భావజాలం కాదు ప్రాంత భావం


Wed,September 30, 2015 12:09 AM

ఇవాళ తెలంగాణకు కావలసింది వైరుధ్య రాజకీయాలు కాదు. తెలంగాణలో బతికే ప్రతి పార్టీకి, ప్రతి భావజాలనికి కచ్చితంగా ప్రాంత భావానిదే మొదటి ప్రాధాన్యం కావాలె. లేదంటే ఈ విభిన్న భావజాలాలు తమ ఉనికి కోసం పనిచేస్తాయా, ప్రాంత భావంతో పనిచేస్తాయా అనే కీలక ప్రశ్న తెలంగాణ సమాజం ముందు ఎప్పుడూఉంటుందని మర్చిపోవద్దు.

దేశంలో ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో లేనన్ని విభిన్న సమాజాలతో పాటు, విభిన్న రాజకీయ భావజాలాలు తెలంగాణలో ఉన్నాయి. సమాజపరంగా భిన్నత్వంలో ఏకత్వం సాధించినా.. రాజకీయ పరం గా అలాంటి ఏకత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు లేకపోవడమే దురదృష్టకరం.

విభిన్న రాజకీయ భావజాలాల గురించి చెప్పుకోవాలంటే, వాటి ఆధిపత్య పోరులతో తెలంగాణ బాగుపడిందెంత అనేది కీలక ప్రశ్న. తన అస్తిత్వం తనకు దక్కనీయని భావజాలాల నిత్య సంఘర్షణలతో తెలంగాణ ఏనాడూ సుఖంగా బతకలేదు. ఢిల్లీ, ఆంధ్రా రైటి స్టు రాజకీయాలు ఓవైపు, వామపక్ష భావజాలాలు మరోవైపు, హైదరాబాద్ మైనారిటీ రాజకీయాలు ఇం కోవైపు.. ఇలా ప్రాంతం పట్ల ఏకోన్ముఖత లేని పై మూడు రకాల రాజకీయాలతో తెలంగాణ రాజకీయ చైతన్యం పొందిదనే కన్నా.. ప్రాంత పరంగా అది రాజకీయ బలహీనతగా మారి సమైక్యుల దోపిడికే ఉపయోడ్డాయని ఇవాళ తెలంగాణలో రైతు బతుకులు, నిరుద్యోగుల వెతలే చెపుతున్నాయి. ఢిల్లీ రైటిస్టులు మనోళ్లే, కామ్రేడ్లు మనోళ్లే, మజ్లిస్ మనదే, బీజేపీ మనదే.. అయినా ఇన్ని భావజాలాలు ఉండి కూడా తెలంగాణ దశాబ్దాల పాటు ఒంటరిదైందెందుకు?

kallurisrinivassreddy


ఉమ్మడి బతుకు నుంచి విముక్తి లభించాకనైనా విభిన్న భావజాలాలు ప్రాంత భావానికి ఏమేరకు ప్రాధాన్యమిస్తున్నాయి? 15 నెలలుగా వాటి పాత్ర ఇప్పటికీ తమ తమ భావజాలాల చుట్టే తిరుగుతున్నా యి తప్ప ప్రాంత భావం పడుతున్నదా? వనరులు విధ్వంసమైనాయి. దేశంలో ఆర్థిక విధానాలూ మారా యి. వాటన్నిటినీ తెలంగాణకు ఎలా మలుచుకొని పునర్నిర్మించుకోవాలో ఆలోచించాల్సిన స్థితిలో ఆయా భావజాలాలు ఉన్నాయా? ఎంతసేపూ తమ భావజాలాల వ్యాప్తి ఆరాటం తప్ప మరొకటి పట్టని వాళ్లు వచ్చిన తెలంగాణకు ఏమేరకు ఉపయోగపడుతున్నారో వారే ఆలోచించుకోవాలి.

