ఉరితాళ్లు పేనినోళ్లే ఊరేగుతున్నారు..


Sat,September 12, 2015 01:41 AM

ప్రతిపక్షాలు నిర్మాణాత్మక పాత్ర పోషిస్తున్నాయా, నింద రాజకీయాలు నడుపుతున్నాయా! ఇవాళ తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఎక్కడ జరిగినా అందుకు.. కేంద్ర పాలకుల విధానాలు, ఆరు దశాబ్దాల వలస పాలకుల ప్రాంతీయ వివక్షలే కారణం. వాటి శాశ్వత పరిష్కారాలకు తమ వంతు సహకారం అందించాలె. అంతే గానీ ఆత్మహత్యలను రాజకీయాలకు ముడిసరుకు చేసుకొని మనుగడ సాగించాలనుకుంటే దేశంలో గానీ,
తెలంగాణలో గానీ వ్యవసాయ సంక్షోభం మరింత పెరుగుతుంది.

srinivasreddy


తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికే దేశంలో ఆర్థిక సంస్కరణలకు తెరతీసి 25 ఏళ్లు గడిచిపోయాయి. దీంతో అన్ని వ్యవస్థలలో అనేక సంక్షోభాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోంచే ఈ దేశ రైతుల ఆత్మహత్యలు ముందుకొచ్చాయి. మన పాలకులు ప్రపంచ పెద్దల మాట జవదాటకుండా సంస్కరణలైతే తెచ్చా రు. కానీ వాటి పర్యావసానాల గురించి ఆలోచించ లేదు. ఆ దుష్పరిణామాల ఫలితమే రైతు, చేనేత కార్మికుల ఆత్మహత్యలకు ఈ దేశం నిలయంగా మారింది. పోటీ ప్రపంచంలో బతకాలన్నారు.

అమెరికా సంపన్న రైతుకు పెట్టుబడిలో 70 శాతం పైగా రాయితీలిస్తున్నారు. భారత రైతుకు ఇస్తున్న కొద్దిపాటి రాయితీలకే ఎగనామం పెట్టారు. ఇదెక్కడి పోటీ ప్రపంచం? భార త బక్కరైతుకు, అమెరికా సంపన్న రైతుకు పోటీపెట్టి రైతును చంపడంలో ఈ దేశ రాజకీయాలు 25 ఏళ్లుగా పోటీపడ్డాయి. ఇప్పుడు రైతు ఆత్మహత్యలపై ధర్నాలు చేస్తున్నాయి. దోషం తమ వద్ద దాచుకొని బరితెగించి ఊరేగుతున్న ఈ దేశ రాజకీయాలే రైతుకు ఉరితాళ్లు పేనాయి.

25 ఏళ్లుగా పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించిన ఏ ఒక్క రాజకీయపార్టీ వద్దనైనా ఈ దేశ వ్యవసాయ విధానం అంటూ ఏమైనా ఉన్నదా? ఏ ఒక్క పార్టీ అయినా ఈ వ్యవసాయ విధానంతో విభేదించాయా? అన్ని పార్టీలదీ ఒకే ఎజెండా అనడానికి దేశంలో జరిగిన లక్షలాది మంది రైతు ఆత్మహత్యలే సాక్ష్యం. కేంద్రంలో అధికారం చెలాయిస్తూ వ్యవసా య సబ్సిడీలను రద్దు చేసిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే ఇవాళ తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై ధర్నాలు నిర్వహించడం హాస్యాస్పదం. రైతును బతికించే విధానాలను చంపేసిన వారే, ఇపుడు రైతు ఆత్మహత్యలపై అంగలార్చడాన్ని ఏమందాం?

