పునరుజ్జీవానికి ‘ఆసరా’


Sun,January 4, 2015 01:57 AM

డిసెంబర్10 నుంచి ఆసరా వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ కొనసాగుతున్నది. 24.21 లక్షల లబ్ధిదారులను గుర్తించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అర్హులైనవారు ఎవరైనా గుర్తింపు పొందనట్లయితే తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. అంతేకాదు, అర్హులైన వారిని గుర్తించడమనేది నిరంతర ప్రక్రియ అని కూడా ప్రకటించింది. నిజానికి అర్హులైనవారు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.

తెలంగాణ వ్యవసాయం, వృత్తులు విధ్వంసం బాట పట్టి చాలా కాలమైంది. కుటుంబాలను నడపాల్సిన వారు పట్నాల బాట పట్టారు. వృద్ధులైన తల్లిదండ్రులను గ్రామాల్లోనే వదిలేశారు. విధ్వంసం తర్వాత స్మశానప్రశాంతతలో ఇవాళ తెలంగాణ గ్రామాలున్నాయి.

పాతగోడలు, కూలిన ఇండ్లు, 60ఏళ్లు పైబడి న వృద్ధులు, వికలాంగులు మాత్రమే గ్రామాల్లో కనిపిస్తున్నారు. చాలామేరకు కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. మానవ సంబంధాలు దిగజారాయి. కొందరు కొడుకులు ఆర్థికంగా బలహీనులై తల్లిదండ్రులను చూడలేకపోవచ్చు. కానీ మరికొందరు ఆర్థికంగా ఎదిగినా తల్లిదండ్రులను చూడని వారే ఈ కాలంలో ఎక్కువ అంటే తప్పుకాదు. ఇలా మానవసంబంధాలు దిగజారి తెలంగాణ గ్రామాల్లో ఒంటరులైన వృద్ధులే ఎక్కువ. వారందరూ ఆసరా పథకానికి అర్హులే. తెలంగాణ పునరుజ్జీవనానికి, మానవ సంబంధాల పునరుద్ధరణకు ఆసరా అవసరం, అనివార్యం. వృద్ధులు, వికలాంగుల కళ్లల్లో ఇవాళ మళ్లీ ఆనందభాష్పాలు తెస్తున్నది ఆసరా.

డిసెంబర్10 నుంచి ఆసరా వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ కొనసాగుతున్నది. 24.21 లక్షల లబ్ధిదారులను గుర్తించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అర్హులైనవారు ఎవరై నా గుర్తింపు పొందనట్లయితే తిరిగి దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. అంతేకాదు, అర్హులైన వారిని గుర్తించడమనేది నిరంతర ప్రక్రియ అని కూడా ప్రకటించింది. నిజానికి అర్హులైనవారు ఎవరూ భయపడాల్సిన అవస రం లేదు. ఇప్పటికే ఆసరా గుర్తింపు పొందిన వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత కార్మికులు, వికలాంగుల ముఖాల్లో ఆనందం కనిపిస్తున్నది. తమ బతుకులకు ఒక భద్రత ఏర్పడిందనే భరోసా వారి కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తున్నది.

ఇలాంటి లబ్ధిదారుల ఆనందాలపై ఆంధ్రా మాధ్యమాలు ఎన్నడైనా వార్తలుగానీ, కథనాలుగానీ రాశాయా? చూపించాయా? కానీ అందుకు భిన్నమైన వార్తలను మాత్రం కుమ్మరిస్తూనే ఉన్నాయి. ఫలా నా గ్రామంలో వృద్ధురాలికి వచ్చే 200 రూపాయల పింఛన్‌తో నలుగురు సభ్యులు గల కుటుంబం బతికేది. ఇపుడు పెన్షన్ రాదేమోననే బెంగతో ఆ వృద్ధురాలి గుండె ఆగిపోయింది అనే పడికట్టు వార్తలు కొంత కాలంగా కొన్ని ఆంధ్రా పత్రికల్లో, టీవీ ఛానళ్లలో చూస్తున్నాం.

అబద్ధం చెప్పినా అది అతికినట్లు ఉండాలంటారు పెద్దలు. ఒక వృద్ధురాలి నెల వారి వచ్చే రూ.200లతో ఒక కుటుంబం బతికేది అని రాస్తే ఎవరైనా నమ్మగలరా? పింఛన్ బెంగతో అక్కడక్కడా కొన్ని అరకొర ఘటనలు జరిగి ఉండవచ్చు. కానీ ఏ వృద్ధుడు, ఏ వృద్ధురాలి మరణానికి కారణం ఏదైనా, పింఛన్ బెంగ అనే టాగ్ తగిలించి రాయడం చూస్తే.. ఆంధ్రా మాధ్యమాల బరితెగింపు స్పష్టంగా కనిపిస్తున్నది. ఒక రాష్ట్ర డిమాండ్ సాకారమైన వేళ కొన్ని ఆంధ్రా మాధ్యమాలు కడుపు మంట రాతలతో ప్రజలను కలవరపర్చడం మంచి పరిణా మం కాదు.
సమగ్ర కుటుంబ సర్వే జరిపినపుడు, పింఛన్, ఆహార భద్రత దరఖాస్తులు స్వీకరించినపుడు కూడా అదే మీడియా రకరకాల విపరీత కథనాలతో ప్రజలను అభద్ర తా భావానికి గురిచేసింది.

