తెలంగాణ ఆత్మను వేరు చేయలేరు


Sat,February 7, 2015 01:50 AM

ఆంధ్రా అజమాయిషీలో కొనసాగుతూ తెలంగాణలో బతికిన పార్టీలు,వాటి బుద్ధి జీవులలో ఇప్పటికీ మార్పులేదని జరుగుతున్న సంఘటనలే రుజువు చేస్తున్నాయి. కాబట్టి వారు మారుతారని ఆశించడం కష్టమే. తెలంగాణ వచ్చిన
నాడు కూడా కొందరు నిరాశ చెంది వుంటారు. నిత్య అసంతృప్తిలో బతికే కొందరికి ఏదీ సంతృప్తినివ్వదు. ప్రజలను బతికించడానికి సైద్ధాంతికులు బతకాలి.

తెలంగాణ రాష్ట్రం దేశ అక్షరాస్యత లో అట్టడుగున (25వస్థానం) ఉన్నది. అనే క వివక్షలకు తెలంగాణ నిలయంగా మారింది. విద్యా, వైద్యం, ఉద్యోగం, వ్యవసాయం ఒకటేమిటి ఏ రంగంలో పోల్చుకున్నా భౌగోళికంగా తెలంగాణ లో హెచ్చుతగ్గులు పెద్దగా లెక్కించదగ్గవి కావు. కానీ కొందరు రంద్రాన్వేషణలో పడ్డారు. అందులోనూ కొందరు బుద్ధిజీవులే రంద్రాన్వేషణలకు పాల్పడుతుండడం ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం. తెలంగాణ నుంచి ఓ జిల్లాను వేరు చేసి మాట్లాడుతున్నారు. భౌగోళిక, సాంస్కృతిక సంబంధంతో ఒక ప్రాంతం గుర్తించబడుతుంది. పరిపాలనా సౌలభ్యం కోసం ఒక జిల్లా ఏర్పడుతుంది. కొందరు బుద్ధిజీవు లు అలాంటి శాస్త్రీయతను సైతం మరిచి తెలంగాణ ను జిల్లాలుగా వేరుచేసి మాట్లాడుతుండటం నిజంగా బాధ కలిగించే విషయం.

తెలంగాణలో జిల్లాలు పాలనా సౌలభ్యం కోసం ఏర్పడ్డాయి. వాటి సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, భౌగోళిక పరిస్థితుల్లో తేడాలేదు. అందుకే ఈ భూభాగాన్ని తెలంగాణ అంటున్నాం. భౌగోళికంగా అన్ని జిల్లాలూ రాచరిక వ్యవస్థలో బతికి రాజకీయ అమాయకత్వంతో అనేక అన్యాయాలకు గురైనవే. కాబట్టి తెలంగాణ పది జిల్లాలలో ఏ జిల్లాను వేరు చేసి చూసి నా అది తెలంగాణ ఆత్మను వేరు చేయడం తప్ప మరోటికాదు. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న కేజీ టు పీజీ అన్ని జిల్లాల కంటే పాలమూరుకు ఎక్కువ అవసరం. నిరక్షరాస్యులు ఏ జిల్లాలో ఎక్కువ ఉంటే ఆ జిల్లా మరింత లబ్ధి పొందుతుంది.

అంతేతప్ప ఏ దో ఒక జిల్లా పట్ల వివక్ష చూపే అవకాశమే ఉండదు. అలాగే పాలమూరు జిల్లాలోనే ప్రవేశిస్తున్న కృష్ణా నది నీటితో ఆ జిల్లాకు న్యాయం చేయకుండా మరో జిల్లాకు తరలించడం సాధ్యం కూడా కాదు. కానీ కొందరు పాలమూరు వనరులను ఇతర జిల్లాలకు తరలించరాదన్నట్టు పరోక్ష అపోహలను ఎందుకు ప్రచారంలో పెడుతున్నారో అర్థం కాదు. నిజానికి కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులు దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను త్వరితంగా రెండేళ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెపుతూనే ఉన్నది. ఈ నాలు గు ప్రాజెక్టులు పాలమూరు జిల్లాకు మాత్రమే సాగునీరు అందించనున్నాయి. ఇక తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్లు ఉద్యమ కాలంలోనే రెండు ప్రధాన ప్రాజెక్టుల ప్రతిపాదనలను (పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోత ల, జూరాల-పాకాల గ్రావిటీ ప్రాజెక్టు) తెచ్చిన విష యం అందరికీ తెలుసు.

