అపోహలు సృష్టించడమే అభ్యుదయమా?


Wed,April 22, 2015 12:20 AM

ఒకరు పాకాలకు నీళ్లు తరలిస్తే పాతరేస్తామంటారు. మరొకరు పాలమూరు ప్రాజెక్టును అడ్డుకుంటామంటారు. ఇలాంటి మాటలను ప్రజలు పట్టించుకుంటున్నారా లేదా అనేది వారికి అవసరం లేదు. చంద్రబాబు కితాబుల కోసం మాట్లాడేది కొందరైతే, ప్రయోజనం లేకు న్నా తమ ఉనికి కోసం మాట్లాడే వారు మరికొందరు! ఇలాంటి విమర్శలను రోజూ చూస్తూనే ఉన్నాం. కాబ ట్టి వాటిని పెద్దగా పట్టించుకోనవసరం లేదు. కొన్ని మావోయిస్టు అనుకూల సంస్థలు దాదాపు అదేకోవ లో ప్రజలకు అపోహలు కల్పించే ప్రయ త్నం చేస్తుండడమే సమాజానికి కొంత ఆశ్చర్యం కలిగిస్తున్న విష యం. కంతనపల్లి ప్రాజెక్టును అడ్డుకుంటామంటున్నా రు.

kalluri


ఆదివాసీలు నిర్వాసితులవుతారంటున్నారు. తెలంగాణ తెచ్చుకున్నది గోదావరి, కృష్ణా జలాలతో వట్టిపోయిన తెలంగాణను సస్యశామలం చేసుకోవడానికే నని, ఉద్యమంలో పాల్గొన్న విప్లవశక్తులకు తెలియదనుకుందామా? ఇపుడు ప్రాజెక్టుల నిర్మాణాన్నే వ్యతిరేకించడాన్ని ఏమనుకోవాలి? నిజానికి కంతనపల్లిలో నిర్మిచాలనుకుంటున్నది ప్రాజెక్టు కాదు, బ్యారేజీ మాత్రమే. ముంపుప్రాంతం కూడా చాలా తక్కువ.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్సీ) కింద 13లక్షల 46 వేల ఎకరాలకు సాగునీరు అందాలి. కానీ 5 లక్షల ఎకరాలకు మించి సాగునీరు అందడం లేదు. దాన్ని ఉమ్మడి పాలకులు ఏనాడూ పట్టించుకోలేదు. నీరు అందని మిగిలిన ఎస్సారెస్పీ ఆయకట్టు 7.46 లక్షల ఎకరాలకు నీరు అందించడం కంతనపల్లి బ్యారేజీ లక్ష్యం. అలాగే, కంతనపల్లి బ్యారేజీ బ్యాక్ వాటర్‌తో దేవాదుల లిఫ్ట్‌లకు నిరాటంకంగా నీరందడం మరొక అదనపు ప్రయోజనం. కంతనపల్లి బ్యారేజీ నీటిని తరలించడానికి కాలువల నిర్మాణం కూడా అక్కరలేదు. కాకతీయ కాలువలు, వాటి ఉప కాలువలు కూడా సిద్ధంగా ఉన్నాయి.

2001లో తెలంగాణ ఉద్యమానికి భయపడి చంద్రబాబు దేవాదుల ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేశా డు. ఇవాళ అదే దేవాదుల రెండు దశల నిర్మాణం కూడా పూర్తి కాలేదు. ఆ రెండు దశలకు కావలసిన 12 టీఎంసీల నీరు దేవాదుల వద్ద ఇప్పటికే లభించడంలేదు. రెండు దశలకే నీటి లభ్యత సరిగాలేనపుడు, మూడో దశకు కేటాయించిన 26టీఎంసీల నీటి లభ్య త దాదాపు అసంభవమనే చెప్పాలి. ఇలాంటి స్థితిలో ఉన్న దేవాదుల ద్వారా ప్రతిపాదిత 6లక్షలకు పైగా ఎకరాలకు నీరు అందండం ఎలా సాధ్యం? ఉమ్మడి ప్రభుత్వాలు నీరందని ఎస్సారెస్పీ ఆయకట్టు ను గానీ, దేవాదుల వద్ద నీటి లభ్యతను గానీ ఏనాడూ పట్టించుకోలేదు. తెలంగాణ ప్రజలను మభ్యపట్టి కాలం గడుపుకునేందుకే ప్రయత్నించాయి.

