాయి. ఈ నికర జలాలపైనే కేంద్రం కన్ను పడిందా అనేదే ప్రశ్న.

మిగిలిన ఆ నికర జలాలను దృష్టిలో పెట్టుకునే తెలంగాణ తెచ్చుకున్నాం. వాటి వినియోగం కోసమే కాళేశ్వరం, ఇచ్చంపల్లి, కంతానపల్లి వంటి మరిన్ని భారీ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. వాటికి నికర జలాల్లో వందలాది టీఎంసీలు అవసరమవుతాయి. అవే కాకుండా గోదావరి బేసిన్‌లోని చెరువుల పునర్మిర్మాణాలు జరుగుతున్నాయి. వాటర్‌గ్రిడ్‌కూ గోదావరి నీరే శరణ్యం కానున్నది. కాబట్టి మన అవసరాలకు గోదావరిలో నికర జలాలే కాదు, వరద జలాలు కూడా మిగలవు. మన కు జరిగిన కేటాయింపులు, మనకున్న అవసరాలు తీరాక అప్పటికీ ఏమైనా నీటి లభ్యత ఉంటే మాత్రమే ఆ నీటి అనుసంధానంపై మనకు అభ్యంతరం ఉండ దు. కానీ ఆ అనుసంధానం అలా జరుగుతందా లేదా అనేదే తెలంగాణ వాచ్‌డాగ్ లాగా గమనిస్తుండాలె.

తెలంగాణ సకల దరిద్రాలకు నీటి కొరతే కారణం. తెలంగాణ ఉద్యమంలో నీళ్ల నినాదమే కీలకం. కానీ ఏ గోదావరిపై ఆశలు పెట్టుకొని తెచ్చుకున్నామో, ఆ నీటినే అనుసంధానం తన్నుకుపోనుందా? మళ్లీ మన నీళ్లనే కృష్ణానదికి అనుసంధానంచేసి సీమాంధ్ర కు మళ్లిస్తే మనకు జరిగే అన్యాయానికి బాధ్యులెవ రు?కాబట్టి వరద జలాల పేర నికర జలాలకు సైతం ఎసరు పెట్టే అవకాశం ఉన్న ఈ అనుసంధానం పట్ల తెలంగాణ అప్రమత్తంగా ఉండాలి.

ఇవాళ రైతు ఆత్మహత్యలపై అందరూ అంగలారుస్తున్నారే తప్ప తెలంగాణ నీటిపై పెట్టిన బోర్డుల నియంత్రణలు, రాబోయే అనుసంధాన అనర్థాలను ఏమేరకు గమనిస్తున్నారు? భవిష్యత్తులో ఇలాంటి ఆత్మహత్యలు జరగకుండా ఉండాలంటే మన నీటి హక్కులపై ఉన్న నియంత్రణపై, అనుసంధానం అనర్థంపై దృష్టి సారించాలె. బోర్డులను కేంద్రం రద్దు చేస్తుందా, లేదా అనే సంశయంలో పడి మిన్నకుండడం సరికాదు. మన నీటి హక్కులపై ఉన్న నియంత్రణ గురించి ప్రజలకు తెలిసినపుడే, అదొక రాజకీయ అంశంగామారి కేంద్రంపై ఒత్తిడి పెరిగి న్యాయం జరిగే అవకాశం ఉంటది. డ్రాఫ్ట్ బిల్లులోనే నదులపై పెట్టిన బోర్డులను వ్యతిరేకించిన కేసీఆర్ దూరదృష్టిని మనం అభినందించాలి. అపుడు తెలంగాణ బిల్లు ఆగిపోతుందేమోననే భయం ఉండిన మాట నిజం.

ఇపుడు కేసీఆర్ ప్రభుత్వమే వాటి రద్దు కోసం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు శ్రీకారం చుట్టాలె. అలాగే నదుల అనుసంధానంపై తెలంగాణకు ఉన్న అనుమానాలను కేంద్రం నివృత్తి చేయాలనే ఒత్తిడి కూడా కొనసాగించాలె. అందుకు కలిసిరాని ప్రతిపక్షాలను ప్రజాకోర్టులో నిలబెట్టాలె. నీటి హక్కులపై బోర్డుల నియంత్రణను నాడు స్వాగతించిన ప్రతిపక్షాలు నేడు ఆత్మహత్యలపై ఊరేగడంలోని నిజాయితీ ఏపాటిది? కాబట్టి తామే స్వాగతించిన రెండు నదులపై నియంత్రణ బోర్డులను, ఇపుడు రద్దు చేయాలనే డిమాండ్‌తో ప్రతిపక్షాలు కూడా ఆ పాపాన్ని కడిగేసుకుంటే మంచిది.

1280

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ        


country oven

Featured Articles