ఎమ్మెల్సీ ఎన్నికలపై విపక్షాల వక్రభాష్యాలు


Mon,March 30, 2015 04:58 PM

ఉద్యోగ పంపకాలు ఇంత ఆలస్యం జరగడానికి కేంద్రం కారణం! ఉద్యోగాల పంపకాన్ని వేగవంతం చేయాల్సిన కేంద్రంలో ఉన్న బీజేపీ, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయడంలేదని నిరుద్యోగులను రెచ్చగొడుతుండడమే ఆశ్చర్యకరం. నిజంగా ఉద్యోగ పంపకాల ఆలస్యానికి చంద్రబాబు ప్రభుత్వం కూడా బలమైన కారణమే. ఎందుకంటే, ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 70శాతం పైగా సీమాంధ్ర ఉద్యోగులే ఉన్నారని అనేక ప్రభుత్వ కమిటీలే అనేక సందర్భాలలో తేల్చిచెప్పాయి. అదనపు సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణలో కొనసాగించాలనుకునే బాబు ఉద్యోగుల పంపకం ఎంత ఆలస్యమైతే అంత మంచిదనుకుంటాడు! అలాంటి ఆంధ్రపార్టీతో జతకట్టి పోటీ చేసిన బీజేపీ నిరుద్యోగులను రెచ్చగొట్టి పట్టభద్రుల ఎన్నికల్లో తన పబ్బం గడుపుకోవడం.. నిజంగా దాని రాజకీయ జాణతనాన్ని తెలుపుతుంది.

శాసన మండలిలోని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల (రెండు)స్థానాల ఎన్నికల తీర్పుపై పలువురు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ పట్టభద్రుల స్థానాన్ని టీఆర్‌ఎస్ గతంలో ఎన్నడూ గెలవలేదు. నల్లగొండ స్థానాన్ని మాత్రం గతంలోనూ గెలిచింది, ఇప్పుడూ గెలిచింది. కాబట్టి టీఆర్‌ఎస్ కొత్తగా పోగొట్టుకున్నదంటూ ఏమీలేదు. హైదరాబాద్ స్థానంలో టీఆర్‌ఎస్ రెండో స్థానంలోనూ ఉండేటిది కాదు. ఈసారి గతంలో కంటే ఎక్కువ ఓట్లు సాధించింది. రెండో స్థానంలో నిలిచింది. అంటే టీఆర్‌ఎస్ అధికారం చేపట్టాక పట్టణ ఓటర్లలో మునుపటి కన్నా తన బలాన్ని మెరుగుపరుచుకుందనే విషయాన్ని విపక్షాలు పనిగట్టుకొని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. సందు దొరికితే దాడి చేయాలని కాచుకొని కూర్చునే విపక్షాలకు హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్‌ఎస్ ఓడిపోవడం.. కోతికి బెల్లం దొరికినట్లయింది. జనాభాలో పట్టభద్రులు సుమారు 15 శాతం ఉంటారు. అందులో పట్టభద్రుల ఎన్నికల్లో 50శాతం పోలింగ్ జరిగింది. 20శాతం ఓట్లతో ఒక అభ్యర్థి గెలిస్తే అది ఒక ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకతగా భావిస్తే పొరపాటు. నిజానికి ప్రజలేమనుకుంటున్నారనడానికి గ్రామీణ ప్రజలు పాల్గొనే ఎన్నికలే ప్రామాణికం కాగలుగుతాయి. హామీలు, సంక్షేమ కార్యక్రమాల అమలు, వ్యవసాయ ప్రాధాన్యాల విషయంలో ఎలా పనిచేస్తున్నదన్నదే ఈ ప్రభుత్వం పట్ల ప్రజల అభిప్రాయాలను తెలియజేయగలుగుతాయి.

మునుపటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ కోతల తో తెలంగాణను ఎలా పీడించాయో ప్రజలకు తెలుసు. ఇప్పుడు అలాంటి బాధలు లేకుండా ఈ ప్రభుత్వం డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నది.ఇది ప్రభుత్వ పనితీరుకు ఓ నిదర్శనం. కాబట్టి ఒక్క స్థానంలో వచ్చిన ఫలితాన్ని బట్టి ప్రభుత్వ వ్యతిరేక తీర్పుగా విపక్షాలు ప్రచారానికి దిగడంలో అర్థంలేదు. నిజానికి అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాదు. విపక్షాలు ప్రభుత్వంపై చేసిన కొన్ని విష ప్రచారాల ప్రభావంలో కొంత మేర పట్టభద్రుల్లో ఏర్పడిన కొద్దిపాటి అసంతృ ప్తి విపక్షానికి కొంత మేలు చేసి ఉండొచ్చు. ఈ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయడం లేదని విపక్షాలు నిరుద్యోగులను రెచ్చగొట్టడంలో కొంత మేరకు సఫలమైనాయి. మనది కొత్త రాష్ట్రం. కొత్త ప్రభుత్వం. ఉద్యోగాల పంపకంగానీ, ఆస్తుల పంపకంగానీ, కార్పొరేషన్ల పంపకంగానీ జరగలేదు. అవన్నీ జరిగితే తెలంగాణ ఉద్యోగులకు మాత్రమే ఉద్యోగాలు చెందేలా అవకాశాలు పెరుగుతాయి. తెలంగాణ తెచ్చుకున్నది మన ఉద్యోగాలు మనకే దక్కాలని తప్ప మన ఉద్యోగాలు మళ్లీ ఆంధ్రావాళ్లకు దక్కాలని కాదు. అలాంటి చిత్తశుద్ధి 14ఏళ్లు పోరాడి రాష్ర్టాన్ని తెచ్చిన ఉద్యమపార్టీకి ఉంటది తప్ప, ఢిల్లీ పార్టీలకో, ఆంధ్రాపార్టీలకో ఎందుకు ఉంటది? నిజంగానే విపక్షాలు చెప్పుతున్నట్లు ఉద్యోగాల పంపకాన్ని పక్కనపెట్టి, ఉద్యోగాల భర్తీ చేపడితే ఆంధ్రా వాళ్లే భర్తీ అయితే అప్పుడు మన తెలంగాణ నిరుద్యోగులే ఏమంటారో తెలియంది కాదు.

అదిగో కేసీఆర్ మళ్లీ ఆంధ్రోళ్లకే ఉద్యోగాలిస్తున్నాడని ఇవే విపక్షాలు మరోసారి తెలంగాణ నిరుద్యోగులను రెచ్చగొడతారు. అందుకే ఏ పనిచేసినా అది తెలంగాణకే చెందేలా చేయాలనే ప్రభుత్వ తాపత్రయాన్ని అర్థం చేసుకోవాలి. అందు కే ఈ విషయంలో ఇప్పటికిప్పుడే తప్పు పట్టడం సరికాదు. ఈనకాచి నక్కల పాలు చేసినట్లు వచ్చిన తెలంగాణ ప్రయోజనాలు మరొకరి కోసం కాకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. ఈ విషయం నిరుద్యోగులు కూడా మర్చిపోవద్దు. కొన్ని విషయాలు బహిరంగంగా వివరించి చెప్పడం ఒక్కోసారి ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే, అలాంటి వివరాలు మళ్లీ న్యాయ సంకటాలకు కూడా దారి తీస్తుంటాయి కాబట్టి. ఉద్యోగ నియామకాలపై విపక్షాలు ఎంత విష ప్రచారం చేసినా కొత్త ఉద్యోగ నియామకాలు ఆగేవి కావు. జరిగి తీరుతాయి. కాకపోతే, ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకే చెందేలా వ్యూహరచన చేయాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వంపై ఉన్నది. ఉద్యోగ పంపకాలు ఇంత ఆలస్యం జరగడానికి కేంద్రం కారణం! ఉద్యోగాల పంపకాన్ని వేగవంతం చేయాల్సిన కేంద్రంలో ఉన్న బీజేపీ, ఇక్కడ తెలంగాణ ప్రభు త్వం ఉద్యోగాల భర్తీ చేయడంలేదని నిరుద్యోగులను రెచ్చగొడుతుండడమే ఆశ్చర్యకరం. నిజంగా ఉద్యోగ పంపకాల ఆలస్యానికి చంద్రబాబు ప్రభుత్వం కూడా బలమైన కారణమే. ఎందుకంటే, ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 70శాతం పైగా సీమాంధ్ర ఉద్యోగులే ఉన్నారని అనేక ప్రభుత్వ కమిటీలే అనేక సందర్భాలలో తేల్చిచెప్పాయి. అదనపు సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణలో కొనసాగించాలనుకునే బాబు ఉద్యోగుల పంపకం ఎంత ఆలస్యమైతే అంత మంచిదనుకుంటాడు! అలాంటి ఆంధ్రపార్టీతో జతకట్టి పోటీ చేసిన బీజేపీ నిరుద్యోగులను రెచ్చగొట్టి పట్టభద్రుల ఎన్నికల్లో తన పబ్బం గడుపుకోవడం.. నిజంగా దాని రాజకీయ జాణతనాన్ని తెలుపుతుంది.

