ఆర్థిక సంఘం అంకెల గారడీ


Sat,February 28, 2015 02:03 AM

నీతి ఆయోగ్ సమావేశంలో కేసీఆర్ వినిపించిన రాష్ర్టాల పన్నుల వాటాపెంపు, నిధులపై స్వేచ్ఛ అనే ఫెడరల్ స్ఫూర్తి డిమాండ్లను, వాటి సహేతుకతను కేంద్రం గౌరవిస్తున్నదని మొన్న విడుదలైన 14వ ఆర్థిక సంఘం నివేదిక వెల్లడిస్తున్నది. కేంద్ర పన్నుల్లో రాష్ర్టాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచడాన్ని అందులో భాగంగానే చూడాలి. అదే సమయంలో కొన్ని కేంద్ర పథకాలను రాష్ర్టాలకే వదిలేయనున్నట్లు కూడా తెలుస్తున్నది. అయితే వదిలేయనున్న కేంద్ర పథకాలను రాష్ర్టాలు తప్పనిసరి అమలు చేయాలా లేక రాష్ర్టాల విచక్షణకు వదిలేస్తున్నారా? అలాగే ఏయే పథకాలను రాష్ర్టాలకు వదిలేయనున్నారు అనే వివరాలన్నీ రేపటి సాధారణ బడ్జెట్‌లో కేంద్రం వివరించవచ్చు. ఇక్కడ మనం ఒకటి గమనించక తప్పదు.

కేంద్రం ఒక చేత్తో పన్నుల్లో రాష్ర్టాలకు వాటా పెంచుతూనే, మరో చేత్తో కొన్ని కేంద్ర పథకాలను రాష్ర్టాలకు వదిలేస్తున్నది. అంటే ఒక చేత్తో ఇస్తూనే మరో చేత్తో లాక్కోవడం లాంటిదన్నమాట. ఏది ఏమైనా కేంద్ర పథకాలు కొన్ని తగ్గినా రాష్ర్టాలకు కేంద్ర పన్నుల్లో వాటా పెరగడమే మేలని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే, ఆయా రాష్ర్టాలు తమ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిధులను వెచ్చిస్తుంటాయి. కానీ కేంద్రం పథకాల మార్గదర్శకాలు మరో విధంగా ఉంటాయి. కాబట్టి కేంద్ర పథకాలు కొన్ని కొనసాగించే కన్నా కేంద్ర పన్నుల్లో రాష్ర్టాలకు వాటా పెంచడమే సహేతుకమైనది. దానితో రాష్ర్టాలకు కొంత నిధుల స్వేచ్ఛ కలుగుతుంది. తమ రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికా బద్ధంగా ఆ నిధులను వెచ్చించుకునే వెసులు బాటు రాష్ర్టాలకు కలుగుతుంది. ఈ క్రమంలో 14వ ఆర్థిక సంఘం కొంత ఫెడరల్ స్ఫూర్తిని చూపిందని చెప్పొచ్చు. కానీ దానితోనే దేశంలో సమాఖ్య స్ఫూర్తి వర్ధిల్లబోతున్నదని కూడా కాదు.

ఆర్థిక సంఘం నివేదిక రూపొందించే ముందు అన్ని రాష్ర్టాలను సందర్శించింది. అలాగే ఆ సభ్యులు తెలంగాణ రాష్ర్టానికి కూడా వచ్చారు. ఆసమయంలో ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర పరిస్థితులను వివరించారు. మాది కొత్త రాష్ట్రం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాం. అవసరాలను గుర్తించి నిధులు కేటాయించాలన్నారు. ఇంటింటికి తాగునీరందించే వాటర్‌గ్రిడ్ పథకానికి, కేజీ టు పీజీ విద్యకు, వ్యవసాయరంగానికి ఫీడర్ల ద్వారా విద్యుత్ అందించేందుకు, ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఐటీ రంగానికి, హరిత హారానికి, చెరువుల పునరుద్ధరణకు కలిపి 20వేల కోట్ల రూపాయల గ్రాంట్లు ఇవ్వాలని ఆర్థిక సంఘానికి కేసీఆర్ విన్నవించారు.

తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేక ప్యాకేజీ వాంఛనీయమని ఆరోజు ఆర్థిక సంఘం చైర్మన్ వైవిరెడ్డి ఒప్పుకున్నట్లు మీడియాలో వార్తలు చూశాం. కానీ ఆయన ఇచ్చిన హామీ నివేదికలో ఎక్కడా కనిపించడంలేదు. కారణం మిగులు రాష్ట్రం అంటున్నారు. ఆర్థిక గణాంకాల ప్రకారం మిగులు రాష్ట్రమే కావచ్చు. కానీ 6 దశాబ్దాలు దోచుకోబడ్డ రాష్ట్రం. అక్షరాస్యతలో దేశంలో 25వ స్థానం లో ఉన్న రాష్ట్రం. ఇక్కడ మిగిలింది అభివృద్ధికాదు, అంకెలు మిగిలాయి. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా లో గల రెవెన్యూ ఆదాయాన్ని లెక్కలు కట్టి తెలంగాణ సగటు ఆదాయాన్ని లెక్కించడం మాత్రమే ఆర్థిక సంఘానికి తెలుసు. కానీ మిగిలిన 8జిల్లాలు సగటు ఆదాయంలో ఎక్కడ ఉన్నాయో ఆర్థిక సంఘానికి తెలియదు. అందుకే ఆర్థిక సంఘానికి గణాంకాలు తప్ప వాస్తవాలు పట్టవు.

పోయిన 13వ ఆర్థిక సంఘం దేశంలో అత్యంత వెనుకబడిన జిల్లా ల్లో తెలంగాణలోని 8 జిల్లాలున్నాయని గుర్తించింది. మరి 14వ ఆర్థిక సంఘం ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోయింది? రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వాల్సిందే అన్న ఆర్థిక సంఘం పెద్దలు, నివేదికలో మాత్రం ఆ మాటనే మర్చిపోయారెందుకు! నిజంగా ఆర్థిక సంఘం చెప్పినట్లు మనది మిగులు రాష్ట్రమేనా? 2015-16 బడ్జెట్‌లో రెవెన్యూ వసూళ్లు సుమారు 79,621 కోట్లు. వ్యయం సుమారు 91,600 కోట్లు. అంటే సుమారు 10346కోట్ల మేర లోటు ఉండబోతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘానికి తెలిపింది. మరి మిగులు రాష్ట్రంగా ఆర్థిక సంఘం పెద్దలు ఎలా లెక్కించారు? పై గణాంకాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆర్థిక సంఘం సొంత లెక్కలతో తెలంగాణ రాష్ర్టాన్ని మిగులు రాష్ట్రంగా తేల్చేసి రాష్ర్టానికి కావలసిన గ్రాంట్లకు గండి కొట్టింది. ఇది కొత్త రాష్ట్రం. దీని ఆదాయ వ్యయాల లెక్కలు ఇప్పటికిప్పుడు తేలవు. కనీసం రెండు బడ్జెట్‌ల కాలమైనా గడవాలి.

విభజన చట్టంలోని పంపకాల ఆధారంగా ఆర్థిక సంఘం ఇప్పటికిప్పుడు తెలంగాణ రెవెన్యూ ఆదాయాన్ని లెక్కించి గ్రాంట్లకు గండిపెట్టడం సరికాదు. రాజకీయంగా, ఆర్థికంగా అణచివేయబడ్డ ప్రాంతం, ఇవాళ ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడిందనే విషయాన్ని ఆర్థిక సంఘం పరిగణనలోకి తీసుకొని ఉండాల్సింది. అంతేకాదు, విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలనైనా దృష్టిలో పెట్టుకొని కొన్ని గ్రాంట్లను ప్రకటించి ఉండాల్సింది. వెనుకబడిన ప్రాంతాలను రోడ్ల నిర్మాణాలతో అనుసంధానిస్తామని విభజన చట్టంలో చెప్పారు. 14వ ఆర్థిక సంఘం గ్రాంట్ల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయమే చేసింది.

దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని ప్రతి ఇంటికి మంచినీరు అందించే వాటర్‌గ్రిడ్, చెరువుల పునర్నిర్మాణం, కేజీ టు పీజీ విద్య లాంటి పథకాలకు నిజాయితీతో నిధులు కేటాయించి ప్రోత్సహించి ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. కనీస అవసరమైన మంచి నీటి కొరతను తీర్చడానికి వాటర్ గ్రిడ్ లాంటి గొప్ప పథకాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని చేపట్టినపుడు దాన్ని ప్రోత్సహించే విధంగా కేంద్రం స్పందించాలి. సర్వత్రా నీటి కొరతతో మనిషి విలవిల లాడుతున్నాడు. నీటిలో ఫ్లోరైడ్ పరిమాణం పెరిగిపోతున్నది. ప్రజల అనారోగ్యానికి 80శాతం కలుషిత, లేదా ఫ్లోరైడ్ నీరే కారణమవుతున్నదని శాస్త్రజ్ఞులు చెపుతున్నారు. దీనికి పరిష్కారం నీటిని ఎక్కడికక్కడ నిలుపుకొని వాడుకోవడమే.