ఈ వ్యవసాయ సంక్షోభాన్ని ఇపుడెవరికో అపాదించి ఊరేగుతున్న రాజకీయాలను చూస్తేనే వాటి నిస్సిగ్గుతనం బయటపడుతున్నది. ఇవాళ దేశంలో రైతులు వ్యవసాయ సంక్షోభాన్ని మాత్రమే ఎదుర్కొంటున్నారు. కానీ తెలంగాణ రైతు దానికి తోడు 6 దశాబ్దాల పాటు ప్రాంత వివక్షతో నష్టపోయిన సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటున్నాడు. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ రైతుకు వారసత్వంగా ఏమైనా లభించిందా లంటే, అది రెండింతల సంక్షోభమే. రైతు ఆత్మహత్యలకు కారణాలు అనేకం ఉన్నా.. తెలంగాణ రైతుకు మాత్రం సాగునీటి కొరతే ప్రధాన కారణమని చెప్పడానికి అనేక ఉదాహరణలున్నాయి. ఈమధ్య స్వయా న ఆంధ్రా పత్రిక (ఈనాడు) 1997 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఆత్మహత్యలపై సమ గ్ర కథనాన్ని ప్రచురించింది.

ఆ కథనం పెట్టడంలో ఆ పత్రిక ఉద్దేశం ఏమైనా కావచ్చు, కానీ తెలంగాణలోని వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారణం సాగునీటి కొరతేనని అర్థం చేసుకోగలిగే వారికి చాలా సులభం గా అర్థమవుతుంది. నేషనల్ క్రైం రిపోర్టు ఆధారంగా, రాష్ట్రం విడిపోకముందు 2013లో ఉమ్మ డి రాష్ట్రంలో 2014 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రం విడిపోయాక 2014లో తెలంగాణలో 898 మంది, ఏపీలో 160 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆ కథనం తెలిపింది. సాగునీటి లభ్యత తెలంగాణ కన్నా ఏపీలోనే చాలా ఎక్కువ అనేది జగమెరిగిన సత్యం. రెండు రాష్ర్టాల్లో 2014లో జరిగిన ఆత్మహత్యల సంఖ్యనే ఆ విషయా న్ని ధ్రువీకరిస్తున్నది.

ఏపీలో ఒక్క ఆత్మహత్య జరిగితే, తెలంగాణలో 8 ఆత్మహత్యలు జరిగాయని ఆ రిపోర్టు చెపుతున్నది. దేశంలోని వ్యవసాయ సంక్షోభం రెండు రాష్ర్టాలకు వర్తిస్తుంది. అయినా తెలంగాణలోనే అత్యధికంగా ఆత్మహత్యలు జరగడానికి కారణం? నిస్సందేహంగా సాగునీటి కొరతే ప్రధాన కారణం. అలాంటి సాగునీటి కోసం అల్లాడిన తెలంగాణ రైతు ఘోషకు ఎవరు కారణమో ఆత్మహత్యలపై కన్నీరు కారుస్తున్న విపక్షాలే చెప్పాలి.

రెండు జీవనదులలో 1200 టీఎంసీలపై హక్కులు కలిగి ఉండి కూడా తెలంగాణ రైతు సాగునీటి కోసం అల్లాడుతూ 20 ఏళ్లుగా ప్రాణాలు వదులుతుంటే.. ఇదే విపక్షాలకు ఏనాడూ కనిపించలేదా? ఈ 15 నెలలోనే వారికి కనిపిస్తున్నాయా? ఉమ్మడి రాష్ట్రం వారసత్వంగా ఇచ్చిన సాగునీటి సంక్షో భం ఒక్క ఏడాదిలోనే తొలగిపోగలదా? నిర్మాణం చేయాలనుకుంటున్న ప్రాజెక్టులకు పక్క రాష్ట్రం అడ్డుపడుతుంటే.. ఒక్కరోజూ ధర్నా చేయని ప్రతిపక్షాలు ఇవాళ తెలంగాణ రైతు ఆత్మహత్యలపై చేస్తున్న ఆందోళనల్లో నిజాయితీ ఉన్నదా?

