రాజకీయ అవినీతి, ద్వంద్వ నీతి


Tue,September 30, 2014 12:04 AM

రాజకీయ సాధింపులు ఒకోసారి మంచి కూడా చేస్తుంటాయి. అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెస్తుంటాయి. సాధింపు కొందరికి కాలం కలిసిరావచ్చు. మరికొందరికి కలిసి రాకపోవచ్చు. ఆ నేపథ్యంలోనే తమిళనాడు ద్రవిడ రాజకీయాలను చూడాలి. 18 ఏళ్ల తర్వాత అక్రమ ఆస్తుల కేసులో జయలలితకు శిక్ష పడినా, వెలుగు చూడని వేల కోట్ల రాజకీయ అవినీతిపరులకు శిక్ష పడుతుందా అనేదే సగటు పౌరుడి మీమాంస.

బోఫోర్స్ స్కాంలో జరిగిన అవినీతి సుమారు 65 కోట్లు. ఆ స్కాం విచారణకు ఇప్పటిదాకా జరిగిన ఖర్చు 400 కోట్లకు పైమాటేనట! దాని విచారణలో తేలిందేమిటో తెలియదు. కాంగ్రెసేతర రాజకీయ పక్షాలకు గత రెండున్నర దశాబ్దాలుగా బోఫోర్స్ ఒక ఎన్నికల అస్త్రంగా బతుకుతూ వచ్చిందంటే తప్పుకాదు. బోఫోర్స్ స్కాంను తన వ్యాసాల ద్వారా వెలుగులోకి తెచ్చన అరుణ్‌శౌరి సైతం వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. అయినా బోఫోర్స్ విచారణ ఫలితం తేలింది లేదు. ఇలాంటి స్కాంలు రాజకీయ అస్ర్తాల కోసమే కొనసాగుతూనే ఉంటాయేమో తెలియదు!

ఈ నేపథ్యంలోనే రెండు ద్రవిడ పార్టీల సాధింపు రాజకీయాలను గమనించవచ్చు. ఎంజీఆర్ మరణం తర్వాత తమిళనాడులో తనదే ఏకవీర రాజ్యం అవుతుందని కరుణానిధి భావించారు. ఎంజీఆర్ భార్య జానకి, జయలలిత నడుమ అన్నాడిఎంకే తెరమరుగవుతుందనుకున్నారు. కానీ అలా జరగలేదు. ప్రజలు జయలలితనే ఎంజీఆర్ వారసురాలిగా ఆదరించారు. అక్కడి నుంచి జయలలిత-కరుణానిధి మధ్య పెరిగింది రాజకీయ వైరుధ్యం కాదు, సాధింపుల యుద్ధం. దీనికితోడు కేంద్రంలో సంకీర్ణాలు మొదలయ్యాయి.

జయలలిత 1991-1996 వరకు ముఖ్యమంత్రి హోదాలో అక్రమ ఆస్తులు సంపాదించారని సుబ్రమణ్యస్వామి కోర్టు కెళ్లారు. 1996 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలిచి అధికారం చేపట్టడమే కాక, కేంద్రంలో కూడా భాగస్వామి. అప్పు డే జయలలిత ఇంటిపై సీబీఐ దాడులు జరగడం గమనార్హం. డీఎంకే తన పలుకుబడిని ఉపయోగించి ఆ దాడులు చేయించిందనే విశ్లేషణలు వెలువడ్డాయి. 28 కిలోల బంగారు ఆభరణాలు, 800 కిలోల వెండి, 750 జతల చెప్పులు, పది వేల చీరలు, వజ్రాలచేతిగడియారాలు, భూముల పత్రాలు సీబీఐ సోదాలో బయటపడ్డాయి. వాటన్నిటి విలువ 66 కోట్లపై చిలుకు.

