సర్వేపై సందేహాలొద్దు..


Fri,August 15, 2014 02:03 AM

58 ఏళ్లు సమైక్యపాలన సాగింది. ఆర్థిక, సామాజిక, రాజకీ య రంగాల్లో తెలంగాణ స్థితిగతులేమిటో ఎవరికీ తెలియదు. నష్టపోయామనే విషయం అందరికీ తెలుసు. కానీ అది ఎలాం టి నష్టం. ఆ నష్టాన్ని ఎలా పూరించుకోగలం. ఎవరికి ఎలాంటి సహాయం అందించాలి. అలాంటి సందిగ్ధతల నడుమ ఒక ప్రజా ప్రభుత్వం ఏ బాటలో నడవాలి?అసలు రాష్ట్ర జనాభా, వారి అక్షరాస్యత, ఉద్యోగ, నిరుద్యోగులు, గృహ వసతి, ఆరోగ్య స్థితి, సామాజికం, ఆర్థికం, ఇలా ప్రతి అంశం తెలిసివుంటేగానీ ఈ కొత్త రాష్ర్టానికి భవ్యమైన భవిష్యత్తును నిర్మాణం చేయలేం.గత ప్రభుత్వాలు ప్రజలను ఎరలతో మభ్య పెట్టాయి. ఎండమావుల వెంట పరుగులు తీయించాయి. ఇపుడు మనరాష్ట్రం మనకు దక్కాక అవే ఎండమావుల వెంట పరుగెత్తలేం. కాబట్టి రాష్ట్రం పట్ల పాలకుల వద్ద పకడ్బందీ ప్రణాళిక ఉండాలి. అదే సమయంలో అట్టడుగు నిజానిజాలు కూడా తెలిసి ఉండాలి.

ప్రభుత్వం చేపడుతున్న సర్వే వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాల గురించి ముందుగా చెప్పుకుందాం. ఇప్పటి వరకు కుల , ఆదాయ , స్థానికత , ఇలా ఏ ధృవపత్రం కావాలన్నా మీ సేవా కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఈ విధానం పోవాలి. అలాగే ఫలానా గ్రామంలో రైతు, దళితుడి ఆర్థిక స్థితి ఏమిటి? ఇలా ప్రజల అవసరాలు తీర్చడానికి ప్రతి దరఖాస్తుదారు వివరాలు కంప్యూటర్‌లో ఒక్క క్లిక్‌తో మండల అధికారుల నుంచి సెక్రటేరియ ట్ అధికారుల దాకా తెలిసిపోతుంది. ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి దాకా తెలుసుకోగలుగుతారు. దానితో ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుంది. గుట్టలకొద్ది ఫైళ్లు పేరుకుపోయి సామాన్యుడికి జరగాల్సిన న్యాయం నెలల తరబడి, ఏళ్ల తరబడి ఆగిపోయే అవకాశాలు ఇకపై ఉండవు. పౌరపాలన అంటే ఇలా ఉండాలి అనేంత కీర్తి తెలంగాణ రాష్ర్టానికి దక్కే అవకాశం. ఇంకా చెప్పాలంటే, 19న ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే ప్రయోజనాలు వెల కట్టలేనివి.

హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ. ఈ నగరానికి అంతర్జాతీయ నగర లక్షణాలు వేగంగా ఏర్పడుతున్నాయి. ఐటీఐఆర్ ద్వారా వేలాది ఐటీ పరిశ్రమలు రాబోతున్నాయి. 3 కోట్ల జనాభాకు తగ్గ నగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పంతో ఉన్నారు. అలాంటి ఈ నగరంలో స్థానికులెవరో, స్థానికేతరులెవరో, అక్రమ విదేశీయులెవరో ఎవరికీ తెలియని పరిస్థితి. ఇక్కడ అనేక ప్రాంతాల ప్రజలు బతుకుదెరువు, వ్యాపారాల కోసం వస్తుంటారు. హైదరాబాద్ ఒక సేఫ్ సిటీగా మారాలి. ఇప్పటికే కొన్ని ఉగ్రవాద సంస్థలు హైదరాబాద్‌ను కేంద్రం చేసుకొని పనిచేస్తున్నాయని గతంలో జరిగిన అనేక సంఘటనలు రుజువు చేశాయి. కాబట్టి, హైదరాబాద్‌లో ప్రజల వివరాలు వారి భద్రత కోసం ప్రభుత్వం వద్ద సమగ్ర సర్వే ఉండాల్సిన అవసరాన్ని కూడా మనం గమనించాలి.
ఈ సర్వే వల్ల ఇటు పౌర సమాజానికి, అటు ఒక మంచి ప్రభుత్వం నడవడానికి గల అనేక ప్రయోజనాలున్నాయి. అదే సమయంలో ఈ సర్వేపై ప్రజలలో కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ సర్వే రేషన్‌కార్డులు తొలగించడానికి కాదని పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ వెల్లడించా రు. ప్రజల్లో ఉండే అనుమానాలను తొలగించే ప్రయత్నం చేసినందుకు ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. కానీ సర్వే అంతా ప్రభుత్వ ఆర్థికంతో ముడిపడి ఉంది కాబట్టి, ప్రజలకు మరింత స్పష్టత అవసరమే. ఇవాళ 84 లక్షల కుటుంబాలకు 91లక్షల తెల్లరేషన్ కార్డులున్నాయి.

ఈ సర్వేతో బోగస్ రేషన్ కార్డులు, బోగస్ పింఛన్ కార్డులు రద్దు కావలసిందే. అవిపోతే, 69లక్షల తెల్లరేషన్ కార్డులు, 15 లక్షల గులాబీ కార్డులు మిగులుతాయి. నిజంగా 69 లక్షల తెల్ల రేషన్‌కార్డు హోల్డర్‌లలో చాలామేరకు అనర్హులు కూడా ఉండి ఉంటారు. అలా అని అందరూ అనర్హులు కారు కూడా. కానీ పేదల అవసరాలను, మధ్యతరగతి అవసరాలను, ఉన్నతతరగతి వారిని విడివిడిగా గుర్తించి అందరికీ న్యాయం చేయాలి. ఈ విషయంలో ప్రభుత్వం తరపున వివరాలు వెల్లడి కాకపోవడంవల్ల ప్రజల్లో సర్వే పట్ల కొంత అభద్రతా భావం ఉన్న మాట మాత్రం వాస్తవం. వారి సందిగ్ధతను దూరం చేస్తే, ఈ సర్వేకు మరింత నమ్మకమైన సమాచారం లభించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా పేదలు- ఆహారం, వైద్యం, విద్యను అందుకోలేకపోవడం తెలిసిందే. అలాగే, మధ్యతరగతి ప్రజ లు నేటి ఖరీదైన వైద్యం, ఉన్నతవిద్యను అందుకోలేని పరిస్థితి. కాబట్టి నేటి సమాజ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సమాజాన్ని ఆర్థికంగా మూడు వర్గాలుగా విభజించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వాలు మొత్తం సమాజాన్ని రెండు వర్గాలుగా మాత్రమే విభజించి సంక్షేమ కార్యక్రమాలను నడిపాయి.

గత ప్రభుత్వం 75 వేల వార్షికాదాయం ఉన్నవారికి తెల్లరేషన్‌కార్డు ఇచ్చింది. అంతకు మించి ఒక్క రూపాయి అధికంగా ఆదాయం ఉన్నా.. అందరినీ టాటాలు, అంబానీలతో సమానంగా లెక్కించింది. ఈ అధర్మ లెక్కింపే మధ్య తరగతి ప్రజలను తప్పడు ఆదాయాలు చూపి తెల్లరేషన్ కార్డు పొందే వైపు పురికొల్పింది. ఫలితంగా మధ్య తరగతి ప్రజలు తెల్లరేషన్‌కార్డుల కోసం ఆరాటపడ్డారు. మధ్యతరగతి కుటుంబాలు తెల్లరేషన్ కార్డు ఎందుకు పొందా రో లోతుగా ఆలోచించాలి. వారికి నేటి ఖరీదైన వైద్యం, విద్య అందుబాటులో లేకపోవడం వల్లనే వారు తప్పుడు ధృవీకరణలతో తెల్లకార్డులు పొందారని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. మధ్య తరగతి వార్షికాదాయం సుమారు 2లక్షల నుంచి 6లక్షల వరకు ఉంటుందని చెప్పొచ్చు.వీరికి వైద్యం లో రాయితీ (ఆరోగ్యశ్రీ), ఉన్నత విద్యలో ఫాస్ట్‌లాంటి ప్రభుత్వ సహాయం కావాలి. కాబట్టి ఇపుడు తెల్లరేషన్ కార్డులు ఉన్నవాళ్లంతా అనర్హులని కాదు. మధ్యతరగతికి రేషన్ సరకులు అవసరం లేదు. వారు ఖరీదైన వైద్య చికిత్సల ను భరించలేరు.