వ్యవసాయ సంక్షోభం నుంచి రైతును కాపాడాలంటే కేంద్రం కల్పించుకోకుండా రాష్ర్టాలు మాత్రమే చేయగలిగేది కొంత మాత్రమే. వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగిపోవడానికి కేంద్రం చేపట్టిన విధానాలు కారణమైతే, తెలంగాణ లాంటి రాష్ట్రంలో సాగునీటి కొరతకు సమైక్య పాలకులు అదనపు కారకులయ్యా రు. దేశంలో ఏర్పిడిన వ్యవసాయ సంక్షోభానికి కేం ద్రం తీసుకుంటున్న చర్యలు ఏమిటో చెప్పని బీజేపీ తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై ఊరేగడంలో అర్థం ఉన్నదా? రైతులు సబ్సిడీలను వదులుకోవాలని ఒకప్పుడు చెప్పిన వాజ్‌పేయి ప్రభుత్వం తమదేనని బీజేపీ నేతలు అప్పుడే మర్చిపోయారా? మలేషియా నుంచి వంటనూనెలు దిగుమతి చేసి, ఈదేశ పల్లీనూనె రైతుల ఉసురు తీసిన ఘనత తమదేనని బీజేపీ నేతలు మర్చిపోయారా? గతంలో ఎరువులు, విత్తనాలపై ఉన్న సబ్సిడీలను కూడా ఎత్తేసి, పెట్టుబడులు భరించలేని సగటు రైతు చావుకు కారణమైన కాంగ్రెస్ ఇవాళ ఆత్మహత్యలపై ఊరేగడాన్ని ఏమందాం?

వ్యవసాయ సంక్షోభం నుంచి రైతును కాపాడే విధానాలు చెప్పకుండా ఆత్మహత్యలపై ఊరేగినంత మాత్రాన ఈ దేశ రైతులెవరూ నమ్మరని ఆ రెండు పార్టీలూ తెలుసుకోవాలి. బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో జరగుతున్న రైతుల ఆత్మహత్యలపై ఈ దేశ ప్రజలకు జవాబు చెప్ప ని ఆ రెండు పార్టీలను తెలంగాణలో ఎవరైనా నమ్ముతున్నారా? గత 20 ఏళ్లుగా ఎత్తేసిన వ్యవసాయ సబ్సిడీలను పునరుద్ధరించినపుడే ఆపార్టీలకు రైతు ఆత్మహత్యలపై మాట్లాడే హక్కు ఉంటుంది. నిజంగానే వ్యవసాయ సంక్షోభ నివారణకు తక్షణం చర్యలు తీసుకోవాలంటే, ఎత్తేసిన వ్యవసాయ సబ్సిడీలను పునరుద్ధరించడంతో మొదలు కావాలి. ముందు సగటు రైతు ను పెట్టబడుల పెను భూతం నుంచి బయట పడేయాలంటే, సబ్చిడీల పునరుద్ధరణే మార్గం.

ఆ దిశగా పనిచేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సిద్ధంగా ఉన్నా యా? పార్లమెంటులో ఆ రెండు పార్టీలు కలిసి 327 స్థానాలు కలిగివున్నాయి. ఆ రెండు పార్టీలు తలుచుకోకుండా ఈదేశంలో ఏ విధానమూ తయారు కాదు. అందుకే ఆ రెండు పార్టీలకు రైతుల ఆత్మహత్యలపై చేస్తున్న వ్యాఖ్యలలో నిజాయితీ ఉంటే.. ముందుగా తమ తమ పార్టీల వ్యవసాయ విధానమేమిటో ప్రకటించాలి. ఆ తర్వాతే ఆ రెండు పార్టీలు ఈ దేశంలో రైతు ఆత్మహత్యలపై మాట్లాడితే సబబుగా ఉంటది. అదేమీ చేయకుండా రాష్ర్టానికో విధంగా రైతు ఆత్మహత్యలపై మాట్లాడే ఆ రెండు పార్టీలు ఈ దేశంలో జాతీయ పార్టీలుగా చెలామణి కావడమే దురదృష్టకరం.

