తెలంగాణకూ ప్యాకేజీ ఇవ్వాలె


Thu,August 20, 2015 12:33 AM

1200 టీఎంసీలపై హక్కులు కలిగి ఉండి కూడా తెలంగాణ సాగునీరు లేక వ్యవసాయం దండగై ఎంత నష్టపోయిందో లెక్కగట్టగలమా? ఇలా అక్షరాస్యత విషయంలో, వ్యవసాయం విషయంలో, వైద్యం విషయంలో, అభివృద్ధి
విషయంలో ఆరు దశాబ్దాల పాటు జరిగిన అన్యాయాన్ని పూరించాలంటే కేంద్రం తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చితీరాలి.

discription

ప్రధాని మోదీ బీహార్ రాష్ర్టానికి లక్షా 25 వేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. దీని ద్వారా ఏపీ విషయంలోనూ కేంద్రం ఓ నిర్ణయం తీసుకునే ఉండి వుంటుంది. ఏపీ సీఎం చంద్రబాబు ప్రధానితో భేటీ కాబోతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా నే కావాలని డిమాండ్ చేయబోతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని ఇచ్చే వాళ్లకే కాదు, అడిగే వాళ్లకూ తెలుసు. ప్రత్యేక ప్యాకేజీ మాత్రం ఇచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఏపీ రాజధాని శుంఖుస్థాపనకు వచ్చినపుడు స్వయాన ప్రధాని మోదీయే ప్యాకేజీని ప్రకటిస్తారని తెలుస్తోంది.

ప్రత్యేక హోదా అనేది అప్పట్లో వెంకయ్యకు, చంద్రబాబులకు ఎన్నికల అస్త్రంగా పనిచేసింది. వారే ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందన్నారు. ఎన్నికల్లో గెలిచారు. ఎప్పటి రాజకీయ అవసరం అప్పుడే అనేందు కు నిలువెత్తు సాక్ష్యం స్వయాన వెంకయ్యనే అనడం లో అనుమానంలేదు. ఇపుడు ఎటూ పాలుపోని చం ద్రబాబు రాష్ర్టాన్ని కాంగ్రెస్ అడ్డగోలుగా విభజించిందంటూ మళ్లీ పాత మాటలనే వినిపిస్తున్నారు.

ఒక రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఆ రాష్ర్టానికి ప్రత్యేక భౌగోళిక, సామాజిక పరిస్థితులు ఉండా లి. ముఖ్యంగా ఆ రాష్ట్రం దేశ సరిహద్దుల లో పొరుగు దేశాలకు భౌగోళిక సరిహద్దు గలిగి ఉండటం, పర్వత ప్రాంతమై ఉండటం, సామాజికంగా బాగా వెనుకబడి ఉండటం లాంటి ప్రత్యేక లక్షణాలను కలిగివున్నపుడే ఆ రాష్ట్రం ప్రత్యేక హోదాకు అర్హత పొందుతుంది. మరి అవశేష ఆంధ్రప్రదేశ్‌కు అందులో ఒక్క లక్షణమైనా ఉన్నదా? 972 కి.మీ కోస్తా తీరం ఉంది తప్ప పొరుగు దేశం సరిహద్దులంటూ ఏమీ లేవు. ఇకపోతే, సామాజికంగా బాగా వెనుకబడిన ప్రాంతమని కూడా చెప్పడానికి బలమైన ఆధారాలు కనిపించవు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తిం చి విభజన చట్టంలోనే కొన్ని ప్యాకేజీలు ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకే ప్రత్యేక హోదాకు బదు లు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే అవకాశాలున్నాయి.

ఏపీలో ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా తప్ప మరే ప్యాకేజీ అక్కరలేదంటున్నాయి. ప్రత్యేక హోదా పేరున ఎన్నికల్లో లబ్ధిపొందిన టీడీపీ, బీజేపీలను ఇరుకున పెట్టడంలో విపక్షాల తప్పేమీలేదు. ఆ రోజు రాజ్యసభలో ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టిన వెంకయ్యకు ఎన్నికలు కనిపించాయి తప్ప ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఏపీకి అన్ని అర్హతలు ఉన్నాయా అనేది పట్టలేదు. అదే ఇపుడు విపక్షాలకు బ్రహ్మాస్త్రంగా మారింది. చేసుకున్న వాడికి చేసుకున్నంత అంటే ఇదే. నిజానికి ఏపీ లోటు బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకొని దానికి ప్యాకేజీ ఇస్తే ఎవరికీ అభ్యంతరం లేదని అప్పట్లో తెలంగాణ ఉద్యమకారులు కూడా చెప్పారు. అలాగే, ఉమ్మడి పాలనలో నష్టపోయిన తెలంగాణకే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరాన్ని కూడా గుర్తుచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చినా, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినా ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ సమైక్య రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణకు న్యాయం చేయకపోతే అంతకంటే దారు ణం మరోటి ఉండదు.

