నదుల'అనుసంధానం' అనర్థదాయకం


Wed,December 10, 2014 01:43 AM

ఇప్పటికే ఆరు దశాబ్దాలు నీటి కోసం తెలంగాణ తల్లడిల్లింది. జీవనదుల నీరు దొరకక ఫ్లోరైడ్ నీరే తాగింది. పంట పొలాలకు దిక్కులేకుండా పోయింది. నీరు లేని వ్యవసాయం దండగైపోయింది. సకల దరిద్రాలకు నీటి కొరతే కారణం. ఆ నీటి కోసమే తెలంగాణ రాష్ట్రం కోరాం. కానీ ఏ గోదావరిపై ఆశలు పెట్టుకొని తెచ్చుకున్నామో, ఆ నీటినే అనుసంధానం తన్నుకుపోనుందా? మళ్లీ మన నీళ్లను కృష్ణానదికి అనుసంధానంచేసి సీమాంధ్రకు అందిస్తామంటుంటే గుండె తరుక్కుపోదా?

ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ యాత్ర కొత్త అశలను తెచ్చింది. ప్రధాని-ముఖ్యమంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి అభిప్రాయాలకు ప్రధాని మోదీ ఆకర్శితుడయ్యారని జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. కేసీఆర్ ఒక బలమైన విజనరీ పాలకుడని మోదీకి అర్థమై ఉంటుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి మాత్రమే కాదు, అంతకు మించి ఒక డిప్లమాటిక్ లీడ ర్ అని ఆయన ఢిల్లీ యాత్ర చాలా స్పష్టంగా రుజువు చేసింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా జలవనరుల మంత్రి ఉమాభారతిని ఒప్పించడం, అందుకు ఆమె అంగీకరించడం, మిషన్ కాకతీయ గురించి ఆమె తెలుసుకొని దాని ప్రారంభోత్సవానికి వస్తానని హామీ ఇవ్వ డం. ఇవన్నీ కేసీఆర్‌లోని డిప్లమాటిక్ నాయకత్వా న్ని తెలియజేస్తాయి. వైరుధ్యాలను సైతం సమయోచితంగా ఎదుర్కొని విజయాలు సాధించడంలో కేసీఆర్‌కు కేసీఆరే సాటి అని చెప్పాలి. వచ్చిన తెలంగాణకు ఆయన డిప్లమాటిక్ వ్యవహార శైలి తెలంగాణకు కొండంత అండ అనడంలో అనుమానం లేదు.

అయితే కేంద్రం మరోసారి నదుల అనుసంధా నం చేపడుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఉత్తరాది నదుల అనుసంధానానికి హిమాలయ నదుల అభివృద్ధి అనే పేరుతో, దక్షిణాది నదుల అనుసంధానానికి ద్వీపకల్ప నదుల అభివృద్ధి అనే పేరున చేపడుతున్నది. ముందుగా దక్షిణాది నదుల అనుసంధానాన్ని మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దక్షిణాది ప్రధాన నదులైన మహానది (ఒడిశా), గోదావరి (తెలంగాణ)లో మిగు లు జలాలున్నట్లు కేంద్ర జలవనరుల శాఖ భావిస్తున్నది.ఈ మిగులు జలాలను కృష్ణా, కావేరీలకు మళ్లిం చి అనుసంధానం చేయాలనుకుంటున్నది.

మహా నదిలో సుమారు 360 టీఎంసీలు, గోదావరిలో 530 టీఎంసీలు మిగులు జలాలున్నాయని జలవనరుల శాఖ వాదన. గోదావరి నీటిని ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్(కృష్ణా)కు, ఇచ్చంపల్లి నుంచి పులిచింతల ప్రాజెక్టు(కృష్ణా)కు తరలించాలని ఆ శాఖ ప్రతిపాదనగా తెలుస్తోంది. అయితే కేంద్ర నిర్ణయా న్ని ఏపీ, తమిళనాడు సమర్థిస్తుండగా.. తెలంగాణ, ఒడిశా రాష్టాలు వ్యతిరేకిస్తున్నాయి.

నిజంగానే తెలంగాణ గోదావరిలో మిగులు జలాలున్నాయా? ఒకవేళ ఉన్నా ఎప్పుడో 15 ఏళ్ల క్రితం 75శాతం డిపెండెబిలిటీ ఆధారంగా లెక్కించిన మిగు లు జలాలు ఉంటే, ఇవాళ వాటికి అర్థంలేదు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, నిర్మించాల్సిన ప్రాజెక్టులు పూర్తయితే గోదావరిలో తెలంగాణకు కేటాయించిన 912టీఎంసీల నికర జలాలే సరిపోయే అవకాశం లేదు. ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన చెరువుల పునర్ని ర్మాణం, వాటర్‌గ్రిడ్‌లు నికర జలాలతోపాటు, వర ద జలాలపై అధారపడక తప్పదు. కాబట్టి మిగులు జలాలంటూ చుక్క నీరు మిగులదు. ఒకవేళ తెలంగాణ రాష్ట్ర పరిధిలో మాత్రమే నదులను అనుసంధనం చేస్తామంటే ఎవరికీ అభ్యంతరం లేదు. అలాకాకుండా తెలంగాణ నుంచి ఇతర రాష్ర్టాలకు గోదావరి మిగులు జలాల పేర నికర జలాలను తరలిస్తే తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితిలో అంగీకరించరు.

