స్వావలంబన దిశగా అడుగులు..


Wed,January 21, 2015 02:44 AM

తెలంగాణ మొదటిసారి రాజకీయ స్వావలంబనను సాధించుకోగలిగింది. ఇక సాధించుకోవలసింది ఆర్థిక స్వావలంబనే. అయితే తెలంగాణ స్వావలంబన విషయంలో గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం తనకున్న అధికారాల పరిధిలో ఎంతోమెరుగ్గా పనిచేస్తున్నదనే విషయాన్ని సైద్ధాంతిక విమర్శకులు గుర్తించాలి. తెలంగాణ ప్రభుత్వ పరిధిలో సాధ్యమయ్యే స్వావలంబనకు ఎక్కడైనా అనర్థం జరుగుతుంటే, విమర్శించే హక్కును సైద్ధాంతికులు సద్వినియోగం చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఢిల్లీ పాలకులపై చేయాల్సిన విమర్శలను తెలంగాణ రాష్ట్ర పాలకులపై చేయడం సరికాదు.

మలిదశ తెలంగాణ ఉద్యమం 1996లోనే పుట్టిందనే వారున్నారు. అది నిజమే. కానీ దానికి రాజకీయ కోణం ఏర్పడిన తర్వాతే 2001లో అది ఉనికి లోకి వచ్చిందని ఎవరూ మర్చిపోవద్దు. అలా ఏర్పడిన ఉద్యమాన్ని వివిధ ఇజా ల వారు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సమర్థించారు. అలాగే ఉద్యమానికి సార థ్యం వహించిన టీఆర్‌ఎస్ వంటి తెలంగాణ పార్టీ సారథ్యంలో భౌగోళిక తెలంగాణ అయినా సరే సాధించాలనే పరోక్ష అంగీకారం అతివాదుల నుంచి మితవాదుల దాకా కనపడిన మాట వాస్తవం. ఇంకా వివరంగా చెప్పాలంటే కొన్ని ఇజాల అంగీకారానికి మౌనమే సమాధానమైంది. అలాగే ఎవరు ఎలాంటి తెలంగాణ కోరుకు న్నా సగటు తెలంగాణనే ఏర్పడుతుందని వారందరికీ తెలుసు. అది భారత గణతంత్ర దేశంలో ఫెడరల్ వ్యవస్థకులోబడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుం ది తప్ప, ఫలానా ఇజం తెలంగాణ కావాలని కోరుకోవడం వాస్తవికతకు భిన్నమైన కోరిక అని వారికి తెలుసు. భారత ఫెడరల్ వ్యవస్థకు అతీతంగా తెలంగాణకు ఇజాలను అంటకట్టడం వల్ల కొందరికి భావవ్యాప్తి ప్రయోజనం కలగవచ్చేమో తప్ప మరేమీ జరగదని వారికి తెలియదనుకుందామా! కాబట్టి వచ్చిన తెలంగాణను మనం భారత ఫెడరల్ వ్యవస్థలో 29వ రాష్ట్రం గానే చూడాలి.

kalluri-sriniasreddy

సమస్యల ఆధారంగా కాకుండా ఏకంగా ప్రభుత్వ ఆర్థికనీతిపైనే కొందరు విమర్శలు చేస్తుండటం కొంత ఆశ్చర్యన్ని కలిగిస్తుంది. వీళ్లకు.. వచ్చేది భారత ఫెడరల్ రాష్ట్రమే అని, అలాంటి తెలంగాణ రాష్ట్రం దేశ ఆర్థిక నీతికి లోబడి పనిచేస్తుంది. అంతేతప్ప తనకు తాను స్వీయ ఆర్థిక నీతిని పాటించజాలదని తెలియదనుకుందామా? తెలంగాణరాష్ట్రం ఏర్పడి ఏడు నెల లు దాటింది. అది భారత ఫెడరల్ వ్యవస్థ పరిధిలో పనిచేస్తుంది. అలాగే భారత ఆర్థిక నీతిని కాదని తెలంగాణ తన సొంత ఆర్థిక నీతిని రచించుకోజాలదు. అందుకు రాజ్యాంగమే ఒప్పుకోదు. కాకపోతే, దేశ ఫెడరల్ వ్యవస్థ పరిధిలో రాష్ర్టాలకు ఉన్న వెసులుబాట్లను ఉపయోగించుకొని స్వావలంబన విధానాల ను పాటించే అవకాశాలు కొంత మేర ఉంటాయి. చంద్రబాబు కాలంలో తెలంగాణ ప్రపంచీకరణ బాధి త ప్రాంతం. ప్రపంచీకరణ దుష్పరిణామాలను తెలంగాణ ప్రాంతం అనుభవించినంతగా బహుశా దేశంలో మరే ప్రాంతం అనుభవించి ఉండకపోవచ్చు. తెలంగాణ ఉద్యమం రాజకీయకోణం తీసుకోవడానికి అది కూడా ఒక బలమైన కారణమైంది. కాబట్టి తన పరిధిలో ఉండే విధానాలతో కేసీఆర్ ప్రభుత్వం స్వావలంబనకు ప్రాధాన్యమిచ్చి పని చేస్తున్నదా లేదా అని మాత్రం ఎవరైనా చూడాల్సిందే. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ దేశ ఆర్థిక నీతినే కాదని తెలంగాణ స్వీయ ఆర్థిక నీతిని రచించుకోగలదనే రీతిలో పరోక్ష ప్రేరక విమర్శలు సరైనవి కావు.

