మిగులు-లోటు: కారణాలు


Fri,March 13, 2015 12:57 PM

దేశంలో ఆశ్రిత పెట్టుదారి వ్యవస్థను ఛేదించకపోతే ఏపీ లాంటి లోటు రాష్ర్టాలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి..తెలంగాణ లాంటి పక్క రాష్ర్టాన్ని వాటాల పేర పీడిస్తూనే ఉంటాయి. కాబట్టి ఏపీ లాంటి రాష్ట్రంలో ఆశ్రిత పెట్టుబడిదారి పోకడలను ఛేదించకుండా ప్రత్యేక హోదా ఇచ్చినా ఏమేరకు ప్రయోజనం కలుగుతుందో చెప్పడం కష్టమే.

యాభై ఎనిమిదేళ్లు ఉమ్మడి రాజ్యం హైదరాబాద్ నుంచి నడిచిన కాలంలో, సుదూర ప్రాంతాలైన కోస్తా, రాయలసీమల్లో పన్నుఎగవేత వ్యాపారాలు (జీరో బిజినెస్‌లు) జోరుగాసాగాయి. అందుకే ఇవాళ అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లోటులో-అక్కడి పెట్టుబడిదారులు మిగులు ఉన్నారు. మరి తెలంగాణలో.. ? నైజాం రాజ్యంలోనూ తెలంగాణ ప్రజలు నిజాయితీతోనో, నిర్బంధాలతోనో పన్నులు కట్టేవారు. అపుడు రాజు ప్రపంచ సంపన్నుడు- ప్రజలు పేదలుగా బతికారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణలో పన్ను చెల్లింపులు ఎక్కువ. అభివృద్ధి తక్కువ. అయినా ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మిగులులో ఉంది. 58 ఏళ్లు అభివృద్ధి అక్కడ-అంకెలు ఇక్కడ మిగిలాయి. ఆ అంకెలను అభివృద్ధిలోకి మార్చుకోవడానికే తెలంగాణ తెచ్చుకున్నాం. రెవెన్యూ ఆదాయ-వ్యయాలలో తెలంగాణ మిగులులో, అవశేష ఆంధ్రప్రదేశ్ లోటు లో ఉంటుందని రాష్ట్ర పునర్విభజన చట్టమే చెప్పిం ది. ఉద్యమ కాలంలోనూ కేసీఆర్ నుంచి మొదలు కుంటే తెలంగాణ బుద్ధిజీవులంతా కూడా అదే చెప్పా రు. అదే నిజమని ఇపుడు మరోసారి ఆర్థిక సంఘం కూడా చెప్పింది.

