ఫిరాయింపులకూ ఓ లెక్కుంది !


Thu,March 12, 2015 12:29 AM

ఆంధ్రా అధిష్టాన రాజకీయాలను ఛేదించడంపైనే తెలంగాణ భవిష్యత్తు ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయనడంలో అనుమానం లేదు. ఇంకా చెప్పాలంటే, తెలంగాణకు స్వీయ అస్తిత్వ అధిష్టానాలు ఎన్ని ఉన్నాయని కాదు, ఒక్క ఆంధ్రా అధిష్టాన రాజకీయం ఇక్కడ బతికినా అది తెలంగాణకు అనర్థమే అనే విషయాన్ని ఎవరూ మర్చిపోకూడదు. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులకు ఓ లెక్కుంది!

పార్టీ మార్పిడులు అనైతికమే. కానీ ఒక ప్రజాప్రయోజనం ఇమిడి ఉన్నపుడు పార్టీ మార్పిడులను సమాజం సైతం పెద్ద గా తప్పు పట్టని సందర్భాలున్నాయి. అలాంటి సందర్భాలు చాలా తక్కువ. కేంద్రంలో పీవీ నర్సింహారావు ఐదేళ్లు ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపి చరిత్రకెక్కారు. ఒక సందర్భంలో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవలసి వచ్చే సరికి జేఎంఎం పార్టీ సభ్యులకు ముడుపులిచ్చి గట్టెక్కాడనే ఆరోపణను ఆయన ఎదు ర్కొన్నాడు. అప్పట్లో అనేక సంక్లిష్టతలను ఎదుర్కొంటున్న దేశంలో మధ్యంతర ఎన్నికలు రాకపోవడమే మంచిదని ప్రజలు సైతం భావించారు. కాబట్టి సంద ర్భం, సమయం, బలమైన కారణమున్నపుడు పార్టీల తీరును ప్రజలు సైతం తప్పు పట్టని సందర్భాలూ ఉన్నాయి. అలాగే పార్టీలనే హైజాక్ చేసి అధికార పీఠాలు అందుకున్న సంఘటనలను ప్రజలు ఏనాడూ సమర్థించలేదు. ఒకప్పుడు హర్యానాలో జరిగిన పార్టీ ఫిరాయింపులతో ఆయారాం-గయారాం అనే నినా దం వాడుకలోకి వచ్చింది. హర్యానా సీఎంగా భజన్‌లాల్ కాంగ్రెస్ శాసన సభ్యులందరినీ వెంటబెట్టుకొని మరో పార్టీలోకి మారాడు. తిరిగి తానే ముఖ్యమంత్రి అయ్యాడు. అలాగే మహారాష్ట్రలో కాంగ్రెస్‌పార్టీ నుంచి 35 మంది శాసన సభ్యులతో తిరుగుబాటు చేసి జనతాపార్టీ మద్దతుతో శరద్‌పవార్ ముఖ్యమంత్రి అయ్యారు.

1995లో రాత్రికి రాత్రి శాసన సభ్యుల ఫిరాయింపులతో ముఖ్యమంత్రి అయిన చరిత్ర చంద్రబాబుది! భజన్‌లాల్, చంద్రబాబులు తమ పార్టీలనే హైజాక్ చేసి ముఖ్యమంత్రి పదవులు చేపట్టి చరిత్రకెక్కారు. రాజీవ్‌గాంధీ కాలంలో ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చిం ది. అయినా చంద్రబాబు ఏకబిగిన ఒక పార్టీనే హైజాక్ చేసి ముఖ్యమంత్రి కాగలిగాడు. ఆ రోజు ఆయన చేసిన అనైతిక రాజకీయం ఒక వర్గం మీడియాకు ఎప్పుడూ తప్పుగా కనిపించలేదు. ఆ రోజు ఎన్టీఆర్‌ను దించేసి బాబు ముఖ్యమంత్రి కావాలని ఏ ప్రజలూ కోరుకోలేదు. కానీ ఈరోజు ఆంధ్రాపార్టీ మాప్రాంతంలో అక్కరలేదనుకునే ప్రజలు ఇక్కడ తెలంగాణలో ఉన్నారు. కాబట్టి అన్ని ఫిరాయింపులనూ ఒకే దృష్టితో చూడలేం. అలాగే దేశంలో జరిగే అన్ని ఫిరాయింపులనూ సమర్థిస్తున్నట్లు కాదు. బలమై న చారిత్రక కారణాలవల్ల జరిగే ఫిరాయింపులను ప్రజలు తప్పుపట్టరు.

2001 కన్నా ముందు వరకు తెలంగాణ తలరాతను ఆంధ్రా, ఢిల్లీ అధిష్టానాలకు తాకట్టుపెట్టి పదవులు అనుభవించిన పార్టీల పట్ల తెలంగాణ ప్రజలకు ఎలాంటి అభిప్రాయమున్నదో వరంగల్ జిల్లాకు చెందిన ఒక సాధారణ రైతు ఫణికర మల్లయ్య ఏనాడో చెప్పేశాడు.