దేవాదుల వద్ద గోదావరి జలాలు తీసుకునే ఇంటేక్ దగ్గర నీటిని నిలువచేసే ఎలాంటి కట్టడం లేదు. అంటే దేవాదుల వద్ద గోదావరిలో కనీస నీటిమట్టం 73మీటర్లు ఉంటేనే ఆ నీటిని లిఫ్ట్ చేయడం సాధ్యమవుతుంది. ఒక్క మీటరు ఎత్తు నీరు తగ్గినా దేవాదుల లిఫ్ట్ పంపులకు నీళ్లు అం దవు. గతంలోనే ఈ సమస్యను గ్రహించిన తెలంగాణ ఇంజనీర్లు, మేధావులు దేవాదులకు 22 కిమీ దిగువన కంతనపల్లి వద్ద 85 మీటర్ల ఎత్తుతో బ్యారేజీని కడితే అటు నీటి లభ్యత లేని ఎస్సారెస్పీ ఆయకట్టుకు, ఇటు దేవాదుల లిఫ్ట్‌లకు నిరాటంకంగా నీరు అందించ వచ్చునని సూచించారు. దీన్నే మనం కంతనపల్లి బ్యారేజీ అంటున్నాం. దేవాదుల ఎత్తిపోతల పథకం నిరాటంకంగా కొనసాగాలన్నా, నీరు అందని ఎస్సారె స్పీ ఆయకట్టుకు నీరందాలన్నా కంతనపల్లి వద్ద బ్యారే జీ కట్టడం తప్ప మరో మార్గం లేదు.

కంతనపల్లి బ్యారేజీ 19.75 టీఎంసీల కెపాసిటీతో మాత్రమే నిర్మించనున్నారు. ఏడాది పొడవునా ఈ బ్యారేజీ ద్వారా సుమారు 100 టీఎంసీల నీరు వాడుకునే వీలుంటది. ఈ నీటితో వరంగల్, ఖమ్మం నల్గొండ జిల్లాల్లోని 40 మండలాలలో 7.46 లక్షల ఎకరాలు సస్యశామలం కానున్నాయి. అలాగే కంతనపల్లి బ్యాక్ వాటర్‌తో దేవాదుల ఎత్తిపోతల పథకం సంపూర్ణంగా పనిచేస్తే మరో 6.5 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడుతుంది. అంటే కంతనపల్లి బ్యారేజీ నిర్మాణం వల,్ల మొత్తం కలిపి సుమారు 13.50 లక్షల ఎకరాల కు సాగు నీరందనుంది. ఇంత తక్కువ ముంపు, ఇంత ఎక్కువ ప్రయోజనం కలిగిన కంతనపల్లి బ్యారేజీని అడ్డుకోవాలనే భావనను ఎవరు కలిగి ఉన్నా అది అభ్యదయమనిపించుకోదు.

గతంలో తెలంగాణ ఇంజనీర్లు కంతనపల్లి బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదనను అప్పటి ఉమ్మడి ప్రభుత్వ దృష్టి కి తీసుకెళ్లారు. ఉమ్మడి పాలకులు కంతనపల్లి బ్యారే జీ పనులకు టెండర్లు కూడా పిలిచారు. తప్పుడు అం చనాల వల్ల టెండర్లు రాలేదు. కొత్త అంచనాలతో అధికారులు కొత్త ప్రతిపాదనలు చేసినా అప్పటి ముఖ్యమంత్రి వద్ద ఫైలు కావాలనే పెండింగ్ పెట్టారు. అది తెలంగాణ ప్రాజెక్టు కనుకనే ఆ ఫైలు కదలలేదు. తెలంగాణకు భారీగా నష్టం చేసే దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్‌పై చూపించిన శ్రద్ధ అప్పటి పాలకులు కంతనపల్లి బ్యారేజీ నిర్మాణానికి చూపలేదు.