నిజానికి ఏపీకి రాజధాని లేకపోవడం తప్ప ఆ రాష్ట్రం ఎందులోనూ వెనుకబడిలేదు. ఐదు మెట్రోనగరాలు, డజనుకు పైగా ఓడ రేవులు, ఏడు జిల్లాల్లో కనీసం రెండు లేదా మూడు పంటల వ్యవసాయం, గనుల పరిశ్రమలు కలిగి ఉన్న ఏపీని ఎవరై నా వెనుకబడిన రాష్ట్రమని అనగలరా? ఇన్ని ఉన్న ఏపీ లోటు బడ్జెట్ కూడా తీరని సమస్య ఏమీ కాదు. ఉమ్మడి రాష్ట్రం కొనసాగినంత కాలం అక్కడ నాటుకుపోయిన జీరో వ్యాపారాల జోరును ఇప్పటికైనా కట్టడి చేస్తే.. చాలామేరకు ఆ రాష్ట్ర బడ్జెట్ లోటు సమస్య తీరే అవకాశాలుంటాయి. కానీ ఏపీలో ఎవరి ప్రభుత్వం ఏర్పడినా జీరో వ్యాపార వర్గాల సంబంధీకులే పాలకులవుతుంటారు. కాబట్టి ఏపీ బడ్జెట్ లోటు సమస్య తీరడమనేది పాలకుడి నిజాయితీపై ఆధారపడివుంటుంది. కాబట్టి ఏపీ ప్రభుత్వ పరంగా పేదది కావచ్చు తప్ప క్యాపిటలిస్టుల పరంగా అది ఎప్పుడూ పేదది కాదు. ఈ విషయంలో తెలంగాణ పూర్తి భిన్నంగా కనిపిస్తు న్నది. తెలంగాణ దశాబ్దాలుగా మిగులు బడ్జెట్‌ను కలిగివున్నమాట నిజం. కాబట్టి తెలంగాణ వెనుకబడ లే దు, వలసపాలనలో వెనుకవేయబడిన ప్రాంతం.

రాష్ర్టాన్ని అడ్డగోలుగా విభజించారు. ఏపీకి తీరని నష్టం జరిగిందని చంద్రబాబు ఈ మధ్య చేస్తున్న వ్యాఖ్యలు ఉల్టాచోర్ కొత్వాల్‌కో డాంటే అన్నట్లున్నది. నిజంగానే అడ్డగోలుగా విభజించి ఉన్నట్లయితే.. జనాభా ఆధారంగా ఉద్యోగుల పంపకం చేయాలని, అప్పులు, ఆస్తులను జనాభా ఆధారంగా పంచాలని, గోదావరి, కృష్ణా నదుల మీద అజమాయిషీ బోర్డులు ఉంటాయిని.. విభజన చట్టంలో పెట్టి ఎవరికి అన్యా యం చేశారో చంద్రబాబు చెప్పగలరా? ఫక్తూ.. అడ్డగోలుగా విభజించి ఏపీకి ఆన్యాయం చేశారని గోబెల్స్ ప్రచారం చేస్తూ.. పరోక్షంగా తెలంగాణ ప్రయోజనాలకు ఇంకా తూట్లు పొడవాలనుకుంటున్న చంద్రబాబు అతి తెలివికి జోహార్లు చెప్పకతప్పదు. రెండు జీవిత కాలాలు కోల్పోయి లెక్కలేనంత నష్టపోయిన తెలంగాణ రాష్ర్టానికి ఏమీ ఇవ్వకుండా పక్క రాష్ర్టానికి మాత్రమే ప్యాకేజీ ఇవ్వడాన్ని ప్రజలు హర్షించరు. అదేదో ఏపీకి ఇస్తున్నారని తెలంగాణకు అడగటం కాదు.

ఈ డిమాండ్‌లో పూర్తి నిజాయితీ ఉందని గమనించాలి. ప్రభుత్వం మిగులు బడ్జెట్‌లో ఉన్నా.. జరిగిన అన్యాయాలను పూరించడం ఒక్క రాష్ట్ర ప్రభుత్వంతో మాత్రమే జరిగేది కాదు. ఉదాహరణకు అక్షరాస్యత విషయంలో తెలంగాణ దేశంలో 25వ స్థానం లో ఉన్నది. విద్యలో అంత వెనుకబడి ఉండటానికి సమైక్య పాలన కారణం. దేశ అక్షరాస్యత సగటు 74 శాతం ఉండగా తెలంగాణ గ్రామీణ అక్షరాస్యత 58 శాతం మాత్రమే ఉన్నది. దీన్ని బట్టి తెలంగాణ ఎంత మిగులు బడ్జెట్ రాష్ట్రమైనా జరిగిన నష్టాన్ని పూరించడం ఎలా సాధ్యం? 1200 టీఎంసీలపై హక్కులు కలిగి ఉండి కూడా తెలంగాణ సాగునీరు లేక వ్యవసాయం దండగై ఎంత నష్టపోయిందో లెక్కగట్టగలమా? ఇలా అక్షరాస్యత విషయంలో, వ్యవసాయం విషయంలో, వైద్యం విషయంలో, అభివృద్ధి విషయంలో ఆరు దశాబ్దాల పాటు జరిగిన అన్యాయాన్ని పూరించాలంటే కేంద్రం తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చితీరాలి.