1948 సెప్టెంబర్ 17 నాడు కూడా తెలంగాణ నగదు ఖజానాతో ఈ దేశంలో విలీనమైంది. అలాగే ఉమ్మడి రాష్టంగా ఏర్పడిన 1956లోనూ తెలంగాణ రూ 65 కోట్లకు పైగా మిగులుతో విలీనమైంది. నైజాం రాజు ప్రపంచంలోనే రెండో ధనవంతుడయ్యాడంటే ఇక్కడి ప్రజలు కట్టిన పన్నులతోనే. తెలంగాణ రైతు తన పంటలతో, వ్యాపారులు పన్నులతో నైజాం ఖజానా నింపారు. అది తెలంగాణ చెమట బిందువుల ఖజానా.అందుకే, నిజాం ప్రపంచ సంపన్నుడనే కన్నా, తెలంగాణ ప్రజలు ప్రపంచస్థాయి సంపదను సృష్టించిన సంపన్నులనడమే సబబు! ఇకపోతే, ఈ దేశానికి తెలంగాణ ఒక్క నగదు ఖజానాను మాత్రమే అందించలేదు. ఈదేశ అస్తిత్వాన్ని కూడా కాపాడింది. ఆనాడు భారతదేశంలో విలీనానికి ప్రజలు మొగ్గుచూపి ఉండకపోతే, సర్దార్‌పటేల్ కూడా ఇక్కడికి సైన్యాన్ని పంపేవాడు కాదు. కాబట్టి తెలంగాణను కాపాడింది సర్దార్‌పటేల్ కాదు, దేశం లో విలీనాన్నికోరుకొని భారత దేశ అస్తిత్వాన్ని కాపాడిన తెలంగాణ ప్రజలదే గొప్పతనం అని ఎవరూ మర్చిపోకూడదు.ఇలా శతాబ్దాల పాటు త్యాగాలు చేయడం తప్ప తెలంగాణ కష్టనష్టాలు ఈరోజుకూ పట్టని ఢిల్లీ పాలకుల వైఖరిని అందుకే తప్పుపట్టాల్సివస్తుంది.నైజాం కాలంలో నిర్బంధాలతో పన్నులు వసూలు చేస్తే, ఉమ్మడి రాష్ట్రంలో మోసాలతో నిధు లు తరలించుకుపోయారు. కాబట్టి శతాబ్దాల వంచనలు, మోసాల నుంచి బయట పడ్డ తెలంగాణ ఇప్పటికీ మిగులు రాష్ట్రంగానే గుర్తించబడడం, ఉద్య మ నిజాయితీని చాటుతుంది ఒక్క హైదరాబాద్ నుంచి వస్తున్న ఆదాయమే తెలంగాణను మిగులు రాష్ట్రంగా చూపిస్తున్నదని మొన్న ఓ పత్రికాధిపతి తన వ్యాసం లో వ్యంగభరితంగా రాశారు. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డ 1956కు ముందు కూడా హైదరాబాద్ ఒక వాణిజ్య, వ్యాపార రాజధానే అని ఆయన తెలుసుకోవాలి. హైదరాబాద్ ఆదాయం ఆరోజు వున్నది, ఈరోజూ వున్నది! మధ్యలో సీమాంధ్రులు స్థిరపడితే మాత్రమే వస్తున్న ఆదాయం కాదు. సీమాంధ్ర వ్యపార వర్గాల జీరో వ్యాపారాలతో హైదరాబాద్ నష్టపోయిందే ఎక్కువ అని కూడా ఆయన తెలుసుకోవాలి. అంతెందుకు సీమాంధ్ర పెట్టుబడిదారులు అంత నిజాయితీ పరులే అయితే.. ఇవాళ అవశేష ఆంధ్రప్రదేశ్ ఎందుకు లోటులో ఉన్నట్లు? ఇది అత్యంత కీలక ప్ర శ్న. 58 ఏళ్లలో కోస్తా-రాయలసీమ నుంచి ఉమ్మడి రాష్ర్టానికి వచ్చిన రెవెన్యూ ఎంత? విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి లాంటి పట్టణాలు ఇప్పటికే మెట్రో నగరాల స్థాయికి ఎదిగాయి. కానీ పన్నుల రాబడి ఏది? ఉమ్మడి రాష్ట్రంలో చివరి 2013-14 బడ్జెట్‌లో ఉమ్మడి రాష్ట్ర ఆదాయం రూ. 62వేల కోట్లుగా చూపారు. అందులో ఒక్క తెలంగాణ నుంచే రూ.47వేల కోట్ల రాబడి ఉన్నట్లు తేలింది. మిగిలిన రూ.15 వేల కోట్లు మాత్రమే సీమాంధ్ర నుంచి రెవెన్యూ రాబడి ఉన్నట్లు స్వయాన కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చెప్పింది. మరి ఓ వైపు మెట్రో స్థాయికి ఎదిగిన నాలుగు నగరాలు ఉన్నాయి. గ్రానెట్, ట్రావెల్స్, లిక్కర్ వ్యాపారాలకు సీమాంధ్ర పెట్టుబడిదారులు పెట్టింది పేరు. వీళ్ల వ్యాపారాలతో ప్రభుత్వానికి వచ్చిన రాబడి ఎంత? జీరో బిజినెస్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆశ్రిత పెట్టుబడిదారుల(క్రోనీ క్యాపిటలిస్టుల) నుంచి నిజాయితీగా పన్నులు ఆశించగలమా? ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పెట్టుబడిదారులే నాయకులై, ఆశ్రిత పెట్టుబడిదారులను పోషించినవారే పాలకులై, రాజ్యాధికారాలను చేపట్టిన వేళ జీరో(పన్ను ఎగవేత) వ్యాపారాలకు కొదువెక్కడిది? సీమాంధ్ర రాజకీయాలకు-ఆశ్రిత పెట్టుబడులకు ఉన్న విడదీయలేని సంబంధాన్ని దేనితోనైనా పోల్చాలంటే అది ఫెవీక్విక్‌తో పోల్చగలుగుతాం! తొండ ఊసరవెల్లిగా మారినట్లు జీరోవ్యాపారులతోమొదలై బడా వ్యాపారులుగా ఎదిగి, రాజకీయనాయకులుగా మారి, రాజ్యాలనే కబళించ మరిగిన వాళ్ల పుణ్యమే, ఇవాళ అవశేష ఆంధ్రప్రదేశ్ లోటులో మునిగిపోవడానికి, తెలంగాణ మిగులులో ఉన్నా అభివృద్ధిలో వెనకబడటానికి అసలైన కారణం. అందుకే, తెలంగాణ ఏనాడూ పేదది కాదు. పేదదిగా చేయబడ్డది.