ఉదాహరణకు ఒక మధ్యతరగతి రోగికి వార్షికాదాయం 6లక్షలున్నా, కనీసం లక్ష రూపాయల కార్పొరేట్ వైద్య చికిత్సను కూడా చేయించుకోలేరు. ఎందుకంటే మధ్యతరగతి ప్రజలు సహజంగా రైతుగానో, ప్రైవేటు ఉద్యోగిగానో చిరుద్యోగిగానో, చిరు వ్యాపారిగానో బతుకుతుంటారు. మధ్యతరగతి కుటుంబంలో లక్ష రూపాయాల నగదును మనం ఊహించలేం కూడా. అలా గే, ఈ మధ్యతరగతి ప్రైవేటు ఉద్యోగికి ఉద్యోగ భద్రతను అంత కన్నా ఊహించలేం. ప్రైవేటు ఉద్యోగం ఎపుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో ఎవరూ చెప్పలేరు. మధ్యతరగతి బతుకే ఒక అభద్రత నడుమ సాగుతూ ఉంటుంది. ఆదాయానికే భద్రత లేనపుడు అతనికి ఆరోగ్య భద్రతెక్కడిది? అతని సంతానానికి ఉన్నత విద్య భద్రతెక్కడిది? అలాగే, కుటుంబ యజమాని అస్తులు, ఆదాయం వివరాలు అడుగుతున్నపుడు, అతని అప్పుల విషయాన్ని కూడా సర్వేలో పొందుపరిస్తే మరింత న్యాయంగా ఉండేదని విజ్ఞులు అంటున్నారు. కాబట్టి వైద్యం, విద్యవిషయంలో ప్రభుత్వం మధ్యతరగతిని అభద్రతా భావం నుంచి వెలికితీసి కాపాడాలి.

సమాజాన్ని ఆర్థికంగా మూడు భాగాలు చేయాల్సిన అవసరం ఉన్నది. 1. పేద తరగతి (వార్షికాదాయం 2లక్షల లోపు) 2. మధ్యతరగతి ( 2 లక్షల నుంచి 6 లక్షల లోపు వార్షికాదాయం) 3. ఉన్నత తరగతి (6లక్షలకు పైబడి వార్షికాదాయం)గా విభజించాలి. పేద తరగతి వారికి- రేషన్ సరుకులు, ఆరోగ్యశ్రీ, ఉన్నత విద్యకు (ఫాస్ట్) సహాయానికి అర్హులను చేయాలి. 2. మధ్య తరగతి వారికి ఆరోగ్యశ్రీ, ఉన్నత విద్యకు(ఫాస్ట్) సహాయానికి అర్హులను చేయాలి. 3. ఉన్నత తరగతికి ప్రభుత్వ రాయితీలు అక్కరలేదు.. ఈ వివరణ సర్వే కన్నా ముందే ప్రకటిస్తే సర్వేలో మరింత సరైన సమాచారం దొరుకుతుంది. సర్వే తర్వాత ప్రభుత్వం సమాజాన్ని మూడు రకాలుగా విభజించి అందరికీ న్యా యం చేసే అవకాశం ఉన్నది. కాబట్టి సర్వే పట్ల ప్రజలకు అనుమానాలక్కర లేదు. అందరూ సర్వేకు వాస్తవ సమాచారం అందించాలి. ప్రభుత్వం మనది కాబట్టి ఎవరికీ అన్యాయం జరిగే అవకాశం ఉండదు.


1301

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