సీమాంధ్ర ‘వ్యాపం’ సంగతేంటి?


Wed,July 8, 2015 12:06 AM

ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే న్యాయం అనే సూత్రీకరణను నమ్మే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం వారికి తెలియంది కాదు. ఉద్యోగుల పంపకంలో న్యాయం జరగకపోతే.. గతంలో అనేక కమిషన్లు ఇచ్చిన
రిపోర్టుల ఆధారంగా, స్థానికత ఆధారంగా ఉద్యోగుల పంపకం చేపట్టడానికి విభజన చట్టానికి సవరణ తేవాలి.

Kallurisrinivassreddy


మధ్యప్రదేశ్‌లో జరిగిన వ్యాపం కుంభకోణంలో పాల కులు, నేతలు, అధికారుల వర కు భాగస్వాములని జరుగుతు న్న దర్యాప్తు తెలుపుతున్నది. అం దుకే కేసుతో సబంధం కలిగిన వారి అసహజ మరణాలు చోటు చేసుకుంటున్నాయి. వ్యాపం స్కామ్‌లో ఏం జరిగింది? మరి మన సమైక్య రాష్ట్రంలో తెలంగా ణ ఉద్యోగాలలో జరిగిన అక్ర మ నియామకాల సంగతేమిటి? వ్యాపం కుంభకోణంలో జరుగుతున్న అక్రమార్కుల అరెస్టులను చూసినపుడు, తెలంగాణ హక్కులను హరించి అక్రమ నియామకాలు చేసిన వారికి ఎందుకు శిక్షలు పడలేదు? అదే ఇక్కడ చర్చనీయాంశం.
వ్యావసాయిక్ పరీక్షా మండల్ (వ్యాపం) దీనిని ఇంగ్లీషులో ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు (పీఈబీ)అంటారు. ఇది మధ్యప్రదేశ్‌లో ఉన్నత విద్యా సీట్ల కేటాయింపును, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను నిర్వహిస్తుంది. ఈ అక్రమ నియామకాల స్కామ్ పదేళ్లుగా జరగుతున్నట్లు తెలుస్తున్నది. 2013లో గ్వాలియర్‌కు చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ స్కామ్‌లో ఉన్న పాలకుల బంధువుల పాత్రను బయటపెట్టడంతో డొంక కదిలింది. మధ్యప్రదేశ్ హైకోర్టు.. రైటైర్డ్ జడ్జితో (సిట్ )దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దానితో అరెస్టుల పర్వం మొదలైంది. దాదాపు రెండు వేల మందిని ఇప్పటికే అరెస్టు చేసింది. అక్రమంగా సీట్లు సంపాదించిన విద్యార్థులను అనర్హులను చేయడమేకాదు,వారితోపాటు వారి తల్లిదండ్రులను కూడా అరెస్టు చేశారు. అక్రమంగా ఉద్యోగాల్లో నియామకాలు పొందిన వారి ని తొలగించడమే కాకుండా వారందరినీ అరెస్టు చేశారు. వారిని రిక్రూట్ చేసిన అధికారులను కూడా అరెస్టు చేశారని గమనించాలి. అలాగే,అరెస్టయిన రాజకీయ ప్రముఖు ల్లో బీజేపీకి చెందిన విద్యాశాఖ మాజీ మంత్రి ఉన్నారు. గవర్నర్ ఓఎస్‌డీ కూడా ఉన్నారట. ఒక డిఐజీ, అనేక మంది వ్యాపం అధికారులు, పదుల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారు లు ఉన్నారు. ఈ అక్రమ ఉద్యోగాలు, ఉన్నత విద్య సీట్ల కేటాయింపులు పొందిన లబ్ధిదారులనే కాకుండా, రిక్రూట్ చేసిన అధికారులను, అవినీతికి మార్గాలు తెరిచిన రాజకీయ నాయకులను సైతం వదలకుండా అందరినీ అరెస్టు చేసి చట్టం ముందు నిలబెడుతున్నది సిట్ దర్యాప్తు బృందం. సిట్ ఒక జ్యుడీషియరీ దర్యాప్తు సంస్థ కాబట్టి నిందితులను గుర్తించడమే కాకుండా వారిని ఉద్యోగాల నుంచి తొలగించగలిగింది. అరెస్టు చేసి విచారించగలుగుతున్నది. కోర్టు ద్వారా శిక్షలు కూడా విధించబడనున్నాయి.