మిగులు-లోటులను ఏ ప్రాతిపదికన ఆర్థిక నిపుణులు బేరీజు వేసి చెపుతారో తెలియక చాలా మందికి కొన్ని అనుమానాలున్నాయి. మిగులు రాష్ట్రమనే సరికి, ఇక తెలంగాణకు అప్పులెక్కడివి, చెరువుల పునరుద్ధరణ, వాటర్‌గ్రిడ్ లాంటి పథకాలకు కొదవేమిటి అనుకునే వారే ఎక్కువ ఉంటారు.అది నిజంకాదు. నిజానికి ఆర్థిక సంఘం మిగులు రాష్ట్రమని దేని ఆధారంగా అంటున్నది? ఒక రాష్ట్ర ప్రభు త్వం వార్షిక వ్యయానికి మించి ఆదాయం ఏమా త్రం ఎక్కువ కలిగి ఉన్నా దాన్ని మిగులు రాష్ట్రంగా గుర్తిస్తున్నది. అంతమాత్రాన రాష్ర్టానికి అప్పులు ఉండవని కాదు. దీర్ఘకాలిక పథకాలకు కావలసిన నిధులు అందుబాటులో ఉన్నాయని కాదు. అందు కే, ఆర్థిక సంఘం మిగులు రాష్ట్రంగా తేల్చి గ్రాంట్లకు గండి కొట్టినందుకు అభ్యంతరం వ్యకం చేస్తున్నాం. ఆర్థిక క్రమశిక్షణ కలిగిన రాష్ట్రం మిగులులో ఉన్నా, అదో రాష్ట్రంగా ఎదగడానికి మరింత ప్రోత్సా హం ఇవ్వాలంటున్నాం. సరే ఆర్థిక సంఘం చెప్పకపోయినా కేంద్ర బడ్జెట్‌లోనైనా మిగులు రాష్ర్టాలు చేపడుతున్న శాశ్వత పరిష్కారాలు చూపే పథకాలను ప్రోత్సహించే చర్యలు ఉండాలి కదా. బడ్జెట్‌లోనూ తెలంగాణకు మొండి చేయి చూపారు.
దేశంలో తమ అవసరాలు తీర్చుకోగల స్థితిలో కేవలం 5 రాష్ర్టాలే ఉన్నాయి. అవి తెలంగాణ, తమిళనాడు గుజరాత్, రాజస్తాన్, హర్యానా మాత్రమేనని ఆర్థిక సంఘం వివరించింది. మిగిలిన రాష్ర్టాలన్నీ లోటులోనే ఉన్నాయి. వాటికి ప్రత్యేక గ్రాంట్లు కేం ద్రం చెల్లించిన తర్వాత కూడా అందులో 11 రా ష్ర్టాలు ఇంకా లోటులోనే ఉంటాయని కూడా ఆర్థిక సంఘం చెప్పింది. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటని తేల్చింది. నిజానికి అలవికాని హామీలిచ్చిన చంద్రబాబు పుణ్యమా అని ఇపుడు ఆంధ్రప్రదేశ్ మరింతగా 26 వేల కోట్ల లోటులోకి దిగజారిపోయిందని తెలుస్తోంది. ఆర్థిక క్రమశిక్షణ పాటించని ఏపీ లాంటి రాష్ర్టాలు చేతలుడిగిపోతుంటే, తెలంగాణ లాంటి మిగులు రాష్ట్రం చేపడుతున్న తాగు, సాగు, చెరువుల పునర్నిర్మాణం లాంటి శాశ్వత పరిష్కారాలు చూపే పథకాలకు కేంద్రం చేయూత ఇవ్వకపోవడమే ఆశ్చర్యం కలిగించే విషయం. కాకపోతే, మిగులు రాష్ర్టాలకు మరిన్ని రుణాలు తెచ్చుకునే వెసులుబాటు ఉండటమొక్కటే చెప్పుకునేందుకు మిగిలిన అనుకూలాంశం.

