సారీ...అమిత్ షా!


Wed,August 27, 2014 12:16 AM

అమిత్ షా.. బీజేపీ నూతన జాతీ య అధ్యక్షులు.గుజరాత్‌కు చెందిన ఈ నేత మోడీకి అత్యంత సన్నిహితు డు. యూపీలో ఎన్నికల బాధ్యతలు చేపట్టి మంచి ఫలితాలు రాబట్టారనే పేరుతో ఇపుడాయన జాతీయ అధ్యక్షులయ్యారు.అది ఆయన గొప్పతనమో, లేక యూపీఏ ప్రభుత్వం పట్ల ఉత్తరాది రాష్ర్టాల్లో వీచిన వ్యతిరేక గాలి ప్రభావమో తెలియదు! గుజరాత్ రాష్ట్రం పట్టణ వ్యాపార వర్గాల ఆధిపత్యం కలిగిన రాష్ట్రం. అలాంటి రాష్ట్ర నుంచి వచ్చిన అమిత్‌షాకు దక్షిణాది తెలంగాణ గురించి, ఇక్కడి గ్రామీణ జీవితాల గురించి అంతగా తెలిసి ఉండదనే చెప్పాలి. కలిసొచ్చిన యూపీఏ వ్యతిరేక గాలికి మోడీ అయినా, అమిత్ షా అయినా ఎదిగొచ్చారు తప్ప ఈ దేశంలోని ప్రాంతాల పట్ల, వాటి చరిత్ర పట్ల పూర్తి అవగాహనతో ఎదిగి వచ్చారనుకోలేము.

సర్దార్ పటేల్ హైదరాబాద్‌ను భారతదేశంలో విలీనం చేశారని అమిత్‌షా కూడా అందరు బీజేపీ నేతల లాగానే గొప్పగా చెప్పారు. పోలీసు చర్య చేపట్టింది పటేలే కావచ్చు.కానీ 1948 నాటి పరిస్థి తుల్లో హైదరాబాద్ స్టేట్ ప్రజలు భారత్‌లో విలీనం కావాలని కోరుకున్నారు. ఆ విషయాన్ని పసిగట్టాకే భారత ప్రభుత్వం పోలీసు చర్య చేపట్టింది. హైదరాబాద్ స్టేట్ ప్రజలు కనుక నిజాం రాజ్యాన్నో, కమ్యూనిస్టుల రాజ్యాన్నో కోరుకొని ఉంటే సర్దార్ పటేల్ హైదరాబాద్‌లో కాలు పెట్టగలిగేవాడు కాదు. హైదరాబాద్ అప్పటికే స్వతంత్ర దేశం కాబట్టి ప్రజ ల అభిప్రాయమే కీలకమైంది. హైదరాబాద్ స్టేట్ ప్రజలు విలీనం కోరుకొని ఉండకపోతే, భారతదేశ పరిస్థితి ఇవాళ ఎలా ఉండేదో అమిత్ షా ఒకసారి అలోచించాలి.

సారీ.. అమిత్ షా..! బీజేపీ తెలంగాణలో దిగాల్సిన స్టేషన్ (1998-2004)ఎప్పుడో దాటిపోయింది. మీ ద్వంద్వ విధానాలు, అవకాశవాద రాజకీయాలు కాలం చెల్లిపోయాయి. ఇపుడు తెలంగాణ స్వీయ రాజకీయాలను తప్ప మరేవీ నమ్మదు.