బచావత్ ట్రిబ్యునల్ చేసిన పంపకాల్లో తెలంగాణ గోదావరిలో మిగులు జలాలున్నట్లు లేదు. కాకపోతే, ప్రతి ఏటా జూన్- అక్టోబర్ మధ్య కాలంలో వచ్చే వరదలను దృష్టిలో ఉంచుకొని వాటినే మిగులు జలాలుగా పరిగణిస్తున్నారేమో తెలియదు. అయినా మిగులు జలాలు వేరు. వరద జలాలు వేరు. మిగు లు జలాలకు డిపెండెబిలిటీ ఉంటది. కానీ వరద జలాలకు డిపెండెబిలిటీ ఉండదు. ఏటా భారీ వర్షాలతో వరదలు రావచ్చు రాకపోవచ్చు. అలాంటప్పు డు వరద జలాలను నమ్ముకొని నదుల అనుసంధా నం చేయడం సరికాదు. వైయస్ ప్రభుత్వం దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టేల్‌పాండ్‌ను గోదావరి వరద జలాల ఆధారంగా ప్రతిపాదించింది.

గోదావరిలో సుమారు 190 టీఎంసీల వరద జలా లు లభ్యమవుతాయని టేల్‌పాండ్ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఇపుడు ఆ ప్రాజెక్టు పెండింగ్ ఉన్నది. మరి ఇవాళ కేంద్రం వరద జలాలను మిగులు జలా లుగా లెక్కిస్తున్నదనుకున్నా గోదావరిలో 190 టీఎంసీలే వరద జలాలుండగా 530 టీఎంసీలు వరద జాలాలున్నట్లు కేంద్రం ఎలా భావిస్తున్నట్లు? కాబట్టి గోదావరి నీటిని నాగార్జునసాగర్‌కు, పులిచింతలకు అనుసంధానం చేయడమంటే, గోదావరిలో తెలంగాణకు ఉన్న నికర జలాలను తరలించడమే!

గోదావరిలో 530 టీఎంసీలు మిగులు జలాలున్నాయని కేంద్రం భావించడంలోనే తిరకాసు ఉన్నదనిపిస్తున్నది. గోదావరిలో తెలంగాణకు సుమారు 912 టీఎంసీల నికర జలాల కేటాయింపులున్నా యి. గోదావరిపై తెలంగాణలో నిర్మాణమై వాడుకలో ఉన్న ప్రాజెక్టులకు జరిగిన నీటి కేటాయింపులు సుమారు 271టీఎంసీలు. అవి: ఎస్‌ఆర్‌ఎస్‌పీ మొదటి దశ, నిజాంసాగర్, కడెం, సింగూరు, కిన్నెరసాని ప్రాజెక్టులు వాడుకలో ఉన్నాయి. అయినా వాడుకలో ఉన్న అన్ని ప్రాజెక్టుల నుంచి మనం వాడుకోగలుగుతున్నది 271కి బదులు 216 టీఎంసీలు మాత్రమే. పూడికలు ఇతర కారణాల వల్ల వాటి కేటాయింపు నీటిని కూడా పూర్తిగా వాడుకోలేకపోతున్నాం. ఇక దేవాదుల, అలీసాగర్, గుత్ప, పాక్షికం గా వాడులోకి వచ్చాయి.

నిర్మాణంలో పూర్తికాని ప్రాజెక్టులు ఎస్‌ఆర్‌ఎస్‌పీ 2వ దశ, దేవాదుల 2,3 దశలు, ఎల్లంపల్లి, వరద కాలువ, లెండి. వాటికి జరిగిన నికర జలాల కేటాయింపులు సుమారు 145 టీఎంసీలు. అంటే తెలంగాణకు కేటాయించబడ్డ 912టీఎంసీల నుంచి... నిర్మించిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల నీరు సుమారు 416 టీఎంసీలను తీసివేయగా 584 టీఎంసీలు మిగులుతున్నాయి. ఇప్పటికిప్పుడు వాడుకలో లేని ఈ తెలంగాణ నికర జలాలపైనే కేంద్రం కన్నుపడిందా అనేదే ప్రశ్న? ఒకవేళ పడినా, ఒక రాష్ర్టానికి కేటాయించిన నికర జలాలను ఇతర రాష్ర్టాలకు మళ్లించడానికి మించిన ఘోరం మరొకటి ఉండదు. గోదావరిపై ప్రాణహిత-చేవెళ్ల, కాంతనపల్లి, ఇచ్చంపల్లి వంటి భారీ ప్రాజెక్టు లు చేపట్టాల్సి ఉన్నది.

