అభ్యుదయంవైపు అస్తిత్వ రాజకీయం


Wed,May 6, 2015 01:22 AM

తెలంగాణ రాష్ట్ర సమితి జీవితం 13 ఏళ్లు ఉద్యమాలతో గడిచింది. 14వ ఏట అధికార పార్టీగా మారింది. ఈ రెండు కాలాల మధ్య ఉండే వ్యత్యాసమేమిటో తెలిసిందే. ఉద్యమ కాలంలో టీఆర్‌ఎస్‌కు ప్రజ లే కార్యకర్తలు. అప్పట్లో దాని లక్ష్యం తెలంగాణ సాధించడమే తప్ప, మరో ఎజెండా లేదు. ప్రజల ఆకాంక్షకు నాయకుడి సంకల్పం వెయ్యేనుగుల బల మై లక్ష్యం నెరవేరింది. ఇపుడది అధికార పార్టీగా మారింది. ప్రభుత్వానికి-ప్రజలకు నడుమ వారధి లాంటి ప్రజాప్రతినిధులకు పరిపాలనా అనుభవం ఏ మేరకు ఉంటే ఆమేరకు అటు ప్రజలకుఅటుప్రభుత్వానికి-ఇటుపార్టీకి మేలు జరుగుతుంది.ఒక ఉద్యమ పార్టీగా తెలంగాణ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ నుంచి ఒక కొత్త వరవడిని, పరిపాలనలో ఒక కొత్త నిబద్ధత ను ప్రజలు ఆశిస్తారనడంలో అనుమానం లేదు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ నాగార్జునసాగర్‌లో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యులకు వివిధ రంగాల నిష్ణాతుల చేత అవగాహన సద స్సులు తలపెట్టారు.

మూడు రోజులు సుమారు పది అంశాలపై అధ్యయన తరగతులు జరిగాయి. నేటి సంప్రదాయ పార్టీల రాజకీయ లక్షణాలేమిటో ప్రజలకు తెలుసు. వాటిని కొంతవరకైనా ఛేదించే ప్రయత్నానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అవగాహన సదస్సుల ద్వారా ఒక ముందడుగు వేశారనే చెప్పాలి.

దేశంలో అనేక పార్టీలు పుట్టాయి. గిట్టినవి ఉన్నా యి, నిలబడినవి ఉన్నాయి. పార్టీ ప్రతినిధులకు పరిపాలన పట్ల, ప్రజా సంబంధాల పట్ల ఏమేరకు అనుభవం ఉందని వెనక్కి తిరిగి చూసుకునే అలవాటు చాలా పార్టీలకు లేదు. ఉదాహరణకు మనం చట్టసభల సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలను చూస్తుంటాం. నిబంధనల ప్రకారం సభ నడవడానికి కావలసిన సభ్యులు (కోరం) ఉన్నట్లు ఒకోసారి కనిపించదు. ఒకోసారి కోరం లేదని స్పీకర్‌కు ఏ సభ్యుడైనా గుర్తుచేస్తే, వెంటనే అధికార పార్టీ చీఫ్‌విప్ చట్టసభ ఆవరణలో తిరగాడే తమ సభ్యులను సభలోకి తీసుకొచ్చే పనిలో పడుతుంటాడు.

దేశంలోని అధికార పార్టీల సభ్యులలో అదొక సహజ లక్షణంగా మారిపోయిందంటే తప్పుకాదు. కానీ మన కొత్త అసెంబ్లీలో అధికార పార్టీకి ఇప్పటి వరకైతే అలాంటి గైర్హాజరీలతో కోరం లేని దుస్థితి రాలేదు. చట్టసభలలో ఎంత ఎక్కు వ పాల్గొం టే అంతే ఎక్కువ పరిపాలనపై పట్టుసాధించగలుతారు. అధికారులు చెప్పిందే నిజం కావచ్చని నమ్మే ప్రజాప్రతినిధులే ఈ కాలంలో ఎక్కువ ఉన్నా రు. ఒకోసారి అధికారులు ప్రజాప్రనిధులను తప్పుదారి పట్టించే అవకాశం ఉంటది. అలాంటి సందర్భంలో ప్రజాప్రతినిధికి ఉండే పరిజ్ఞానమే ఉపయోగపడుతూ వుంటుంది.
కొత్త రాష్ట్రంలో అధికార పార్టీ నుంచి అసెంబ్లీకి మొదటి సారి ఎన్నికైన వారు 30 మంది ఉన్నారు. అలాగే లోక్‌సభకు మొదటిసారి ఎన్నికైనవారు ఆరుగురున్నారు.

