అస్తిత్వ విస్తరణే భవిష్యత్తుకు భరోసా


Tue,June 2, 2015 04:15 PM

కేసీఆర్ తెలంగాణను రాజకీయ ఎజెండాకు తెచ్చి ఉండకపోతే, ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో ఉండేవాళ్లమేనా? అనే ప్రశ్నలో ఎం త నిజముందో, వచ్చిన తెలంగాణలో దాని అస్తిత్వ రాజకీయ స్థిరీకరణ కూడా అంతే అనివార్యం అనడంలో అంతే నిజముంది. ఏమిటా అనివార్యత అనే దే ఇక్కడ చర్చనీయాంశం.
దేశంలో ఏ రాష్ర్టానికి అస్తిత్వ రాజకీయం అవసరమో తెలియదు కానీ, తెలంగాణ రాష్ర్టానికి మాత్రం అది అనివార్యమని గత ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల తో కలిగిన అనుభవం చెపుతున్నది. తెలంగాణలో బతికిన, బతుకుతున్న ఏ ఒక్క పార్టీ కూడా తెలంగా ణ అజమాయిషీలో పనిచేసే పరిస్థితిలో లేకపోవడం, విభజన పంపకాలపై వాటికి అంతగా శ్రద్ధ ఉండకపోవడంతోపాటు, భవిష్యత్తులోనూ అవి సీమాంధ్ర ఆధిపత్యాన్ని త్యజించే స్థితి కనిపించకపోవడం లాం టి అనేక కారణాలే తెలంగాణకు అస్తిత్వ రాజకీయం అనివార్యం అని చెపుతున్నాయి. మరింత బలపడాలని చెపుతున్నాయి.

discription

కేసీఆర్ తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని స్థాపించారు. రాష్ర్టాన్ని సాధించారు. అస్తిత్వాన్ని అధికారంలోకి కూడా తేగలిగారు. కానీ ఆ అస్తిత్వ విస్తరణ తెలంగాణలో మరింత జరగాల్సిన అవసరం కూడా వుంది. ఖమ్మం జిల్లాలో చాలా ప్రాంతం, హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి జిల్లా పరిసరప్రాంతం. ఆయా జిల్లాలకు ఉన్న కోస్తా సరిహద్దు ప్రాంతాలు, మరికొన్ని జిల్లాలలో వ్యవసాయం, వ్యాపారం దృష్ట్యా స్థిరపడిన ఆంధ్ర ప్రజలు, అలాగే మినీ ఇండియాగా మారిన హైదరాబాద్ నగరం. ఇలా అన్ని రకాల సామాజిక విభిన్నతలను ఛేదించి తెలంగాణ అస్తిత్వాన్ని స్థిరీకరించాల్సిన అవసరాన్ని, దాని అనివార్యతను అర్థం చేసుకున్న వాళ్లెవరూ ఇపుడు కేసీఆర్ జరుపుతున్న రాజకీయ సమీకరణను తప్పుపట్టలేరు. తెలంగాణ రావడంతోనే సమస్య తీరిపోలే దు. దాని అస్తిత్వ రాజకీయం కూడా స్థిరీకరించబడా లి. ఇపుడు కేసీఆర్ చేస్తున్న పని కూడా అదే అనుకుం టే తప్పుకాదు.

తుమ్మల నాగేశ్వర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను పార్టీలో చేర్చుకొని మంత్రులను చేశారు. వారిరువురిని కొన్ని సామాజిక సమీకరణల్లో భాగంగానే తీసుకున్నట్లు చెప్పొచ్చు. కానీ అదే సమయం లో పార్టీ పుట్టినప్పటి నుంచి సేవలందిస్తున్న ఈటల రాజేందర్ కూడా మంత్రి అయ్యారని మనం మర్చిపోవద్దు. అలాగే మొదటి నుంచీ పార్టీనే అంటిపెట్టుకొని ఉన్న నాయిని నర్సింహారెడ్డి కనీసం ఎమ్మెల్యే కాకపోయినా.. ఎమ్మెల్సీని చేసి హోంమంత్రిగా నియమించారు. కాబట్టి డెడికేటెడ్ క్యాడర్‌కు అన్యాయం జరిగిందనో, పూర్తి న్యాయం జరిగిందనో కాదు. వలసలు, పదవులు అనేవి అస్తిత్వ విస్తరణలో భాగంగా చూడగలిగినపుడే అవి మనకు అర్థమవుతాయి. అలా అని డెడికేటెడ్ క్యాడర్‌కు న్యాయం జరగకున్నా ఫరవాలేదని వ్యాసకర్త ఉద్దేశం కాదు.
ఉదాహరణకు, యూపీలో మాయవతి ఎలా దళితులను రాజ్యాధికారంలోకి తేగలిగిందో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.

