ప్రత్యేక హోదానే పరిష్కారం


Wed,December 17, 2014 01:24 AM

ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ యాత్రలో ప్రధానితో సహా మంత్రులను కలిసినప్పటి నుంచి తెలంగాణ పట్ల కేంద్ర పాలకుల్లో కొంత సానుకూలత కనిపిస్త్తున్నది. వెంకయ్య నాయుడు కూడా కేసీఆర్‌లో విజనరీ పాలకుడిని చూడగలగాలి. తెలంగాణకు జరగాల్సిన న్యాయాల కోసం విభజన చట్టాన్ని సవరించాలి. అంతకుమించి తెలంగాణకు జరిగిన చారిత్రక అన్యాయాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణకు పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇప్పించాలి

తెలంగాణ కోరుకుంటున్న రెండు వార్తలు ఈ మధ్య వెలువడ్డాయి. 1) ఏపీ పునర్విభజన చట్టాన్ని మార్చాల్సి న అవసరం ఉందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించ డం. 2)లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టు తెలంగాణదే అని కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో రాత పూర్వకంగా వెల్లడించడం. అయితే దాని అమలు విషయం మాత్రం ఇంకా వెల్లడికాలేదు. దానిపై పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి మళ్లీ ఏ మాయ చేస్తాడో చూడాలి. ఇకపోతే వెంకయ్య నాయుడు పడికట్టు వ్యాఖ్యలకు పెట్టిందిపేరని అందరికీ తెలుసు. విభజ న చట్టంపై ఆయన చేసిన వ్యాఖ్యలలోనూ ఆ విష యం కనిపిస్తుంది.

విభజన చట్టాన్ని ఆదరాబాదరా గా రూపొందించారని ఆయన పరోక్షంగా కాంగ్రెస్‌ను టార్గెట్ చేసి మాట్లాడారు. అలాగే మరికొన్ని నిజమై న లొసుగుల గురించి చెప్పారు. తెలంగాణ శాసన మండలిలో ఎంతమంది సభ్యులుండాలో, ఆంధ్రా మండలిలో ఎంతమంది ఉండాలో విభజన చట్టం లో సరిగా వివరించలేదు. అలాగే రాజ్యసభ సభ్యుల ను తెలంగాణకు చెందిన కేశవరావును ఆంధ్రాకు, ఆంధ్రాకు చెందిన కేవీపీని తెలంగాణకు కేటాయించడాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే వెంకయ్యనాయుడు విభజన చట్టంలో లొసుగుల గురించి మాత్ర మే మాట్లాడుతున్నరు. కానీ.. అదే విభజన చట్టంలో తెలంగాణకు కొన్ని అన్యాయాలు కూడా ఉన్నట్టు ఆయన గుర్తించివుంటే బాగుండేది.

విభజన చట్టం రూపకల్పన పూర్తిగా కాంగ్రెస్ మాత్రమే చేసిందనడంలో నిజం లేదు. దానికి మద్దతిచ్చిన బీజేపీ పరోక్ష ప్రభావం కూడా ఉందని మర్చిపోకూడదు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని కోసమే కాకుండా, ఇతర రంగాలకూ ప్రత్యేక ప్యాకేజీని విభజన చట్టంలో పెట్టించడంలో వెంకయ్య పాత్రను ఎవరూ కాదనలేరు. కానీ అదే సమయంలో ఆరు దశాబ్దాలు జీవనదుల నీటికోసం అల్లాడుతున్న తెలంగాణలోని ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా పెట్టించలేకపోయారు.

నిజానికి ఆరు దశాబ్దాలు తెలంగాణకు చెందిన నీళ్లు, నిధులు సీమాంధ్రకు మళ్లించబడినాయి. ఆంధ్రప్రదేశ్‌కే జాతీయ ప్రాజెక్టు, ప్రత్యేక ప్యాకేజీలు, ప్రత్యేక హోదా కల్పించి, అన్యాయం జరిగిన తెలంగాణకు మొండిచెయ్యి చూపడం విభజన చట్టంలో ఉన్న పెద్ద లొసుగు. శాసనమండలి సభ్యు ల సంఖ్యపై సరైన వివరణ లేకపోవడం, రాజ్యసభ సభ్యుల ప్రాంత కేటాయింపుల్లో ఏర్పడిన లొసుగులు మరో నాలుగేళ్లు పోతే వాటంతట అవే సరైపో తాయి. కానీ దశాబ్దాల పాటు అన్యాయాలకు గురైన తెలంగాణకు విభజన చట్టంలో పూర్తి న్యాయం జరగపోతే, అవి శాశ్వత అన్యాయాలుగానే మిగిలిపోతాయని వెంకయ్యకు తెలియదనుకుందామా?