స్వాతం త్య్రానంతర ఆరు దశాబ్దాల కాలంలో తెలంగాణలోని 45వేల చెరువులు విధ్వంసమైనాయి. ఇవాళ వాటి పునరుద్ధరణపైనే తెలంగాణ గ్రామాల బతుకులు ఆధారపడి ఉన్నాయి. అలాంటి చెరువుల పునరుద్ధరణలాంటి గొప్ప పథకానికి గ్రాంటు ఇస్తే ప్రజల దాహార్తిని తీర్చినవారవుతారు, ఉపాధి మార్గాలను పునరుద్ధరించినవారవుతారు. అక్షరాస్యతలో వెనుక బడిన తెలంగాణ రాష్ర్టానికి కేజీ టు పీజీ ఉచిత విద్య అవసరం. కనీస అవసరాలకై శాశ్వత ప్రాతిపదికన ఒక రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు గ్రాంట్లు ఇవ్వక పోవడం అన్యాయం. అలాంటి పథకాలను ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ కనీస ధర్మం. ఆ విచక్షణను కూడా మర్చిపోయి రాష్ర్టాన్ని అంకెల గారడీతో మిగులు రాష్ట్రంగా తేల్చి గ్రాంట్లకు ఎగనామం పెట్టడం సరైంది కాదు.

ఆర్థిక సంఘానికి ఆదర్శ రాష్ర్టాలు పట్టవా? కాజీపేటలో వ్యాగన్ల ఫ్యాక్టరీ స్థాపిస్తామని విభజన చట్టం హామీ ఇచ్చింది. కానీ నిన్నటి రైల్వే బడ్జెట్‌లో దాని ప్రస్తావన కూడా లేదు. రేపు ప్రవేశ పెట్టబోయే కేంద్ర బడ్జెట్‌పైనే తెలంగాణ రాష్ట్రం ఆశలు పెట్టుకుంది. ఆర్థిక సంఘం గ్రాంట్ల విషయంలో మొండి చేయి చూపినా, బడ్జెట్‌లో తెలంగాణకు కేంద్రం న్యాయం చేయాలి. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కేంద్ర బడ్జెట్ ఉండాలి. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా, 4వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల స్థాపన, ఉద్యానవన విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయం, ఉక్కు ఫ్యాక్టరీ స్థాపన వంటి విభజన చట్టం హామీలకు బడ్జెట్‌లో ఏ మేరకు చోటు దక్కనున్నదనేదే తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వ నిజాయితీకి కొలమానం కానున్నది.

తెలంగాణ ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన చేపడుతున్న పథకాలకు కేంద్రం తన వంతు సహకారం అందించాలి. అపుడే దేశంలో కొన్ని ఆదర్శ రాష్ర్టాలనైనా కేంద్రం తీర్చదిద్దగలుగుతుంది. ఆ దిశగా కేంద్రం బడ్జెట్‌లో తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తుందని ఆశిద్దాం. ఇంకా చెప్పాలంటే, బడ్జెట్ కేటాయింపులు గానీ, ఆర్థిక సంఘం సిఫార్సులు గానీ శాశ్వతం కాదు. బడ్జెట్‌కు అతీతంగా కేంద్రం సహా యం చేసే అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి దేశంలో ఆదర్శ రాష్ర్టాల సంఖ్య పెంచడానికి మోడీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి తెలంగాణ రాష్ట్రమే ఒక పరీక్ష కాబోతున్నది. రాబోయే నాలుగేళ్లలో తెలంగా ణ రాష్టం పట్ల కేంద్రం వ్యవహరించే తీరే దాని నిజాయితీకి ఒక గీటురాయి. ఆ విషయాన్ని కేంద్ర పాలకులు ఏ మేరకు గుర్తిస్తే.. తెలంగాణకే కాదు దేశానికి కూడా ఆ మేరకు మేలు చేసినవారవుతారు.
- కల్లూరి శ్రీనివాస్‌రెడ్డి

1882

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