విజన్‌పై విశ్వాసం


Wed,September 17, 2014 01:17 AM

తమ కలలను సాకారం చేయడంలో కేసీఆర్ ఏమాత్రంతగ్గకుండా కృషి చేస్తారనే ప్రజల నమ్మకానికి ప్రతిబింబమే మెదక్ ఫలితం. బట్ట కాల్చి మీద వేస్తున్న ప్రతిపక్షాలకు చెంపపెట్టు.కేసీఆర్ విజన్‌పై విశ్వాసానికి ఇదొక ప్రజా తీర్పు.

ఉన్నది ఉన్నట్టు చెబితే ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ అసత్యా లు, అర్థంలేని ఆరోపణలు చేసినంత మాత్రాన ప్రజాతీర్పును మార్చలేరని మెదక్ లోక్‌సభ ఉప ఎన్నిక ఫలితం తెలియజేసింది. ప్రతిపక్షాలను ఆంధ్రాపక్షాలుగా ప్రజలు గుర్తించారని చెప్పడానికి కూడా ఈ ఉప ఎన్నిక ఫలితం ఒక నిదర్శనం. యాభై ఎనిమిదేళ్ల తర్వాత రాష్ర్టాన్ని సాధించుకున్న తెలంగాణ.. ఎన్నికల్లో తన రాజకీయ స్వాతంత్య్రాన్నే గెలిపించుకుని ప్రభుత్వాన్ని ఏర్పా టు చేసుకున్నది. అలాంటి ప్రభుత్వాన్ని తామే చేసిపెట్టిన పాపఫలితాలపై నిలదీయాలనుకోవడం ఒక విచిత్రం. తాము చేసిన పాపాలనే టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అంటగట్టి, దుమ్మెత్తిపోయడాన్ని ప్రజలు తీవ్రంగా నిరసించారని చెప్పవచ్చు. గత ప్రభుత్వా లు తెలంగాణలో చేసిపెట్టిన విధ్వంసాలను, దోపిడీని, అవినీతిని, దురాక్రమణలను తెలుసుకోవాలం టే ఏ ప్రభుత్వానికైనా ఏడాది కాలం కూడా సరిపో దు.

అయినా గత ప్రభుత్వాలు చేసి పెట్టిన సంక్షేమ పథకాల ముసుగుదోపిడీని, భూముల దురాక్రమణను, జరిగిన అవినీతిని వెలికితీయడంలో ఈ ప్రభు త్వం వందరోజుల్లోనే పూర్తి చొరవతో పనిచేచేస్తున్న దని ప్రజలు గుర్తిస్తున్నారడానికి కూడా ఈ తీర్పు ఒక నిదర్శనమే. ఈవిధంగా ప్రతిపక్షాల గత పాలన బాగోతాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగుచూడడం వాటికి మింగుడుపడలేదు. దీంతో కొన్ని సీమాంధ్ర మీడి యా సంస్థలను ప్రభుత్వంపైకి ఎగదోసే ప్రయత్నం చేశాయి. ఆ మీడియా సంస్థలు అనాగరికమైన వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్నే కించేపరిచే స్థాయికి దిగజారాయి. ఆ మీడి యా సంస్థలకే వంత పాడుతున్న పార్టీల గురించి ప్రజలకు తెలియని విషయమేమీకాదు. తెలంగాణ ప్రజలు బయటిపార్టీలను ఎందుకు తిరస్కరించారో అవి తెలుసుకోలేపోతున్నాయి.

ఇంటిపార్టీనే ఎందుకు గెలిపించుకున్నారో అంతకన్నా తెలుసుకోలేకపోతున్నాయి. విపక్షపాత్రను ఎలా పోషించి ప్రజల మన్ననలు పొందాలో కూడాతెలుసుకోలేకపోతున్నాయి. ఈ ఉపోద్ఘాతమే మెదక్ ఉప ఎన్నిక ఫలిత సారంశం అంటే తప్పుకాదు. ముఖ్యంగా టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను కార్యకర్తల పథకాలుగా మార్చేసి అర్హులైన ప్రజలకు అందకుండా చేశాయి. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో జరిగిన అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించడాన్ని మనం గమనించవచ్చు. అలాగే హైదరాబాద్‌లో జరిగిన భూ దురాక్రమణలను వెలికితీయడం కావచ్చు, అనేక అభివృద్ధి ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని వెలికితీయడం కావచ్చు.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి సాహసోపేతమైన చర్యలను ప్రజలు స్వాగతిస్తున్నారని కూడా మెదక్ తీర్పు చెపుతున్నది.