పెన్షన్ రద్దవుతదని, రేషన్‌కార్డు రద్దవుతదనే అభద్రతను పేద, మధ్య తరగతి ప్రజలకు కల్పించాయి. అదే ఒరవడిని ఆసరా పథకంపై కూడా కొనసాగిస్తున్నాయి. పెన్షన్ గుర్తింపు లభించని అర్హులు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చ ని స్వయాన ప్రభుత్వమే ప్రకటించాక ఏమాత్రం అభద్రతా భావానికి లోను కావలసిన అవసరం లేనప్పుడు కూడా.. పెన్షన్ బెంగ టాగ్‌తో కొన్ని ఆంధ్రా మాధ్యమాలలో వార్తలు వస్తుండడం మాత్రం ఆగకపోవడం గమనార్హం.

ఆసరా పథకం పట్ల ఆంధ్రా మాధ్యమాల విపరీతాలను కొద్దిసేపు పక్కన పెడితే.. ప్రభుత్వోద్యోగుల అలసత్వాలు, అవినీతి అలవాట్లు కూడా కొంతమేర అర్హులైన వారికి అన్యాయం చేసివుంటాయి. ఉమ్మడి రాష్ట్రంలో పాటించిన అలసత్వం, నిర్లక్ష్యాలను ఉద్యోగులు కొత్త రాష్ట్రంలోనూ కొనసాగిస్తున్నారేమో అనిపిస్తున్నది.అలాగే, లక్షలాది లబ్ధిదారులను గుర్తించి పంపిణీ చేయడంలో కొన్ని పొరపాట్లు జరగడం కూడా సహజమే. అలాగే, ఉద్యోగుల విభజన పూర్తి కానుందున ఉద్యోగుల కొరత కూడా పొరపాట్లకు కొంత కారణమైవుంటది. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులనే నమ్ముకొని పనిచేస్తున్నది.

తెలంగాణ రాష్ట్రసాధన కోసం పోరాడిన ఉద్యోగులు రాష్ట్రం వచ్చాక మరింత చిత్తశుద్ధితో మనసు పెట్టి పని చేస్తారని ప్రజలు కూడా ఆశించారు, ఆశిస్తున్నారు. ఉద్యోగులు మరింత పట్టుదలతో పని చేయాలని కేసీఆర్ ప్రభుత్వం ప్రోత్సాహకంగా తెలంగాణ ఇంక్రిమెంట్‌కూడా ఇచ్చింది. ఉద్యోగులలో చాలామేరకు చిత్తశుద్ధతో పనిచేస్తున్న వారు ఉండి వుంటారు. కానీ పాత పద్ధతుల్లోనే పనిచేసేవారు కూడా వుండి వుంటారు. కొత్త రాష్ట్రంతో పాటు ఉద్యోగులలో మౌలిక మార్పును కూడా ప్రజలు ఆశిస్తారని ఎవరూ మర్చిపోవద్దు. అలాంటి మౌలిక మార్పు వచ్చి ఉంటే అర్హులైన పెన్షనర్లు ఇంకా మిగిలేవారు కారేమో! ఇంత పెద్ద పథకంలో కొన్ని పొరపాట్లు సహజమే. కానీ చివరి అర్హుడి వరకూ అన్యాయం జరగకుండా చూడాల్సి బాధ్యత కూడా ఉద్యోగులదేనని ఇప్పటికైనా వారు మర్చిపోవద్దు. కాబట్టి పెన్షన్లకు అర్హులను గుర్తించడంలో ఉద్యోగులు ఎవరకీ అన్యాయం జరగకుండా చూసుకోగలగాలి.

గత ప్రభుత్వం పెన్షన్ల కోసం సాలీనా 881 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం 3350 కోట్లు ఖర్చు చేస్తున్నది. గతంలో సుమారు 31 లక్షల పెన్షన్‌దారులు ఉన్నారు. ఇపుడు ఈ ప్రభుత్వం ఇప్పటికే 24.21 లక్షల లబ్ధిదారులను గుర్తించి పంపిణీ చేస్తున్నది. ఇంకా అర్హులైన వారు మళ్లీ దరాఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం చెపుతున్నది.