కాబట్టి, సర్దార్ పటేల్‌ది గొప్పతనం కాదు, విలీనంతో ఈ దేశ అస్తిత్వాన్ని కాపాడిన హైదరాబాద్ స్టేట్ ప్రజలది గొప్పతనం. ఈదేశ అస్తిత్వాన్ని కాపాడటమే కాక, ఈ దేశానికి నగదు ఖజానాను అందించిన తెలంగాణ ప్రజలకు మించిన గొప్పవాళ్లు ఇంకెవరైనా ఉంటారా? అందుకే ఈ దేశానికి తెలంగాణ రుణపడిలేదు. ఈ దేశమే తెలంగాణకు రుణపడి ఉందని గ్రహించాలి. అలాంటి తెలంగాణ తన సొంత రాష్ట్రం కోసం 58 ఏళ్లు పోరాటం చేయాల్సి వచ్చినందుకు దేశ పాలక వర్గాలు సిగ్గు పడాలి. అందుకే, సర్దార్ పటేల్ ప్రస్తావన పదేపదే తెచ్చి, తెలంగాణ ప్రజల త్యాగాన్ని, గొప్పతనాన్ని అగౌరవపరచడం మంచి పరిణామం కాదు. అమిత్‌షా పొగడాలనుకుంటే తెలంగాణ ప్రజలను పొగడాలి. తెలంగాణ రాష్ర్టాభివృద్ధికి సహకరించాలి.

అమిత్‌షా చెప్పిన రెండో విషయం 2019 లో తెలంగాణ బీజేపీదే అని. అసలు తెలంగాణ గొప్పతనాన్ని ఏనాడూ గుర్తించని బీజేపీ తెలంగాణను ఎలా గెలుచుకుంటాననుకుంటుందో తెలియదు. 1969లో తెలంగాణ ఉద్యమాన్ని బీజేపీ పూర్వా శ్రమ పార్టీ జనసంఘ్ వ్యతిరేకించింది.1972లో తెలంగాణ హక్కులను కొల్లగొట్టేందుకు జరిగిన జై ఆంధ్రా ఉద్యమాన్ని సమర్థించింది. 1996లో 13 రోజుల ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు పడగొట్టాక గానీ బీజేపీకి తెలంగాణ గుర్తుకు రాలేదు. ఫలితంగానే ఒక్క ఓటుకు రెండు రాష్ర్టాలు అనే నినాదం తో ముందుకొచ్చింది. అయినా అన్యాయం జరిగిన ప్రాంతం పట్ల పోరాడుతామనే కన్నా, రెండు తెలు గు రాష్ర్టాలు ఇస్తామనే ముచ్చట చెప్పింది. రాష్ట్రం ఇస్తామంటున్నారు కదా అని 1998ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 26 శాతం ఓట్లు వేశారు. రెండు లోక్‌సభ సీట్లు గెలిపించారు.

1998లో అధికారంలోకి రాగానే ఆంధ్రాపార్టీ మద్దతు అనివార్యమైన మాట నిజమే. కానీ ఆంధ్రాపార్టీ అడ్డుకోవడం సంగతేమో గానీ, తెలంగాణ ఏర్పాటే అక్కర లేదని స్వయాన బీజేపీయే నాలుక తిప్పేసిం ది. 2004లో అధికారం కోల్పోయాక కూడా చాలా కాలం తెలంగాణ విష యం పట్టించుకోలేదు. స్వయాన చంద్రబాబు- ఇక బీజేపీతో స్నేహం చేసేది లేదని ప్రకటించాక గానీ, బీజేపీ మళ్ళా తెలంగాణపై మాట్లాడలేదు. యూపీఏ బిల్లు తెస్తే సమర్థిస్తామని 2010లో చెప్పారు. మొత్తం మీద 2014లో తెలంగాణ ఏర్పాటు బిల్లు ను బీజేపీ సమర్థించిన మాట ఎంత వాస్తవమో.. ఆ బిల్లులో తెలంగాణపై పెట్టిన అనేక ఆంక్షలకు బీజేపీయే కారణమనేది కూడా అంతే వాస్తవం. తెలంగాణ ప్రజల్లో బీజేపీ తన విశ్వసనీయతను ఏనాడూ నిలబెట్టుకున్న దాఖలాలు లేవు.

