దబాయింపు రాతలు నిజాలవుతాయా?


Tue,September 23, 2014 04:34 AM

దబాయింపు రాతలు, మాటలనే నిజాలుగా చెలామణి చేయాలనుకోవడంలోనే ఆధిపత్యం, అహంభావం, నియంతృత్వాలు కనిపిస్తాయి. మంచి పాలన కోసం సాహసోపేత నిర్ణయాలు తీసుకునే నాయకుడు ఆర్కే లాంటి వారికి ఎప్పుడూ నియంత లాగే కనిపిస్తాడు.ఆంధ్ర పేరుతో పుట్టిన పత్రికలనే కం. అలాగే వాటి నేపథ్యం 1956 కన్నా ముందు నుంచే ఉన్నా అప్పటి వాటి యాజమాన్యాలు వేరు, ఇప్పటి యాజమాన్యాలు వేరు. ఆ వత్యాసాన్ని గత 15 ఏళ్లుగా వాటికవే చాటుకున్న సంఘటనలు అనేకం చూశాం. ఇవాళ అందులో ఒక పత్రిక, ఉద్యమానికి అండగానిలబడ్డది మేమే అని తనకు తానే రాసుకుంటున్నది. ఏ పత్రిక నిజాయితీనైనా నిర్ధారించేది పాఠకులు మాత్రమే తప్ప సదరు పత్రిక కాదు.ఆంధ్రజ్యోతి మాత్రమే ఉద్యమానికి అండగా నిలబడిందని ఆ పత్రిక ఎండీ ఈ మధ్య విపరీత ప్రచా రం చేసుకుంటున్నారు. తన పత్రిక తెలంగాణ వాదు ల అభిప్రాయాలకు వేదికగా నిలిచిందంటున్నారు. లెక్కలేనన్ని వ్యాసాలు ప్రచురించిందంటున్నారు.

నిజమే కావచ్చు. కానీ ఒక్క ఉద్యమ కథనం పెట్టి, మూడు ఉద్యమ వ్యతిరేక కథనాల పెట్టిన ఆపత్రిక చరిత్రను ఏ పాఠకుడైనా ఎలా మర్చిపోగలడు? అయినా తెలంగాణ వాదులకు కొంత స్పేస్ ఇచ్చామని చెప్పుకుంటే కొంత వరకు బాగుంటుంది. ఇచ్చి న స్పేస్ కూడా తెలంగాణ ప్రాంతంలో తమ పత్రిక వ్యాపారం కోసం తప్ప ప్రజలపై ప్రేమతో కాదని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. కాబట్టి అప్పట్లో తమ పత్రిక మాత్రమే ఉద్యమానికి అండగా నిలబడిందని చెప్పడంలో దబాయింపు తప్ప మరేమీ కనిపించదు.

చాలామేరకు ఆంధ్ర పత్రికలు 14ఏళ్ల ఉద్యమ కాలమంతా రెండు ప్రాంతాల్లో వేరు వేరు ఎడిషన్లు ప్రచురించి వ్యాపారం చేసుకున్నాయి. అందులో ఎవరకీ అనుమానం ఉండనక్కరలేదు. రాష్ట్రం విడిపోయాక మాత్రమే రెండు రాష్ర్టాల్లో వేరు వేరు ఎడిషన్లు ప్రచురిస్తున్నామని ఇపుడు ఆంధ్రజ్యోతి చెపుతున్నది. అందులో ఎంత నిజముందో ఇరు ప్రాంతాల పాఠకులకు బాగా తెలుసు. ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్, ఆంధ్రా ఎడిషన్ వేరు వేరుగా ఉంటున్నాయని ఉద్యమ కాలంలోనే ఒక నెల్లూరు మిత్రు డు నాతో అనేకసార్లు చెప్పారు. అతను నెల్లూరు నుంచి తెచ్చిన ఆంధ్రజ్యోతి పత్రికతో, హైదరాబాద్ ఆంధ్రజ్యోతి పత్రికతో పోల్చి చూసుకుంటే పోలికే లేదని చెప్పేవారు.
ఇంకో విషయం ఇక్కడ గమనించాలి. ఇక తెలంగాణ రాదులే అనుకున్నపుడు ఒక తీరు, ఇక తెలంగాణ వచ్చేస్తున్నదని తెలిశాక ఒక తీరు ప్రదర్శించిన ఆ పత్రిక వ్యూహాత్మకతను మనం గమనించవచ్చు.