విభజన చట్టంలో లొసుగులను తొలగించాలనుకున్నపుడు, వాటితో పాటు తెలంగాణకు జరిగిన అన్యాయాలను కూడా తొలగించాలి. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడానికి ఆ మధ్య కేంద్ర మంత్రి ఉమాభారతి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాటిచ్చారు. దాని అమలు బాధ్యత వెంకయ్యపై ఉన్నది.
ఉమ్మడి ఉన్నతవిద్యపై ఉన్న లొసుగులను కూడా తొలగించాలి. తెలంగాణలో ఉన్న ఉన్నత విద్యాలయాల్లో సీమాంధ్ర విద్యార్థులు చదువుకోవడానికి ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ, వారి ఫీజు రీయింబర్స్‌మెంటును తెలంగాణ ప్రజలే భరించాలనడం సరికాదు.

దీనిపై విభజన చట్టంలో వివరణ ఇవ్వా లి, సవరణ తేవాలి. దశాబ్దాల పాటు ముల్కీ నిబంధనలను, రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించారు. ఇప్పటికీ దానిపై విభజన చట్టంలో వివరణ ఇవ్వకుం డా, పదేళ్లపాటు సీమాంధ్ర విద్యార్థుల ఫీజులను తెలంగాణ ప్రజలే భరించాలని చెప్పడానికి మించిన అన్యాయం ఇంకేముంటుంది? సీమాంధ్ర విద్యార్థు ల ఫీజులు తాము చెల్లిస్తామని ఆమధ్య ఏపీ ముఖ్యమంత్రి గాంభీర్యంగా ప్రకటించారు. కానీ ఎవరు సీమాంధ్ర విద్యార్థి అని గుర్తించాలో చంద్రబాబు చెప్పలేదు.

అంటే సీమాంధ్ర విద్యార్థుల ఫీజులు కడతామనడం ప్రచారం చేసుకోవడానికే! కాబట్టి విద్యార్థుల స్థానికతను గుర్తించడానికి విభజన చట్టంలో సవరణ తేవాలి. ఉద్యోగుల పంపకంలోనూ విభజన చట్టం మరోసారి అన్యాయమే చేసింది. స్థానికతను లెక్కించకుండా జనాభా ఆధారంగా ఉద్యోగుల పంప కం చేపట్టాలని చట్టంలో పెట్టారు. దీన్ని సవరిస్తేనే తెలంగాణ నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది.

ఆస్తులు-అప్పుల పంపకంలోనూ తెలంగాణకు చట్టంలో అన్యాయమే ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పులు ఎక్కడ వెచ్చించారో అక్కడి ప్రాంతానికే ఆ అప్పులు చెందాలని తెలంగాణ కోరుతూ వచ్చింది. కానీ ఆస్తులు-అప్పుల పంపకం జనాభా ప్రాతిపదికన జరుగుతుందని చట్టంలో పెట్టారు. సీమాంధ్రలో పవర్ ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు, ఓడరేవుల కు అప్పులు వెచ్చించి, వాటిని జనాభా ఆధారంగా తెలంగాణకు పంచడంలో న్యాయం ఉందా? ఆర్థిక నిపుణులు చెబుతున్న లెక్కల ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నుంచి ప్రభుత్వం పొందిన రెవెన్యూ ఆదాయం సుమారు 55 శాతం. కానీ, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నీటిపారుదలకు 20 శాతం, విద్యుత్‌కు 30 శాతం, పేదరిక నిర్మూలన పథకాలకు 35 శాతం మాత్రమే ఖర్చు చేశారు.

ఆ విధంగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధికి వెచ్చించిన సరాసరి 29 శాతం మాత్రమే. 55 శాతం ఆదాయం ఇచ్చిన తెలంగాణకు అభివృద్ధి లో 29 శాతం వెచ్చించి, అప్పులను 42 శాతం అంటగట్టడం ఏమేరకు న్యాయమో కేంద్ర పాలకులు ఆలోచించాలి. కాబట్టి ఆస్తులు-అప్పుల పంపకాన్ని జనాభా ప్రాతిపదికన కాకుండా, అప్పులు ఏ ప్రాంతంలో వెచ్చిస్తే ఆ ప్రాంతానికే చెందేట్లు విభజన చట్టంలో సవరణ చేసి తెలంగాణకు న్యాయం చేయా లి. అలాగే, ఉమ్మడి రాష్ట్రంలో నిధుల మళ్లింపుతో తెలంగాణ 4.10లక్షల కోట్లు నష్టపోయిందని నిపుణుల అంచనా. ఉమ్మడి రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ సాగునీటి కొరతతో మరో రూ.4.53లక్షల కోట్లు నష్టపోయిందని అంచనా. కొల్లగొట్టిన ఉద్యోగాలను లెక్కిస్తే దాని నష్టం లక్షల కోట్లలోనే ఉం టుం ది. ఇలా చారిత్రక నష్టాలకు విభజన చట్టంలో ఎక్కడా పరిష్కారం చూపించింది లేదు.