మధ్యప్రదేశ్‌లో ఉద్యోగాల నియామకాల్లో అవినీతి పనిచేసింది. కానీ తెలంగాణ ఉద్యోగ నియామకాల్లో చట్ట ఉల్లంఘనలు పనిచేశాయి. అక్కడ అవినీతిది రాజ్యమైతే, ఇక్కడ ఒక ప్రాంత హక్కుల హరణది రాజ్యమైంది. ఇందులో ఒకటి తప్పు, మరొకటి ఒప్పు అనడానికి వీలులేదు. రెండూ సమాన శిక్షార్హాలే. మరి తెలంగాణ లో జరిగిన అక్రమ నియామకులు ఎందుకు శిక్షించబడలేదు? కారణం స్పష్టం. తెలంగాణ ఉద్యోగాలు కొల్లగొట్టబడుతున్నాయని గొంతు విప్పినప్పుడల్లా సమైక్య పాలకులు కమిటీలు, కమిషన్లు వేశారు. వాటికి జ్యుడీషియల్ పవర్స్ ఇచ్చిన పాపాన పోలేదు. ఎందుకంటే, అక్రమ నియామకాలు జరిగాయనే విషయం తెలిసిన సమైక్య పాలకులు తెలివిగా కంటితుడుపు కమిటీలు వేసి అక్రమార్కులకు రక్షణ కల్పించి, శిక్షలు పడకుండా చూసుకోగలిగారు. అందుకే కనీసం ఆ కమిటీలు, కమిషన్లు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా బాధితులకు న్యాయం గానీ, దోషులకు శిక్షలుగానీ పడిన సందర్భం ఒక్కటీ లేదు. 2001లో చంద్రబాబు ప్రభుత్వం గిర్‌గ్లానీ కమిషన్ వేసింది. గిర్‌గ్లానీ దర్యాప్తుకు అనేక శాఖలు సహకరించలేదని స్వయాన గిర్‌గ్లానీయే తన రిపోర్టులో పేర్కొన్నారు.అప్పట్లో ఉన్న 102 శాఖలలో (హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్స్) కేవలం 52 మాత్రమే ఉద్యోగుల వివరాలు అందించాయని ఆయన వాపోయారు. మిగిలిన సుమారు 50 శాఖలు ఉద్యోగుల వివరాలు ఇవ్వనపుడు గిర్‌గ్లానీ కూడా ఏం చేయలేకపోయారు. ఎందుకంటే అతనికి కూడా సిట్ లాంటి జ్యుడీషయరీ అధికారాలు ఉండి ఉంటే, ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో అక్రమార్కులను అరెస్టు చేస్తున్నట్లుగానే, ఆయన కూడా దర్యాప్తునకు సహకరించని శాఖాధిపతుల నుంచి ఉద్యోగుల వివరాలనైనా రాబట్టగలిగేవారు, లేదా వారిపై లీగల్ చర్యలైనా తీసుకొని సమాచారం రాబట్టేవారు. గిర్‌గ్లానీ తనకు లభించిన కేవలం 52 శాఖల వివరాల ప్రకారం, తెలంగాణలో 59వేల అక్రమ నియామకాలు జరిగాయని తన రిపోర్టులో వెల్లడించారు. ఇక వివరాలు ఇవ్వని శాఖల్లో ఉన్న అక్రమ నియామకాలను లెక్కిస్తే తెలంగాణలో సుమారు లక్ష ఉద్యోగాల్లో అక్రమ నియామకాలు జరిగాయని అప్పట్లోనే ఒక అంచనా.
రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులను తుంగలో తొక్కి అక్రమంగా ఉద్యోగ నియామకాలు జరిగాయని కమిషన్లు, కమిటీలు తేల్చిచెప్పాయి. అక్రమంగా నియమించబడ్డ ఉద్యోగికైనా, నియమించిన అధికారికైనా శిక్ష పడిందా? అయినా సిట్ లాంటి సంస్థను నియమించి దర్యాప్తు జరిపించి ఉంటే ఇవాళ వ్యాపం స్కామ్‌లో జరుగుతున్న అరెస్టుల వలెనే సమైక్య రాష్ట్రంలోనూ అరెస్టులు, శిక్షలు తప్పక జరిగి ఉం డేవి. తెలంగాణ తన ఉద్యోగాల వాటాను తాను పొందగలిగేది. ఇవాళ మధ్యప్రదేశ్‌లో ఒక విద్యాశాఖ మాజీ మంత్రిని కూడా అరెస్టు చేశారు. మరి అలాంటి జ్యుడీషయరీ దర్యాప్తే జరిగి ఉంటే బ్రహ్మానందరెడ్డి నుంచి మొదలుకుంటే, చంద్రబాబు దాకా ఎక్కడ ఉండేవారో..?
కనీసం 610 జీవో అమలు పైన అయినా అప్పట్లోనే సిట్ చేత దర్యాప్తు జరిపిఉంటే అక్రమ నియామకాలు ఇంతగా ఉండేవేనా? ఇప్పుడు కమలనాథన్ కమిటీ ఇంతటి కాలయాపన చేసేదేనా? ఇవాళ వ్యాపం స్కామ్‌లో జరగుతున్న అరెస్టుల పర్వాన్ని చూసినపుడు ఈ సందేహాలు ఎవరికైనా రావడం సహజం.