ఉద్యోగాల విభజనను కనీసం రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగానైనా పంపకం చేస్తామని చెప్పకుండా, కేవ లం జనాభా అధారంగా పంపకం జరగడం వల్ల ఎవరికి అన్యాయమో చంద్రబాబు చెప్పగలరా? తెలంగాణ ఆశలు పెంచుకున్న రెండు జీవనదులపై అజమాయిషీ బోర్డులు పెట్టి ఎవరికి అన్యాయం చేశారో చెప్పగలరా? సమైక్య రాష్ర్టానికి 55 శాతం రెవెన్యూ ఆదా యం తెలంగాణ నుంచి వచ్చేది. అందులో 29 శాతం వెచ్చించి అన్యాయం చేసింది పక్కన పెట్టి.. ఇపుడు ఆస్తులు, అప్పుల పంపకం జనాభా ఆధారంగా 42 శాతం అప్పులు అంటగడుతుంటే ఎవరు నష్టపోతున్నారో చెప్పగలరా? ఒక్క రాజధాని లేదనే విషయా న్ని అడ్డం పెట్టుకొని.. తెలంగాణకు విభజన చట్టంలో కావలసినంత అన్యాయం చేశారు.

విభజన చట్టంలో ఉన్న అన్యాయాలను అప్పుడే వ్యతిరేకించి ఉంటే, వచ్చే తెలంగాణ ఆగిపోతుందేమోనని భయం అప్పట్లో అందరిలో ఉన్నది. తెలంగాణ ఏర్పడ్డాక ఆ అన్యాయాలను సరిదిద్దుకోవచ్చని అంద రూ భావించారు. ఆ దిశగా కేసీఆర్ ప్రభుత్వం కూడా పనిచేస్తున్నది. కానీ ఏ న్యాయాన్ని కేంద్రం చేస్తున్నది లేదు. ఉదాహరణకు ఉమ్మడి హైకోర్టు విభజన చట్టబద్ధ హామీ. ప్రత్యేక హోదా అనేది నోటి మాట హామీ. ఉమ్మడి హైకోర్టును విభజించడంలో కాలయాపన చేస్తున్న కేంద్రం ప్రత్యేక హోదా వంటి నోటిమాట హామీని మరో రకంగా ప్రత్యేక ప్యాకేజీ రూపంలోనైనా నెరవేర్చడానికి సిధ్ధం కావడం గమనార్హం. ఇది కేంద్రం చూపుతున్న పక్షపాత ధోరణి. కేంద్రానిది పక్షపాత ధోరణి కానట్లయితే.. ఏపీకి మాత్రమే కాకుం డా అనేక రకాల నష్టపోయిన తెలంగాణకు కూడా భారీ ప్యాకేజీని ప్రకటించాలి.

తెలంగాణలోని విపక్షాలకు కూడా ఇదొక పరిక్ష అని చెప్పాలి. రోజూ కేసీఆర్‌పై దుమ్మెత్తి పోయడం తప్ప తెలంగాణకు జరిగిన అన్యాయాల పట్ల అవి ఎం త శ్రద్ధ చూపెడుతున్నాయో ప్రజలు ఇప్పటికే గమనిస్తున్నారు. ప్రాజెక్టుల డిజైన్లపై మాట్లాడే ప్రతిపక్షాలు.. అవే ప్రాజెక్టులను నిరంతరం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబుపై ఏ ఒక్క ప్రతిపక్షమూ మాట్లాడదు. అందుకే 15 నెలలు గడిచినా ప్రతిపక్షాలు ప్రజ ల మన్ననలు పొందలేకపోతున్నాయి. ఇప్పటికైనా, తెలంగాణకు ఏపీతో సమానంగా ప్రత్యేక ప్యాకేజీ రాబట్టడంలో తమ వంతు పాత్ర పోషించాలి. ప్రజల్లో తమ నిజాయితీని నిరూపించుకునేందుకు ప్రతిపక్షా లు.. తెలంగాణకు జరిగిన అన్యాయాలను తుడిచేయడంలోగానీ, ప్రత్యేక ప్యాకేజీని రాబట్టడంలోగానీ అధికార పక్షంతో కలిసి పనిచేస్తేనే ప్రజల మన్ననలు పొందగలుగాయని మర్చిపోవద్దు.

1772

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ



        


Featured Articles