అధికారంలో ఉన్న పార్టీకి ప్రతి ఎన్నిక ఒక సవాలుగా మారుతుంటుంది. అలాగే విపక్షాలు అధికార పక్షాన్ని ఓడించడానికి ఎన్ని అనైతిక అడ్డదారులకైనా తెగబడుతుంటాయి. హైదరాబాద్ పట్టభద్రుల స్థానంలోనూ అదే జరిగింది. ఈ స్థానంలో పోటీచేసిన కాంగ్రెస్ పార్టీకి కనీసం 3000 ఓట్లు కూడా రాలేదంటే.. ఆపార్టీ ఈ ఎన్నికల్లో ఏపార్టీ ఓడిపోవాలని పనిచేసిందో అర్థమవుతూనే ఉన్నది. దేశంలో బీజేపీ వ్యతిరేక రాజకీయంతో బతికే కాంగ్రెస్‌పార్టీ తెలంగాణలో మాత్రం పరోక్షంగా బీజేపీ గెలుపు కోసం పనిచేయడమే దాని అనైతిక రాజకీయాన్ని బయటపెడుతుంది. ముఖ్యంగా, వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అస్తిత్వ పార్టీ అధికారం చేపట్ట డం.. మొదటి నుంచీ ఢిల్లీ, ఆంధ్రాపార్టీలకు కంటగింపుగా మారింది. అవన్నీ తమతమ వైరుధ్య, వ్యతిరేకతలను సైతం పక్కకు పెట్టి తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి చేతులు కలిపాయని ఈ పట్టభద్రుల ఎన్నికల్లో చాలా స్పష్టంగా బయటపడింది. తెలంగాణలో మొఖం చెల్లని ఆంధ్రాపార్టీ, బీజేపీ భుజంపై తుపాకి పెట్టి తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని అంతమొందించాలనుకుంటున్నది. వచ్చిన తెలంగాణ ఈన కాచి నక్కల పాలు కావద్దనే తెలంగాణ ప్రజలు స్వీయ అస్తిత్వ పార్టీని గెలిపించుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ స్వీయ అస్తిత్వాన్ని అంతమొందిస్తేనే ఢిల్లీ, ఆంధ్రపార్టీలకు మళ్లీ బతుకుదెరువు ఉంటుందనే ఏకైక ఎజెండాతో పనిచేస్తున్న ఆ పార్టీల పట్ల చాలా జాగ్రత్తగా పనిచేయాల్సిన అవసరం ఉందని పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు గుర్తుచేస్తున్నాయి.