ప్రాంతం పట్ల ఏనాడూ నోరు తెరవని బయటి పార్టీలతో జరిగిన అనర్థాల పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది.58 ఏళ్లలో తెలంగాణ సుమారు 12 లక్షల కోట్ల అభివృద్ధిని కోల్పోయిందని శ్రీకృష్ణ కమిటీకి కొందరు నిపుణులు నివేదికిచ్చారు. అది ఆర్థికంగా జరిగిన నష్టం మాత్రమే. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం కోల్పోయిన రెండు జీవిత కాలాలను వెల కట్టడం ఈ దేశ అకౌంటెంట్ జనరల్ కూడా సాధ్యం కాకపోవచ్చు. దేనినైనా శాసించేది రాజకీయమే తప్ప మరొకటి కాదు. అలాంటి రాజకీయం ఐదు దశాబ్దాల పాటు తెలంగాణ చేతిలో ఏనాడూ లేదు. రాజకీయాధిపత్యం ఉన్న శక్తుల దోపిడీకి తెలంగాణ నిలయమైంది. అలాంటి రాజకీయాలతో దశాబ్దాల పాటు సహజీవనం తప్పని తెలంగాణ తిరిగి అదే తప్పు మరోసారి చేయడానికి సిద్ధంగా లేదు. వచ్చిన తెలంగాణలో తిరిగి అలాంటి విద్రోహ రాజకీయాలకు తావు లేకుండా చూసుకునే చైతన్యం బలపడుతున్నది.

ప్రజల్లో పెరిగిన ఈ రాజకీయ చైతన్యమే ఆంధ్రా, ఢిల్లీ పార్టీలను కలవర పెడుతున్నది. అందుకే ఆ పార్టీలలో ఉన్న నేతలకు తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన పెరిగింది. ఏ ప్రజాప్రతినిధికైనా పెట్టుబడి ప్రజలే. అలాంటి ప్రజల రాజకీయ చైతన్యా న్ని కాదని భవిష్యత్తును ఊహించుకునే సాహసం ఆంధ్రాపార్టీలలో ఉన్న వారు చేయలేకపోతున్నారు. అలాంటి వారు రోజురోజుకు ఎక్కువవుతున్నారు. పార్టీ ఫిరాయింపులు అనైతికమే అయినా.. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రా, ఢిల్లీ పార్టీల దోషపూరిత మానసిక స్థితే ఫిరాయింపులకు ప్రేరకమని ఎవరూ మర్చిపోకూడదు. అందుకే వర్తమాన తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు ఓ లెక్కుంది! కాబట్టి అవి బలవంతంగా జరుగుతున్న ఫిరాయింపులనుకోలేం. బలమైన చారిత్రక కారణాలతో జరుగుతున్న ఫిరాయింపులేనంటేనే న్యాయంగా ఉంటుంది!

తెలంగాణలో ఉనికిలో ఉన్న ఢిల్లీ పార్టీలది ఒక పరిస్థితి అయితే, ముఖ్యంగా ఆంధ్రా పార్టీది మరొక పరిస్థి తి. రాష్ట్రం విభజింపబడిన తర్వాత కూడా పక్క ప్రాంత పు పార్టీ ఇక్కడ బతకడం సాధ్యమయ్యే పని కాదు. ఆం ధ్రా ఆధిపత్యమే నేపథ్యంగా పుట్టిన పార్టీ అది! దానికున్న పక్క ప్రాంత లక్షణాలు తుడిచేస్తే పోయేవి కావు. ఒకప్పుడు తెలంగాణ అన్ని పార్టీలను నమ్మినట్లుగానే ఆంధ్రాపార్టీని కూడా నమ్మింది. అయినా దాని లక్షణం ఏనాడూ పోనిచ్చుకోలేదు. ఇక్కడ అందుకో ఉదాహర ణ కూడా చెప్పుకోవచ్చు.

1985లో ఎన్టీఆర్ ప్రభుత్వం 610 జీవో తెచ్చిన విషయం తెలిసిందే. కానీ దాని అమలు సీమాంధ్రలో జరిగింది తప్ప తెలంగాణలో జరగకపోవడమే గమనార్హం. సీమాంధ్రలో ఎవరైనా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులుంటే, వెం టనే వారిని తెలంగాణకు తరిమేశారు. కానీ తెలంగాణ లో సుమారు లక్ష మంది సీమాంధ్ర ఉద్యోగులున్నా ఒక్కరినీ సీమాంధ్రకు తరిమేసిన పాపానపోలేదు. ఆంధ్రా పార్టీ తెచ్చిన 610 జీవో తెలంగాణ ఉద్యోగుల ను తరిమేయడానికే తప్ప సీమాంధ్ర ఉద్యోగులను తరిమేయడానికి కాదని అప్పట్లోనే అర్థమైన విషయం. దాని ప్రాంతాధిపత్య దగాకోరుతనానికి అంతకు మిం చిన ఉదాహరణ మరొకటి అక్కరలేదేమో! కాబట్టి ఆ పార్టీ కావాలని ఒంటికి తెలంగాణ లక్షణాలు అంటించుకున్నా అంటేవి కావు! కొండను ఢీకొంటే విరిగేవి కొమ్ములే తప్ప కొండ కాదు.