విభజన చట్టంలో ఏపీతోపాటు, తెలంగాణకు కొన్ని అంశాల్లో మాత్రమే కంటితుడుపు లాంటి అరకొర ప్యాకేజీ ఇచ్చారు. పారిశ్రామిక అభివృద్ధికి పన్ను ప్రోత్సాహకాలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర సహాయం చేస్తుందని చెప్పారు. కానీ రెండు జీవిత కాలాల అభివృద్ధిని కోల్పోయిన తెలంగాణకు ఆ సహాయం మూతికి అందేది కాదు, న్యాయం జరిగేది కాదు. కాబట్టి తెలంగాణకు ప్రత్యేక హోదా కల్పిస్తేగానీఈ ప్రాంతానికి జరిగిన చారిత్రక నష్టాలను తగ్గించలేరు.

ఎలాంటి వివాదాలు లేని, సీమాంధ్రతో సరిహద్దులు లేని తెలంగాణలో ప్రవహించే గోదావరి నదిపై పెట్టిన యాజమాన్య బోర్డును రద్దు చేయాలి. ఇప్పటికే వివాదంలేని ప్రాణహిత-చేవెళ్ల, కాంతనపల్లి ప్రాజెక్టులను అడ్డుకోవాలని చంద్రబాబు గోదావరి యాజమాన్యబోర్డుకు లేఖ రాసిండు. ఏపీ రాష్ర్టానికి తెలంగాణలోని ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు ఏమై నా సంబంధం ఉన్నదా? కృష్టా నీటిని ఎలాగూ దోపి డీ చేస్తూనే ఉన్నారు. ఎలాంటి వివాదం లేని గోదావరి నది నీటిని కూడా తెలంగాణ రాష్ట్రం వాడుకోకుండా అడ్డపడుతున్న పక్క రాష్ట్ర పాలకుడి దుర్నీతి మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నది.

కాబట్టి తెలంగాణను ఇబ్బంది పెట్టాలనే పక్కరాష్ట్ర పాలకుడి దురుద్దేశానికి ఉపయోగపడడం తప్ప ఎలాంటి అర్థంలేని గోదావరి నది యాజమాన్య బోర్డును రద్దు చేయాలి. అందుకు విభజన చట్టంలో సవరణ తేవాలి. వెంకయ్యనాయుడుకు విభజన చట్టంలో కనిపించిన లొసుగులు సవరించాల్సిన అవసరం లేదని కాదు, కానీ అదే చట్టంలో తెలంగాణకు శాశ్వత అన్యాయా లు కూడా ఉన్నాయని ఆయన గుర్తించాలి. ఉన్నత విద్యలో విద్యార్థుల స్థానికతను గుర్తించడం, ఉద్యోగుల పంపకం జనాభా ప్రాతిపదికన కాకుండా స్థానికత అధారంగా, గోదావరినదిపై బోర్డు రద్దు లాంటి వి..విభజన చట్టంలో సవరణలు తెచ్చి తెలంగాణకు న్యాయం చేయొచ్చు. అలాగే చారిత్రకంగా నీళ్లు, నిధుల మళ్లింపుల వల్ల జరిగిన నష్టాలకు పరిష్కారం గా ప్రత్యేక హోదా తెలంగాణకు కల్పించి న్యాయం చేయొచ్చు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ యాత్రలో ప్రధానితో సహా మంత్రులను కలిసినప్పటి నుంచి తెలంగాణ పట్ల కేంద్ర పాలకుల్లో కొంత సానుకూలత కనిపిస్త్తున్నది. కేసీఆర్ బలమైన విజన్ కలిగిన పాలకుడుగా ప్రధాని మోదీ సహా ఉమాభారతి, రాజ్‌నాథ్‌సింగ్, రవిశంకర్‌ప్రసాద్, పీయూష్‌గోయల్, అరుణ్‌జైట్లీ లాంటి మంత్రులు సైతం గుర్తించారని అనిపిస్తున్న ది. వెంకయ్య నాయుడు కూడా కేసీఆర్‌లో విజనరీ పాలకుడిని చూడగలగాలి. తెలంగాణకు జరగాల్సిన న్యాయాల కోసం విభజన చట్టాన్ని సవరించాలి. అంతకుమించి తెలంగాణకు జరిగిన చారిత్రక అన్యాయాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణకు పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇప్పించాలి

1427

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ        


country oven

Featured Articles