ఇక్కడ తెలుగుదేశం వంటి ఆంధ్రా అజమాయిషీ పార్టీల గురించి చర్చించాల్సిన అవసరం లేదనుకుంటా. దాని ఆధిపత్య దురహంకారాన్ని పారదోలితే తప్ప తెలంగాణ బాగుపడదనే ప్రజల చైతన్యానికి ప్రతిరూపంగానే తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టింది. 14 ఏళ్లు ఆ రాజకీయ చైతన్యాన్ని కేసీఆర్ అనే మూడక్షరా లు ముందుకు నడిపించిన విషయమూ మనకు తెలు సు. కాబట్టి తెలుగుదేశం వంటి ఆంధ్రా పార్టీలది వచ్చి న తెలంగాణలో గతించిన చరిత్ర మాత్రమే. కాకపో తే, వచ్చిన తెలంగాణను విఫలం చేయాలనే పాత్ర పోషించడానికి అది ఎపుడూ కాచుకొని కూర్చుంటదనడంలో అనుమానం లేదు.

ఢిల్లీ పార్టీల సంగతి చూద్దాం. ఢిల్లీ రైటిస్టు పార్టీలు ఆరు దశాబ్దాలు తెలంగాణలో ఆంధ్ర అజమాయిషీ రాజకీయాలు నడిపాయి. వాటికి ఢిల్లీ రాజకీయ సమీకరణ అవసరాలు తప్ప తెలంగాణ అవసరాలు నాడూ పట్టనట్లే నేడూ పట్టడం లేదు. అవి ఇప్పటికీ తెలంగాణ ప్రాంతాన్ని ఏమేరకు అర్థం చేసుకొని పని చేస్తున్నాయనేదే ప్రశ్న. తెలంగాణ ఇచ్చిననాడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే, బీజీపీ ప్రతిపక్షంలో ఉంది. ఇపు డు బీజేపీ అధికారంలో ఉంటే, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది. ఇపుడు ఇచ్చిన తెలంగాణకూ అన్యాయాలను అంటగట్టిన చరిత్ర కాంగ్రెస్‌తో పాటు బీజేపీకీ ఉంది. రెండు జీవ నదులపై యాజమాన్య బోర్డుల పేర ఆం క్షలు పెట్టి తెలంగాణ రైతుకు గోతులు తవ్వారు. సాగునీటి కోసం అల్లాడుతున్న తెలంగాణకు ఎగనామం పెట్టి, సాగునీటి లభ్యత మెరుగ్గా ఉన్న సీమాంధ్రకే ఓ జాతీయ ప్రాజెక్టు ఇచ్చారు. సదుపాయాలు సీమాంధ్రకు, అన్యాయాలు తెలంగాణకు అంటగట్టిన కాం గ్రెస్, బీజేపీలకు తెలంగాణ రైతుల గురించి మాట్లాడే నైతికత ఏమేరకు ఉందందాం?

ఈశాన్య రాష్ర్టాల పరిస్థితులకు తెలంగాణ పరిస్థితులకు పోలికలున్నాయి. ఈశాన్య రాష్ర్టాల వెనుకబాటుతనాన్ని గుర్తించి వాటికి కేంద్రం ప్రత్యేక హోదా కల్పించింది. ఈశాన్య రాష్ర్టాల పరిస్థితులతో పోలికలు కలిగి న తెలంగాణకు కాకుండా, పాడిపంటలతో విలసిల్లుతున్న సీమాంధ్రకే ప్రత్యేక హోదాపై మాటిచ్చారు. తెలంగాణ పట్ల కాంగ్రెస్, బీజేపీల హ్రస్వ దృష్టికి అదొ క నిదర్శనం. మిగతా దేశానికి, తెలంగాణకు దశాబ్దాల అగాధం ఉన్నది. తెలంగాణ ఇచ్చామని చెప్పుకునే కాంగ్రెస్, బీజేపీలు ఆ అగాధాన్ని ఎలా పూడ్చాలో విభజన బిల్లులో ఎక్కడైనా చెప్పారా? అలాంటి వాటితోనే తెలంగాణ ఒక నిరుద్యోగుల, పేద రైతుల సమాజంగా మారింది. తాము చేసిపెట్టిన ఘన కార్యాలే గత 20 ఏళ్లగా తెలంగాణ రైతులకు ఉరితాళ్లు పేనుతున్నాయనే విషయం మరిచి ఇపుడు రైతుల ఆత్మహత్యలపై గగ్గోలు చేయడం చూస్తే వాటి నిస్సిగ్గుతనం బయటపడుతుంది.