తెలంగాణలో ఆంధ్రాపార్టీల పరిస్థితి కూడా అంతే! తెలంగాణలో భవిష్యత్తును కోల్పోయిన పార్టీ నుంచి శాసన సభ్యులు సైతం వైదొలుగుతుండడం ఒక సహజ పరిణామమే తప్ప మరొకటి కాదు. అయినా, ఇప్పటికీ కొందరు ఆంధ్రాపార్టీ తరఫున గొంతు చించుకుంటున్నవారున్నారు. విజయవాడలో విధానాలు రచించే పార్టీ తరఫున ఎవరు వక ల్తా పుచ్చుకున్నా, దాన్ని ఇట్టే పసిగట్టే రాజకీయ చైత న్యం ఇవాళ తెలంగాణలో మనకు ఎక్కడ చూసినా కనిపిస్తున్నది. ఇది చాలు.. ఇవాళ ఆంధ్రా, ఢిల్లీ పార్టీలనుం చి ఎందుకు ఫలాయనాలు జరుగుతున్నాయో తెలుసుకోవడానికి! ఒక రాజకీయ నాయకుడికి ప్రజల అభిప్రాయాలకు మించిన పెట్టుబడి మరొకటుండదు.

అలాంటి ప్రజల్లో స్థిరపడ్డ ఒక బలమైన రాజకీయ తిరస్కారాన్ని కాదని ఆంధ్రా పార్టీలోనో, ఢిల్లీ పార్టీలోనో భవిష్యత్తును వెతుక్కోలేని స్థితిలోనే కొందరు ఆయా పార్టీలను వీడుతున్నారనడంలో సందేహం లేదు.
విద్యుత్‌వాటాపై, ఉద్యోగాల పంపకాలపై, ఉమ్మడి రాజధానిపై, ఉమ్మడి హైకోర్టుపై జరుగుతున్న కిరికిరీలు పక్క రాష్ట్రం కొనసాగిస్తుందే తప్ప అవి ఆగిపోయేవి కావు. అలాగే, మనకు రెండు జీవనదులున్నాయి. పక్క రాష్ట్రంతో జీవితాంతం నీటి వాటాల కొట్లాటలుంటా యి. ఉమ్మడి ప్రాజెక్టుల కొట్లాటలుంటాయి. అలాంటి పక్క రాష్ర్టాన్ని పాలిస్తున్న పార్టీ తెలంగాణలో బతికి ఎవరిని బతికించనుందో అందరూ ఆలోచించాల్సిన విష యం. పక్క ప్రాంతపు రాజకీయాలను తెలంగాణలో బతికిస్తే జరిగే నష్టమేమిటో తెలియంది కాదు. అందుకే రాజకీయ శత్రు శేష ఛేదనపైనే తెలంగాణ భవిష్యత్తు ఆధారపడి ఉందనడంలో అనుమానం లేదు. ఆ దృష్టి కోణంలో చూసినపుడు ఇలాంటి పార్టీ ఫిరాయింపులకు ఓ లెక్కలేదందామా?

ఇంతకాలం ఆంధ్రా అధిష్టానాలు, ఢిల్లీ అధిష్టానాల పాలనల్లో తెలంగాణ బతికింది. రెండు జీవిత కాలాల అభివృద్ధిని కోల్పోయింది. తెచ్చుకున్న తెలంగాణలో నూ అలాంటి అధిష్టానాల రాజకీయాలను నమ్ముకొని తెలంగాణ మరో జీవితకాలాన్ని కోల్పోవడం ఇకపై సాధ్యం కాని పని. ముఖ్యంగా ఆంధ్రా అధిష్టాన రాజకీయాలను ఛేదించడంపైనే తెలంగాణ భవిష్యత్తు ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయనడంలో అనుమానం లేదు. ఇంకా చెప్పాలంటే, తెలంగాణకు స్వీయ అస్తిత్వ అధిష్టానాలు ఎన్ని ఉన్నాయని కాదు, ఒక్క ఆంధ్రా అధిష్టాన రాజకీయం ఇక్కడ బతికినా అది తెలంగాణకు అనర్థమే అనే విషయాన్ని ఎవరూ మర్చిపోకూడదు. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులకు ఓ లెక్కుంది!

చివరగా.. ఆంధ్రా అధిష్టాన రాజకీయాలను ఛేదించడంలో భాగంగా పార్టీ ఫిరాయింపులను చూడడం తప్ప, అనైతిక ఫిరాయింపులను ప్రోత్సహించాలని తెలంగాణ అభిమతం కాదు. కాగల కార్యం గంధర్వు లు తీర్చినట్లు పార్టీ ఫిరాయింపుల వల్ల తెలంగాణకు పక్క ప్రాంతపు రాజకీయాల పీడతగ్గి, కొంత ప్రయోజనం కలుగుతుందనేదే చెప్పుకోదగిన విషయం. అలాగే, ఫిరాయింపుల వల్ల అధికార పార్టీ క్యాడర్‌కు అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యతను కూడా ఆ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు.

861

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ        


country oven

Featured Articles