ప్రాంతీయ స్పృహలేని ప్రతిపక్షాలు


Fri,November 28, 2014 12:42 AM

తెలంగాణ వ్యవసాయ సంక్షోభానికి కారకులైన వారే ఇవాళ తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై గగ్గోలు పెడుతున్నారు. వారి ఆరు దశాబ్దాల పాలనా నిర్లక్ష్యాలను వదిలేసి, వాటిని ఇప్పటి 6 నెలల ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తుండటం ఒక విచిత్రం!

పార్టీ ఏదైనా ప్రాంతం ముఖ్యం. దశాబ్దాల వివక్షకు గురైన తెలంగాణ ప్రాంతానికి ఇది మరింత ఎక్కువ అవసరం. ప్రాంతం ముఖ్యమని భావించ ని పార్టీలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా క కూడా మారకపోవడం దురదృష్టక రం. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల చేత ఎన్నుకోబడ్డామనే స్పృహ ఉంటే, ఆంధ్రా హైకమాండ్ కోసమో, ఢిల్లీ అధిష్ఠానాల కోసమో కాకుండా తమ కొత్త రాష్ట్ర ప్రయోజనా ల కోసం ఆలోచించాలి. కానీ ప్రతిపక్ష పార్టీల తీరు లో ఎక్కడా ఆ మార్పు కనిపించడం లేదు. విభజన చట్టాన్నే ఉల్లంఘింస్తున్న పక్క రాష్ట్రం తరఫున ఒక పార్టీ బరి తెగించి వకల్తా పుచ్చుకోవడం అసెంబ్లీ సమావేశాలకే ఒక మాయని మచ్చ. పక్కరాష్ట్రం 54 శాతం విద్యుత్ వాటా ఇవ్వడంలేదని సాక్ష్యాలతో సహా ప్రభుత్వం చూపుతుంటే.. లేదు లేదు ఇస్తున్నదని ఆంధ్రా హైకమాండ్ పార్టీ తెలంగాణలో వకల్తా పుచ్చుకొని చెపుతున్నది. ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని ఢిల్లీలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో మాట్లాడుతున్నది! ఐఏఎస్ వంటి ఉన్నతాధికారుల పంపకం చేయకుండా ఇబ్బంది పెడుతున్న ఆ ఢిల్లీ పార్టీయే, రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేయడం లేదని మాట్లాడ టం ఇంకో విచిత్రం!
ప్రభుత్వం నడవడానికి సిబ్బంది కావాలి. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే మంత్రుల చాంబర్లలోనే సరై న సిబ్బంది లేదని వార్తలు వింటున్నాం. మొన్న అసెంబ్లీలో ఏదో సమాచారం కోసం టీడీపీ సభ్యులు దరఖాస్తు చేసుకున్నారట! ఐదు రోజులు గడిచినా ఆ సమాచారం అందలేదట! సమాచారం లభించకపోవడానికి సిబ్బంది కొరతే కారణమని సమాచా రం.

దానికి కూడా మేమే కారణమా? అని టీడీపీ సభ్యులు వ్యంగ్య బాణాలు విసిరారట! వారు నిజం గా ఆత్మపరిశీలన చేసుకుంటే వారే కారణమని వారికే అర్థమయ్యేది. 17 ఏళ్ల టీడీపీ కాలంలో ఉద్యోగ నియామకాల్లో తెలంగాణకు న్యాయం చేసి ఉంటే, ఇవాళ వారు ఆ పరిస్థితిని ఎదుర్కునేవారు కాదు. సరే, న్యాయమో, అన్యాయమో ఉన్న ఉద్యోగులనైనా స్థానికత ఆధారంగా పంపకం చేయాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. దాన్ని కూడా కాదని జనాభా ఆధారంగానే పంపకం జరుగుతుందని చట్టంలో పెట్టారు. దాని ప్రకారమే కమలనాథన్ కమిటీ వేశారు. ఉద్యోగుల అభ్యంతరాలు, ఆప్షన్లు తీసుకున్నారు. కానీ 6 నెలలు గడుస్తున్నా పంపకాలు పూర్తి కాలేదు. తెలంగాణ ఉద్యోగుల న్యాయమైన ఫిర్యాదులను పట్టించుకోకుండా కమలనాథన్ కమి టీ కాలయాపన చేస్తున్నదని ఆరోపణ ఉంది. ఈ విషయాలేవీ పట్టని విపక్షాలు, రాష్ట్ర ప్రభుత్వం పని చేయడంలేదనడం విడ్డూరంగా ఉన్నది! ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి ఉన్నతాధికారుల పంపకం రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణకు 44 మంది ఐఏఎస్ అధికారులను కేటాయించారు. ప్రస్తుతం 39 మందే ఉన్నారు. ప్రభుత్వంలో 112 శాఖలు ఉన్నాయి, వందకు పైగా కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలున్నాయి. అవన్నీ ఉన్నతాధికారుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి.

