ఆ కలానికి సకలజనులు సన్నాసులా?


Sat,July 11, 2015 12:29 PM

తెలంగాణ ఉద్యమ కాలంలో, ఆ తర్వాత తెలంగాణ వచ్చాక కూడా కొన్ని కలాల మేధో శ్రమను ఎవరూ కాదనలేరు.అలాంటి శ్రమ పట్ల అందరికి గౌరవం ఉంటది. కానీ ఒకొక్కప్పుడు కొందరి అతి మేధో శ్రమ సమాజాన్ని సందిగ్ధంలో పడేస్తుంది. కొన్ని పదాలు కత్తి మీద సాములాగా మారుతుంటాయి. దాన్ని మనం ఎలా అన్వయించి చెపితే పాఠకుడికి అలాగే అర్థమవుతాయి కూడా. ఉద్యమకాలంలో చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి పంచన ఉండి తెలంగాణ ఉద్యమాన్ని మనసారా పట్టించుకోని కొందరు తెలంగాణ ప్రాంత నేతలను సన్నాసులు దద్దమ్మలుఅని కేసీఆర్ సంబోధించిన సందర్భాలు అనేకం! తన ప్రాంత బాగు గురించి పట్టనోళ్లు అనే అర్థంలో వారిని అలా సంబోధించేవారు. ఆ సంబోధన ను ప్రజలు కూడా ఎప్పుడూ తప్పుపట్టలేదు. ఉద్యమకాలంలో వ్యతిరేకశక్తులతో పనిచేసిన వారిని ఎలా సన్నాసులన్నారో, ఇపుడు అవే శక్తుల వెనకాల పనిచేస్తున్న వారెవరైనా ఉంటే వారిని కూడా సన్నాసులు అని ఆయన సంబోధిస్తున్నారేమో! అయితే, వారు ఆ వ్యతిరేక శక్తుల వెనకే ఉన్నారా లేరా అనేది మాత్రం వారి వారి అంతరాత్మలు మాత్రమే చెప్పగలుగుతాయి.

పద్నాలుగేళ్లు కష్టపడ్డోడికి కష్టం విలువ తెలియదనుకోలేం? తన ప్రాంతంలో ఏమూలలో ఏమున్నదో తెలియనంతటి అమాయకుడనుకోలేం. గమ్యాన్ని ముద్దాడినోడికి సహజంగానే పని ఆరాటం ఎక్కువ. ప్రాణహిత-చేవెళ్ల వివాదం లో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆ కలం మేధావి కోరారు. ఏడాది కాలంగా కేసీఆర్ అలసట లేకుండా జరుపుతున్న తాగు, సాగు నీరు సమీక్షలు, పరిపాలనా సమీక్షలన్నీ తానొక్కడే జరిపి నిర్ణయాలు తీసుకోవడం లేదని ఆ కలానికి తెలియదనుకోవాలా? ఉద్యమకాలంలో పనిచేసిన ఇంజినీర్ల సేవలను కూడా తీసుకోనట్లయితే, పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకానికి ఆయన శంఖుస్థాపన చేయగలిగేవారేనా? కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదన చేయగలడా? అభివృద్ధి వ్యూహాలు నిపుణుల సలహాలతో ఉద్యమకాలంలోనే రచించబడ్డాయి. అప్పటి వివిధ రంగాల నిపుణుల సలహాలను అవసరమైన చోట ఇప్పటికీ కేసీఆర్ స్వీకరిస్తున్నారనే విషయాన్ని ఆ కలం ఎందుకు మర్చిపోతున్నదో తెలియదు. సమైక్య పాలకులు చేసిన అప్పటి సాగునీటి ప్రాజెక్టుల డిజైన్లలో ఏ ఒక్కటైనా పనికొచ్చేదేనా? వాటిని పునస్సమీక్ష చేయకుండా ఏ ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేయగలమా? పక్కరాష్ర్టాల ముంపు అభ్యంతరాల కు అవకాశాలిచ్చి,