ఆ విధం గా అప్పట్లో కంతనపల్లి బ్యారేజీ నిర్మాణాన్ని ఉమ్మడి పాలకులు కావాలనే పట్టించుకోలేదు. ఇపుడు తెలంగాణ రాష్ట్రంలో దాని నిర్మాణాన్ని అడ్డుకుంటా మని కొందరు అనవసర అపోహలు సృష్టిస్తున్నారు. ఒక సాగునీటి ప్రాజెక్టు కడుతున్నపుడు కొంత ప్రాంతం ముంపుకు గురికావడం ఒక సహజమైన పరిణామం. ఇపుడు వ్యతిరేకిస్తున్న రాజకీయ శక్తులను రాజ్యాధికారంలో కూర్చుండబెట్టినా వారు ముంపు ఏర్పడకుం డా ఏ ఒక్క ప్రాజెక్టునైనా కట్టగలరా? చైనా వంటి కమ్యూనిస్టు దేశాల్లో ప్రజాప్రయోజనం ఉన్న ఏప్రాజెక్టునైనా రైతులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భూములను లాగేసుకుంటారు.

కానీ ఇక్కడ ప్రభుత్వ మే నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలనుకున్నా వారిని కొందరు ఉనికి కోసం పక్కదోవ పట్టించాలనుకోవడం ఏమేరకు సమంజసమో అందరూ ఆలోచించాలి. కంతనపల్లి బ్యారేజీ నిర్మాణం చేపడితే ముంపు కు గురయ్యే గ్రామాలు 8 మాత్రమే. పాక్షికంగా ప్రభావితమయ్యే గ్రామాలు మరో 12. కానీ 60 గ్రామాలు ముంపునకు గురవుతాయని అపోహలు సృష్టిస్తున్నా రు. కంతనపల్లి బ్యారేజీకి 85 మీటర్ల ఎత్తు మాత్రమే ప్రతిపాదన ఉండగా, దాన్ని పోలవరం కన్నా ఎత్తుగా 198 మీటర్ల ఎత్తుతో కడుతున్నారని ప్రజలను తప్పు డు ప్రచారం చేస్తున్నారు.

నిజంగానే వారు అనుకున్న ట్లు కంతనపల్లి బ్యారేజీ కట్టకపోతే, తెలంగాణకు కేటాయించిన నికర, మిగులు జలాలు పోలవరం పాలు కావడం వారికి అభ్యంతరం లేదనుకోవాలా? చేపట్టే ప్రతి ప్రాజెక్టులోనూ ముంపు ప్రాంతాన్ని సాధ్యమైనం త వరకు తగ్గించేందుకు ప్రభుత్వం తన వంతు ప్రయ త్నం చేస్తూనే వున్నది. కంతనపల్లి బ్యారేజీ ఎత్తును కూడా మరింత తగ్గించుకునేందుకు కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ముంపు తగ్గించే ప్రతిపాదన ఎవరు చేసినా దాన్ని ఆహ్వానించవచ్చు. కానీ బ్యారేజీ నిర్మాణమే చేయకూడదన్నట్లు ముంపు ప్రజలను రెచ్చగొట్టడం ఏమేరకు అభ్యదయం?

పునరావాసం ఇవ్వకుండా ప్రత్యామ్నాయం చూపకుండా ఏ ప్రాజెక్టూ కట్టబోము అని నిర్వాసితులకు హామీ ఇస్తున్న ప్రభుత్వం.. తెలంగాణ ప్రభుత్వమే. అలాంటపుడు ముంపు ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగే అవకాశం ఎక్కడిది? నిజంగానే నిర్వాసితులకు నష్టపరిహారం లేదా ప్రత్యామ్నాయాలు చూపకుండా ప్రభుత్వం ప్రాజెక్టును చేపడితే అపుడు నిర్వాసితుల తరఫున ఎవరు ఏస్థాయిలో మాట్లాడినా అది తప్పుకాదు. కానీ అలాంటి అన్యాయమేమీ జరగకముందే.. కంతనపల్లి ప్రాజెక్టును అడ్డుకుంటామని వ్యాఖ్యలు చేయడం, నిర్వాసితుల్లో అనుమానాలు కలిగించడాన్ని ప్రజలు హర్షించరు.

