విపక్షాలా? ఆంధ్రాపక్షాలా?


Tue,October 14, 2014 08:21 AM

తెలంగాణ పట్ల బాబుకు అంత ప్రేమే ఉంటే.. తాజాగా కృష్ణపట్నం, హిందూజా ప్రాజెక్టుల విద్యుత్‌లో తెలంగాణకు వాటా లేదని ఎలా చెపుతున్నారో? కృష్ణపట్నం థర్మల్ విద్యుత్, హిందూజా విద్యుత్‌పై పీపీఏలను ఈఆర్‌సీ ఆమోదించలేదంటున్నారు. కానీ ఆ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రం డబ్బులతో, అనుమతులతో నిర్మాణమయ్యాయనే విషయం బాబుకు తెలియదందామా?

కొత్త రాష్ట్రం. సూటిగా చెప్పాలంటే కొత్త సంసారం. అంతేకాదు గత కాల పు పాలనలో అనేక విధ్వంసాలు. విభజనలో సవాలక్ష అన్యాయాలు. ఈ అవరోధాలన్నిటీనీ అర్థం చేసుకొని అడుగులేయాలంటే, ఎంతటి గొప్ప నాయకుడికైనా కొంత కాలమైనా పడుతుంది. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వమొచ్చి 130 రోజులైంది. ఇంత చిన్న కాలంలో ఏదో చేయలేదని విపక్షాల గావుకేకలు! ఇంతకాలం సాగిన విధ్వం సానికి, అన్యాయాలకు కార కులే విమర్శకులైన ఈ విపక్షాలను చూసినపుడు ఇవి విపక్షాలా? ఆంధ్రాపక్షాలా? సందేహం కలగడం సహజం. ఇపుడు కొత్త గా బస్సు యాత్రల అవతారం కూడా అందులో భాగంగానే చూడకతప్పదు. ఒకటి కాంగ్రెస్ బస్సు. ఇంకొకటి తెలుగుదేశం బస్సు. మూడో పక్షం నేనూ ఉన్నానంటూ బీజేపీ ఆందోళనలు!
కాంగ్రెస్ వాళ్లది రైతు భరోసా యాత్ర. గత 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాంతంలో ఎన్ని పవర్ ప్రాజెక్టులు స్థాపించారో ఒక్క కాంగ్రెస్ నాయకుడైనా చెప్పేస్థితిలో ఉన్నాడా?

కాంగ్రెస్ ప్రభుత్వం లో విద్యుత్ ప్రాజెక్టులు బోలెడు వచ్చాయి. తెలంగాణలో డిమాండ్‌ను చూసైనా ఎన్ని పవర్ ప్రాజెక్టులు స్థాపించారో చెప్పగలరా? ఆంధ్రాలో విద్యుత్ ప్రాజెక్టులకు తెలంగాణ మంత్రుల చేతనే అనుమతులిప్పించిన ఘనత కాంగ్రెస్‌ది. విద్యుత్ డిమాండ్ తెలంగాణలో ఉండగా, సీమాంధ్రలో పవర్ ప్రాజెక్టులు స్థాపిస్తుంటే ఇదే కాంగ్రెస్ నేతలు అప్పుడు కళ్లు మూసుకున్నారు. విద్యుత్, నీటి దోపిడీలు తెలంగాణ మంత్రుల చేతనే కాంగ్రెస్ ప్రభుత్వం చేయించిది నిజం. నీటిపారుదల మంత్రిగా పొన్నాల ఏడేళ్లు పనిచేశారు. పొన్నాల చేతనే వైయస్ పోతిరెడ్డిపాడుకు మరిన్ని పొక్కలు కొట్టించాడు. 44 వేల క్యూసెక్కుల నీటి దోపిడీకి ఆయన చేతనే జీవో జారీ చేయించాడు. తెలంగాణ రైతు బతుకులో మట్టికొట్టిన వారే, ఇపుడు తగుదునమ్మా అంటూ రైతు భరోసా యాత్ర చేయడాన్ని ఏమందాం?

ఇతర రాష్ర్టాల నుంచి కరెంటు కొనాలన్నా కనీసం ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ లైన్ల నిర్మాణం చేసిన పాపాన పోలేదు. ఇవాళ ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసినా, ట్రాన్స్‌మిషన్ కారిడార్ లేదు. దాని నిర్మాణానికి ఏడాది కాలం పడుతుంది. అప్పటి దాకా ఛత్తీస్‌గఢ్ విద్యుత్ మనకు లభ్యంకాదు. ఆ పాపం ఎవరిదందాం? నాలుగు నెలల టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది అందామా? గత 35 ఏళ్ల కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలదందామా? పోనీ, గత 5 ఏళ్లు గా తెలంగాణలో తుఫాను, వర్షాభావాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారమైనా ఇచ్చారా? 5 ఏళ్ల కాంగ్రెస్ కాలంలో పంటలు నష్టపోయిన రైతులకు ఇపుడు కేసీఆర్ ప్రభుత్వం రూ.480 కోట్ల పంట నష్టం విడుదల చేసింది. రైతులకు భరోసా కల్పిస్తామంటూ బస్సులో బయలుదేరిన కాంగ్రెస్ నేతలను, రైతులోకమే పైన పేర్కొన్న పశ్నలు అడిగితే ఏం సమాధానం చెబుతారు?