వాటిని పాలమూరు కరువును దృష్టిలో పెట్టుకోకుండా వారు ప్రతిపాదించలేదని గమనించాలి. ఈ రెండు ప్రాజెక్టులు వరద జలా ల ఆధారంగా చేసిన ప్రతిపాదనలే తప్ప నికర జలాల ఆధారంగా కాదని మనం గమనించాలి. పాలమూరు ఎత్తిపోతల పథకం తీవ్ర కరువు ప్రాంతమైన పాలమూరు ఉత్తర ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకునే ఇంజినీర్లు ఆ ప్రతిపాదన చేశారు. పాలమూరు ప్రా జెక్టు ముందుగా పాలమూరు జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు సాగునీరందిస్తుంది. ఆ తర్వాత భౌగోళికంగా కలిసివచ్చే దక్షిణ రంగారెడ్డి కరువు ప్రాంతానికి 2.70 లక్షల ఎకరాలకు, ఆ పక్కనే ఉన్న నల్లగొండ జిల్లా పడమటి కరువు ప్రాంతానికి 30 వేల ఎకరాలకు సాగునీరందించనుంది.

అంటే ఆ ప్రాజెక్టు ప్రయోజ నం 70శాతానికి పైగా పాలమూరు జిల్లాకే కలగనుం ది. అలాగే భౌగోళికంగా అనువుగా ఉన్న రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని కరువు ప్రాంతాలకు సమారు 25 శాతమే ప్రయోజనం కలగనుంది. జూరాల-పాకాల గ్రావిటీ ప్రాజెక్టు పాలమూరు భూములను సస్యశ్యామలం చేశాకే నల్లగొండ జిల్లా కరువు ప్రాం తాలను తాకుతూ వరంగల్‌లోని కరువు ప్రాంతాల ను తాకుతూ పాకాల చెరువుకు చేరుకుంటది. జూరాల-పాకాల ప్రాజెక్టు పాలమూరు జిల్లాలో సుమారు 300కు పైగా చెరువులను నింపనుంది. ఆ తర్వాతే ఆ నీరు జిల్లా సరిహద్దును దాటుతాయని గమనించాలి. పై రెండు ప్రాజెక్టుల లక్ష్యం కరువును పారదోలడమే తప్ప పాలమూరుకు అన్యాయం చేయడం కాదు.

ఈ రెండు ప్రాజెక్టుల నీటికి మొదటి ప్రాధా న్యం పాలమూరు జిల్లానే ఆ తర్వాతే భౌగోళికస్థితిని బట్టి ఇతర జిల్లాలకు చిన్న మొత్తంలో మా త్రమే ప్రయోజనం కలగనుంది. జిల్లా ప్రాంతమం తా సాగునీరు చేరాలంటే అందుకు భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. మనకు తెలిసి దేశంలోని ఏ జిల్లా భౌగోళిక స్వభావం అలా ఉండదు. అయితే ఆ జిల్లాకు ప్రాధాన్యమిచ్చి సాధ్యమైన మేర కు అధిక సాగునీరు అందేలా చూడడమే మార్గం. కానీ కొంద రు అదే పనిగా రంద్రాణ్వేషణలు చేయడంలోని ఉద్దేశమేమిటో అర్థం కాదు. ప్రతి ఏటా కృష్ణాలో వర్షాకాలంలో వచ్చే వరదలను ఒడిసిపట్టుకొని వాడుకుందామనే లక్ష్యంతోనే పై రెండు ప్రాజెక్టులను మన ఇంజినీర్లు ప్రతిపాదించారు.

సుమారు 140 టీఎంసీల వరద జలాలను ఆ రెండు ప్రాజెక్టుల ద్వారా మనం వాడుకోకపోతే అవి కిందికి శ్రీశైలం ద్వారా పోతిరెడ్డిపాడుకో, నాగార్జునసాగర్‌కో, బంగాళాఖాతంకో వెళ్లిపోతాయి. 140 టీఎంసీల వరద జలాల ను భౌగోళికంగా ఒక్క పాలమూరు జిల్లా మాత్రమే వాడుకోవడం సాధ్యం కాదు. అంటే పాలమూరుకు మాత్రమే వాడాలనుకుంటే మిగిలే వరద జలాలు శ్రీశైలం ద్వారా పోతిరెడ్డిపాడుకు వెళ్లడం ఈ బుద్ధిజీవులకు సమ్మతమే అనుకోవాలా? పక్కవాడు తిన్నా బాధలేదు గానీ ఇంటివాడు తినకూడదనా? కొందరు సాంప్రదాయ (పాలక) పార్టీల నేతల విమర్శలను పెద్దగా పట్టించుకోనవసరంలేదు. ఎందుకంటే వారి గురించి అందరికన్నా ప్రజలకే బాగా తెలుసు కాబట్టి! కానీ ఓ సైద్ధాంతికత కలిగిన బుద్ధిజీవులు కూడా అలాంటి రంద్రాన్వేషణలకు పాల్పడడమే ఆశ్చ ర్యం.