వీరికి ఉద్యమ నేపథ్యం ఎంత ఉన్నా అధికార అనుభవం అనివార్యం. మిగిలినవారి లో కొందరు చాలా మేరకు రాజకీయాల్లో తలపండినవారు, వివిధ పదవులను నిర్వహించారు. వారికి పరిపాలనపై పట్టున్నది. కానీ పాతవాళ్లలో వారిని మినహాయిస్తే మిగిలివారిలోనూ అడ్మినిస్ట్రేషన్ పట్ల పూర్తి అవగాహన ఉందని అనుకోలేము. కాబట్టి చట్టసభలకు ఎన్నికైన కొత్తవారితో పాటు, పాతవారికి తెలంగాణ అభివృద్ధితో పాటు తెలంగాణ అస్తిత్వ రక్షణపై కూడా సంపూర్ణ అవగాహన అవసరం.

దేశంలోనే టీఆర్‌ఎస్‌ను ఒక గొప్ప పార్టీగా నిలబెడతానన్న కేసీఆర్ ఆ దిశగానే తమపార్టీ బాధ్యులకు, ప్రజాప్రతినిధులకు, తెలంగాణ అస్తిత్వ రాజకీయానికి అన్ని రంగాలలో నిరంతరం తర్ఫీదు ఇవ్వాలనుకోవడం ముమ్మాటికి అదొక అభ్యుదయ నిర్ణయమే. తెలంగాణ అభ్యుదయ రాజకీయానికి, అభ్యుదయ పాలనకు ఈ అవగాహన సదస్సులు నాంది పలకాలి. ఇంతకాలం, తెలంగాణలో ఆంధ్రా, ఢిల్లీ పార్టీలు ఎలాంటి రాజకీయ వ్యవస్థను నిర్మాణం చేసిపెట్టాయో మనకు తెలుసు. ప్రభుత్వ పథకాలను ఎలా దారిమళ్లించొచ్చో నేర్పాయి. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయిదాకా పరిపాలన పట్ల అవగాహన కన్నా, పరిపాలనను ఎలా దుర్వినియోగం చేయొచ్చనే నైపుణ్యానిదే పైచేయిగా మారింది.

టూకీగా చెప్పాలంటే, పరిపాలనను సద్వినియోగం చేసుకొని పది కాలాల పాటు రాజకీ య భవిష్యత్తు కాపాడుకునే లక్షణాలను అవి పెద్దగా నేర్పలేకపోయాయి. అధికారం చేపట్టింది ఆంధ్రాపార్టీ అయినా, ఢిల్లీ పార్టీ అయినా అవి తెలంగాణ రాజకీ య వ్యవస్థను ఎలా నిర్మాణం చేసిపెట్టాయో ప్రజలకు తెలుసు. అందుకే పరిపాలన పట్ల సకారాత్మక అవగాహన అనుకున్నంత పెరగలేదు. తెలంగాణ సమాజానికి ఆంధ్రా,ఢిల్లీ పార్టీలు చేసిపెట్టిన ప్రధాన కీడులలో అది కూడా ఒకటి. అందుకే సంప్రదాయ రాజకీయ లక్షణాల నుంచి టీఆర్‌ఎస్ పార్టీని కూడా ఇప్పటికిప్పు డు సంపూర్ణంగా మళ్లించడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఆ దిశగా ఇపుడిపుడే అడుగులు పడుతుండడం మాత్రం ప్రజలు ఆహ్వానించ దగ్గ పరిణామం.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ 58 ఏళ్లు బయటి రాజకీయాధిపత్యంలో బతికిందనే కన్నా మగ్గిందని చెప్పాలి. ఆంధ్రా, ఢిల్లీ ఆధిష్టానాల కింద సాగిన పరిపాలనలో తెలంగాణోడికి ఏమేరకు పట్టు ఉండేది? ఎంత మందికి సంపూర్ణ పరిజ్ఞానముండేది? కనీసం తన నియోజకవర్గంలో పని చేయించుకోలేని వారు సమైక్య పాలనలో మంత్రులుగా కొనసాగిన చరిత్ర మన ప్రాంత నేతలకున్నది. అందుకు ఆంధ్రా ఆధిప త్యం కొంత కారణమైతే, విషయ పరిజ్ఞాన లోపం మరికొంత కారణమైంది.