ఆంధ్రజ్యోతి తెలంగాణకు అనుకూలంగా పని చేస్తున్నదని ఆంధ్రాపాఠకులు తమ పత్రికను సమైక్యాం ధ్ర ద్రోహి అన్నారని ఆ పత్రిక ఇపుడు కథనాలు రాసుకుంటున్నది. రాష్ట్రం ఏర్పడుతున్న చివరి అంకంలో తెలంగాణ ప్రజల మెప్పుపొందేందుకన్న ట్లు ఆ పత్రిక కొంత అనుకూల వైఖరిని ప్రదర్శించి ఉండవచ్చు.అపుడు ఆంధ్రా పాఠకులు ఆంధ్రజ్యోతిని సమైక్యాంధ్ర ద్రోహిగా పేర్కొని ఉండొచ్చు. అదే ప్రామాణికం అయితే, గత 4 నెలలుగా తెలంగాణ పాఠకులను తప్పుదారి పట్టించే విధంగా, ఉమ్మడి రాజధానిపై, గవర్నర్ అధికారాలపై, ఉమ్మడి విద్యపై, పోలవరం ముంపు మండలాలపై ఆ పత్రిక చంద్రబాబు బాణినే ఎందుకు వినిపిస్తున్నట్లు? ఆ విషయా న్ని ఇపుడు ఇటు తెలంగాణ పాఠకులు, అటు ఆంధ్రా పాఠకులు కూడా అర్థం చేసుకుంటున్నారనే విషయాన్ని ఆ పత్రిక మర్చిపోతున్నట్లున్నది.

టీఆర్‌ఎస్‌ను స్థాపించిన 2001లో ఆంధ్రజ్యోతి ఉన్నదా? ఉద్యమ ప్రారంభం నుంచే ఆంధ్రజ్యోతి అండగా ఉన్నదని తమకు తామే ప్రచారం చేసుకోవ డం సరికాదు. ఆంధ్రజ్యోతి పత్రిక టీఆర్‌ఎస్ పుట్టక ముందే మూతపడ్డది. తిరిగి 2002 అక్టోబర్‌లో మళ్లీ ప్రారంభమైంది. 2001లో ఈనాడు , వార్త మాత్రమే ప్రధాన పత్రికలుగా చెలామణిలో ఉన్నా యి. ఈనాడు గురించి చెప్పనక్కరలేదు. దాని మూలాలు పచ్చపార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రధాన పత్రికల్లో మిగిలింది వార్త దినపత్రిక మాత్ర మే. అపుడు తెలంగాణ నూతన రాజకీయ అస్తిత్వానికి బాసటగా నిలిచింది వార్త పత్రిక తప్ప మరేదీ కాదు.

అవసరమైతే మిగతా పత్రికలు దుమ్మెత్తిపోయడానికి కాచుకొని ఉన్నాయి. కానీ ఆంధ్రజ్యోతి మళ్లీ ప్రారంభమైన 2002లోనే టీఆర్‌ఎస్ పుట్టినట్లు తన వ్యాసాల్లో రాసుకుంటున్న ఆర్కే తీరును చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది? మసిపూసి మారేడు కాయ చేసే ఆయన తత్వం ఎవరికైనా బోధపడుతుం ది. ఆ పత్రిక టీఆర్‌ఎస్‌పై చేస్తున్న ఆరోపణల్లో నిజాయితీ ఏపాటిదో ఉహించుకోవచ్చు.
వార్త దిన పత్రిక 1996లో పుట్టింది. తెలంగాణ మలిదశ ఉద్యమం అపుడపుడే పురుడుపోసుకుంటున్నది. 1997లో తెలంగాణ కోసం బీజేపీ కాకినాడ లో తీర్మానం చేసింది. 2001లో తెలంగాణ ప్రజలే అధిష్ఠానంగా టీఆర్‌ఎస్ పుట్టింది. నిలిచింది. ఒక నూతన తెలంగాణ జర్నలిస్టు సమాజాన్ని వార్త పత్రిక ముందుకు తెచ్చింది. రాటుదేలిన తెలంగాణ జర్నలిస్టులకు అదొక వేదికైంది. నాలాంటి జర్నలిస్టు ల కలాలకు ప్రాధాన్యమిచ్చింది. నిఖార్సైన తెలంగా ణ వాదులను, రచయితలను, ఆలోచనాపరులను ఉద్యమానికి పరిచయం చేసింది. అదృష్టంకొద్ది వార్త యాజమాన్య మూలాలు ఆంధ్ర ప్రాంతాలో లేవు.

యజమాని గిరీష్ సంఘీ ఉత్తర భారతీయడైనా తెలంగాణలో పుట్టిపెరిగినవాడు. తెలంగాణను అర్థం చేసుకున్నవాడు. అందు కే వార్త తెలంగాణ ఉద్యమానికి అండగా నిలబడగలిగింది. అలాగే సంపాదకులు టంకశాల అశోక్ కలం నుంచి జాలువారిన అనేక వ్యాసాలు ఉద్యమానికి మరింత ఊతమందించాయి. నాలాంటివారి గొంతుకలను, రచనలను ఆదరించి ఉద్యమ విస్తృతికి అనేక రూపాల్లో ఉపకరించిన అశోక్‌ను ఎవరూ మరిచిపోలేరు. ఉద్యమ గొంతుకగా అప్పట్లో వార్త నే లేకుంటే టీఆర్‌ఎస్ రాజకీయ ఉద్యమానికి అప్పట్లో అంత ఊపు వచ్చేది కాదేమో అంటే తప్పు కాదు. అలాంటి చారిత్రక నిజాలను కాదని, ఆర్కే మార్కు ఆంధ్రజ్యోతి మాత్ర మే ఉద్యమానికి అండ గా నిలబడిందని ఊదరగొట్టుకుంటే ఎవరైనా నమ్ముతారా? అలాగే తెలంగాణ జర్నలిస్టుల కలాలతో ఆంధ్రజ్యోతి బతికిందని మర్చిపోవద్దు.