అలాగే వారు ఎంతసేపూ తెలంగాణలోనే సమస్యలను వెదకడం తప్ప, పక్కరాష్ట్రం తెలంగాణకు చేస్తు న్న అన్యాయం పట్ల పెద్దగా స్పందించరెందుకనే దే తెలంగాణ ఆత్మను వేధిస్తున్న ప్రశ్న. పక్కరాష్ట్ర నీటి దోపిడీపై నాటి నుంచి నేటి దాక ఏనాడూ పట్టించుకోని వారు సైతం ఇవాళ తెలంగాణను జిల్లాల వారి గా విడదీసి చూపే ప్రయత్నం చేయడం నిజంగా శోచనీయం. రాష్ట్ర విభజన తర్వాత కూడా పోతిరెడ్డి పా డు నుంచి కేటాయింపులకు మించి మరో 40 టీఎంసీల నీటిని పక్కరాష్ట్రం దోచుకుపోయింది. ఈ బుద్ధిజీవులకు అది కనిపించడంలేదేందుకు? వచ్చిన తె లంగాణకు అన్యాయం జరగకుండా చూడాల్సిందిపో యి, వచ్చిన తెలంగాణలోనే లేని సమస్యను చూపే ప్రయత్నం చేయడం ఎంతవరకు సంమంజసం?

తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌కు భాష, యాస, సంస్కృతి లాంటి కారణాలనేకం ఉన్నా, భౌగోళికత మరింత ప్రధాన కారణం. స్వతంత్రానికి పూర్వం ఈ రెండు ప్రాంతాలు (తెలంగాణ, సీమాంధ్ర) భిన్నమై న పాలనల్లో బతికాయి. ఒకటి రాచరిక వ్యవస్థలో, మరొకటి బ్రిటిష్ ఇండియాలో బతికింది. ఈ దేశం లో ఉన్న అనేక రాష్ర్టాల్లో ఇలాంటి భౌగోళిక వ్యత్యా సం చాలా అరుదు. భిన్నమైన భౌగోళికంతో పాటు భిన్నమైన పాలనలో బతికిన రెండు ప్రాంతాల కలయికతో ఏర్పడిందే అంధ్రప్రదేశ్. రాచరిక వ్యవస్థలో బతికిన తెలంగాణది అమాయకత్వమైతే, బ్రిటిష్ ఇండియాలో బతికిన సీమాంధ్ర విద్యా, ఉద్యోగం, వ్యా పారంలో రాటుదేలింది. అమాయకత్వంపై ఆధిపత్యం సవారీ చేసింది. తెలంగాణ పట్ల దశాబ్దాల పాటు అనేక రకాల వివక్షలు కొనసాగడానికి దాని అమాయకత్వం ఒక కారణమైతే, దాని భౌగోళికత మ రొక కారణమైంది.