దళితులను రాజ్యాధికారంలోకి తేవడం మాయావతి రాజకీయ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చాలంటే కేవలం దళితులు, మైనారిటీలతోనే వచ్చేది కాదని మాయావతి గ్రహించారు. క్షత్రియులు, బ్రాహ్మణు లు, వైశ్యులను కూడా ఆమె సమీకరించారు. వారికి ఎన్నికల్లో అవకాశాలిచ్చారు. అధికారంలోకి వచ్చా రు. దానితో ఒక దళిత మహిళ ఒక పెద్దరాష్ర్టానికి ముఖ్యమంత్రి కాగలిగింది. దళితులకు కావాల్సినవి రిజర్వేషన్లు కావు, రాజ్యాధికారమని కాన్షీరాం ఏనా డో అన్నారు. ఆ మాటను మాయావతి సాధించి చూపగలిగారంటే, సమాజంలోని మిగతా వర్గాలను కూడా సమీకరించి రాజ్యాధికారాన్ని సాధించగలిగారని మనం గమనించాలి. కాబట్టి బీఎస్పీకి దళితుల రాజ్యాధికారమెలా లక్ష్యమో, తెలంగాణ తన రాజకీయ అస్తిత్వాన్ని స్థిరీకరించుకోవడం కూడా లక్ష్యమని గమనిచాలి.

తెలంగాణ వంటి కొత్త రాష్టంలో ఒక నూతన రాజకీయ సమీకరణ జరగకపోతే ఆశ్చర్య పడాలి తప్ప జరుగుతుంటే ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎవరు అవునన్నా కాదన్నా, రాజకీయ పార్టీలన్నీ అధినేతల వ్యక్తిత్వాలపై ఆధారపడి నడుస్తున్న కాలమిది. అలాగే తెలంగాణ రాజకీయ అస్తిత్వానికి ప్రతీకగా మారి వ్యూహాత్మకంగా రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌కే ప్రజలు అధికారం అప్పగించారు. ఎందుకంటే, వచ్చి న తెలంగాణకు అస్తిత్వ పాలనే న్యాయం చేయగలుగుతుంది తప్ప, మునుపటిలాగ బయటి అధిష్టానాల పాలనల వల్ల న్యాయం జరగదని ప్రజలు భావించా రు. ఈ విషయం అర్థం కాని ప్రతిపక్ష సభ్యుడు బహుశా తెలంగాణ అసెంబ్లీలో ఒక్కరూ ఉండి ఉండరని నా అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే వలసలు వస్తున్నాయి తప్ప అవి ఆకర్ష్ వలసలు కావు. అప్ప ట్లో రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన ఆకర్ష్ వలసలు వేరు, ఇప్పుడు జరుగుతున్న అస్తిత్వ వలసలు వేరు.

తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు వారు అస్తిత్వ పార్టీలో చేరుతున్నారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఇక తెలంగాణలో ఉండదని తెలిశాకనే ఆ పార్టీలో ఉన్న నేతలలో రాజకీయ అభద్రతా భావం పెరిగిపోయింది. నలుగురు ఎమ్మెల్యేలు అస్తిత్వ పార్టీ లో చేరారంటే, తమ రాజకీయ భవిష్యత్తుకు అస్తిత్వ పార్టీలోనే భద్రత ఉంటదని వారు భావిస్తుండడమే కారణమని గమనించాలి. భవిష్యత్తు లేని పార్టీలో కొనసాగుతూ తమ రాజకీయ భవిష్యత్తును ఎవరూ పణంగా పెట్టుకోలేరు. అలా అంటే రేవంత్, ఎర్రబెల్లి ఆంధ్రాబాబు తరఫున వకల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారు కదా అని అనవచ్చు. ఒక ఆంధ్రా పార్టీని తెలంగాణలో బతికించుకోవడం అంత సులభం కాద ని రేవంత్ లాంటి నేతలకు తెలియక కాదు. రాజకీయాల్లో ఎప్పటి భవిష్యత్తు కన్నా ఇప్పటి ప్రయోజనం మిన్న అనుకునేవారు కూడా ఓ ఉప్పురవ్వలా ఎప్పుడూ ఉంటారని అందరికీ తెలిసిందే.

ఇక కాంగ్రెస్‌లోనూ భవిష్యత్తు పట్ల బెంగపెట్టుకున్నవారు లేరని కాదు. ఇచ్చింది సోనియా తప్ప తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ నేతలు కాదనే ముద్ర ను ప్రజల్లో ఎవరూ తుడిచేసే స్థితిలో లేరు. ఎందుకంటే అది నిజం కాబట్టి! విశ్వసనీయత కోల్పోయిన నేతృత్వాలతో తమ రాజకీయ భవిష్యత్తుకు భద్రతలేదనే వారు కాంగ్రెస్‌లోనూ పెరుగుతున్నారు. కాబట్టే, నలుగురు ఎమ్మెల్యేలు అస్తిత్వపార్టీలో చేరిపోయారు. రేపటి రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవాలనుకునే వారే అస్తిత్వ పార్టీలో చేరుతున్నారని చెప్పాలి. తెలంగాణ అస్తిత్వ రాజకీయం ఐదేళ్లలో ముగిసిపోయేది కాదు. దాని అస్తిత్వ రాజకీయం శాశ్వతంగా నిలబడే అవకాశాల వల్లనే వలసలు జరుగుతున్నాయని గమనించాలి.