కేసీఆర్ ప్రభుత్వం తన పరిధిలో స్వావలంబన దిశగా పనిచేస్తున్నదా లేదా చూద్దాం. కేజీ టు పీజీ ఉచి త నిర్బంధ విద్యను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తామంటున్నారు. అది దశల వారిగా మరో మూడు లేదా నాలుగేళ్లలో సంపూర్ణ అమలుకు నోచుకునే అవకాశం ఉంటది. దేశ అక్షరాస్యతలో తెలంగా ణ రాష్ట్రం 25వ స్థానంలో ఉన్నది. దేశ సగటు అక్షరాస్యత 74.04 శాతం ఉంటే, తెలంగాణ సగటు అక్షరాస్యత 66.45 శాతం ఉంది. తెలంగాణ గ్రామీణ అక్షరాస్యత మరింత అధ్వాన్నంగా 57.25 ఉన్నది. సమైక్యపాలనలో విద్యను తెలంగాణ ఏమేరకు ఆర్జించగలిగిందో పై అంకెలు చూస్తే గుండెలు తరుక్కుపోతాయి. కాబట్టి కేజీ టు పీజీ ఉచిత విద్య అనివార్యం. ఆ దిశగా విద్యను పకడ్బందీగా ప్రభుత్వమే నడపడానికి సిద్ధపడడంలో మనం స్వావలంబనను చూడవ చ్చు. ఆ పథకం ఎప్పటి వరకు అమల్లోకి వస్తుందనేది ముఖ్యం కాదు. ఈ ప్రభుత్వం విద్యాపరంగా స్వావలంబనపై దృష్టి పెడుతున్నదా లేదా అనేదే ముఖ్యం.

కాంట్రాక్టు ఉద్యోగులను రెగులరైజ్ చేయడాన్ని కూడా మనం స్వావలంబన దిశగానే చూడాలి. కొత్త ఉద్యోగాల భర్తీని కాంట్రాక్టు పద్ధతిలో కాకుండా శాశ్వ త ప్రాతిపదికన తీసుకుంటామని టీఆర్‌ఎస్ ప్రభు త్వం మాటిచ్చింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ కాంట్రాక్ట్ పద్ధతిలోనే జరగాలని గతంలోనే ఆదేశించింది. అయినా టీఆర్‌ఎస్ ప్రభుత్వం, ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను రైగులరైజ్ చేస్తూనే... కొత్త ఉద్యోగాల భర్తీ శాశ్వత పద్ధతిన భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇది కేసీఆర్ ప్రభుత్వం స్వావలంబనకు ఊతమిచ్చే మరో సాహసోపేత నిర్ణ యం.అలాగే తెలంగాణప్రభుత్వం నూతనంగా విద్యు త్ ప్లాంట్లను ప్రభుత్వ ఆధీనంలోనే (జెన్‌కో ద్వారా) స్థాపించబోతుండడమూ గొప్ప స్వావలంబనే. నల్లగొండ జిల్లా దామరచెర్లలో స్థాపించబోతున్న విద్యుత్ ప్లాంట్ దానికి ఉదాహరణ. అలాగే గోదావరి తీరం వెంట భవిష్యత్తు కాలంలో నిర్మాణంచేసే విద్యుత్ ప్లాంట్లన్నీ జెన్‌కో ఆధ్వర్యంలోనే నిర్మించనున్నామని ఈ ప్రభుత్వం అనేక సార్లు ప్రకటించింది.

