పటేళ్ళ పోరు: ఒక విశ్లేషణ


Sun,August 30, 2015 12:21 AM

ఈ దేశంలోని బాధ్యత గల పార్టీలు ఇపుడున్న రిజర్వేషన్లను క్రిమీలేయర్ విధానం ఆధారంగా అమలు చేసేందుకు
కృషి చేయాలి. చివరి పేద దళితుడికి సైతం ప్రయోజనం అందేలా చూడాలి. అపుడే రిజర్వేషన్ల లక్ష్యం చాలామేరకు నెరవేరే అవకాశం ఉంటది. అలా కాకుండా ఇపుడున్న పద్ధతిలోనే రిజర్వేషన్లు అమలు చేస్తూపోతే వాటి అవసరం వందల ఏైళ్లెనా తీరేది కాదు.

హఠాత్తుగా గుజరాత్‌లోని పటేల్ సామాజికవర్గం నుంచి ఓబీ సీ రిజర్వేషన్ డిమాండ్ రావడం నిజంగా దేశాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచిందని చెప్పాలి. 22 ఏళ్ల యువకుడు హార్ధిక్ పటేల్, పటేల్‌లకు 27 శాతం ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలని లక్షాలాది మందితో అహ్మదాబాద్‌లో సభ జరిపి సంచలనం సృష్టించాడు. ఆ మరుసటిరోజు విధ్వంసా లు, కర్ఫ్యూల దాక దారి తీయడం చూసి, గుజరాత్ ప్రజలే కాదు, యావద్దేశ ప్రజలు కొంతమేర దిగ్భ్రాంతి గురయ్యారు. ఆ అల్లర్లలో అక్కడక్కడా పోలీసులు కూడా విధ్వంసాలకు, వాహన దహనాలకు పాల్పడినట్లు వార్తలు వెలువడడం కొసమెరుపు.

srinu


పటేళ్ళ రిజర్వేషన్ డిమాండ్‌ను మనం రెండు పార్శాల్లో చూడాలి. ఈ రిజర్వేషన్ డిమాండ్ వెనక ఏదైనా రాజకీయ తంత్రం ఉన్నదా? లేక నిజంగానే ఓసీ కులాల పేదలలో పెరుగుతున్న అసమ్మతి ఉన్నదా? లేక రెండూ సమ్మిళిమై ఉన్నాయా? ఇవే అత్యంత కీలకమైన ప్రశ్నలు. ముందుగా రాజకీయ తంత్రం గురించి చర్చిద్దాం.గుజరాత్ 55 ఏళ్లలో ఐదుసార్లు రాష్ట్రపతి పాలనను చవి చూసింది. 15 మంది ముఖ్యమంత్రులయ్యారు.

ఇద్దరు ముగ్గురు తప్ప ఏ ఒక్క ముఖ్యమంత్రి పూర్తి ఐదేళ్లు పాలించిన వారులేరంటే, గుజరాత్‌లో అధికార పోటీ ఎలా ఉండిందో అర్థమవుతుంది.గుజరాత్ రాజకీయాల్లో పటేల్ సామాజిక వర్గం చాలా కీలకపాత్ర పోషిస్తున్నది. రాజకీయాల్లో అది ఎగుడుదిగుడులను కూడా చవి చూసింది.బాబూ భాయ్, చిమన్ భాయ్, కేశూ భాయ్ ఇలా పార్టీ ఏదైనా పటేల్ సామాజిక వర్గం వారు దాదాపు సుమారు 15 ఏళ్లు పాలించారు. గోద్రా సంఘటనతో గుజరాత్ రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. ఇంకా చెప్పాలంటే నరేంద్ర మోదీ శకం మొదలైందని చెప్పాలి. పాలన బాగుంటే కులంతో పని లేదనే స్థితిని మోడీ పాలన కొంత మేర తెచ్చింది. 2001లో మొదలైన మోడీ పాలన 2014 వరకు సాగింది.

అంటే దాదాపు 13 ఏళ్లు పటేల్‌లకు అతీతంగా గుజరాత్‌లో పాలన సాగడం ఒక విశేషం. మోడీ దేశానికి ప్రధాని అయ్యాక పటేల్ సామాజికవర్గానికే చెందిన ఆనందీబెన్ పటేల్‌ను ముఖ్యమంత్రిని చేయడం గమనార్హం.అంటే గుజరాత్‌లో పటేల్ సామాజిక వర్గం దూరం కాకుండా మోడీ తన ముందు చూపుతోనే ఈ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళను ముఖ్యమంత్రిని చేశారని విశ్లేషకుల అభిప్రాయం. అయినా కూడా అక్కడ ఇపుడు పటేల్‌ల రిజర్వేషన్ డిమాండ్ ఎందుకు వస్తున్నదనేది మరింత కీలక ప్రశ్న.