కంతనపల్లి ముంపు ప్రాం తంలో ఆదివాసులకు ప్రత్యామ్నాయం, నష్టపరిహా రం ఇవ్వాల్సిన అవసరాన్ని ఎవరూ కాదనలేరు. వారు చేసుకునే పోడు వ్యవసాయాన్ని మరో అటవీ ప్రాం తంలోనూ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించకతప్పదు. కానీ గోదావరి తీరం వెంట ఉన్న అటవీ ప్రాంతాలు సీమాంధ్ర నుంచి వచ్చిన వారి ఆక్రమణలకు గురైనాయని కూడాతెలుస్తున్నది. అలాంటి వారు ఒకరొకరు 10నుంచి 50 ఎకరాల వరకు మేలైన వ్యవసాయం చేస్తున్నారట! ఎందుకంటే గోదావరి తీరం వెంట నీటికి కొదవుండదు.ఆ విధంగా అటవీ భూము లు గిరిజనేతరుల (ఆంధ్రా)ఆక్రమణలకు గురై ఉంటా యి.

ఇపుడు కంతనపల్లి ముంపు ప్రాంతంలోనూ అలాంటి ఆంధ్రా మోతుబరి రైతులు కూడా ఉన్నారని తెలుస్తున్నది. నిర్వాసితులయ్యే ఆదివాసులు సంచార జీవులుగా తమ పోడు వ్యవసాయాన్ని ప్రభుత్వం చూపే ఏ అటవీ భూములనైనా చేసుకోగలుగుతారు. కానీ ముంపు ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క ఆక్రమణ ఆంధ్రా వలస మోతుబరి రైతు అయినా కంతనపల్లి బ్యారేజీని అడ్డుకోవాలనుకుంటాడు. మరి ఇవాళ కంతనపల్లి బ్యారేజీని అడ్డుకోవాలంటున్నవారి సేవలు ఎవరికి ఉపయోగపడతాయి?

నిజానికి ఆదివాసీలను ముంచుతున్నది పోలవరం తప్ప కంతనపల్లి కాదు.ఎందుకంటే. పోలవరం ముం పులో లక్షకుపైగా ఆదివాసులు నిర్వాసితులవుతున్నా రు. వారికి పునరావాసం కల్పించడం ఏ ప్రభుత్వానికీ సాధ్యమయ్యే పనికాదు. కంతనపల్లి వద్ద ముంపు ప్రాంతంలో వేలల్లో మాత్రమే ఉండే ఆదివాసులకు పునరావాసం కల్పించడానికి తెలంగాణలో కావలసినంత అటవీ ప్రాంతమూ ఉన్నది. కాబట్టి అడ్డుకోవలసిన అవశ్యకత భారీగా నిర్వాసితులను చేస్తున్న పోలవరం వంటి భారీ ప్రాజెక్టునే తప్ప కంతనపల్లి వంటి చిన్నపాటి బ్యారేజీని కాదు. తెలంగాణ వచ్చాక వాదా లు, ఇజాలు తమ ఉనికి ఆరాటంలో పడినట్లున్నాయి. అపోహలు సృష్టించడానికే అవి అధికప్రాధాన్యమిస్తున్నాయి. తెలంగాణ పొలాలకు నీరందించే కంతనపల్లిని అడ్డుకోవాలంటున్నారు..

కానీ, తెలంగాణ నీటికి దశాబ్దాలుగా ఎసరు పెడుతున్న పోతిరెడ్డిపాడును అడ్డుకోవాలని ఎవరైనా అంటున్నారా? తెలంగాణకు చెందాల్సిన నీటిని దోపిడీ చేస్తున్న పోతిరెడ్డిపాడును అడ్డుకోవాలని ఏనాడు అనని వారు, ఇపుడు తెలంగాణలో కట్టే ప్రాజెక్టులను అడ్డుకోవాలంటున్నవారిని ఏమందాం?ఉనికి ఆరాటంలో పడి అపోహలు సృష్టిం చడం తప్ప, తెలంగాణకు తాము చేస్తున్న మేలు ఏమి టో ఆలోచించాలి. అడ్డుకోవడమే అభ్యుదయమైతే పోతిరెడ్డిపాడు లాంటి అక్రమ ప్రాజెక్టును అడ్డుకుంటామనాలి. కానీ దశాబ్దాలుగా గోదావరి నీటి కోసం ఎదు రు చూస్తున్న తెలంగాణ బీడు భూముల దాహార్తి తీర్చే కంతనపల్లి వంటి బ్యారేజీని అడ్డుకోవాలనే భావన సరైంది కాదు.

1052

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ        


country oven

Featured Articles