ఉమ్మడి రాష్టం ద్వారా లభించిన వారసత్వ సంక్షో భం నుంచి తెలంగాణ రైతును కాపాడాల్సిన రాజకీయ పార్టీలు వారి శవాలపై రాజకీయాలు చేయడం సరికాదు. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రైతుకోసం తాత్కాలిక, దీర్ఘకాలిక చర్యలు తీసుకుంటున్నదా లేదా చూడాలి. రైతుల రుణమాఫీ దశల వారీగా చేస్తున్నా రు. అది రిజర్వుబ్యాంకు విధించిన నిబంధనల వల్ల ఒకే సారి మాఫీ చేయడం కుదరలేదు తప్ప, ప్రభుత్వ మే తనకు తాను అలా చేయలేదని అందరికీ తెలుసు. రిజర్వుబ్యాంకు నిబంధనలను సవరించాలంటే కేంద్ర మే చేయాలి. సంస్కరణల్లో భాగంగా రిజర్వుబ్యాంకు కు అలాంటి నిబంధనలు విధించిన కేంద్రంలో బీజే పీ, కాంగ్రెస్ పార్టీలే తెలంగాణలో రైతు రుణ మాఫీ ఒకేసారి మాఫీ కాకపోవడానికి కారణం. ఇవాళ ఆ పార్టీలే రుణాలు దశల వారీగా అమలు చేయడమేమిటని మాట్లాడటం విడ్డూరం.

గ్రామీణ తెలంగాణ రైతు కుటుంబానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం ఒక ఉపశమనం. ఉదాహరణకు వృద్ధులకు 1000 పెన్షన్, రేషన్ బియ్యం ఒక్కొక్కరికి 6 కేజీలు ఇవ్వడం లాంటివి తెలంగాణ పేద రైతులకు ఉపశమనం కలిగించే కార్యక్రమాలే. దీర్ఘకాలిక పరిష్కారాల గురించి చెప్పుకోవాలంటే.. చెరువుల పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కీలకమైనవి. ముఖ్యంగా నాలుగు దశాబ్దాలుగా తెలంగాణ చెరువులు విధ్వంసమయ్యాయి. వాటి పునరుద్ధరణ తెలంగాణ రైతుకు ఒక శాశ్వత పరిష్కారం. ప్రతి ఏటా దాదాపు తొమ్మిది వేల చెరువుల పునరుద్ధరణ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. సుమా రు నాలుగేళ్లలో చెరువుల పునరుద్ధరణ పూర్తి కావచ్చు. ఇదొక దీర్ఘకాలిక పరిష్కారం.

అలాగే తెలంగాణ రైతు ను వర్షాభావ పరిస్థితుల నుంచి కాపాడాల్సిన అవసరాన్ని కూడా ప్రభుత్వం గుర్తించింది. రెండు వందల కోట్లకు పైగా మొక్కలు నాటడానికి హరితహారం కార్యక్రమం చేపట్టింది. అలాగే సమైక్య పాలకులు వదిలేసిన సాగునీటి ప్రాజెక్టు డిజైన్లపై మరో సారి సర్వే చేయిస్తున్నారు. ఎందుకంటే, సమైక్య పాలకులు ఉమ్మడి రాష్ర్టాన్ని దృష్టిలో ఉంచుకొని చేసిన ప్రాజెక్టుల డిజైన్లను ఇపుడు మన ప్రయోజనాలకు అనుగుణంగా నిర్మించుకోవడం తప్పని సరి. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కూడా దీర్ఘకాలిక పరిష్కారమే. అలాగే హరితహారం కూడా. ఈ విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో రైతుకు ఏమేరకు చేయగలదో ఏ మేరకు కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నది.

అయితే వాటన్నిటి ప్రయోజనాలు రైతుకు అందాలం టే మరో మూడు, నాలుగేళ్లు పడుతుంది. పని చేసే ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా పెట్టకోవద్దు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక పాత్ర పోషిస్తున్నాయా, నింద రాజకీయాలు నడుపుతున్నాయా! ఇవాళ తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఎక్కడ జరిగినా అందుకు.. కేంద్ర పాలకుల విధానాలు, ఆరు దశాబ్దాల వలస పాలకుల ప్రాంతీయ వివక్షలే కారణం. వాటి శాశ్వత పరిష్కారాలకు తమ వంతు సహకారం అందించాలె. అంతే గానీ ఆత్మహత్యలను రాజకీయాలకు ముడిసరుకు చేసుకొని మనుగడ సాగించాలనుకుంటే దేశంలో గానీ, తెలంగాణలో గానీ వ్యవసాయ సంక్షోభం మరింత పెరుగుతుంది.

1241

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