ప్రభుత్వం చెరువుల నిర్మాణం (మిషన్ కాకతీయ) చేపడుతున్నది. 45 వేల చెరువులను నాలుగేళ్లలోపు దశలవారీగా పునర్నిర్మాణం చేస్తామంటున్నది. వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటిని అందించే పథకం చేపడుతున్నది. ఈ రెండు పథకాలు ప్రభుత్వ మే చేపడుతున్నది తప్ప ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పడం లేదని మనం గమనించాలి. ధ్వంసమైన చెరువులు, ఫ్లోరైడ్ నీళ్లతో అంగవైకల్యాలతో వట్టిపోయిన గ్రామాలను పునరుజ్జీవింపజేసే పై రెండు పథకాలలో స్వావలంబన తప్ప మరేమిటి? అలాగే రెండు జీవనదులలోని 1200 టీఎంసీల నీటిని తెలంగాణ పంట పొలాలకు మళ్లించే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. గ్రామీణ నిరుద్యోగానికి ఒక గొప్ప పరిష్కారం రాబోయే ప్రాజెక్టుల సాగునీరే చూపనున్నది. రేపటి తెలంగాణ వ్యవసాయమే తెలంగాణ సంపూర్ణ స్వావలంబనకు ఒక గొప్ప సాధనం కాబోతున్నది.

కోటి ఎకరాల సంపన్న తెలంగాణలో స్వావలంబన లేదందామా? ఈ రాష్ట్ర ప్రభుత్వానికున్న అధికారాల పరిధిలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రణాళికలు.. స్వావలంబన విషయంలో దేశంలోని అన్ని రాష్ర్టాల కన్నా మిన్నగా ఉన్నాయనడంలో అనుమా నం అక్కరలేదు. స్వావలంబనకు మెరుగైన ప్రాధా న్యం ఇస్తున్న రాష్ర్టాల్లో దేశంలో బహుశా తెలంగాణదే మొదటి స్థానం వుంటుంది.దేశంలోని ఏ రాష్ట్రం ఉద్యోగాల భర్తీలో కాంట్రాక్టు పద్ధతిని రద్దుచేయలేదు. కొం తమేరకైనా విద్యుత్ ప్రాజెక్టులను ప్రభుత్వాలే స్థాపిస్తున్న రాష్ర్టాలు లేవు. మూతపడిన ప్రభుత్వ కంపెనీలను నిర్దాక్షిణ్యంగా అమ్మకానికి పెడుతున్న రాష్ర్టాలు ఉన్నాయి తప్ప, ప్రజలకే అప్పగిస్తున్నవి లేవు. వాటన్నిటికి భిన్నంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో చాలామేరకు చూడగలుగుతున్నాము.

సమైక్యపాలనలో అనేక ప్రభుత్వ సంస్థలు మూతపడ్డాయి. అలాంటి సంస్థలను అమ్మేస్తామని ఈ ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీని రైతులకే అప్పగిస్తామని ఆ మధ్య సీఎం కేసీఆర్ ప్రకటించడం గమనార్హం. గత పాలకుల వలె పరిశ్రమల అమ్మకం మీద మనసు పెట్టకుం డా వాటిని పునరుజ్జీవం చేసే దిశగా ఈ ప్రభు త్వం ఆలోచిస్తున్న సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి. నిజాం షుగర్ ఫ్యాక్టరీని రైతులకే అప్పగించడం వంటి నిర్ణయాలు తెలంగాణ పునరుజ్జీవ స్వావలంబనగానే చూడాలి. సాధ్యమైనంత వరకు ప్రైవేటును తరిమేసి స్వావలంబన సాధించే పనులు ఈ ప్రభుత్వం ఎన్ని చేస్తున్నా లక్షలాది నిరుద్యోగులకు చూపే మార్గం ఏమిటనే ప్రశ్న ఈ ప్రభుత్వం ముందు ఉండనే ఉన్నది.

