వాటర్‌గ్రిడ్‌పై వక్రభాష్యాలొద్దు


Thu,April 30, 2015 12:28 AM

కుట్రలు పన్నడం చాలా సులభం. కానీ కలలు కనడం, ఆ కలల సాకారానికి అహర్నిషలు కష్టపడటం అందరికీ చేతకా దు. కలలు నిజమవుతాయని నమ్మకం లేని వారు జీవితంలో ఏదీ సాధించలేరు. అందుకే.. కలలు కనా లి. ఆ కలలను నిజం చేసుకునే దిశగా నిరంతర ప్రయ త్నం చేయాలి. అపుడే అసాధ్యాలు సుసాధ్యాలుగా మారుతుంటాయి. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ కలలు కన్నారు. నిరంతరం కృషి చేశారు. ఫలితం సాధించారు. అలాగే కొత్త ప్రభుత్వం చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకం పట్ల విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేయడం, అందులో అవినీతికి అవకాశముందని నానా విమర్శలు గుప్పిస్తుండటం మీడియాలో చూస్తున్నాం. ఒక మంచి పథకం చేపడుతున్నపుడు దాన్ని ఆహ్వానించాలే తప్ప అడ్డంగా మాట్లాడమే లక్ష్యం కాకూడదు. నిజంగానే దాని అమలులో ఎలాంటి తప్పులు జరిగినా ప్రజల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తెచ్చి నిలయదీయడం ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షం చేయాల్సిన పని. కానీ మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు ఆ రకంగా పని చేస్తున్నాయా?
మన రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా నీటి కొరత, ఫ్లోరైడ్ కలుషిత నీరు తప్ప స్వచ్ఛమైన నీరు దొరకదు. పంచాయతీ సంస్థలు లేదా ఇతర సంస్థలు శుద్ధి చేసి తాగునీటిని కొన్ని గ్రామాలలో అందిస్తున్నాయి. వాటిలోనూ శుద్ధి శాతం ఎంత అంటే అదీ అనుమానమే. తాగునీటి స్వచ్ఛత, దాని లభ్యతపైనే ఏ సమాజం ఆరోగ్యమైనా అధారపడి వుంటది. అంతేకాదు దేశంలోనే తెలంగాణ ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం. అలాంటి ప్రాంతానికి స్వచ్ఛమైన తాగునీటి లభ్యతకు ఎంతటి ప్రాధాన్యముంటదో చెప్పాల్సిన పనిలేదు. ఇన్ని రకా లుగా అవశ్యమైనది కాబట్టే జలహారం (వాటర్‌గ్రిడ్)కు ప్రభుత్వం అంత ప్రాధాన్యం ఉన్నది.

దేశంలో ప్రభుత్వాలు గుక్కెడు కలుషితం లేని తాగునీరు అందించలేకపోతున్నాయి. ఫలితంగా తాగునీరును కూడా వ్యాపారం చేశాయి. నదులనే అమ్మేసిన ఘటనలు ఈ దేశంలో ఉన్నాయి. తమిళనాడులో 12 ఏళ్ల క్రితం కావేరి ఉపనది భవానీ నదిని ఓ అమెరికా కంపెనీకి (లీజుకు)అమ్మేశారు. ఛత్తీస్‌గఢ్‌లో శివనాథ్ అనే చిన్న నదిని 23 కి.మీ పొడవున ఓ కంపెనీకి అమ్మేశారు. గొప్పగా చెప్పుకునే గుజరాత్‌లోనూ కిమ్ నదిని, కాక్‌పాడ కాలువను 2003లో ఓ కంపెనీకి అమ్మేశారు. దీంతో బహుళజాతి సంస్థలు తాగునీటిని వ్యాపారంచేసి వేల కోట్లు కొల్లగొట్టుకుపోతున్నాయి. కిన్లే లాంటి విదేశీ కంపెనీలు మన నీటిని మనకే అమ్మి ఈ దేశం నుంచి కోట్లాది లాభాలను తరలించుకుపోతున్నాయి. ప్రకృతిలోని పంచభూతాలను కూడా వ్యాపార వస్తువులుగా మన ప్రభుత్వాలే మార్చేస్తున్న ఈ కాలంలో.. కొత్త రాష్ట్రమైన తెలంగాణలో పదివేల గ్రామాలకు వందలాది పట్టణాలకు శుభ్రమైన తాగునీటిని ప్రభుత్వమే అందించడానికి వాటర్‌గ్రిడ్ పథకం చేపట్టడం గొప్ప సదాశయం. అందుకే ఈ పథకాన్ని కేంద్రం కూడా ప్రశంసించింది. తెలంగాణలో జరుగుతున్న ఈ అపర భగీరథ ప్రయత్నాన్ని దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలుసుకొని అమలు చేయాలని కేంద్రం ఆదేశించడమే ఈ పథకంలో ఉన్న గొప్పతనాన్ని తెలియజేస్తున్నది. హడ్కో లాంటి ప్రఖ్యాత సంస్థ తెలంగాణలో చేపడుతున్న వాటర్‌గ్రిడ్ పథకానికి ముగ్ధురాలై ప్రతిష్టాత్మక అవార్డును కూడా తెలంగాణ ప్రభుత్వానికి ప్రదానం చేసింది. అంతేకాదు, హడ్కో సంస్థ పదివేల కోట్ల రూపాయల ఆర్థిక రుణ సాయాన్ని కూడా ప్రకటించింది. తెలంగాణ రాష్టం లో ఉన్న కొన్ని ప్రతిపక్షాలకు ఇవేమీ కనిపిస్తున్నట్లు లేదు. ఎంతసేపూ విమర్శించడమే తమ హక్కుగా భావించే ఇలాంటి ప్రతిపక్షాలకు మంచిని మెచ్చుకోవడం ఎన్నటికీ చేతకాదని తమకు తామే చెప్పుకుం టున్నారు.

వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా వచ్చే నాలుగేళ్లలో ప్రతి ఇంటికి నల్లా ద్వారా సురక్షిత మంచినీరు అందించడమే తమ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణా, గోదావరి నదుల నుంచి 42 టీఎంసీల నీటిని వాటర్‌గ్రిడ్‌కు ఉపయోగిస్తామంటున్నది. ప్రతి వ్యక్తి ఉపయో గానికి 100 లీటర్ల నుంచి 150 లీటర్ల నీరు అందిస్తామంటున్నది. రాష్ట్రవ్యాప్తంగా 26 సెగ్మెంట్లు ఏర్పాటు చేసి, 19 ఇంటెక్ వెల్స్, 67 ట్రీట్‌మెంట్ ప్లాంట్లు నిర్మిస్తామంటున్నది. మొత్తం పథకంలో ఒక లక్షా 25 వేల కి.మీ పైప్‌లైన్ నిర్మాణం చేపడుతున్నది. ఇంత పెద్ద ఎత్తున చేపడుతున్న ఈ పథక నిర్మాణ ప్రణాళికను మన ప్రభుత్వ ఇంజినీర్లే తయారు చేశారు. దాని అంచనాలను కూడా నిపుణులే నిర్ధారించారని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా ప్రతిపక్షాలలో కొందరు ఈ పథకాన్ని అనుమానించడమే పనిగా పెట్టుకొన్నారు. రంద్రాన్వేషణతో రాజకీయ ఆరోపణలు సహజమే కావచ్చు, కానీ ఆ పథకం అమలు అంచనాల పట్ల ప్రతిపక్షాలకే సరైన అవగాహన లేకపోతే అవి రాజకీయ ఆరోపణలుగానే మిగులుతాయి తప్ప నిజాలు కాలేవు.

ఒక విపక్షనేత వాటర్ గ్రిడ్ పథకాన్ని పది వేల కోట్ల లో పూర్తి చేయవచ్చన్నారు. 38 వేల కోట్ల అంచనాలెందుకన్నారు. నిజంగానే పదివేల కోట్లతోనే పది వేల గ్రామాలకు ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించగలిగితే విపక్షాలు ఇన్నేళ్లు ఎందుకు చేయలేదు? ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఒక్క చిత్తూరు జిల్లా మంచినీటి పథకానికే ఏడు వేల కోట్లు కేటాయించారు. ఒక్క జిల్లా తాగు నీటికే ఏడు వేల కోట్లు కేటాయించినపుడు, పది జిల్లా ల తెలంగాణ తాగునీటి పథకానికి ఎంత కేటాయించాలనేది సహజంగా వచ్చే మౌలిక ప్రశ్న. పది జల్లాలకు 70 వేల కోట్లు ఖర్చవుతాయని స్కూలు పిల్లాడిని అడిగినా చెబుతాడు. అయినా, తెలంగాణ పది జిల్లాల వాటర్ గ్రిడ్ పథకం అంచనాను ఈ ప్రభుత్వం సుమా రు 38వేల కోట్లు మాత్రమే వేసింది. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినవారే ఇపుడు వాటర్‌గ్రిడ్‌పై అనుమానాలు వ్యక్తం చేయడం గమనా ర్హం. నిజంగానే పది వేల కోట్లతో వాటర్‌గ్రిడ్ పథకాన్ని పూర్తి చేయగలిగే పరిజ్ఞానముంటే, తమకు పంపాలని ప్రభుత్వం విపక్షాలను కోరింది. నిర్మాణాత్మక విమర్శ కన్నా రాజకీయ విమర్శలకే ప్రాధాన్యమివ్వడాన్ని ప్రజలు హర్షించరు.