ఇక తెలుగుదేశం బస్సు రాజకీయం చూద్దాం. తెలంగాణ సకల దరిద్రాలకు తెలుగుదేశం పుట్టుకే కారణమని తెలియని వారు ఎవరూ ఉండి ఉండరు. దాని పుట్టుకతోనే తెలంగాణ దోపిడీ, నిధుల మళ్లింపులు, ఉద్యోగాల ఆక్రమణ, ఆక్రమ డిప్యూటేషన్లు, హైదరాబాద్‌కు పెరిగిన సీమాంధ్ర వలసలు, భూము ల ఆక్రమణలు, ల్యాండ్ మాఫియాలు.. ఎన్నని చెప్పగలం? ఇక చంద్రబాబు కుర్చీ చేపట్టిన నాటి నుంచి మొదలైన తెలంగాణ రైతు కష్టాలు తిరుగులేకుండా నేటికీ కొనసాగుతున్నాయి. వ్యవసాయం దండగ అన్న పాలకుడు దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన చంద్రబాబే నని చరిత్ర చెపుతున్నది.

దేశంలో రైతుల ఆత్మహత్యల పరంపరకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు పాలనను ఏ రైతైనా ఎలా మర్చిపోగలడు? అలాంటి చంద్రబాబు సైగలతో ఇపుడు టీ-టీడీపీ నేతలు రైతు పేర బస్సు యాత్ర చేపడితే నవ్వుకోవడం తప్ప మరేమైనా ఉంటుందా? ఉద్యమకాలంలో, తన పొలం దగ్గరకు వచ్చిన చంద్రబాబును ఫణికర మల్లయ్య (వరంగల్‌జిల్లా)అనే ఒక సాధారణరైతు ఏమడిగాడో తెలంగాణ టీడీపీ నేత లకు గుర్తుందో లేదో తెలియదు. కానీ తెలంగాణను ఎందుకు అడ్డుకుంటున్నావని ఆరోజు మల్లయ్య వేసి న ప్రశ్న ఈరోజుకూ మిగిలే ఉంది. తెలంగాణను తన ఆధిపత్యంలో ఉంచుకొని తిరిగి దోపిడీ సాగించాలనే చంద్రబాబు తీరే ఫణికర మల్లయ్య ప్రశ్న సజీవంగా ఉందని చెపుతుంది. తెలంగాణను అడ్డుకోలేకపోయి నా.. దాని మూలాలను దెబ్బతీసే తంత్రాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగితే సమస్యలొస్తాయని నేను ముందే చెప్పాను అని బాబు ఇపుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. విభజన జరిపినపుడు సమస్యలను జోడించిన ఘనత బాబు గారి దే కదా! రాష్ట్రం ఇచ్చినా తమ ఆధిపత్యంలోనే తెలంగాణ బతకాలనే బాబు గారి కుతంత్రాలకు విభజన పర్వంలోనే బీజం వేశారు.

ఉమ్మడి రాజధాని, ఉమ్మ డి విద్య, పోలవరం ముంపు మండలాలు, రెండు జీవనదులపై ఆంక్షలు.. ఇవన్నీ బాబు గారి పుణ్యమే కదా! అలాగే తామే సృష్టించిపెట్టిన విద్యుత్ సమస్య పై ఇవాళ తెలంగాణ తమ్ముళ్లను ఎగదోయడంలోని మర్మం తెలియంది కాదు. నిజానికి సీమాంధ్రలో డిమాండ్‌కు మించి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలున్నా యి. అదేదో ఇవాళ తన పాలనా సామర్థ్యం తోనే తన రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి తనలాగ చేయలేకపోయారని, తనకు మించినోడు లేడన్నట్లు చెప్పుకున్నారు.కనీసం ఇతర రాష్ర్టా ల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలంటే విద్యుత్ ట్రాన్స్‌మిషన్ లైన్లు ఉండాలి. అలాంటి ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్‌లు కూడా తెలంగాణకు లేకుండా చేసిన చంద్రబాబు పుణ్యమే కదా... ఇవాళ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ వెంటనే విద్యుత్ పొందలేకపోతున్నది! మావద్ద మిగులు విద్యుత్ ఉంటే తెలంగాణకే ఇస్తామని గొప్పగా చెపుతున్నారు.