ఒకే దేశంలో ప్రాంతానికో న్యాయాన్ని ఎవరూ ఊహించలేరు. కానీ 58 ఏళ్లలో తెలంగాణకు జరిగిన అన్యాయమే అది! ఇంతటి అక్రమ నియామకాలను భరించిన తెలంగాణకు ఇపుడైనా న్యాయం జరుగుతున్నదా అనేది కీలక ప్రశ్న. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి ఏడాది దాటింది. ఉద్యోగుల విభజనకు కమలనాథన్ కమిటీ వేశా రు. అది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పంపకానికే ఏడాది కాలం వృథా చేసింది. శాఖాధిపతుల కార్యాలయాల్లో 18వేల మంది సీమాంధ్ర ఉద్యోగులు తిష్టవేశారు. వారిని సీమాంధ్రకు పంపడానికి కమలనాథన్ కమి టీ మీనమేశాలు లెక్కిస్తున్నట్లు తెలంగాణ ఉద్యోగ సంఘాలు చెపుతున్నాయి. జోనల్, మల్టీజోనల్, జిల్లా స్థాయి ఉద్యోగుల విభజన ఇంకా ప్రారంభం కాలేదు. కాలయాపనతో సరిపుచ్చుతున్న కమలనాథన్ కమిటీ అప్పటి అక్రమ ఉద్యోగులకు ఓ వరం లా మారింది. విభజన చట్టంలో జనాభా ఆధారంగా ఉద్యోగుల పంపకం జరుగుతుందని చెప్పారు. అలాంటి అన్యాయాన్ని భరించినా కూడా ఉద్యోగుల పంపకం లో తెలంగాణ ఇంకా అన్యాయాలనే ఎదుర్కోవలసి వస్తుండటం దురదృష్టకర పరిణామం. విభజన చట్టం మరోసారి సవరణ దాకా పరిస్థితి పోకూడదంటే, కమలనాథన్ కమిటీ నిష్పక్షపాతంగా ఉద్యోగుల విభజన చేయాలి. తెలంగాణకు తెలంగాణ ఉద్యోగులనే కేటాయించాలి. సీమాంధ్ర ఉద్యోగులు అధికంగా ఉంటే, అక్కడ సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించుకొమ్మని చెప్పాలి. లేదంటే, అప్పటి అక్రమ ఉద్యోగులపై సిట్ లాంటి జ్యుడీషియరీ బృందం చేత దర్యాప్తు జరిపించి అక్రమార్కులను శిక్షించి మాకు న్యాయం చేయాలని తెలంగాణ ప్రజలు అంటారు.

ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే న్యాయం అనే సూత్రీకరణను నమ్మే బీజేపీ కేంద్రం లో అధికారంలో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాల్లో తెలంగాణ కు జరిగిన అన్యాయం వారికి తెలియంది కాదు. ఉద్యోగుల పంపకంలో న్యాయం జరగకపోతే.. గతంలో అనేక కమిషన్లు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా, స్థానికత ఆధారంగా ఉద్యోగుల పంపకం చేపట్టడానికి విభజన చట్టానికి సవరణ తేవాలి. గిర్‌గ్లానీ లాంటి కమిషన్లు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా అక్రమ నియామకాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అక్రమార్కులకు శిక్షలు పడాలి. తెలంగాణ ఉద్యోగులకు, నిరుద్యోగులకు న్యాయం జరగాలి. మధ్యప్రదేశ్‌లో ఒక న్యాయం, మునుపటి ఆంధ్రప్రదేశ్‌లో ఒక న్యాయం ఉంటుందా.. వెంకయ్య నాయుడు చెప్పాలి.

1198

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ        


country oven

Featured Articles