నరేంద్రమోడీ గుజరాత్‌ను మోడల్ స్టేట్‌గా చేశాడా లేదా అనేది పక్కనపెడితే.. 35 ఏళ్ల తర్వాత పార్లమెంటులో సంపూర్ణ మెజారిటీ సాధించి దేశానికి ప్రధాని కాగలిగిన మొదటి నాయకుడు ఆయనే. ఆయన ఇపుడు దేశానికి ప్రధాని అయినా.. ఇప్పటికీ ఆయన ప్రతిష్ఠ గుజరాత్‌తోనే ముడిపడి ఉన్న విషయం ఎవరూ మర్చిపోవద్దు.గుజరాత్‌లో ఏం జరిగినా ఆయన వ్యక్తిత్వాన్ని దేశ ప్రజల ముందు పరీక్షకు నిలబెడుతుంది. ఈ కోణంలో చూసినపుడు మాత్రం పటేల్‌ల రిజర్వేషన్ ఆందోళన వెనకాల ఏ రాజకీయ శక్తులైనా ఉండిఉంటాయా అనే అనుమానం రావడం సహజం.

ఇకపోతే, ఓసీ కులాల పేదలలో రోజురోజుకు పెరిగిపోతున్న అసంతృప్తి, అసహనం గురించి చర్చించాల్సిన అవసరం ఉన్నది. భారతదేశంలో ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ల ఉద్దేశం చాలా గొప్పది. నిజానికి ఈదేశానికి ఎవరూ సోషలిజాన్ని నేర్పలేదు. స్వాతంత్య్రం సిద్ధించాక, గతంలో సామాజికంగా ఉన్న అంటరానితనం, అసమానతలు తొలగిపోవాలనే బలమైన లక్ష్యంతోనే మన రాజ్యాంగం రిజర్వేషన్లను తనకు తాను నిర్దేశించుకున్నది. ఇంత గొప్ప నిజాయితీతో ప్రపంచంలో ఏ దేశ రాజ్యాంగమూ రచించబడలేదేమోనంటే అతిశ యోక్తి కాకపోవచ్చు. కానీ రిజర్వేషన్ల లక్ష్యాలను ఏమేరకు సాధించామనే విషయం మన రాజకీయ పార్టీలకు పట్టకుండాపోయింది. కానీ రిజర్వేషన్ల ప్రయోజనాలు ఆయా సామాజిక వర్గాలలోని కొందరే పదే పదే పొందుతూ చివరి పేదవాడి దాకా అందకుండా చేస్తున్నాయి.

ఈ విషయం దేశంలోని అన్ని పార్టీలకు తెలుసు. కానీ దానికి పరిష్కారం చూపే క్రిమీలేయర్ విధానం ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ దేశంలోని ఏ రాజకీయపార్టీ అనుకోకపోవడమే దురదృష్టకరం. రిజర్వేషన్ల లక్ష్యం నెరవేరలేదంటూ ప్రతి పదేళ్ల కోసారి రిజర్వేషన్లను పొడిగించడంలో మాత్రం మన పాలకులు పోటీ పడుతుండటం గమనార్హం. నిజానికి రిజర్వేషన్లతో ఆయా సామాజిక వర్గాలలో కొంత మేరకు ఉన్నతిని సాధించగలిగామని గర్వంగా చెప్పొచ్చు. కానీ అదే సమయంలో అవి అందరికీ అందకుండా కొందరికే పరిమితమై దుర్వినియోగమవుతున్నాయనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇవాళ గుజరాత్‌లో పటేల్ సమాజికవర్గం కూడా రిజర్వేషన్ల కోసం పోరాటానికి దిగిందంటే లోపం ఎక్కడ ఉందో అందరికీ తెలిసిందే.

రిజర్వేషన్ల సద్వినియోగం ఏపాటి జరుగుతున్నా, రిజర్వేషన్ పొందిన కుటుంబాలే తిరిగి పొందుతూ రిజర్వేషన్ల లక్ష్యాన్ని విచ్ఛిన్నం చేస్తున్నంత కాలం, ఇతరులు నష్టపోవడం ఖాయం. ఉదాహరణకు దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు, దళిత ఉన్నతాధికారులు, ఇతర దళిత ఉద్యోగుల సంతానం తిరిగి రిజర్వేషన్లను ఉపయోగించుకుంటున్నపుడు.. గ్రామంలో ఇంకా పశువుల కాపరిగా బతుకుతున్న దళితుడి కొడుకుకు రిజర్వేషన్ ప్రయోజనం లభించగలదా? ఒక్క దళితులలోనే కాదు, గిరిజనులు, వెనుకబడిన కులాలలోని చివరి పేదవాడి సంతానానికీ క్రిమీలేయర్ విధానం లేకుండా రిజర్వేషన్ ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయా? కాబట్టి ఇప్పటికైనా దేశంలో రిజర్వేషన్లను క్రిమీలేయర్ విధానం ఆధారంగా అమలు చేయాల్సిన అవసరాన్ని బాధ్యత గల రాజకీయ పార్టీలు గుర్తించాలి. ఓసీ కులాల పేదలలో పెరుగుతున్న అసంతృప్తి వెనకాల ఉన్న కారణాన్ని గుర్తెరగాలి.