58 ఏళ్ల విధ్వంసాన్ని, జరిగిన అవినీతిని చక్కదిద్దడానికి జరుగుతున్న ప్రయత్నాలను స్వాగతించాల్సిన ప్రతిపక్షాలు, అడ్డగోలు విమర్శలకు దిగడాన్ని ప్రజలు నిర్దంద్వంగా తిరస్కరించారని కూడా చెప్పాలి. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే తెల్లరేషన్ కార్డు రద్దవుతుందని మెదక్‌లో ప్రచారం చేశారు. కానీ బోగస్ రేషన్ కార్డులను ఏరివేయాల్సిందేనని ప్రజలు తీర్పు ఇచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని, ఇందిరమ్మ ఇండ్లలో జరిగిన అవినీతిని వెలికితీయాలని ప్రజలు కోరుకుంటున్నారని ప్రతిపక్షాలకు ఇప్పటికైనా అర్థమవుతున్నదో లేదో తెలియదు. ప్రజలను ఎంతగా తప్పుదారి పట్టిద్దామని ప్రతిపక్షాలు భావించినా ప్రజలు మాత్రం ప్రతిపక్షాలకు సరైన దారే చూపారని చెప్పాలి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వందరోజుల పాలనపై మిస్‌రూల్ పేరిట కాంగ్రెస్ ఓ పుస్తకాన్నే ప్రచురించి ప్రచారం చేసింది. 58 ఏళ్ల తమ మిస్‌రూల్‌ను మరిచిన పొన్నాల ప్రజలను అమాయకులనుకోవడమే ఒక విచిత్రం.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత చర్యలన్నీ విపక్షాలకు కంటగింపుగా మారాయని వాటి విమర్శల తీరును చూసిన ప్రజలకు అర్థమైం ది. ముఖ్యంగా ఇంతకాలం ఆంధ్ర అజమాయిషీలో బతికిన పార్టీల తీరు ఇప్పటికీ మారకపోవడాన్ని ప్రజ లు గమనిస్తూనే ఉన్నారు. రాజకీయంగా తెలంగాణ ప్రజల చేత తిరస్కరించబడిన పార్టీ టీడీపీ. అలాంటి పార్టీతో స్నేహం చేస్తున్న బీజేపీని ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు మూడో స్థానానికే పరిమితం చేయడాన్ని మనం గమనించొచ్చు. అయినా ఆపార్టీకి ఏమేరకు జానోదయమైందో తెలియదు. ఆంధ్రాపార్టీలతో ఏపార్టీ స్నేహం చేసినా, ఆ పార్టీని ఆంధ్రాపార్టీగానే ప్రజలు పరిగణిస్తారనడానికి ఈ ఉప ఎన్నికలో బీజేపీకి పట్టిన దుర్దశనే ఒక ఉదాహరణ.

తెలంగాణ ప్రభుత్వం ఏం చేసినా అందులో ఏవో లొసుగులు వెతికే ప్రయత్నం చేశారు. కరెంటు లోటు ఉందని తెలిసినా దానికి తెలంగాణ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. కరెంటు కష్టాలు మూడేళ్ల పాటు భరించాల్సి వస్తుందని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. అయినా దశలవారిగా ఏడాదికి ఏడాది విద్యుత్ కొరత తగ్గించేందుకు ఒక ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం పనిచేస్తున్న విషయం ప్రతిపక్షాలకు కనిపించలేదు. చంద్రబాబు పీపీఏలు రద్దు చేసినా నోరు మెదపని వాళ్లు, కరెం టు కోతల వల్ల పంటలు ఎండిపోతున్నాయని గోబె ల్స్ ప్రచారానికి తెరలేపారు. ప్రజలను మభ్యపెట్టడానికి రైతుల పేరిట పార్టీ జెండాలతో సబ్‌స్టేషన్ల ముందు ధర్నాలు చేశారు. తమ పాలనలతో ఏర్పడిన కరెంటు కొరతను టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అంటగడదామనుకున్న విపక్షాల తీరును ప్రజలు గమనించారు. మెదక్ ప్రజలు గతంలో కేసీఆర్‌ను ఆదరించినట్లుగానే,ఈ ఉపఎన్నికల్లోనూ ఏ మాత్రం తగ్గకుండా అంతేస్థాయిలోటీఆర్‌ఎస్‌ను ఆదరించి గెలిపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఓ ఏడాది పాటు గమనించి స్పందించాలనే సోయి ప్రతిపక్షాలకు లేకుండాపోయింది. సకారాత్మక వైఖరి విడనాడి గోబెల్స్ ప్రచారాలతో నెగ్గుకురాలేమని అవి తెలుసుకోలేకపోవడం వాటి దురదృష్టం.

తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఒక విజన్‌తో ఎన్నుకున్నారు. రాష్ట్రం ఏర్పడటమే కాదు, తెలంగా ణ రాజకీయ స్వతంత్రాన్ని కోరుకున్నది, గెలిపించుకున్నది. ఎవరు అవునన్నా కాదన్నా ఆ రాజకీయ స్వతంత్రానికి టీఆర్‌ఎస్ ఒక ప్రతీక. తెలంగాణ ఏ ఆంధ్రాపార్టీనో, ఢిల్లీపార్టీనో గెలిపించుకుని తిరిగి రాజకీయ బందీ కాదలుచుకోలేదు. ఈ విషయం ప్రతిపక్షాలకు ఇంకా అర్థమైనట్టులేదు. బీడువారిన తెలంగాణ భూములు సస్యశ్యామలం కావాలంటే, ఏ ఆంధ్రాపార్టీతోనో, ఢిల్లీ పార్టీతోనో అయ్యే పని కాదని తెలంగాణ ప్రజలు తెలుసుకొని చాలాకాలమైంది. పోతిరెడ్డిపాడు ద్వారా నీటి దోపిడీ చేస్తున్న తూములను చంద్రబాబుగానీ, కిషన్‌రెడ్డిగానీ, పొన్నాలగానీ మూయించలేడని తెలుసు. ఉమ్మడి విద్య ముసుగులో తెలంగాణ విద్యార్థులకు అన్యా యం జరగకుండా చూడలేరని తెలుసు. రెండు జీవనదులలో తెలంగాణ రాష్ట్రం కలిగి ఉన్న 1200 టీఎంసీలను తెలంగాణ బీడు భూములకు మళ్లించలేరని తెలుసు. కోటి ఎకరాల బీడు భూములను పంటపొలాలుగా మార్చేందుకే తెలంగాణ ఉద్యమం మొదలైంది. అలాంటి ఉద్యమాన్ని అడుగడుగునా అడ్డుకున్న చంద్రబాబు చరిత్ర తెలంగాణ ప్రజలకు తెలుసు. అలాంటి చంద్రబాబును తిరిగి తెలంగాణలోకి తెచ్చేందుకు తమవంతు సహకారం అందిస్తున్న బీజేపీని తెలంగాణ ప్రజలు ఎక్కడ పెట్టాలో అక్కడే పెడుతున్నారు.

మెదక్ ప్రజలు టీఆర్‌ఎస్‌ను తిరిగి భారీ మెజారిటీతో గెలిపించారు. దీనితో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మరింత బాధ్యత పెరిగింది. ఒక విజన్‌తో పని చేస్తు న్న ముఖ్యమంత్రికి తెలంగాణ ప్రజలు పూర్తి మద్దతిస్తున్నారని ఈ ఉప ఎన్నిక తీర్పు చెపుతున్నది. తెలంగాణ గ్రామాలు సాగునీటి ప్రాజెక్టుల కోసం, చెరువుల మరమ్మతుల కోసం ఎదురు చూస్తున్నా యి. సాగునీటి ప్రాజెక్టులను చేపట్టాల్సిన అవసరం గురించి కేసీఆర్‌కు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. నెర్రెబారిన బీడు భూములే కేసీఆర్‌ను తిరుగులేని నాయకుడిగా నిలబెట్టాయి. సస్యశ్యామల పంట పొలాలతో తెలంగాణ కళకళలాడినపుడే, సంపూర్ణ తెలంగాణ సార్థకమైనట్లు! సకల దరిద్రాలను పారదోలే శక్తి తెలంగాణ వ్యవసాయంలో ఉంది. ఆ విష యం అందరికన్నా కేసీఆర్‌కు బాగా తెలుసు. ఆదిశగానే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై కేసీఆర్ ప్రత్యే క దృష్టి పెడుతారనే నమ్మకం ప్రతి తెలంగాణ రైతులోనూ బలంగా ఉన్నది. ఎనిమిదేళ్ల కిందట ఒక బహిరంగ సభలో కేసీఆర్ చేసిన ప్రసంగం నాకు ఇప్పటికీ గుర్తుంది. తెలంగాణ రైతు పెరుగన్నం తిని అరుగు మీద హాయిగా పడుకునే రోజులను తిరిగి తెస్తానని చెప్పారు. అదే తెలంగాణ సాకారానికి నిదర్శనం కూడా. ఇవాళ మెదక్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు లభించిన గెలుపు వెనకాల కుల మతాల కతీతమైన రైతు సమాజం ఉన్నది. గ్రామ సమాజం, వృత్తుల సమాజాలున్నాయి. ఇది నిఖార్సైన తెలంగాణ ప్రజల తీర్పు. ఇంకా చెప్పాలంటే, వట్టిపోయిన తెలంగాణ గ్రామాల పునరుజ్జీవం కోసం ప్రజలిచ్చిన తీర్పు. తమ కలలను సాకారం చేయడంలో కేసీఆర్ ఏమాత్రం తగ్గకుండా కృషి చేస్తారనే ప్రజల నమ్మకానికి ప్రతిబింబమే మెదక్ ఫలితం. బట్ట కాల్చి మీదేస్తున్న ప్రతిపక్షాలకు చెంపపెట్టు. కేసీఆర్ విజన్‌పై విశ్వాసానికి ఇదొక ప్రజా తీర్పు.

1155

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ        


Featured Articles