ఉద్యోగాల భర్తీ విషయంలో విపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని అడ్డుకోవడంలో టీఆర్‌ఎస్ ఎందుకు విఫలమైందో పరిశీలన చేసుకోవాలి. ఉద్యోగుల పంపకం కోసం ప్రజలకు కనిపించేలా కేంద్రం మీద నిరంతరం ఒత్తిడి తెచ్చిఉంటే, నిరుద్యోగులు నిజమేమిటో తెలుసుకునే అవకాశం ఉండేది. కేంద్రం పట్ల స్నేహ భావంతో మెలగడం తప్పు కాదు, కానీ మన స్నేహభావం కేంద్రానికి అలుసుగా మారినపుడే ఇబ్బంది ఏర్పడుతుంది. నిజానిజాలు తెలియని ప్రజలను విపక్షాలు తప్పుదారి పట్టిస్తుంటాయి. బట్టకాల్చి మీద వేస్తుంటాయి. నిరుద్యోగులను పక్కదారి పట్టించడంలో విపక్షాలు అదే పని చేశాయి. ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్, ఫక్తు రాజకీయపార్టీగా మారానని ఎంతచెప్పుకున్నా.. ఆ పార్టీని తెలంగాణ ప్రజలు తమ అస్తిత్వ పార్టీగానే లెక్కిస్తారని మర్చిపోవద్దు. ఆ విషయాన్ని మర్చిపోతే జరిగే అనర్థం టీఆర్‌ఎస్‌కు మాత్రమే కాదు, యావత్ తెలంగాణ ప్రయోజనాలకూ అనర్థం జరుగుతుందని ఆపార్టీ గమనించాల్సిన అవసరం ఉంది. అందుకే టీఆర్‌ఎస్ ఉద్యమ నేపథ్యాన్ని మర్చిపోకుండా ఒక రాజకీయ పార్టీ గా మనగలగాలి. అందుకే అటు ప్రభుత్వం, ఇటు పార్టీ మరింత రాటు దేలితేగానీ విపక్షాల కుయుక్తులను ఎదుర్కోవడం సాధ్యం కాదు. పార్టీలోకి వలసలు వస్తే ప్రజలెవరూ తప్పుపట్టరు. కానీ ఎలాంటి వలసలు రావాలో, ఎలాంటి వలసల రాకూడదు అనే అభిప్రాయం ప్రజల్లోనూ ఉంటదని మర్చిపోకూడదు. కానీ అంకిత భావంతో పని చేసే వారి గుర్తింపు తగ్గడానికి కూడా విపరీత వలసలు కారణమవుతుంటాయి. అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీఆర్‌ఎస్‌పై ఉంది.

నిజానికి టీఆర్‌ఎస్‌కు 14 ఏళ్ల పాటు ప్రజలే కార్యకర్తలయ్యారు. తమ తమ వృత్తుల ద్వారా ఉద్యమ పార్టీకి నిరంతర సేవలందించారు. లాయర్లు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఇంజినీర్లు, డాక్టర్లు, ఐఏఎస్‌లు, సగటు రైతు వరకు సేవలందించారు. వరంగల్ జిల్లా సగటు రైతు ఫణికర మల్లయ్య చంద్రబాబును నిలదీసి, తెలంగాణలో ఆంధ్రాపార్టీ అవసరం లేదనే సందేశాన్ని యావత్ తెలంగాణ సమాజానికి అందించగలిగాడు. అలాగే లాయర్లు తమ పోరాటాలతో ఉద్యమానికి బాసటగా నిలిచారు. జర్నలిస్టులు తమ కలాలతో ఉద్యమ వ్యాప్తికి కృషిచేశారు. ఒకరేమిటి ప్రతి వృత్తిదారు సేవలతో టీఆర్‌ఎస్ అనే ఉద్యమపార్టీ 14 ఏళ్లపాటు నిలబడగలిగింది. ఆసేవల అండతోనే కేసీఆర్ వ్యూహాత్మక నాయకుడుగా ఎదిగి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించగలిగాడు. ఇంతటి విస్తృత సేవలందించిన నేటి తెలంగాణ సమాజంలో అంకిత భావమున్న వారిని గుర్తించి వారి సేవలను అటు ప్రభుత్వంలోనైనా, ఇటు పార్టీలోనైనా ఉపయోగించుకోగలిగితే.. టీఆర్‌ఎస్ ప్రభు త్వం మరింత మంచి పాలన అందించే అవకాశాలు పెరుగుతాయి. అలాగే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులో తెలంగాణ ఆత్మ కనపడాలె. అప్పుడే తెలంగాణ అస్తిత్వ రాజకీయాన్ని అంతమొందించే కుట్రలకు తెరలేపుతున్న ఆంధ్ర, ఢిల్లీ పార్టీలను బలంగా ఎదుర్కోగలుగుతుంది. స్వీయ అస్తిత్వ రాజకీయాన్ని తెలంగాణ కలకాలం నిలుపుకోగలుగుతుంది.

1429

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