ప్రపంచీకరణ పరిణామాలు సమాజంలో అనేక మార్పులు తెచ్చాయి. అలాగే కులం మతం తేడా లేకుండా పేద-గొప్ప అంతరాలు కూడా బాగా పెరిగిపోయాయి. ఆర్థిక సంస్కరణల దుష్పరిణామాలు అన్ని సామాజిక వర్గాలపైనా ప్రభావం చూపాయి, చూపుతున్నాయి. గుజరాత్‌లో చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు చాలామేరకు పటేల్ సామాజిక వర్గం వారివే. గుజరాత్‌లో ఇపుడు దాదాపు రెండున్నర లక్షలకు పైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూత పడ్డాయని తెలుస్తోంది. వీటిలో సుమారు 20 లక్షల మంది ఉపాధి పొందేవారు. అలాగే, దేశ వ్యాప్తంగా వ్యవసాయ సంక్షోభంతో అనేక ఓసీ కులాల పేదల బతుకులకు దిక్కులేకుండా పోయింది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకున్నపుడు ఓసీ కులాలలోని పేదలలో ఒక రకమైన అసంతృప్తి, అసహనం చోటు చోటుచేసుకుంటుండడం ఒక సహజ పరిణామం. గుజరాత్ పటేల్‌ల పోరాటాన్ని కూడా మనం ఈ కోణంలో చూడవచ్చు.

దేశంలో ఒకో రాష్ట్రంలో రిజర్వేషన్ల అర్హత ఒకో తీరుగా ఉండడం గమనార్హం. ఉదాహరణకు పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో లింగాయత్, ఒక్కలిగ కులాలు అగ్రకులాలని భావిస్తుంటాం. కానీ ఆ రాష్ట్రంలో ఆ రెండు కులాలు ఓబీసీ కులాలుగా ప్రభుత్వం గుర్తించి రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం గమనార్హం. అలాగే అక్కడ రెడ్డిలనూ ఓబీసీలుగా గుర్తించారు. కానీ ఆదే రెడ్డీలు తెలంగాణలో ఓసీలుగా గుర్తించబడుతున్నారు. రిజర్వేషన్లలో రాష్ర్టానికో తీరు దేశ వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఇది మంచి పరిణామం కాదు.దేశంలో అన్ని రాష్ర్టాలలోని ఓసీ కులాలపై ఓ కమిటీ వేసి దర్యాప్తు జరపాలి. ఆయా కులాల స్థితిగతులపై అధ్యయనం జరగాలి. జాతీయ స్థాయిలో అలాంటి దర్యాప్తు జరిపితేనే నిజానిజాలు తేలుతాయి.

ఆయా కులాల ఆర్థిక సామాజిక పరిస్థితులు తెలుస్తాయి. ఎందుకంటే, దేశంలో అర్థిక సంస్కరణలు వచ్చాక సామాజిక, ఆర్థిక పరిస్థితులు చాలా తీవ్రంగా మారాయి. నిన్నటి అగ్రకుల రైతు, నేడు కూలీ రైతుగా మారిన పరిస్థితులూ దేశంలో కోకొల్లలు కనిపిస్తాయి.కాబట్టి అగ్రకుల పేదల కోసం కనీసం ఈబీసీ రిజర్వేషన్ అయినా కల్పించాల్సిన అవసరం ఉందని మారిన సామాజిక, ఆర్థిక పరిస్థితులు చెపుతున్నాయి. గుజరాత్ పటేల్‌ల ఆందోళనను మనం ఎన్ని కోణాలలో చూసినా.. అగ్రకులాలోని పేదలలో కొంత అసంతృప్తి పెరుగుతున్నదని పటేళ్ల ఆందోళన చెపుతున్నది.

ఈ దేశంలోని బాధ్యత గల పార్టీలు ఇపుడున్న రిజర్వేషన్లను క్రిమీలేయర్ విధానం ఆధారంగా అమలు చేసేందుకు కృషి చేయాలి. చివరి పేద దళితుడికి సైతం ప్రయోజనం అందేలా చూడాలి. అపుడే రిజర్వేషన్ల లక్ష్యం చాలామేరకు నెరవేరే అవకాశం ఉంటది. అలా కాకుండా ఇపుడున్న పద్ధతిలోనే రిజర్వేషన్లు అమలు చేస్తూపోతే వాటి అవసరం వందల ఏైళ్లెనా తీరేది కాదు. అలాగే, గుజరాత్ పటేళ్ళ ఆందోళన వెనకాల రాజకీయ తంత్రాలున్నాయా లేదా తెలియదు కానీ, ఓసీ పేదల అసంతృప్తి దానికి తోడైందనడంలో అనుమానం లేదు.
చివరగా.. ఒక సంపన్న ఓసీతో సమానంగా ఒక పేద ఓసీని కూడా చూసే ధోరణి ఇటు సమాజంలో, అటు ప్రభుత్వాలలో మారాల్సిన అవసరాన్ని గుజరాత్ పటేల్‌ల ఆందోళన గుర్తుచేస్తున్నదని మాత్రం చెప్పొచ్చు.

1243

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ        


country oven

Featured Articles