గత ఉమ్మడిరాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పథకానికి మొబలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేవి. జలయజ్ఞంలో జరిగింది కూడా అదే. పని జరగకముందే అడ్వాన్సు లు ఇవ్వడం వెనకాల అవినీతి ఉందనే విషయం అందరికీ తెలిసిందే. కాంట్రాక్టర్లకు మొబలైజేషన్ అడ్వాన్సులిచ్చి కమీషన్లు కాజేసిన ఆరోపణలు గత ఉమ్మడి పాలకులపై లెక్కలేనన్ని ఉన్నాయి. కాబట్టి ఇపుడు వాటర్ గ్రిడ్ లాంటి పథకాలకు అడ్వాన్సులివ్వ బోవడంలేదని ఈ ప్రభుత్వం కరాఖండిగా చెప్పేసింది. దేశంలో మొబలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వబోమని ప్రకటించిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే. అవినీతి పట్ల ప్రభుత్వం చాలా మేరకు అప్రమత్తత పాటిస్తున్నదనడానికి అదొక ఉదాహరణ. వాటర్‌గ్రిడ్ టెండర్లు కూడా అంచనా కన్నా తక్కువకు పోయాయని, కొంత ప్రజాధనం ఆదా అయిందని కూడా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. పారదర్శకతకు ఏ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చినా ప్రజలు హర్షిస్తారు. అలాగే విపక్షాలు నిర్మాణాత్మక విమర్శలు చేసినపుడు మాత్రమే ప్రజలు స్వీకరిస్తారు.

తెలంగాణ ఉద్యమానికి - నీటికి బలమైన సంబం ధం ఉన్నది. అటు సాగు, ఇటు తాగునీటి కోసం దశాబ్దాల తరబడి తల్లడిల్లిన గోస తెలంగాణోడికి తప్ప బయటి అధిష్టానాల కింద పనిచేసే వారికి అంతగా పట్టదు. అందుకే విపక్షాల విమర్శల్లో రాజకీయ కోణం మాత్రమే ఉంటున్నది. నిజంగానే గత పాలకులకు ఫ్లోరైడ్ తెలంగాణ పట్ల అంత చిత్తశుద్ధే ఉంటే, ఎప్పు డో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచి నీరు అంది ఉండాలి. తెచ్చుకున్న తెలంగాణలో స్వచ్ఛమైన తాగునీరుకు నిక్కచ్చిగా మొదటి ప్రాధాన్యం. తెలంగాణ గ్రామాల ఆరోగ్యం మినరల్ వాటర్ ప్లాంట్లపై ఆధారపడి ఉన్నది. అయినా ఆ నీళ్లలోనూ ఆరోగ్యానికి ఎక్క డా గ్యారంటీ లేదు. కొన్ని వేల గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు కూడా అందుబాటులో లేవు. మొత్తం తెలంగాణ గ్రామాలకు పట్టణాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలంటే భగీరథ ప్రయత్నమే జరగాలి. అందుకే వాటర్‌గ్రిడ్ అనే ఒక భగీరథ ప్రయత్నం నిరాటంకంగా పూర్తి కావాలి. దేశంలో స్వచ్ఛమైన తాగునీటిని సాధించుకున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడాలి. అందుకే ఇదొక మహత్కార్యం. దేశంలో ప్రతి దాన్ని ప్రైవేటు వ్యాపారాలకు వదిలేస్తున్న నేటి కాలం లో ప్రభుత్వమే వాటర్ గ్రిడ్‌లాంటి శాశ్వత మంచినీటి పథకాన్ని చేపట్టడం తెలంగాణకు ఒక వరం. బయటి అధిష్టానాలు కలిగిన పార్టీలే తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఉంటే.. తాగునీటిని వ్యాపారానికి వదిలేవారు. తెలంగాణ ఉద్యమానికి- నీటికి ఉన్న సంబం ధం అలాంటిది కాబట్టే ఇవాళ ప్రభుత్వమే వాటర్‌గ్రిడ్ పథకం చేపట్టింది. సాగు-తాగు నీటిని ప్రజలకు అందుబాటులోకి తేగలిగితే తెలంగాణ అస్థిత్వ పార్టీకి తిరుగుండదనే విషయాన్ని విపక్షాలు కూడా గుర్తిస్తున్నాయి. అందుకే ఆధారాలను గాలికి వదిలేసి వాటర్‌గ్రిడ్ పథకంపై విపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి.

తెలంగాణ రాజకీయాల్లో డైనమిజం చాలా అవసరం. వేగంగా పనిచేయడం, భవిష్యత్తు అవసరాలను గుర్తించడం, దార్శనికతతో పనిచేయడం మరింత అవసరం. ఈ పథకం పట్ల కేసీఆర్ ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో, దాని పని వేగం పట్ల పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ అంతకు మించి శ్రద్ధ చూపిస్తున్నారు. ఏ పథకానికైనా రుణాలు లభించాలంటే, పాలకుడికి, అధికారులకు ఆ పథకం పట్ల చిత్తశుద్ధి, దార్శనికత ఉన్నపుడే అలాంటి రుణాలు లభించగలుగుతాయి. హడ్కో సంస్థ ఇవాళ వాటర్‌గ్రిడ్‌కు పదివేల కోట్ల రుణం ఇవ్వడానికి సిద్ధపడిందంటే ఆ పథకం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి సంబంధిత మంత్రికి ఉన్న కార్యసాధన పట్టుదలే ప్రధాన కారణం. నిబద్ధత ఉన్న కేటీఆర్ లాంటి మంత్రి కలిగి ఉండడం వల్లనే వాటర్‌గ్రిడ్ పథకం దేశంలో ప్రశంసలు అందుకోగలుగుతున్నది.
[email protected]

936

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ        


Featured Articles