కాలువలు తవ్వి, స్ట్రక్చర్లు వదిలేసి, మొబిలైజేషన్ అడ్వాన్సులకు కక్కుర్తిపడి రచించిన ప్రాజెక్టుల డిజైన్లు ఇవాళ తెలంగాణకు ఏ మేరకు పనికి వస్తాయి? వాటి పునఃసమీక్ష అవసరంలేదా? ముంపు అవకాశాలను తగ్గించుకోవడం తప్పవుతుందా? ఒకవైపు ముంపు ప్రజలను రెచ్చగొట్టడం, మరోవైపు ముంపు అవకాశాలున్న ప్రాజెక్టులనే కోరుతున్న వారి ద్వంద్వ ధోరణులు ఆ కలానికి కనిపించడం లేదా? ఎన్నడూ మాట తొలకని మంచి సంపాదకుడు సైతం మాటలు జారి రాయడమేమిటి?నైనాల గోవర్ధన్ చెప్పేదే నిజమనుకోవడమేమిటి? సకల జన సన్నాసులారా ఏకంకండి అంటూ వ్యాస రూపంలో పిలుపు నివ్వడమంటే.. దాన్ని ఏ రూపంలో స్వీకరించాలి? తెలంగాణ వ్యతిరేక రాజకీయశక్తుల దన్నుతో పనిచేస్తున్నవారిని ఏకం కమ్మంటున్నట్లు అనుకోవాలా? రేవంత్‌రెడ్డి నుంచి మొదలు నైనాల దాకా అందరినీ ఏకం కమ్మని పిలుపు ఇస్తున్నట్లా? కేసీఆర్ సభలో నైనాల గోవర్ధన్ చేయబోయిన అంతరాయం ముఖ్యమంత్రికి చికాకు కలిగించి ఉంటుంది. ఆయన, తన నేపథ్యం, ఆయన వెనకాల ఉన్నశక్తులను దృష్టిలో ఉంచుకొని సన్నాసులు అనే సంబోధన కేసీఆర్ నోట వెలువడి ఉం టుందనడంలో సందేహం లేదు.

కానీ మస్కు మహిపాల్‌రెడ్డిని కూడా నైనాలతో కలిపేసి అందరినీ సన్నాసులను చేద్దామనుకున్న ఆ కలం మేధావి టక్కరి ఎత్తుగడను ప్రశంసించాలి మరి! మస్కు మహిపాల్‌రెడ్డి ఒక సాధారణ రైతు బిడ్డ. నైనాలకు ఉన్నట్లు ఆయన వెనకాల ఏశక్తులూ ఉండి ఉండకపోవచ్చు. మస్కు మహిపాల్‌రెడ్డి తోటపల్లి రిజర్వాయర్ గురించి అడగాలనుకోవడంలో నిజాయితీ ఉంది. కానీ నైనాల కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకుంటామనడంలో నిజాయితీ ఎక్కడిది? హుస్నాబాద్ సభలో ప్రసంగిస్తున్న సమయంలో ఏదో చెప్పే ప్రయ త్నం చేసిన మహిపాల్‌రెడ్డిని కేసీఆర్ గద్దిరించి వారించాడే తప్ప తిట్టలేదని గమనించాలి. కానీ నైనాలతో పాటు మస్కు మహిపాల్‌రెడ్డిని కూడా సన్నాసుల జాబితాలో కలిపేసి చెప్పడంలో ఆ కలం మేధావి చూపిన రాత చాతుర్యం చూసి ఆశ్చర్యపోవడం నాలాంటి పాఠకుడి వంతైంది.

తెలంగాణలో గతమంతా ఇజాలు బతికాయి. తెలంగాణ బతకలేదు. అవే ఇజాలు ఉద్యమంలో పాల్గొని ఉండొచ్చు. కానీ అవి తెలంగాణ రావాలని ఉద్యమంలో పాల్గొన్నాయా? లేక తమ ఇజం వ్యాప్తి కోసం పాల్గొన్నాయా? తెలియని విషయమేమీ కాదు. ఇపుడు అవే ఇజాలు ఏడాది కాలంగా తమ ఉద్దేశాలను తమంతట తామే బయటపెట్టుకుంటున్నాయి. కంతానపల్లిని అడ్డుకుంటామనో, కాళేశ్వరాన్ని అడ్డుకుంటామనో అనడంలో ఇజాల ప్రయోజనం తప్ప ప్రజా ప్రయోజనం ఉన్నదా? పోతిరెడ్డిపాడును అడ్డుకుంటామని ఆ ఇజాలు అనవు. పట్టిసీమను పట్టించుకోవు. కానీ ప్రాణహిత-చేవెళ్లను కాళేశ్వరానికి ఎందుకు మార్చుతున్నారని మాత్రం అడుగుతాయి.లేని లెక్కలు చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలను నిరంతరం కొనసాగిస్తాయి. నిజంగానే ఏది అనర్థమైనా దాన్ని ఎవరు వ్యతిరేకించినా ప్రజలు సమర్థిస్తారు. కానీ ఎదురైన దానినల్లా వ్యతిరేకించి జీవించాలనుకునే వారిని ఎవరైనా ఏమంటారు?