తెలంగాణ ఏర్పడటానికి 58 ఏళ్లు పట్టింది. ఇన్ని దశాబ్దాలు పట్టడానికి ఒక్క కాంగ్రెస్ మాత్రమే కార ణం కాదు. బీజేపీ కూడా అంతే కారణం. చట్టబద్ధ హామీల ఉల్లంఘనలతో తీవ్ర అన్యాయాలకు గురైన ప్రాంతం దేశంలో ఏదైనా ఉందంటే వాటిలో తెలంగాణే ప్రధానమైనది. 58 ఏళ్లపాటు తెలంగాణకున్న చట్టబద్ధ హామీలు ఉల్లంఘించబడుతుంటే, ఏ పార్టీ మాట్లాడింది లేదు. అదేదో గొప్ప విషయమన్నట్టు ఒక్క ఓటుకు రెండు రాష్ర్టాలన్నారు తప్ప తెలంగాణకు జరిగిన అన్యాయాలపై బీజేపీ ఏనాడూ మాట్లాడలేదు. ఇపుడు అమిత్‌షా మాకు రెండు రాష్ర్టాలూ సమానమే అంటున్నారు.

బీజేపీకి జాతీయ దృక్పథమే ఉంటే.. 1969 జై తెలంగాణ ఉద్యమాన్ని సమర్థించేది. 1972 లో జై ఆంధ్రా ఉద్యమాన్ని వ్యతిరేకించేది.1998లో మాటిచ్చిన బీజేపీ, తెలంగాణే అక్కరలేదని చెప్పేది కాదు. అన్యాయానికి గురవుతున్న ప్రాంతానికి న్యాయం కోసం పోరాడాల్సింది పోయి, ఇప్పుడు అన్యాయాలనే చట్టబద్దం చేయబూనారు. బిల్లులో ఉన్న వాటి నే చట్టబద్ధం చేస్తున్నామనే ముక్తాయింపులో ఎంత నిజాయితీ ఉందో మోడీ, అమిత్‌షాల అంతరాత్మలకు తెలియదనుకుందామా? పోలవరం ముంపు మండలాలను ఆంధ్రాకే ఇవ్వాలని మన్మోహన్‌పై ఒత్తిడి తెచ్చింది వెంకయ్య నాయుడు కాదా? హైదరాబాద్‌లో గవర్నర్ అధికారాల విషయాన్ని సైతం యూపీఏపై ఒత్తిడి తెచ్చిన ఘనత ఆయనదే కాదా? రేపు రెండు జీవనదుల (గోదావరి, కృష్ట) పై తెలంగాణ ప్రభుత్వం అనేక కొత్త ప్రాజెక్టు లు నిర్మించాల్సి ఉన్నది. ఆ రెండు నదులపై కూడా బిల్లులో ఆంక్షలున్నాయి. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల అనుమతులను కూడా బీజేపీ అడ్డుకునే అవకాశాన్ని ఎలా కాదగలం? బీజేపీ సూచనల మేరకే తెలంగాణపై అనేక ఆంక్షలు పెట్టారనే విషయం అమిత్‌షాకు ఏమేరకు తెలియదనుకోవాలి? రెండు రాష్ర్టాలూ మాకు సమానమే అంటున్న అమిత్‌షా..తెలంగాణ కు ఏవిధంగా న్యాయం చేస్తారో ఎక్కడైనా చెప్పారా?
తెలంగాణపై ఆంక్షలు పెట్టింది కాంగ్రెస్ మాత్ర మే కాదు, అంతకుమించి బీజేపీ కూడా అనే విష యం ఇవాళ తెలంగాణ సమాజాని కి తెలియనిదేమీ కాదు. బిల్లు తెచ్చిన పార్టీని, మద్దతిచ్చిన పార్టీని కాదని తెలంగాణ ప్రజలు ఇంటిపార్టీనే ఎందుకు గెలిపించుకున్నారో అమిత్‌షా లోతుగా ఆలోచించినట్లు లేరు.