ఐఏఎస్ స్థాయి అధికారి సంతకం కానిదే ప్రభుత్వంలో ఏ పని జరగదు. ఒక్కో ఐఏఎస్ అధికారి మూడుకు మించిన శాఖలు నిర్వహిస్తున్నా రు. 163 మంది ఐఏఎస్‌ల అవసరం ఉన్న తెలంగాణ రాష్ర్టాన్ని 6 నెలలుగా 39 మంది ఐఏఎస్‌లతో మాత్రమే ప్రభుత్వాన్ని నడుపుతున్న కేసీఆర్ పాలనా సామర్థ్యాన్ని విపక్షం సైతం ప్రశంసిచక తప్పదు. విపక్షాలకు ప్రశంసించడం నచ్చకపోతే, కనీసం విమర్శలైనా చేయకుండా ఉండాలి కదా! ఐఏఎస్‌ల పంప కం అన్ని అవరోధాలను అధిగమించి చివరకు నవంబర్ 4న ప్రధాని ఆమోదం కోసం పంపినట్టు సమాచారం. గత 25 రోజుల నుంచి ఆ ఫైలు ప్రధాని వద్దే మూల్గుతున్నది. ఆ విధంగా దోషం తమవద్దే పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పని చేయడంలేదని విమర్శించడం రాష్ట్ర బీజేపీ నేతలకు తగునా? ఐఏఎస్‌ల పంపకం కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అనేకమార్లు మొరపెట్టుకుంది. సామరస్యానికి కూడా హద్దు పద్దు ఉండాలి. ఐఏఎస్‌ల పంపకం ఆలస్యమైతే తెలంగాణ పాలనా పరంగా నష్టపోతదన్న విష యం ఘనత వహించిన ప్రధానికి తెలియదా? రాజకీయ రాగద్వేషాలు ఒక రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకోకూడదు.

విపక్షాలు రైతు ఆత్మహత్యలపై గగ్గోలు చేస్తున్నా యి. హరిత విప్లవం, ఆతర్వాత ప్రపంచీకరణ దుష్పరిణామాలు సాంప్రదాయ వ్యవసాయాన్ని విధ్వంస చేశాయి. వాటి ప్రతి రూపమే వ్యవసాయ సంక్షో భం. వ్యవసాయ సంక్షోభానికి తోడుగా ఐదు దశాబ్దాల అన్యాయాలు, నిర్లక్ష్యం తెలంగాణ వ్యవసాయ సంక్షోభానికి అదనపు కారణాలు. ఆ రెండింతల కారణాలతోనే దేశంలో మొదట తెలంగాణలోనే రైతుల ఆత్మహత్యలు రెండు దశాబ్దాల క్రితం మొదలయ్యా యి. తెలంగాణ వ్యవసాయ సంక్షోభానికి గల అదన పు కారణాలకు కారకులైన వారే ఇవాళ తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై గగ్గోలు పెడుతున్నారు. వారి ఆరు దశాబ్దాల పాలనా నిర్లక్ష్యాలను వదిలేసి, వాటిని ఇప్పటి 6 నెలల ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తుండటం ఒక విచిత్రం! దేశంలో ఏర్పడిన వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొని నిలబడుతున్న రైతులు కోస్తాంధ్ర ప్రాంతంలో ఉండగా.. తెలంగాణ ప్రాంత రైతులే ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారో, రాష్ర్టాన్ని 58ఏళ్లు పాలించిన ఆంధ్రా, ఢిల్లీ పార్టీలే జవాబు చెప్పాలి.

దేశంలో వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టింది కాంగ్రెస్, బీజేపీ ప్రభు త్వాలై తే, తెలంగాణ వ్యవసాయాన్ని రెండింతల సంక్షోభంలోకి నెట్టింది ఆంధ్రా ప్రభుత్వాలు! ఎదుటి వాణ్ణి నిందిస్తే, చారిత్రక సత్యాలు తుడిచేసుకుపోతాయా? నిజంగానే తెలంగాణ రైతుల పట్ల ఆంధ్రా, ఢిల్లీ ప్రభు త్వాలకు అంత ప్రేమే ఉంటే, ఏ వివాదాలు, సరిహద్దులు లేని గోదావరి నదిపై యాజమాన్య బోర్టు ఉం డేదేనా? దీనిపై ఈ ప్రతిపక్షాలు ఒకవేళ ఆ రోజే కేసీఆర్ తో గొంతు కలిపి ఉంటే, ఇవాళ గోదావరి నదిపై బోర్డు ఉండేది కాదు. గోదావరిలోని 900 టీఎంసీల నీరు తెలంగా ణ రైతుల బతుకులను మార్చబోతున్నాయి. అలాంటి నీటిపై యాజమాన్య బోర్డు పేర కేంద్ర, ఆంధ్ర రాష్ట్రం పెత్తనం చెలాయించనున్నది. వారి అనుమ తితో మాత్రమే గోదావరి నీటిని తెలంగాణ వాడుకోవాలి. ఈ దిక్కుమాలిన ఆంక్షపై ఆరోజు మాట్లాడని ఆంధ్రా, ఢిల్లీ పార్టీలు ఇవాళ తెలంగాణ రైతుల ఆత్మహత్యలపై మాట్లాడుతున్నాయి. ఎంత బాగా పని చేసినా సాగునీటి వసతి పెంచడానికి, విద్యుత్ సమస్యను అధిగమించడానికి మరో మూడే ైళ్లెనా పడుతుంది. ఆ దిశగా కొత్త ప్రభుత్వం పని చేయగలదనే నమ్మకం అందరికీ ఉంది. ప్రతి పక్షాలు రైతు ఆత్మహత్యల నివారణకు ఏం చేయాలో ప్రభుత్వానికి చెప్పాలి తప్ప, ఆత్మహత్యలను జాతరగా మార్చుకోవడం కాదు.