తెలంగాణ రాష్ట్ర జనాభా 3.63 కోట్లు. ఉద్యోగాల కోసం వేచిచూస్తున్న నిరుద్యోగులు లక్షల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గరిష్ఠంగా లక్షా యాభైవేల వరకు ఉద్యోగాలు భర్తీ చేయవచ్చు. మరి మిగిలే లక్షలాదిమంది నిరుద్యోగుల సంగతేమిటి? సేవా రంగంలోకి పారిశ్రామిక రంగంలోకి పెట్టుబడులను ఆహ్వానిస్తేగానీ వారికి ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది. అలాంటపుడు.. ఈ ప్రభుత్వం పెట్టుబడులను ఆహ్వానించడం తప్ప మరేదైనా మార్గం ఉన్నదా? వారికి భూమి లాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుం డా ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి వస్తారా? కాబట్టి ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని ఏమని తప్పు పట్టగలం? గరిష్ఠంగా 200 కోట్ల పెట్టుబడి పెట్టే పరిశ్రమ కనీసం వెయ్యి మందికి ఉపా ధి కల్పించాలని తెలంగాణ పారిశ్రామిక విధానంలో కచ్చితమైన నిబంధన పెట్టారు. కాబట్టి దాని లక్ష్యం ప్రభుత్వానికి పన్ను ఆదాయమే కాకుండా ఉద్యోగాల ప్రాధాన్యం ఉన్నదని మనం గమనించాలి.

రాజకీయ విమర్శలు సహజమే. కానీ కొందరు సైద్ధాంతిక విమర్శలు చేస్తున్నారు. దేశం ప్రపంచీకరణ పాలై 25 ఏళ్లు గడిచిపోయాయి. తిరిగి వెనక్కి రాలేనంత దూరం వెళ్లిపోయింది. పెట్టుబడిదారీ విధానం లేనిదే బతకలేమనే దైన్య స్థితిలోకి ప్రపంచమే జారిపోయింది. పాత వ్యవస్థలోని బతుకులను ధ్వంసం చేసి, కొత్త వ్యవస్థలో పోటీ బతుకులను నిర్మాణం చేసింది. అలాంటి వ్యవస్థలో కూరుకుపోయిన ఈ దేశంలో తెలంగాణ వంటి రాష్ట్రం తనకున్న అధికారాల పరిధిలో అయినా స్వావలంబన దిశగా పని చేస్తున్నదా లేదా చూడాలి. కానీ తెలంగాణ పాలకులనే టార్గెట్ చేస్తూ సైద్ధాంతిక విమర్శలు చేస్తే అర్థం ఉండదు. తెలంగాణ మొదటిసారి రాజకీయ స్వావలంబనను సాధించుకోగలిగింది. ఇక సాధించుకోవలసింది ఆర్థిక స్వావలంబనే. అయితే తెలంగాణ స్వావలంబన విషయంలో గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం తనకున్న అధికారాల పరిధిలో ఎంతోమెరుగ్గా పనిచేస్తున్నదనే విషయాన్ని సైద్ధాంతిక విమర్శకులు గుర్తించాలి.

తెలంగాణ ప్రభుత్వ పరిధిలో సాధ్యమయ్యే స్వావలంబనకు ఎక్కడైనా అనర్థం జరుగుతుంటే, విమర్శించే హక్కును సైద్ధాంతికులు సద్వినియోగం చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఢిల్లీ పాలకులపై చేయాల్సిన విమర్శలను తెలంగాణ రాష్ట్ర పాలకులపై చేయడం సరికాదు. అలాంటి విమర్శలు సాధించుకున్న తెలంగాణ రాజకీయ స్వావలంబనను భగ్నం చేసి, తిరిగి ఆంధ్రా అజమాయిషీ రాజకీయాలను తెలంగాణలో ప్రతిష్టించడానికి, అవి తెలంగాణను మరోసారి కొల్లగొట్టడానికి ఉపయోగపడతాయనే విషయాన్ని సైద్ధాంతిక విమర్శకులు గుర్తించాలి. వచ్చిన తెలంగాణను మరోసారి విఫల తెలంగాణ చేయాలనే సీమాంధ్ర పెట్టుబడిదారుల కుట్రలు ఓవైపు కొనసాగుతున్నాయి. సైద్ధాంతికుల ఉద్దేశం ఏమైనా కావచ్చు, కానీ వారి విమర్శలు ఎవరికి ఉపయోగపడతాయనేదే తెలంగాణ ఆత్మ గమనిస్తుంది.

1139

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