ఇపుడు ఆంధ్రాధిపత్య రాజకీయాలకు ప్రజలే చరమగీతం పాడారు. ఇక కావలసిందల్లా ప్రజాప్రతినిధులకు పరిపాలనపై పట్టు. ఆ పట్టు సాధించగలిగినపుడే వారి ప్రజా సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంటుంది. ఆ బలమైన ప్రజాసంబంధాలే తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వానికి ప్రాణ వాయువులవుతాయి. ఇప్పటికే కొన్ని ప్రతిపక్షాలు అవగాహన సదస్సులపై సెటైర్లు విసురుతున్నాయి. పార్టీలో వలసలు వచ్చిన వారికి అవగాహ నా సదస్సులా అని అంటున్నాయి. తెలంగాణ రాజకీ య అస్తిత్వం శాశ్వతంగా నిలబడనుందనే నమ్మకం బలపడడం వల్లనే వలసలు వస్తున్నాయని మనం గమనించాలి.

అయితే డెడికేటెడ్ క్యాడర్‌కు న్యాయం జరగాలి. స్థిరమైన వ్యక్తిత్వం, ప్రాంత అస్తి త్వం సంపాదించుకున్న కేసీఆర్ లాంటి నాయకుడితో పనిచేయడానికి ఏ రాజకీయ నాయకుడైనా ఇష్టపడడం సహ జం. ఎందుకంటే, అది వారి రాజకీయ జీవితానికి ఒక భద్రతగా భావిస్తారు. అలాగే వలసలు వచ్చినవారు తెలంగాణ అస్తిత్వ రాజకీయం గొడుగు కింద మాత్ర మే బతకక తప్పదని మనం గమనించాలి. అందుకే వలసలను అదేపనిగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వలస వచ్చిన వారికి ఈ అవగాహన తరగతులు తెలంగాణ అస్తిత్వ పాఠాలు నేర్పే ఉంటాయి .
పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు వర్తమాన దేశ ఆర్థిక విధానాల పట్ల చాలా అవగాహన కలిగి ఉండాలి.ఈ దేశంలో 25 ఏళ్లుగా అమలవుతున్న నయా ఆర్థిక విధానాల పట్ల, వాటి పోకడల పట్ల పూర్తి అవగాహన అవసరం. అయితే ఉన్న ఆర్థిక విధానాలలోని మంచిని ఆస్వాదించి చెడును విసర్జించే పరిజ్ఞానం పెరగాలి.

అదృష్టం కొద్ది కేసీఆర్ ఆ పరిజ్ఞాన బాండాగారం అంటే అతిశయోక్తి కాదు. వ్యవసాయ రంగంలోని సమస్యల పట్ల కేసీఆర్‌లో అవగాహనతో పాటు ఆరా టం ఉంది. ఉదాహరణకు, నూతన ఆర్థిక విధానాల లో భాగంగా స్వేచ్ఛా మార్కెట్లను ఆసరా చేసుకొని చైనా వంటి దేశాలు విపరీతంగా పత్తిని మన దేశంలోకి దిగుమతి చేస్తున్నాయి. దానితో మన పత్తి రైతుకు గిట్టుబాటు ధర లభించక ఆత్మహత్యల పాలవుతున్న విషయం మనందరికి తెలిసిందే. మన దేశంలోకి విపరీతంగా పత్తిని ఎగుమతి చేస్తున్న చైనా లాంటి దేశాల పై దిగుమతి సుంకాలు పెంచి వాటికి కళ్లెం వేస్తేనే మన పత్తి రైతును కాపాడుకోగలుగుతాం.