ఆంధ్రా, ఢిల్లీ అధిష్టాన పార్టీలు అధికారం చేపడి తే, పోతిరెడ్డిపాడు తూముల అక్రమ నీటి దోపిడీ, ఆగే నా? పంపకాల వాటాలు సరిగా జరిగేనా? తెలంగా ణ ఉన్నంత కాలం అస్తిత్వ రాజకీయం తెలంగాణకు ఒక పహారాగా కాపలా కాస్తుందనే విషయాన్ని ఎవ రూ కాదనలేరు. తెలంగాణకు పక్కరాష్ట్ర పాలకుల దాయాది రాజకీయాలు బతికున్నంత కాలం ఉంటా యే తప్ప పోయేవి కావు. దాని అక్రమాలను అస్తిత్వ రాజకీయం అడ్డుకోగలదు తప్ప ఢిల్లీ, ఆంధ్రా అధిష్టాన పార్టీలు కావని కూడా గమనించాలి. అందుకే ప్రకృతిసిద్ధంగా కృష్ణా, గోదావరి నదులు ఎంత శాశ్వతమైనవో తెలంగాణకు అస్తిత్వ రాజకీయం కూడా అంతే శాశ్వతం కావాలి. అందుకే, ఇవాళ తెలంగాణ లో జరుగుతున్న రాజకీయ సమీకరణ రేపటి అస్తిత్వ రాజకీయ స్థిరీకణలో భాగంగానే చూడాలి.

ఎమ్మెల్యేల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఐదుగురు అభ్యర్థులను నిలిపింది. వారంతా వలసలు వచ్చినవారే అనే వాదనను విపక్షాలు గేలిచేయడం సహజమే. అయితే, టీఆర్‌ఎస్ క్యాడర్‌లోనూ కొంత అసంతృప్తి ఏర్పడడం కూడా సహజమే. డెడికేటెడ్ క్యాడర్ ఏడాది పాటుగా చూపుతున్న సహనాన్ని మనం అభినందించాల్సిందే. వారి సహనం వల,్ల బలంగాలేని ప్రాంతాల్లో అస్తిత్వ రాజకీయం మరింత స్థిరీకరించబడుతున్నదని కూడా వారు గమనించాలి. ఒకసారి అస్తిత్వ రాజకీయం స్థిరీకరించబడితే భవిష్యత్తు కాలంలో తమ రాజకీయ భవిష్యత్తుకు కూడా ఢోకా ఉండదని డెడికేటెడ్ క్యాడర్ కూడా అర్థం చేసుకుంటున్నదని చెప్పొచ్చు.

ఎమ్మెల్యేల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఐదుగురు అభ్యర్థులను నిలిపింది. వారంతా వలసలు వచ్చినవారే అనే వాదనను విపక్షాలు గేలిచేయడం సహజమే. అయితే, టీఆర్‌ఎస్ క్యాడర్‌లోనూ కొంత అసంతృప్తి ఏర్పడడం కూడా సహజమే. డెడికేటెడ్ క్యాడర్ ఏడాది పాటుగా చూపుతున్న సహనాన్ని మనం అభినందించాల్సిందే. వారి సహనం వల,్ల బలంగాలేని ప్రాంతాల్లో అస్తిత్వ రాజకీయం మరింత స్థిరీకరించబడుతున్నదని కూడా వారు గమనించాలి. ఒకసారి అస్తిత్వ రాజకీయం స్థిరీకరించబడితే భవిష్యత్తు కాలంలో తమ రాజకీయ భవిష్యత్తుకు కూడా ఢోకా ఉండదని డెడికేటెడ్ క్యాడ ర్ కూడా అర్థం చేసుకుంటున్నదని చెప్పొచ్చు. కేసీఆర్ ఇంకా అనేక పదవులు, నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయనేలేదు. అంకిత భావమున్న పార్టీ శ్రేణులు నిరాశకు గురికావలసిన అవసరం కూడా లేదు. కాకపోతే అదేపనిగా డెడికేటెడ్ క్యాడర్‌ను నిర్లక్ష్యం చేయకుంటే చాలు. అస్తిత్వ స్థిరీకణ కోసం కేసీఆర్ చేస్తున్న సమీకరణలను ఎవరూ తప్పుపట్టరు.
kallurisreddy@gmail.com

1457

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ        


country oven

Featured Articles