అవే అక్రమ ఆస్తులుగా కేసు కొనసాగింది. నిజానికి జయలలిత అక్రమ ఆస్తులను అందరిలాగ దేశ విదేశాలకు తరలించి ఉంటే, ఆ ఆభరాణాలు, అలంకరణలన్నీ దొరికేవి కావేమో! ఒక మహిళకు అలంకరణలు, ఆభరణాలపై ఉండే సహజమైన మోజు జయలలితలో మరింత ఎక్కువ ఉండిందని అనిపిస్తున్నది. పట్టుబడిన ఆమె ఆభరణాలు, చెప్పులు, వస్ర్తాలకు అప్పట్లో మీడియా విపరీత ప్రచారం చేసి పెట్టింది. సహజంగా నేతల ఆర్భాటాల పట్ల ప్రజల్లో ఎప్పుడూ వ్యతిరేకత ఉంటుంది.అదే ఆమెను అవినీతిపరురాలిగా నిలబెట్టింది. కనిపించని వేల కోట్ల స్కాంలు బయట పడకపోయినా, ఆర్భాటపు ఆభరణాలతో జయలలిత మాత్రం బయట పడింది.

దేవెగౌడ, గుజ్రాల్ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉంటూ కరుణానిధి తనపై సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని జయలలిత ఆరోపించింది. 1998లో లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలొచ్చాయి. జయలలిత బీజేపీతో జత కట్టింది. కేంద్రంలో బీజేపీ నేతృత్వ ఎన్‌డీఏ అధికారానికి వచ్చింది. తాను మద్దతిస్తున్న వాజపేయి ప్రభుత్వ సహకారంతో కరుణానిధి, ఆయన కుటుంబ అవినీతిని వెలికి తీయాలని జయలలిత భావించింది. కరుణానిధి, మురసోలీమారన్, చిదంబరంల అవినీతిపై విచారణ జరపాలని సాక్ష్యాధారాలతో కూడిన పత్రాలను ప్రధాని వాజపేయికి సమర్పించింది. నిజానికి వారిపై విచారణ జరిపితే ప్రయోజనం కలిగేది దేశానికే తప్ప జయలలితకు కాదు. కానీ వారిపై విచారణ జరపడానికి అప్పటి ప్రధాని వాజపేయి ఒప్పుకోలేదు. కాకపోతే జయలలిత అవినీతి కేసులను విచారిస్తున్న ప్రత్యేక కోర్టులను రద్దు చేశారు. ఆ కేసులను కింది కోర్టులకు అప్పగించారు. వాజపేయి ప్రభుత్వం జయలలిత అవినీతి కేసుల్లో సాయపడ్డదే తప్ప, ఆమె ప్రత్యర్థుల అవినీతిపై విచారణకు ఒప్పుకోకపోవడం గమనార్హం.

మరో గమనించదగ్గ విషయమేమిటంటే.. జయలలిత ప్రత్యర్థుల అవినీతిపై విచారణ జరపాలని కోరింది. కానీ ఆమె తన అవినీతి కేసులను రద్దు చేయాలని బ్లాక్‌మెయిల్ చేస్తున్నదని బీజేపీ దేశమంతటా ప్రచారం చేసుకున్నది. అది గమనించాకే, జయలలిత వాజపేయి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది. నిజానికి ఆమె ప్రత్యర్థుల అవినీతిపై విచారణ జరిపి ఉంటే, వాజపేయి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించేది కాదు. నిజం చెప్పాలంటే, బీజేపీ రాజకీయ ద్వంద్వ నీతికి అదొక పరాకాష్ఠ. తమకు మిత్రపక్షం కాకపోయినా సరే, కాంగ్రెస్ వ్యతిరేక, కాంగ్రెసేతర పక్షాల అవినీతి జోలికి పోవడం బీజేపీకి ఇష్టం లేదు. ఎందుకంటే, కాంగ్రెసేతర పక్షాలు ఎప్పుడైనా మిత్రపక్షం కావచ్చనే బీజేపీ దురాశే,కరుణానిధి అవినీతిపై విచారణకు ఆపార్టీ ఒప్పుకోలేదని చెప్పాలి. ఉదాహరణకు, 1997లో బీజేపీ, చంద్రబాబుపై వంద ఆరోపణలతో పుస్తకం ప్రచురించి ప్రజాకోర్టులో పెట్టింది. అప్పట్లో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించింది కూడా స్వయాన వెంకయ్యనాయుడు గారే!

తాము కేంద్రంలో అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తామని చెప్పారు. కానీ ఏమైంది? 1998లో ఎన్నికల తర్వాత అదే చంద్రబాబు మద్దతివ్వగానే, వంద ఆరోపణలు మాయమైపోయాయి! మొత్తం మీద సాధింపులతో ప్రత్యర్థి అవినీతిని బయట పెట్టొచ్చని కరుణానిధి రుజువు చేశాడు. కానీ, అలా రుజువు చేసుకునే అవకాశం జయలలితకు దక్కలేదంటే అవినీతి పట్ల బీజేపీ ద్వంద్వ నీతే అందుకు కారణమైందని చెప్పొచ్చు.