విభిన్న భావజాలకులలో ఉన్న ప్రాంతభావం ఏపాటిదనేందుకు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకోవా లి. ఎక్కడ కట్టినా తెలంగాణకు మాత్రమే ఉపయోగపడే ప్రాణహిత, కాళేశ్వరాలను రచ్చచేయడంలో ఢిల్లీ పార్టీలు, లెఫ్ట్ భావజాలకులు ఎక్కడలేని ఆసక్తి చూప డం గమనార్హం. కానీ పాలమూరు ప్రాజెక్టుకు అడ్డచెపుతున్న చంద్రబాబు వల్ల తెలంగాణకు జరిగే నష్టం పట్ల వారికి అంతగా ఆసక్తి లేకపోవడం మనం గమనించొచ్చు. ప్రాణహితలో కట్టినా, కాళేశ్వరంలో కట్టి నా ఆ ప్రాజెక్టు తెలంగాణ ప్రాంతానికే ఉపయోగపడుతుంది. కానీ పాలమూరు ప్రాజెక్టును చంద్రబాబు అడ్డకుంటే అది యావత్ తెలంగాణకే నష్టం చేస్తుంది. అందుకే, ఢిల్లీ పార్టీలు, లెఫ్ట్ భావజాలకులలో ప్రాంతభావానికి ఉన్న ప్రాధాన్యం ఏమిటో చెప్పడానికి అదొ క ఉదాహరణ మాత్రమే. అలాగే, ప్రాంత భావాన్ని విచ్ఛిన్నం చేసేందుకే అన్నట్లు కొందరు బరితెగించి తెలంగాణను ఉత్తర, దక్షిణ కొలమానంలో కొలిచి చూపిస్తుండటం మరొక ఉదాహరణ. ఆ విధంగా, తెలంగాణలో బతుకుతున్న వివిధ భావజాలకుల సేవ లు పరోక్షంగా ఆంధ్రా బాబుల కుతంత్రాలకే ఉపయోగపడుతుండటం దురదృష్టకర పరిణామం.

దేశంలో వామపక్ష భావజాలానికి తెలంగాణ పెట్టిం ది పేరనే భావన ఉంది. తెలంగాణలో కమ్యూనిజం సాధించిన విజయాలు ఎన్ని ఉన్నా, విశాలాంధ్ర పేర ఆంధ్రాతో అంటగట్టడంలో అది పోషించిన పాత్ర వల్ల జరిగిన అనర్థమూ అంతేవుంది. అదంతా గతించిన చరిత్ర. ఇంతకాలం ఉద్యమాలు తెలంగాణలో, నిర్ణయాలు సీమాంధ్రలో జరిగాయి. అంటే ప్రాంత భావం కన్నా భావజాలానికే ప్రాధాన్యమిచ్చిన వామపక్షాలు తెలంగాణకు రాజకీయంగా చేసిన మేలు ఏమి టో అర్థమవుతుంది. దేశంలో గత రెండున్నర దశాబ్దాలలో అనేక మార్పులు జరిగాయి. ఆర్థిక విధానాలూ మారాయి. ఇంకాచెప్పాలంటే, ప్రపంచ పోకడనే మారింది. మారిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణను పునర్నిర్మానం చేసుకోక తప్పదు. ముం దే చెప్పుకున్నట్లు, తెలంగాణలో జరిగిన విధ్వంసాలు, వివక్షల కారణంగా వ్యవసాయం కునారిల్లింది, నిరుద్యోగం పెరిగింది. వచ్చిన తెలంగాణలో వాటికి పరిష్కారాలు వెతకాలె. ప్రభుత్వ ఉద్యోగాలతో నిరుద్యో గం పోయేది కాదు. దాని పరిష్కారానికి పెట్టబడులు అనివార్యం. నేటి పోటీ ప్రపంచంలో సరళమైన పారిశ్రామిక విధానాన్ని చేపడితే తప్ప పెట్టబడులు రావు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. అలాగే తెలంగాణలో ఏర్పడిన రెండింతల వ్యవసాయ సంక్షోభ పరిష్కారం దిశగా సాగునీటి వసతి పెంపకానికి ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు, చెరువుల మరమ్మతులు పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. అంత మాత్రాన ఏమీ జరగడం లేదనే భావనను సృష్టించి రైతులలో, నిరుద్యోగులలో ఒక రకమైన నిరుత్సాహా న్ని పెంచిపోషించడం అభ్యుదయం అనిపించుకోదు. ఒక్క తెలంగాణలో విప్లవాలతో దేశ ఆర్థిక విధానాలుగానీ, ప్రపంచ పోకడగానీ మారేది కాదు. లేక లేక ఆరు దశాబ్దాల తర్వాత రాష్ర్టాన్ని సాధించుకున్నాం. కాబట్టి ఇక్కడ తెలంగాణను బతికించుకొని పురోగమించాలంటే, భేషజాలాలకు పోకుండా భావజాలాలను పక్కనపెట్టి ప్రాంత భావంతో పనిచేస్తేనే ఏదైనా సాధించగలుగుతామని అందరూ గమనించాలె. రాజకీయ వైరుధ్యాలతో భావజాలాలు బతకొచ్చేమో గానీ వచ్చి న తెలంగాణ బతకదు. రైటిస్టు, లెఫ్టిస్టు, సెంట్రలిస్టు ఏ భావజాలకులైనా సరే, ప్రాంతభావం లేని రాజకీయాలు, ఇన్నాళ్లూ విధ్వంసాలకు గురైన తెలంగాణకు ఏ మాత్రం పనికి రావని గమనించాలె.