దేశంలో తెలంగాణ ప్రాంతానిది ఒక ప్రత్యేక పరిస్థితి. దేశంలో అనేక రాష్ర్టాలు పాలనా సౌలభ్యం కోస విభజింపబడ్డాయి. కానీ తెలంగాణ పాలనా సౌలభ్యంతో పాటు బలమైన వివక్షల కారణంగా విభజింపబడ్డది. అలాగే రాజకీయంగా తెలంగాణకు అంద రూ చుట్టాలే. కానీ అవసరం వచ్చేసరికి సీమాంధ్రకు చుట్టాలైపోతుంటారు. అలా రాజకీయంగా జరిగిన ద్రోహాలతో ఐదు దశాబ్దాలలో లక్షల కోట్లల్లో సంపద ను, రాబడిని తెలంగాణ కోల్పోయింది. ఇపుడు రాష్ట్రం ఇచ్చారు. కానీ నష్టపరిహారం ఏది? ఏనాడైనా త్యాగాలు తప్ప తెలంగాణ సుఖమెరుగదు. నిపుణు ల లెక్కల ప్రకారం- 53 ఏళ్లలో ఏపీ ప్రణాళికా వ్యయం 6.68లక్షల కోట్లు(ప్రస్తుత ధరల ప్రకారం). ఇందులో తెలంగాణకు ఖర్చు చేసింది 29 శాతం మాత్రమే. అలాగే 53ఏళ్లలో ఏపీ ప్రణాళికేతర వ్యయం- 11.87 లక్షల కోట్లు. ఇందులోనూ తెలంగాణకు వెచ్చించింది 29 శాతమే. కానీ 53 ఏళ్ల ఏపీ రెవెన్యూ ఆదాయం 55శాతం తెలంగాణదే. ఆదా యం తెలంగాణ నుంచి వ్యయం సీమాంధ్రలో జరిగింది. ఆ లెక్కన 53ఏళ్లలో 4.11 లక్షల కోట్ల తెలం గాణ వాటా నిధులను సీమాంధ్రకు మళ్లించారు. దానికితోడు నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయం వల్ల తెలంగాణ మరో 4.45 లక్షల కోట్లు నష్టపోయింది. మొత్తం మీద సుమారు 13 లక్షల కోట్లకు పైగా కేవ లం నిధులు, నీళ్ల రూపంలో తెలంగాణ నష్టపోయిం ది. రెండున్నర లక్షల ఉద్యోగాలను రెండు తరాలు కోల్పోవడం అదనం.

తెలంగాణ కోల్పోయిన ఒక జీవిత కాలాన్ని వెల కట్టడం అప్పటి మన్మోహన్‌కు గానీ, ఇప్పటి మోదీకిగానీ సాధ్యం కాదు. పక్క రాష్ర్టానికి ఓ జాతీయ ప్రాజెక్టు ఇచ్చారు. ప్రత్యేక హోదా ఇచ్చారు. అన్ని విధాలుగా నష్టపోయిన తెలంగాణకు ఏమిచ్చారు? కనీసం విభజన చట్టాన్నైనా అమలు చేసి న్యాయం చేయడానికి కేంద్రానికి తీరిక లేదు. తెలంగాణలో బతుకుతున్న విపక్షాలకు చిత్తశుద్ధే ఉం టే, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని డిమాండ్ చేయాలి. సాధించుకు రావాలి. ఆ పని ఆంధ్రా హైకమాండు ఉన్న పార్టీ ఎలాగూ చేయదు. ఢిల్లీలో అధికారం ఉన్న బీజేపీ ఆపని చేయవచ్చు. కానీ వారికి కళ్ల నిండా బాబు కనిపించినంత కాలం తెలంగాణ కష్ట నష్టాలు తెలుస్త యా? ప్రాంతం పట్టని పార్టీలను ప్రతిపక్షాలుగా కూడా గుర్తించడానికి తెలంగాణ సమాజం ఎన్నటికీ సిద్ధంగా ఉండదు. ఇది ఎన్నటికి తెలిసొస్తుందో!


1064

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