అయితే కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఏమేరకు తెలంగాణ వంటి ఒక కొత్త రాష్ర్టానికి మేలు చేస్తుంది? ఒక పెద్ద రాష్ట్రంగా ఉండి, ఒక ప్రాంతాన్ని దోచిన ఖ్యాతి దేశంలో ఏరాష్ర్టానికైనా ఉన్నదంటే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తప్ప మరో రాష్ర్టానికి ఉండి ఉండదు. అలాంటి రాష్ర్టాన్ని ఛేదించి ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం తనకే కాదు, ఈదేశానికి మరింత ప్రయోజనం కలిగించిందనే విషయం ఢిల్లీ పాలకులు ఎప్పుడూ మర్చిపోవద్దు. అయినా విభజన బిల్లు ఇంకా పూర్తి అమలుకు నోచుకోనేలేదు. ఆస్తుల పంపకం పూర్తి కాలేదు. ఉమ్మడి రాజధాని, ఉమ్మడి హైకోర్టును తెలంగాణ తన తలపైన మోస్తున్నది. 62 వేల కోట్ల అప్పులకు సాలీనా ఏడున్నర వేల కోట్ల వడ్డీ కట్టాల్సివుంది. పెన్షన్లకు ఏటా సుమారు రూ.8500 కోట్లు చెల్లించాలి. ఇందులోనూ కనీసం 25శాతం సీమాంధ్ర అక్రమ పెన్షనర్లే ఉంటారు. తన బరువు మోయడమే కాదు, ఇతరుల బరువు కూడా మోయాల్సిన పరిస్థితి. ఉద్యోగుల పంపకంలోనూ న్యాయం కనిపించదు. ఇటు అక్రమ ఉద్యోగులను, అటు అక్రమ పెన్షనర్ల బరవును మోయక తప్పని పరిస్థితులు తెలంగాణకు శాపాలవుతున్నాయి. మిగులు రాష్ర్టామని చెప్పి గ్రాంట్లకు ఎగనామం పెడుతున్న కేంద్రం విభజన చట్టం అమలులోనైనా న్యాయం చేయగలుగుతున్నదా?
దేశంలో ఆశ్రిత పెట్టుదారి వ్యవస్థను ఛేదించకపోతే ఏపీ లాంటి లోటు రాష్ర్టాలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి..తెలంగాణ లాంటి పక్క రాష్ర్టా న్ని వాటాల పేర పీడిస్తూనే ఉంటాయి. కాబట్టి ఏపీ లాంటి రాష్ట్రంలో ఆశ్రిత పెట్టుబడిదారి పోకడలను ఛేదించకుండా ప్రత్యేక హోదా ఇచ్చినా ఏమేరకు ప్రయోజనం కలుగుతుందో చెప్పడం కష్టమే. కానీ, తెలంగాణ వంటి మిగులు రాష్ర్టాన్ని ప్రోత్సహిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని కేంద్ర పాలకులు తెలుసుకోవాలి.

1492

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ        


country oven

Featured Articles