వాటికి నికర జలాల్లో సుమా రు 300 టీఎంసీలకు పైగా కేటాయింపులున్నాయి. ఇవే కాకుండా ఇంకా గోదావరిపై అనేక కొత్త ప్రాజెక్టుల నిర్మాణాల కోసం తెలంగాణ ప్రభు త్వం ప్రణాళికలు తయారు చేస్తున్నది. అలాగే గోదావరి బేసిన్‌లోని చెరువుల పునర్నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. కాబట్టి తెలంగాణ గోదావరిలో నికర జలాలే కాదు, వరద జలాలు మిగలవు. కాబట్టి వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకోకుండా గోదావరి నీటిని తరలించే ప్రయత్నంచేస్తే మరోసారి తెలంగాణ సమా జం ఉద్యమించాల్సి వస్తుంది.

వరద జలాల పేర నికర జలాలకు ఎసరు పెట్టే ఈ గోదావరి అనుసంధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించకపోతే, తెలంగాణ బతుకులకు మరో ప్రమాదం పొం చి ఉంటుంది. కాబట్టి ముందు తెలంగాణ తలపెట్టిన భారీ ప్రాజెక్టులు, చెరువుల పునర్నిర్మాణం, వాటర్‌గ్రిడ్‌లకు సరిపడా నీరందాక... ఏమైనా మిగిలితే మానవతా దృక్పథంతో ఇతర రాష్ర్టాలకు తరలించడంలో అభ్యంతరం లేదు. కానీ అలా తెలంగాణ పట్ల కేంద్రం వ్యవహరించి న్యాయం చేస్తుందా అనే దే ప్రశ్న. ఇప్పటికే ఆరు దశాబ్దాలు నీటి కోసం తెలంగాణ తల్లడిల్లింది. జీవనదుల నీరు దొరకక ఫ్లోరైడ్ నీరే తాగింది. పంట పొలాలకు దిక్కులేకుండా పోయింది.

నీరు లేని వ్యవసాయం దండగైపోయిం ది. సకల దరిద్రాలకు నీటి కొరతే కారణం. ఆ నీటి కోసమే తెలంగాణ రాష్ట్రం కోరాం. కానీ ఏ గోదావరిపై ఆశలు పెట్టుకొని తెచ్చుకున్నామో, ఆ నీటినే అనుసంధానం తన్నుకుపోనుందా? మళ్లీ మన నీళ్లను కృష్ణానదికి అనుసంధానం చేసి సీమాంధ్రకు అందిస్తామంటుంటే గుండె తరుక్కుపోదా? దేశంలో అందరూ బతకాలని తెలంగాణ ఎప్పుడూ కోరుకుంటుంది. తాను బతికి ఇతరులను బతికించాలనుకుంటున్నది తప్ప మునుపటి వలె ఇతరుల దోపిడీకి తాను చావాలనుకోవడం లేదు.
నదుల అనుసంధానం అనేది ప్రకృతితో ఆటలాడుకోవడం లాంటిదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తు న్నారు.

రాజకీయ పడికట్టు పదాలు వల్లించినంత సులభంగా నదుల అనుసంధానం చేపడుతామంటున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, కచ్ నుంచి కటక్ దాకా.. రోడ్ కనెక్టివిటీ, ఫోన్ కనెక్టివిటీ, మెయిల్ కనెక్టివిటీ, ఇపుడు నదుల కనెక్టివిటీని.. అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం నుంచి ఇప్ప టి మోదీ ప్రభుత్వం దాకా దేశంలో కనెక్టివిటీ తెచ్చింది మేమే! - అనే ఈ పడికట్టు పదాల మాంత్రికుడు ఎవరో వేరే చెప్పనక్కరలేదేమో! ఆయనే వెంకయ్యనాయుడు అలియాస్ కనెక్టివిటీ నాయుడు అని ఇప్పటికే అర్థమైయుంటుంది! ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును జాతీ య ప్రాజెక్టుగా పరిశీలిస్తామన్న ఉమా భారతిలో మనం మానవీయ జాతీయతత్వాన్ని చూడొచ్చు!

కానీ విభజన చట్టంలో పోలవరాన్ని మాత్రమే జాతీ య ప్రాజెక్టుగా పెట్టించిన వెంకయ్యలో మనం ఏం చూడగలం? ఏది ఏమైనా.. కేంద్రం చేపట్టబోతున్న దక్షిణాది నదుల అనుసంధానంలో తెలంగాణ తన గోదావరి నీటి వాటాను కోల్పోకుండా చూసుకోవాలి. నదుల అనుసంధానం మనకు అన ర్థం. కాబట్టి దాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాల్సిం దే!

1820

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