నిరంతరం కొనసాగే ఈ ప్రక్రియను బట్టి చూస్తే పెన్షన్‌దారుల సంఖ్య 31లక్షలు దాటే అవకాశం ఉన్నది. ఆ విధంగా గత ప్రభుత్వంలోని లబ్ధిదారుల సంఖ్యను దాటే అవకాశం ఉంది. నిజానికి గత ప్రభుత్వం సుమా రు 15 శాతం వరకు అనర్హులకు సైతం పెన్షన్ పంపిణీ చేసింది. 35ఏళ్ల యువకులకు, సంపన్న వృద్ధులకు కూడా పెన్షన్లు ఇచ్చిన ఉందంతాలున్నాయి. అలాగే, అర్హులైనా కూడా పెన్షన్ లభించక అన్యాయానికి గురైన వారూ ఉన్నారు. వారంతా ఇప్పు డు ఈ ప్రభుత్వ హయాంలో పెన్షన్‌కు దరఖాస్తు చేసుకొని గుర్తింపు పొందుతున్నా రు. టూకీగా చెప్పాలంటే గత ప్రభుత్వ కాలంలోని అనర్హులు ఇప్పుడు తొలగిపో యి, గత ప్రభుత్వంలో అన్యాయానికి గురైన అర్హులు ఇప్పుడు పెన్షన్ పొందగలుగుతున్నారు.

గత ప్రభుత్వం సాలీనా పెన్షన్లకు 881 కోట్లు.. 31 లక్షల మంది లబ్ధిదారులకు వెచ్చిస్తే, ఈ ప్రభుత్వం సాలీనా పెన్షన్లకు సుమారు 3800 కోట్లు.. 31లక్షలకు పైగా లబ్ధిదారులకు వెచ్చించనున్నది. గత ప్రభుత్వం కంటే, నాలుగింతలకు పైగా నిధులు కేటాయించి, గత ప్రభుత్వ కాలంలోని లబ్ధి దారుల సంఖ్యకు మించి 31 లక్షల మందికి వెచ్చించబోతుంటే, అర్హుడైన ఏ ఒక్క వృద్ధుడుగానీ, వృద్ధురాలుగానీ, వికలాంగుడుగానీ, చేనేత, గీత కార్మికుడుగానీ బెంగ పడాల్సిన అవసరం లేదు.

దేశంలో తెలంగాణ ఆసరా పథకమే అతి పెద్దది. మధ్యప్రదేశ్‌లో వృద్ధులకు పెన్షన్ రూ.275, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లలో 300,యూపీలో 400, గుజరాత్, బెంగాల్‌లో 400, కర్ణాటక, రాజస్థాన్‌లో 500 రూపాయలు ఇస్తున్నారు. అయితే తమిళనాడు, కేరళ, ఏపీలో వృద్ధులకు వెయ్యి రూపాయలు ఇచ్చినా.. వికలాంగులకు కూడా వెయ్యి రూపాయలే ఇస్తున్నారు. కానీ తెలంగాణలో వృద్ధులకు, వికలాంగులకు 1000 ఇస్తూనే, వికలాంగులకు 1500 రూపాయలిస్తున్నారు. ఆ విధంగా దేశంలో వృద్ధాప్య పెన్షన్ పథకం తెలంగాణదే మొదటి స్థానం. దేశంలోనే ఒక పెద్ద పథకాన్ని అమలుచేస్తున్నా తెలంగాణ ప్రభుత్వానికి గొప్ప పేరు రావలసింది పోయి, కొన్ని ఆంధ్రా మాధ్యమాలు తమ రాతలతో వక్రీకరణలకు పాల్పడుతూ అపకీర్తి తెచ్చే కుయుక్తులు నడుపుతండడం దురదృష్టకరం. అలాగే ఉద్యోగుల కొరత, కొంతమేర ఉద్యోగుల అలసత్వాలు వెరసి 3800 కోట్లు, 30లక్షలకు పైగా లబ్ధిదారులకు వెచ్చిస్తున్న ఆసరా వంటి ఒక అద్భుత పథకం ద్వారా ప్రభుత్వానికి దక్కాల్సినంత కీర్తిని దక్కకుండా పోతున్నదని చెప్పాలి.

విధ్వంసమైన తెలంగాణకు ఆసరా పథకం పునరుజ్జీవం లాంటిది. దానికి దక్కాల్సినంత కీర్తి దక్కించుకోవడం ప్రభుత్వంలో ఉన్నవారి బాధ్యత మాత్రమే కాదు, యావత్ తెలంగాణ సమాజం బాధ్యత కూడా. ఆసరా పథకం ద్వారా లబ్ధిపొందుతున్న సుమారు 30 లక్షల మంది హృదయాల్లో ఉన్న సంతోషాన్ని, సంతృప్తిని చాటుకోగలిగే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపాలి. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకొని పథకాల విజయాలను ప్రచారంలో పెట్టాల్సిన అవసరాన్ని ఆసరా వంటి పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గుర్తుచేస్తున్నాయని చెప్పాలి.

796

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ        


Featured Articles