తెలంగాణలో అన్ని రాజకీయ సైద్ధాంతికతలు బతికాయి. వాటి రాజకీయానికి తెలంగాణ అమాయకత్వమే పెట్టుబడిగా మార్చుకున్నాయి. తెలంగాణ గడ్డమీద పెత్తనం కోసం ఆరాటపడ్డాయి తప్ప ఈ గడ్డను బతికించాలనుకున్నట్టు ఎక్కడా కనిపించదు. సాంప్రదాయ పాలకపార్టీలే కాదు. అతి, మిత వాద కుడి, ఎడమ సైద్ధాంతికులూ అందుకు అతీతం కావని బాధగానైనా చెప్పకతప్పదు. వైరుధ్య రాజకీయ ప్రదర్శనలతో అన్ని పార్టీలూ తెలంగాణలో ఉనికి చాటుకున్నాయి,బతికాయి. మీవాళ్లూ మంత్రులయ్యారు, ముఖ్యమంత్రులయ్యారు అని దెప్పిపొడిచేవారు.. బయటి అధిష్టానాల కింద బతికిన ఏ తెలంగాణ ప్రజాప్రతినిధి అయినా ఏం న్యాయం చేయగలడో చెప్పగలరా? ఆంధ్రా, ఢిల్లీ అధిష్టానాల ప్రాపకం కోసం పాకులాడే ఏ ప్రజాప్రతినిధి అయినా, అతను తెలంగాణ ప్రాంతం వాడైనంత మాత్రాన ప్రయోజనమేముంటది? తెలంగాణలో దశాబ్దాల పాటు సాగి న ఇలాంటి పరాయి రాజకీయంతో అనేక పార్టీలు, విభిన్న సైద్ధాంతికలు బతికాయి తప్ప తెలంగాణ బతకలేదని గమనించాలి. అంతర్జాతీయ, జాతీయ, ఆంధ్రాప్రాంతీయ సైద్ధాంతికలకు తెలంగాణ ఒక కేంద్రమైంది.

అవన్నీ తన సైద్ధాంతికలేనని తెలంగాణ భ్ర మ పడ్డది. అవి పక్క ప్రాంతాలకు, హస్తిన పాలకులకు, అంతర్జాతీయ ప్రభావాలకు వింటాయి తప్ప తనకు ఉపయోగపడటం లేదని తెలుసుకోవడానికి తె లంగాణకు కొన్ని దశాబ్దాలు పట్టింది. తెలంగాణ సరిహద్దుల ఆవల ఉన్న ఆయా సైద్ధాంతిక పార్టీల ఆదేశాలు పాటించడం తప్ప తెలంగాణ ప్రజల ఆదేశాలను పాటించినవారున్నారా? ఉంటే తెలంగాణ రావడానికి ఆరు దశాబ్దాల కాలం పట్టేదేనా? తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని సంతరించుకుంటే తప్ప తెలంగాణ రాలేదు. ఇవాళ పాలమూరు ప్రయోజనాలను కాదని తెలంగాణ స్వీయ రాజకీయ అస్తి త్వం కూడా ఏ పనీ చేయదు.

ఇది ముమ్మాటికి నిజం. ఇప్పటికీ అంతర్జాతీయ, జాతీయ సైద్ధాంతికు లు, వాటి బుద్ధిజీవులు పక్క రాష్టం చేస్తున్న దోపిడీ, అన్యాయాలను ప్రశ్నించకుండా తెలంగాణనే విడదీసి చూపే ప్రయత్నాలే చేస్తుండడం గమనార్హం. స్థిరపడుతున్న తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని తిరిగి అస్థిరపరిచి తమ తమ భావజాల వ్యాప్తితో పాటు పక్క రాష్ట్రం దోపిడీకి ఉపయోగపడడమే వారి ఉద్దేశ మా? అందుకే తెలంగాణకు ఏ ఇజం పనికిరాదు తెలంగాణిజమే దానికి పనికి పనికొచ్చేది. ఎందుకం టే దాని భౌగోళిక పరిస్థితులు అలాంటివి. అలాగే దశాబ్దాల పరాయి రాజకీయ ద్రోహాలు తెలంగాణకు ఒక తిరుగులేని పాఠాలు.

ఆంధ్రా అజమాయిషీలో కొనసాగుతూ తెలంగాణలో బతికిన పార్టీలు, వాటి బుద్ధి జీవులలో ఇప్పటికీ మార్పులేదని జరుగుతున్న సంఘటనలే రుజువు చేస్తున్నాయి. కాబట్టి వారు మారుతారని ఆశించడం కష్టమే. తెలంగాణ వచ్చిన నాడు కూడా కొందరు నిరాశ చెంది వుంటారు. నిత్య అసంతృప్తిలో బతికే కొందరికి ఏదీ సంతృప్తినివ్వదు. ప్రజలను బతికించడానికి సైద్ధాంతికులు బతకాలి. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణలో కొందరు సైద్ధాంతికాలను బతికించుకోవడానికే లేని సమస్యలను వెదుకుతుంటారు. అందుకే తెలంగాణ ప్రజలు స్వీ య అస్తిత్వ రాజకీయాలను నమ్ముకోవాలి తప్ప తెలంగా ణ సరిహద్దుల ఆవలి ప్రభావాల్లో ఉండే వారిని కాదు.

1366

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ        


Featured Articles