కరుణానిధిపైగానీ, చంద్రబాబుపైగానీ విచారణ జరిపి ఉంటే అవినీతి వెలుగు చూసేదా కాదా అనేది ప్రశ్న కాదు. రాజకీయ సాధింపులు కొందరికే పరిమితం కావడం దేశంలో అవినీతి పెరగడానికి పరోక్షంగా కారణమవుతుందని గడిచిన పదేళ్లలో బయటపడిన స్కాములే చక్కని ఉదాహరణలు.

1996 నుంచి కేంద్రంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడినా, అందులో డీఎంకే భాగస్వామి కావడం గమనార్హం. వాజపేయి ప్రభుత్వంలో డీఎంకే మంత్రి మురసోలీమారన్‌పై పరిశ్రమల లైసెన్సుల కేటాయింపులపై ఆరోపణలొచ్చాయి. కానీ విచారణ సంగతి తెలియదు. ఇకపోతే, 2004-2012 వరకు కాంగ్రెస్ నేతృ త్వంలోని ప్రభుత్వంలో డీఎంకే మంత్రులపై వచ్చిన ఆరోపణలు తెలిసినవే. ఒక లక్షా డ్బ్బైవేల కోట్ల విలువైన 2జీ స్పెక్ట్రం స్కాంలో డీఎంకే మంత్రి ఏ రాజా, కరుణానిధి కూతురు కనిమొళి ప్రధాన నిందితులు. ఇతర కేసుల్లో దయానిధిమారన్ లాంటి డీఎంకే మంత్రులున్న సంగతి తెలిసిందే. జయలలిత 66 కోట్ల అక్రమ ఆస్తులతో పోల్చుకుంటే, 2జీ స్పెక్ట్రం లాంటి స్కాంలు దేశానికి ఎంత హానిగా మారాయో చెప్పనక్కరలేదు.

మొక్కై ఉన్పపుడే వంగనిది మానై వంగు నా అన్నట్టు గతంలో దేవెగౌడ యూఎఫ్, వాజ్‌పేయి ఎన్‌డీఏ,సంకీర్ణాలు వ్యవహరించిన తీరు పుణ్యమా అని, డీఎంకే లాంటి పక్షాలు కాంగ్రెస్ సంకీర్ణంలోనూ విచ్చలవిడితనానికి పాల్పడ్డాయి. 2జీల బాగోతాలు బరితెగించాయి.

రాజకీయ సాధింపుల పుణ్యమా అని అవినీతి వెలుగు చూస్తున్న మాట నిజం. కరుణానిధి సాధింపులో నిజమెంత ఉన్నదో కానీ జయలలిత అవినీతి వెలుగు చూసింది. అలాగే జయలలిత సాధింపు చర్యల వల్ల కరుణానిధి అవినీతి బయట పడేదో లేదో తెలియదు, కానీ జయలలితకు ఆ అవకాశం అప్పటి బీజేపీ ఇవ్వలేదని మాత్రం చెప్పొచ్చు. కాంగ్రెస్ వ్యతిరేక పక్షాల అవినీతిని గాలికి వదిలేసి, తన రాజకీయ పబ్బం గడుపుకుందామనుకునే బీజేపీ వైఖరితో దేశంలో మరికొందరి అవినీతి వెలుగు చూసి ఉండకపోవచ్చు, మరింత అవినీతి పెరిగి ఉండొచ్చని ఎవరికైనా అనిపిస్తుంది. అందుకు కేంద్రంలో డిఎంకే మంత్రులు, కరుణానిధి కుటుంబ సభ్యులపై నడుస్తున్న అవినీతి కేసులే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దేశంలోని రాజకీయ అవినీతిపై పోరాడటంలో అప్పటి వాజపేయి కన్నా ఇప్పటి మోడీ మేలని ప్రజలు భావిస్తున్నారా! అయితే అందులో ఎంత నిజముందో వచ్చే ఐదేళ్లలో తెలిసిపోతుంది.


1447

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ        


Featured Articles