భరోసా రైతుకా? రాహుల్‌కా?


Thu,May 14, 2015 04:07 AM

రెండు దశాబ్దాలుగా దేశం లో రైతుల ఆత్మహత్యలు ఎందు కు జరుగుతున్నాయో చట్టాలను తయారుచేస్తున్న రాజకీయ పార్టీలకు తెలియదనుకుందామా? అటు దేశాన్ని, ఇటు ఉమ్మడిరాష్ర్టాన్ని ఏకకాలంలో చాలా కా లం ఏలిన కాంగ్రెస్‌పార్టీకి తెలియని విషయమే నా?

రాహుల్‌గాంధీకి రెండు దశాబ్దాల తర్వాత రైతు గుర్తొచ్చా డు.!ఆయన రాజకీయ అరంగెట్రం చేసిన తొలినాళ్లలో, చంద్రబాబును ఒక మం చి ఆర్థిక సంస్కర్త అని, ఆదర్శ ముఖ్యమంత్రని పొగిడిన సంఘటనను ఇంకా ఎవరూ మర్చిపోలేదు. పచ్చి రైతు వ్యతిరేక విధానాలతో రైతుల ఆత్మహత్యలకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు అప్పట్లో ఆదర్శముఖ్యమంత్రిగా కనపడిన రాహుల్‌గాంధీకి ఇపుడు రైతుల ఆత్మహత్యల సమస్య ఎట్లా గుర్తొచ్చిందనేదే విశ్లేషకులకు అర్థం కాని విషయం!

చైనా లాంటి దేశాలు విపరీతంగా పత్తిని దిగుమతి చేసి ఈదేశ పత్తి రైతుకు ఉరితాళ్లు పేనుతున్నాయి. చైనా లాంటి దేశాల ఉత్పత్తులకు బ్రేకులు వేసి ఈదేశ రైతును కాపాడుకోవాలనే సోయి గత పదేళ్లలో రాహుల్‌గాంధీకి ఏనాడైనా ఉన్నదా? ఒకవేళ ఉంటే, గత పదేళ్లలో తెలంగాణ, విదర్భ వంటి ప్రాంతాల పత్తిరైతులే దేశంలో అత్యధికంగా ఆత్మహత్యలు ఎందుకు పాల్పడుతున్నారో రాహుల్ గాంధీ జవాబు చెప్పాలి. ఇకపోతే, వ్యవసాయ సబ్సిడీలను ఎత్తేయడంలో చూపిన శ్రద్ధ, రైతు ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు ఇప్పించడంలో ఈ యువనేత ఏనాడైనా నోరు తెరిచి మాట్లాడారా? కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వం ఒక్క యూరియాకు తప్ప అన్ని రకాల ఎరువుల సబ్సిడీలకు ఎగనామం పెట్టింది.

Kalluri-Srinivas-reddy

ఐదేళ్ల క్రితమే ఎరువుల ధరలు అనేక రెట్లు పెరిగిపోయాయి. గత రెండు దశాబ్దాలలో వ్యవసాయ సబ్సిడీలకు కత్తెర పెట్టని కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఉన్నదా? అందుకే వ్యవసాయం మరింత భారీ పెట్టుబడులకు దారితీసింది.దాంతో బక్క రైతుల అప్పుల పెట్టుబడికి తిరిగి రాబడి నమ్మకం లేకుండాపోయింది. అదే ఆత్మహత్యలకు బలమైన కారణమవుతున్నది. దేశంలోని సగటు రైతు సమస్యలు ఒక ఎత్తైతే, తెలంగాణ రైతు సమస్యలు మరొక ఎత్తు. అటు ప్రకృతి వైపరీత్యాలు, ఇటు కేంద్రం విధానాల కారణాలతో పాటు, తెలంగాణ రైతుకు ప్రాంత వివక్ష మరో బలమైన కారణమైంది. తెలంగాణ రైతు సమస్యలకు వివక్ష అనే అదనపు కారణానికి కారకులే ఇవాళ రైతు జపం చేస్తుండడం ఇక్కడ చర్చనీయాంశం.

ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభాన్ని కోస్తాంధ్ర రైతులు తట్టుకొని నిలబడగలిగినపుడు, తెలంగాణ రైతులే ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడ్డారో ఢిల్లీ పార్టీ యువ నేత రాహుల్‌కు తెలుసా? రెండు జీవనదులు, అనేక ఉపనదులు, 45వేల చెరువులు కలిగిన తెలంగాణ వ్యవసాయం కొన్ని దశాబ్దాలుగా బోర్లపైనే ఎందుకు ఆధారపడి ఉరితాళ్లకు వేలాడిందో ఆయనకు ఏమేరకు తెలుసు? అలాంటి బోర్ల వ్యవసాయానికి ఉచిత కరెంటు గాలం వేసి ప్రాజెక్టులకు ఎగనామం పెట్టి పోతిరెడ్డిపాడు లాంటి అక్రమ తూముల ద్వారా వేలాది టీఎంసీల నీటి దోపిడీ జరిపింది తమ పార్టీ ప్రభుత్వమే అని తెలుసా? కృష్ణా నీటికి కన్నంవేయడానికి రాయలసీమలో హంద్రీనీవా లాంటి ప్రాజెక్టులకు శంఖుస్థాపన చేస్తుంటే రాజశేఖర్‌రెడ్డికి మంగళహారతుల పట్టిన చరిత్ర అప్పటి తెలంగాణ కాంగ్రెస్ మంత్రులకుంది. అలాంటి తెలంగాణ కాంగ్రెస్ మాజీ మంత్రులే తగుదునమ్మా అని, ఇపుడు ఏమీ తెలియని రాహుల్ గాంధీని పట్టుకొచ్చి రైతు భరోసా యాత్ర జరిపిస్తే నమ్మడానికి ఇదేమైనా మునుపటి అమాయకపు తెలంగాణ?

ఇవాళ తెలంగాణ తన రాజకీయ అస్తిత్వ సోయిని కలిగివుందని వారు మర్చిపోతున్నట్లున్నారు! తెలంగాణలో డజన్ల కొలది ప్రాజెక్టులు కట్టబోతున్నట్లు బిల్డప్‌లు ఇచ్చి, ప్రాజెక్టు స్ట్రక్చర్లను వదిలేసి, ఎందుకూ పనికిరాని కాల్వలు అక్కడక్కడా తవ్వి మొబిలైజేషన్ అడ్వాన్సులు కాజేసి తెలంగాణ రైతు చేతిలో చిప్ప పెట్టిన వారు ఇవాళ రైతుకు ఏ భరోసా కల్పిద్దామనుకుంటున్నారో ఎవరికైనా అర్థమవుతున్నదా? 1200 టీఎంసీల నీటిపై హక్కులు కలిగిన తెలంగాణ రైతు గత దశాబ్దాలుగా ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతూ వస్తున్నాడో ఘనత వహించిన ఆ యువనేతనే తెలంగాణ రైతులకు సంజాయిషీ ఇచ్చుకోవాలి.

రైతులను బషీర్‌బాగ్‌లో కాల్చి చంపిన చరిత్ర ఆంధ్రాపార్టీదైతే, విద్యుత్ కేంద్రాలను సీమాంధ్రలో స్థాపించి తెలంగాణకు ఎగనామం పెట్టిన చరిత్ర ఢిల్లీపార్టీది. బోరుబావుల తెలంగాణ రైతును డిపెండెబుల్‌గా మార్చిన ఘన చరిత్ర తమ పార్టీదేనని రాహుల్ తెలుసుకోవాలి. డిమాండ్ ఎక్కడ ఉంటే అక్కడే స్థాపించాల్సిన విద్యుత్ కేంద్రాలను సీమాంధ్రలోఎందుకు స్థాపించారో తెలంగాణ కాంగ్రెస్ మాజీ మంత్రులనే అడగాలి.అయినా 6 దశాబ్దాలలో తెలంగాణ రైతుకు ఇన్ని అనర్థాలు చేసిపెట్టిన వారే, తగుదునమ్మా అని ఇపుడు రైతుకు భరోసా కల్పిస్తామంటే ఎవరు నమ్మగలరో ఫణికర మల్లయ్య లాంటి సగటు తెలంగాణ రైతును అడిగితే రాహుల్‌కే తెలిసిపోతుంది! రెండు దశాబ్దాల అనర్థాల ఫలితమే నేటి రైతు ఆత్మహత్యలని ఆర్థికవేత్తలు సైతం ధృవీకరిస్తున్నారు.
రెండు జీవనదుల నీటిని సంపూర్ణంగా వాడుకునే భగీరథ ప్రయత్నం జరగడానికే తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చుకున్నాం.అలాగే, 45 వేల చెరువులు పునరుద్ధరణ జరగాలి. వాగులు వంకలు ఉపయోగంలోకి తెచ్చుకోవాలి. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరుపుకోవాలి. ఆ దిశగా తెలంగాణ కొత్త ప్రభుత్వం పని చేస్తున్నదా లేదా చూడకుండా, తాము చేసిన పాపాలను కొత్త ప్రభుత్వానికి అంటగట్టి భరోసా యాత్రలు చేస్తే అవి రాజకీయ యాత్రలే అవుతాయి తప్ప రైతు యాత్రలు కాలేవు.