అద్భుతమైన కలం శక్తి కలిగిన కే. రామచంద్రమూర్తి, కే శ్రీనివాస్, అల్లం నారాయణ, కట్టాశేఖర్‌రెడి,్డ లాంటి వారి కలాల నుంచి వెలువడిన వ్యాసాలు, విశ్లేషణలతో ఉద్యమానికి జరిగిన ఉపకారం గొప్పది. అలాంటి తెలంగాణ కలాల శక్తితో బతికిన ఆ పత్రిక ఇపుడు ఉద్యమాన్ని ఆర్కేనే బతికించాడనే లెవల్లో బుకాయించడమే బాగాలేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, తెలంగాణ కలాలతో ఆంధ్రజ్యోతి బతికింది. కానీ యజమాని ద్వంద్వ ప్రమాణాలు, వేరు వేరు ఎడిషన్లతో ఉద్యమానికి ఆ పత్రిక చేసిన అపకారాలను ఎవరు కాదంటారు? ఇవాళ నమసే తెలంగాణ వంటి పత్రికే లేకపోతే, కనీసం ఆపత్రిక దబాయింపులను ప్రశ్నించే అవ కాశం కూడా దక్కేది కాదు.

దబాయింపు రాతలు, మాటలనే నిజాలుగా చెలామణి చేయాలనుకోవడంలోనే ఆధిపత్యం, అహంభావం, నియంతృత్వాలు కనిపిస్తాయి. మంచి పాల న కోసం సాహసోపేత నిర్ణయాలు తీసుకునే నాయకుడు ఆర్కే లాంటి వారికి ఎప్పుడూ నియంత లాగే కనిపిస్తాడు. కానీ ఒక మీడియా సంస్థ ఒక ప్రాంతం పై ఆధిపత్య దబాయింపులతో నియంతలా వ్యవహరిస్తే మాత్రం ఏప్రాంతమూ సహించదనడంలో అనుమానం లేదు. 58 ఏళ్ల విధ్వంసాన్ని ప్రజల దృష్టికి తేకుండా తొక్కిపెట్టిన ఘనత ఎవరిదో ఆ పత్రిక ఆత్మవలోకనం చేసుకోవాలి. ఒక ప్రాంత మన్నన పొందాలంటే, ఆ ప్రాంత ప్రజల విశ్వాసాన్ని పొందాలి. వారు ఎన్నుకున్న ప్రభుత్వానికి కథనాల రూపంలో సకారాత్మక సందేశాలివ్వాలి.

ఆప్రభుత్వం ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లయితే బయ ట పెట్టాలి. కానీ అధికారం చేపట్టిన క్షణం నుంచే ప్రజలెన్నుకున్న ప్రభుత్వంపై దాడికి దిగిన ఆ పత్రిక తీరును ఎవరైనా ఏమని హర్షిస్తారు?. అంతేకాదు, తెలంగా ణ ప్రభుత్వంపై విమర్శలతో పాటు, ఆంధ్రా వార్తల తో పత్రికను నింపేసి, తెలంగాణ పాఠకులపై రుద్ద డం, ఆ పత్రిక తెలంగాణ వ్యతిరేక వ్యూహాత్మక ధోరణిని తెలియజేస్తుంది. చంద్రబాబు పాలనకు పొగడ్తలు, కేసీఆర్ పాలనకు విమర్శల వర్షం కురిపిం చే ఆ పత్రిక ధోరణిని ప్రతి తెలంగాణ వాసి గమనిస్తున్నాడనడంలో అనుమానం లేదు.మరోసారి ఆం ధ్రా పార్టీని తెలంగాణలోకి తెచ్చేఎజెండాతో ఆ పత్రిక పనిచేస్తున్నదనేవిజ్ఞులఅనుమానాలను ఎలా కాదన గలం? అలాంటి ఆంధ్రామీడియా తనకు తాను ఎన్ని కథనాలు రాసుకున్నా తెలంగాణ ప్రజలు ఎన్నటికీ నమ్మరు. ఆంధ్రాబాబు రాజకీయ కుతంత్రాలకు సానపెడుతున్న కొన్ని పత్రికల కథనాలను అంతక న్నా నమ్మరు.

2121

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