దాంతో మన రైతు ల పత్తికి గిట్టుబాటు ధర లభించగలుగుతుంది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ మొన్ననే ఒక మేడే సభలో వివరంగా చెప్పారు.ఈ విషయం స్వయాన ప్రధాన మంత్రి దృష్టికి తెస్తానన్నారు. నీతి ఆయోగ్‌లోనూ ఈ విషయాలపై గట్టిగా వాదిస్తానని చెప్పారు. అలాగే, కేసీఆర్ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామిక వేత్తలకు ఏ ఇబ్బంది లేకుండా మూడు వారాల్లో అనుమతులు లభించేలా దాన్ని రూపొందించారు. నిజమే అడ్మినిస్ట్రేషన్ స్థాయిలో పరిశ్రమల అనుమతుల కోసం పారిశ్రామిక వేత్తలు అనేక అడ్డంకులను, అధికారుల అలసత్వాలను ఎదుర్కొంటుంటారు. చివరికి ఇతర రాష్ర్టాలకు తరలిపోతుంటా రు.

ఆ ఇబ్బందులేమీ లేకుండా అనుమతులిచ్చినపు డు ఎవరైనా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడతారు. ఇకపోతే ఇలాంటి విధానాలపై దాడి చేయడానికి వైరుధ్య రాజకీయ శక్తులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. భూములను పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారనే వారు ఉంటారు.కానీ అదే కొత్త పారిశ్రామిక విధానంలో ప్రతి 100 కోట్లు పెట్టుబడి పెట్టగలిగే పరిశ్రమలు అదే స్థాయిలో ఉద్యోగాలు కల్పించాలనే కచ్చితమైన నిబంధన కూడా ఉందని ఎంతమందికి తెలుసు? వ్యవసాయ ప్రధానమే కాకుండా పారిశ్రామిక ప్రాధాన్యం పెరిగినపుడే, మన రాష్ట్రంలో ఉన్న లక్షలాది నిరుద్యోగులకు ఉపాధులు కల్పించడం సాధ్యమవుతుంది.

పారిశ్రామికులను ఆహ్వానించకపోతే, ఈ లక్షలాది నిరుద్యోగులకు ఎక్కడి నుంచి ఉద్యోగాలు కల్పిస్తారో విమర్శకుల దగ్గర జవాబులు లేవు.ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే, తెలంగాణ ముఖ్యమంత్రికి అన్ని విషయాల పట్ల అవగాహన ఉంది. దాన్ని అందిపుచ్చుకోవడమే పార్టీ శ్రేణులు చేయాల్సిన పని. ఇలాంటి సూక్ష్మ విషయాల పట్ల ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించడంలో ముందుండాలి. అలాగే సైద్ధాంతికంగా వ్యతిరేకించే వారికి కూడా దీటైన జవాబులు చెప్పగలిగే స్థాయిలో పార్టీ శ్రేణులూ ఉండాలి.

నిజం చెప్పాలంటే కేసీఆర్‌ది పెట్టుబడిదారీవాదం కాదు, తెలంగాణ వాదం! తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ఏ విధానంలో ఉంటే ఆ విధానం ఆచరించడమే ఆయన వాదం! ఇజాలకు కాలం కాదిది! ఉన్న విధానాలనే మనకు అనుకూలంగా మలుచుకోగలిగే సమర్థత కావాలి. దాన్ని అభ్యదయం వైపు నడిపించగలిగే సామర్థ్యం ఉండాలి. అలాగే, తెలంగాణ అస్తిత్వ రాజకీయాన్ని అభ్యుదయ పథం వైపు నడిపించగలగాలి. దేశంలో అనేక సైద్ధాంతికతలు, అనేక పార్టీలూ ఉన్నాయి. వాటన్నిటికీ తెలంగాణే సర్వస్వం కాదు. కాబట్టి తెలంగాణ మాత్రమే సర్వస్వమైన టీఆర్‌ఎస్ పార్టీ ఎంత అభ్యుదయంగా రాటుదేలితే తెలంగాణకు అంతే అధికంగా మేలు జరుతుంది.అందుకే, తెలంగాణ అస్తిత్వ రాజకీయం స్థిరపడాలి, శాశ్వతం కావా లి. అందుకోసం నాయకుడు రాజనీతిజ్ఞుడు, సమర్థు డు, అయితే చాలు, తన రాజకీయ పార్టీని అభ్యుద యం వైపు నడిపించడం అంత కష్టమైన పనేమీ కాదు. ఆదిశగానే దృష్టిపెట్టి టీఆర్‌ఎస్ అవగాహన తరగతులు జరగడం.. రాబోయే తెలంగాణ అభ్యుదయ రాజకీయానికి నాంది పలకగలదని ఆశిద్దాం!

848

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