ఏది ఏమైనా విభిన్న సమాజాలు, భావజాలాలు కలిగిన తెలంగాణలో ప్రాంతభావం కలిగిన పార్టీ మొదటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తెలంగాణకు కలిసొచ్చిన అంశమనే చెప్పాలె. తెలంగాణ వస్తే మైనారిటీలకు భద్రత ఉండదని అప్పట్లో మజ్లిస్ పార్టీ ప్రచారం చేసింది. కానీ ఇవాళ మైనారిటీలనూ తెలంగాణ అస్తిత్వం వైపు మళ్లించడంలో కేసీఆర్ ఇప్పటికే కొంత విజయం సాధించారు. తెలంగాణ వస్తే మైనారిటీల రాజ్యమవుతుందని ఒకప్పుడు(2004లో) బీజేపీ పరోక్ష ప్రచారం చేసింది. కానీ మెజారిటీ భావజాల సమాజాన్ని సైతం అస్తిత్వ గొడుగు కిందకు తేవడంలో కేసీఆర్ కృషి కాదనలేనిదే. అనుమానాలు, అభూత కల్పనలను ఛేదించి తెలంగాణ సమాజాన్ని ఒక బలమైన అస్తిత్వ వాదం వైపు నడిపించడంలో కేసీఆర్ దృష్టి పెడుతున్నారు. తెలంగాణలోని విభిన్న సమాజాలలో ప్రాంత భావం పట్ల ఏకత్వం ఉంది. కానీ విభిన్న భావజాలలో మాత్రం ప్రాంతభావానికి ప్రాధాన్యం లేకపోవడమే వచ్చిన తెలంగాణకు కలిసిరాని అంశం. అందుకే ఇవాళ తెలంగాణకు కావలసిం ది వైరుధ్య రాజకీయాలు కాదు. తెలంగాణలో బతికే ప్రతి పార్టీకి, ప్రతి భావజాలనికి కచ్చితంగా ప్రాంత భావానిదే మొదటి ప్రాధాన్యం కావాలె. లేదంటే ఈ విభిన్న భావజాలాలు తమ ఉనికి కోసం పనిచేస్తా యా, ప్రాంతభావంతో పనిచేస్తాయా అనే కీలక ప్రశ్న తెలంగాణ సమాజం ముందు ఎప్పుడూ ఉంటుందని మర్చిపోవద్దు.
kallurisreddy@gmail.com

1743

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