నిజంగా తెలంగాణ పట్ల బాబుకు అంత ప్రేమే ఉంటే.. తాజాగా, కృష్ణపట్నం, హిందూజా ప్రాజెక్టుల విద్యుత్‌లో తెలంగాణకు వాటా లేదని ఎలా చెపుతున్నారో? కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ ,హిందూజా విద్యుత్‌పై పీపీఏలను ఈఆర్‌సీ ఆమోదించలేదంటున్నారు. కానీ ఆ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రం డబ్బులతో, అనుమతుల తో నిర్మాణమయ్యాయనే విషయం బాబుకు తెలియదందామా? ఉమ్మడి రాష్ట్రంలో అనుమతించబడిన ఏ విద్యుత్ ప్రాజెక్టు ఉత్పత్తిలోనైనా తెలంగాణ రాష్ట్రంవాటా కలిగి వుంటది. విభజన బిల్లులో ఉన్న 54 శాతం విద్యుత్ వాటాకే ఎగనామాలు పెడుతున్న చంద్రబాబు, మిగులు విద్యుత్ ఉంటే తెలంగాణకే ఇస్తామనడం చూసి వినే వారే సిగ్గు పడాలేమో!

ఇక బీజేపీ చేపడుతున్న రైతుల పేర ఆందోళనల వైపు చూద్దాం. పోలవరం ముంపు మండలాలు, ఉమ్మడి రాజధానిలో గవర్నర్ అధికారాలపై బిల్లు లో ఉన్నట్లుగానే అమలు చేస్తున్నామని బీజేపీ నేత లు ఢిల్లీ నుంచి మొదలుకుంటే, హైదరాబాద్ దాకా చెపుతూవస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి విద్యుత్ విషయంలోనూ బిల్లులో ఉన్నట్లుగానే ఎందుకు అమలు చేయడంలేదో బీజేపీ నేతలు చెప్పడం లేదెందుకు?

బిల్లులో తెలంగాణకు రావలసిన 54 శాతం విద్యుత్ వాటాను ఇప్పించాల్సిన బాధ్యత కేంద్రానిదనే సోయి బీజేపీ నేతలకు లేదెందుకు? తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని బతిమిలాడితే విద్యుత్ వాటా ఇప్పిస్తాం అనే రీతిలో బీజేపీ నేతల మాటలు అపుడపుడు వినబడుతున్నాయి. నిజానికి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 4 రోజులకే కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసి చెప్పారు. మరోసారి ఆమధ్య వెళ్లారు. ఇపుడు మళ్లీ వెళ్ళి వచ్చారు. న్యాయమైన విద్యుత్ వాటా కోసం ఇన్ని సార్లు మొర పెట్టుకున్నా ఇప్పించలేకపోతున్న కేంద్ర బీజేపీ ప్రభు త్వం తెలంగాణ ప్రభుత్వాన్ని అడగకుండానే పోలవరం ముంపు మండలాలను మాత్రం ఏపీలో ఎలా విలీనం చేయగలిగింది?

బిల్లులో ఉన్న అంశాలనే అమలు చేస్తున్నామని పదే పదే చెపుతున్న బీజే పీ నేతలు.. విద్యుత్ విషయంలోనూ బిల్లులో ఉన్న వాటానే ఎందుకు ఇప్పించడంలేదో చెప్పాలి. చట్టబద్ధమైన న్యాయం కూడా చేయలేని బీజేపీ ఇవాళ తెలంగాణ రైతుల పేరిట ఆందోళనలు చేపట్టడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. తెలంగాణ విద్యు త్ కొరత తీర్చడం ఒక్క తెలంగాణ ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వ బాధ్యత కూడా. ఆ బాధ్యతను మరిచి ఆందోళనలు చేపట్టి రైతులనే మోసం చేయాలనుకోవడం సరికాదు. తెలంగాణ రైతుల పట్ల నిజంగానే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే.. తెలంగాణకు రావలసిన 54 శాతం విద్యుత్ వాటా ఇప్పించాలి. ఎన్‌టీపీసీ నుంచి 4000 మెగావాట్ల విద్యుత్ తెలంగాణ రాష్ర్టానికి ఇస్తామని కేంద్రం చెప్పిన మాటను అమలు చేయించాలి.

Editpage Articel By Kalluri Srinivas reddy

రైతులు వర్షాలు లేక, విద్యుత్ కోతలతో సతమతమవుతున్న మాట నిజం. అయితే కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వానికి ఉన్న సమస్యల తోరణాలు ప్రజలకు తెలియనివి కావు. ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధిని ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు తప్ప, ఆంధ్రాపక్షాల వలె గావుకేకలు పెడుతున్న విపక్షాల మాటలను ప్రజలు లెక్కలోకి తీసుకోరనేది కూడా నిజం. కొత్త ప్రభుత్వం చిత్తశుద్ధిని, దాని పనితీరును కొంతకాలం గమనిస్తే ప్రజలకు ఈ ప్రభుత్వం పట్ల ఒక అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. నిజానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అవసరమనుకుంటే ప్రజలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు తప్ప, ఆంధ్రా అధిష్టానం, ఢిల్లీ ఆధిష్టానం కలిగిన బయటిపార్టీల ప్రతిపక్ష పాత్రలకు తెలంగాణలో అర్థమేలేదని చెప్పాలి.

1270

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