ఆమధ్య ఓ మేధావి అయితే.. తెలంగాణ మరొక పదేళ్ల తర్వాత వస్తే బాగుండేదన్నారు. ఆ మేధావే కృష్ణా నీళ్లు పాలమూరు దాటి పోవద్దని ప్రచారం కూడా చేశారు. ఆ నీరు పోతిరెడ్డిపాడు ద్వారా సీమాంధ్ర వెళ్లినా తప్పుకాదని ఆయన ఉద్దేశం! ఇలాంటి వాళ్లంతా తెలంగాణ వ్యతిరేకశక్తులకు పరోక్షంగా సేవలందిస్తుం డటం ఆ కలం మేధావికి తెలియదనుకోలేం. తెలంగాణవాదం ముసుగులో బతికిన, బతుకుతున్న ఇజాలు తమ అసలు రూపాలను ఏడాది కాలంగా బయటపెట్టుకుంటున్న క్రమాన్ని దృష్టిలో ఉంచుకొని చూసినపుడు అక్కడొకడు, ఇక్కడొకడు తయారవుతున్నారని కేసీఆర్ ఎందుకు అనవలసి వచ్చిందో ఆ కలం మేధావికి తెలియదనుకోవాలా? కొందరు మేధావులు, మరికొందరు నైనాల లాంటి వారి సేవలు రేవంత్‌రెడ్డి బాస్‌కు ఉపయోగపడవచ్చు తప్ప తెలంగాణకు ఉపయోగపడతాయా? పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలను అడ్డుకోవాలని కేంద్ర జల సంఘానికి రేవంత్‌రెడ్డి బాస్ లేఖ రాసిన విషయం..

కృష్ణా నీళ్లు పాలమూరు తప్ప మిగ తా తెలంగాణ వాడుకోవద్దన్న ఆ మేధావికిగానీ, నైనాల లాంటి వారికి గానీ తెలియదా? అలాంటి రేవంత్ బాస్‌పై పోరాటం చేయనోళ్లు, కేసీఆర్‌పై కాలు దువ్వుతున్నారు. ఇలాం టి ఇజాల గుంపును వెనకేసుకురావడమే ఆ కలం మేధావి ఉద్దేశమా? వాళ్లే ఈ కలం మేధావికి అసలు సిసలైన తెలంగాణ ఉద్యమకారులైపోయినారు. ఫణికర మల్లయ్య నిజంగానే నక్కీరుడు. కానీ మల్లయ్య ప్రశ్నించిన చంద్రబాబు మాత్రం శివుడు కాదనే విషయం కలం మేధావి మర్చిపోతున్నారు. అలాగే, నైనాల గోవర్ధన్‌ను నక్కీరుడంటూ గొప్ప ప్రయత్నమే చేశారు. ఫణికర మల్లయ్య లాంటి నక్కీరుడి వెనకాల ఏ శక్తులు లేవు, ఏ ఇజాలు లేవు. కానీ నైనాల వెనకాల ఏశక్తులున్నాయో, ఏ ఇజాలున్నా యో తెలియకకాదు. అలాంటి నైనాలను నక్కీరునితో పోల్చి గొప్పగా చిత్రించే ప్రయత్నం చేసిన ఆ కలం మేధోమథనాన్ని ప్రశంసించాల్సిందే మరి!

ఆంధ్రులజ్యోతిలో ఉంటూ తెలంగాణ మంచి-చెడులను బ్యాలెన్స్ చేయగల సంపాదకుడిగా అతనికి పాఠకుల్లో మంచి పేరే ఉండింది. కానీ సకలజన సన్నాసులారా, ఏకంకండి అనే ఉసిగొలిపే టైటిల్ పెట్టి రాశాక ఆయన పట్ల పాఠకుల్లో మరో అభిప్రాయానికి కూడా అవకాశమిస్తున్నది. ఆ పత్రిక ఉప్పు-కారం పట్ల ఆయనకుండే మొగ్గు, మమకారం తప్పుకాదు. కానీ ఆ మమకారం.. తనకుతానే తెలంగాణ సకలజనులను సన్నాసులని సంబోధించి రాసే దశకు చేరుకోవడమే సగటు తెలంగాణవాదికి అభ్యంతకరమని ఆయన తెలుసుకోవాలి.

ఎంతైనా ఆంధ్రులజ్యోతిలో ఉంటూ తెలంగాణ మంచి-చెడులను బ్యాలెన్స్ చేయగల సంపాదకుడిగా అతనికి పాఠకుల్లో మంచి పేరే ఉండింది. కానీ సకలజన సన్నాసులారా, ఏకంకండి అనే ఉసిగొలిపే టైటిల్ పెట్టి రాశాక ఆయన పట్ల పాఠకుల్లో మరో అభిప్రాయానికి కూడా అవకాశమిస్తున్నది. ఆ పత్రిక ఉప్పు-కారం పట్ల ఆయనకుండే మొగ్గు, మమకారం తప్పుకాదు. కానీ ఆ మమకారం.. తనకుతానే తెలంగాణ సకలజనులను సన్నాసులని సంబోధించి రాసే దశకు చేరుకోవడమే సగటు తెలంగాణవాదికి అభ్యంతకరమని ఆయన తెలుసుకోవాలి. కేసీఆర్ ఎవరిని దృష్టిలో పెట్టుకొని సన్నాసులన్నారో ప్రజలకు తెలుసు. కానీ అం దుకు భిన్నంగా రెచ్చగొట్టే రాతలకు తెగబడిన ఆ కలం తీరు రాధాకృష్ణకు, రేవంత్ బాస్‌కు తప్పక నచ్చేవుంటాయి!

1837

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