కొత్త రాష్ట్రంలో తమ అస్తిత్వ పార్టీ పాలనను ప్రజలు కోరుకున్నారు.అది ఏపని చేసినా అంతే శాశ్వత పరిష్కారాల దిశగా పనిచేయాల్సి వుంటుంది. ఉదాహరణకు, చెరువుల పునరుద్ధరణ(మిషన్ కాకతీయ) అనేది పది వేల గ్రామాలకు సాగు, తాగు నీటికి ఒక నమ్మకమైన పరిష్కారం. అటువైపు ఈ ప్రభుత్వం దృష్టిపెట్టి పనిచేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు, హర్షిస్తున్నారు. . నిజంగానే సమైక్య పాలకులు తెలంగాణలో ప్రాజెక్టులు కట్టి 1200 టీఎంసీలు వినియోగంలోకి తెచ్చి వుంటే, తెలంగాణలో ఇంతగా బోరుబావుల వ్యవసాయం ఉండేదేనా? సాగునీరు లేక పత్తి పంట వెంట మన రైతులు పరుగెత్తేవారేనా? ఇంతగా ఆత్మహత్యలు జరిగేవేనా? ఈ ప్రశ్నలన్నిటికీ ఎవరు జవాబులు చెప్పాలి? భరోసా ఇవ్వడానికి వచ్చిన రాహుల్ చెపుతారా?, లేక సమైక్య పాలనలో మంత్రులుగా పనిచేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెపుతారా?

సమైక్య ప్రభుత్వాలు చేసిపెట్టిన అనర్థాలను 11 నెలలో ఎవరూ సరిచేయలేరు. కాకపోతే ఆదిశగా కొత్త ప్రభుత్వం పనిచేస్తున్నదా లేదా అనేదే తెలంగాణ రైతుకు ముఖ్యం. రెండు జీవనదులపై అనేక ప్రాజెక్టుల ప్రతిపాదనలను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది. చెరువుల పునర్నిర్మాణం కొససాగుతున్నది. రైతుకు గతం కంటే మెరుగ్గా విద్యుత్ సరఫరా చేస్తున్నది. వచ్చే ఏడాది నుంచి పగటి పూట 9 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామంటున్నది. ఒక రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో ఏమేరకు రైతు కోసం పని చేయగలదో ఆమేరకు ఈ ప్రభుత్వం పని చేస్తున్నది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పునర్నిర్మాణం మరో మూడు నాలుగేళ్లలో చాలా మేరకు పూర్తి చేయగలిగితే, తెలంగాణలో రైతు ఆత్మహత్యలు చాలా మేరకు తగ్గవచ్చు. కాబట్టి ఆత్మహత్యలు చేసుకున్న రైతులను ఓదార్చడం కన్నా, వారి ఆత్మలకు శాంతి కలిగించే పనులు చేయడమే ఒక నిజమైన ప్రజా ప్రభుత్వం చేయాల్సిన పని. ఆ దిశగా కేసీఆర్ లాంటి పాలకుడు అపర భగీరథుడిలా పని చేయడంలోనే ఆత్మహత్యలకు పరిష్కారాలు దొరుకుతాయి తప్ప, రాహుల్ లాంటి వారి రాజకీయ భరోసా యాత్రలతో పరిష్కారాలు దొరికేవి కావు.

ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభాన్ని కోస్తాంధ్ర రైతులు తట్టుకొని నిలబడగలిగినపుడు, తెలంగాణ రైతులే ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడ్డారో ఢిల్లీ పార్టీ యువ నేత రాహుల్‌కు తెలుసా? రెండు జీవనదులు, అనేక ఉపనదులు, 45వేల చెరువులు కలిగిన తెలంగాణ వ్యవసాయం కొన్ని దశాబ్దాలుగా బోర్లపైనే ఎందుకు ఆధారపడి ఉరితాళ్లకు వేలాడిందో ఆయనకు ఏమేరకు తెలుసు?

1017

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