58ఏళ్ల నిర్బంధానికి అన్ని పార్టీలదీ బాధ్యతే. భారత రాజకీయ పార్టీలను తెలంగాణ నమ్మింది. ఎప్పటికప్పుడు మోసపోతూ వచ్చింది. ఈదేశంలో తెలంగాణది ఒక ప్రత్యేక స్థానం. అయి నా తెలంగాణ గోసను, చరిత్రను రైటిస్టు, లెఫ్టిస్టులనే కాదు అన్ని పార్టీలు తమ స్వార్థాలకు వాడుకొని బతికాయి. తెలంగాణ ఆత్మను ఏనాడూ ఏపార్టీ గౌరవించింది లేదు. స్వీయ రాజకీయం తెలియని తెలంగాణ అమాయకత్వాన్ని అన్ని పార్టీలూ సొమ్ము చేసుకున్నాయి. అట్లా 45 ఏళ్లు గడిచిపోయాయి.

స్వీయ రాజకీయానికి 2001లో తెర లేచింది. సమర్థ నాయకత్వమూ దొరికింది. అయినా 14 ఏళ్లపాటు పోరాడక తప్పలేదు. తెలంగాణ సొంత రాజకీయం ఆంధ్రా పార్టీలను బోనులో నిలబెట్టింది. ఢిల్లీ పార్టీలకు అనివార్యతలను సృషించింది. తెలంగాణకు సొంత రాజకీయ సోయి వచ్చి ఉండకపోతే కాంగ్రెస్ బిల్లు తెచ్చేదేనా? బీజేపీ మద్దతిచ్చేదేనా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదేనా? ఈ విషయాలు తెలియని మనిషి ఇవాళ తెలంగాణలో ఒక్కరంటే ఒక్కరైనా ఉండి ఉంటారా? అయినా వచ్చిన తెలంగాణపై ఆంక్షలు పెట్టిన, పెట్టించిన పార్టీలను ప్రజలు ఎందుకు నమ్మాలి?

అయినా.. 2019లో తెలంగాణ బీజేపీదే అని అమిత్‌షా ధీమా ! ఒక పార్టీ అధ్యక్షుడిగా తన పార్టీ బలోపేతం కోసం మాట్లాడటంలో తప్పులేదు. కానీ ఏ ప్రాంతంలో తమ పార్టీ బలపడాలనుకుంటున్నాడో ఆ ప్రాంతంపైనే ఆంక్షలు రుద్దుతూ బలపడతామని కలలు కనడమే ఆశ్చర్యం కలిగించే విష యం.అంతేకాదు, తెలంగాణకు రాజకీయంగా విరోధియైన ఒక ఆంధ్రా పార్టీతో జతకట్టి తెలంగాణను 2019లో వశపరుచుకోవాలనుకోవడం మరింత ఆశ్చర్యకరం. తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణ అస్తిత్వాన్ని తుడిచేయడానికి. టీడీపీతో జతకట్టే ఏ పార్టీకైనా అదే స్వభావం ఉంటుందని తెలంగాణ ప్రజలు భావిస్తారు.

తెలంగాణ ఆత్మనే ఒక రాజకీయ సిద్ధాంతం. దానికి రైటు, లెఫ్ట్ అనే పేర్లు లేవు. స్వీయ రాజకీయాన్ని నమ్ముకున్న తెలంగాణ ఇవాళ ఇతర పార్టీల మాటలను నమ్ముకొని మరోసారి మోసపోయే స్థితిలో లేదు. దేశంలో ప్రాంతీయ పార్టీలు అవసర మా లేదా అనే విషయం ఎలా ఉన్నా.. తెలంగాణకు మాత్రం ఇంటిపార్టీ అవసరమే కాదు అనివార్యం కూడా.ఈ సత్యాన్ని చరిత్ర పుటలు, వర్తమాన ఆంక్ష లు తెలంగాణ ప్రజలకు గుర్తు చేస్తున్నాయి.

సారీ... అమిత్ షా..! బీజేపీ తెలంగాణలో దిగాల్సిన స్టేషన్ (1998-2004)ఎప్పుడో దాటిపోయింది.మీ ద్వంద్వ విధానాలు, అవకాశవాద రాజ కీయాలు కాలం చెల్లిపోయాయి. ఇపుడు తెలంగాణ స్వీయ రాజకీయాలను తప్ప మరేవీ నమ్మదు.

2264

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ        


Featured Articles