అవినీతి అంతంతోనే అభివృద్ధి


Tue,July 29, 2014 11:50 PM

ప్రభుత్వ పథకాలను పార్టీ క్యాడర్ బతుకుదెరువు కోసం చేపట్టి నడిపిన సమైక్యపాలన పాప ఫలితాలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. ఒక్క గృహనిర్మాణ మే కాదు, పెన్షన్లు, రేషన్ కార్డులు, ఫీజురీయింబర్స్‌మెంట్‌లలో జరిగిన భయంకరమైన అవినీతిని చూస్తే ఆంధ్రా పార్టీలు తెలంగాణను, ఈ ప్రాంత గ్రామాలను ఎంతటి విధ్వంసానికి గురిచేశాయో అర్థమవుతుంది. ఆ అంతులేని అవినీతే ఇప్పుడు తెలంగాణ గ్రామాల అభివృద్ధికి పెద్ద ఆటంకంగా మారింది. దాన్ని ఛేదిస్తేగానీ తెలంగాణ గ్రామాల అభివృద్ధి సాధ్యం కాదు.

1980ల నుంచి తెలంగాణ గ్రామాలలో రాజకీయ చైతన్యం పెరిగిందనే వారున్నారు. కానీ చైతన్యం పెరిగిందనే కన్నా రాజకీయ ఆశావాహులను గ్రామాల్లో పెంచారని చెబితేనే న్యాయంగా ఉంటుంది. అలా పెరగడానికి తెలుగుదేశం పార్టీ పుట్టుకే కారణమని వేరే చెప్పనక్కరలేదు. 17 ఏళ్ల టీడీపీ, 17 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దోపిడీ రాజకీయాలు తెలంగాణ గ్రామాలను ఎలా విధ్వంసం చేశాయో ఒకసారి తిరిగి చూసుకుందాం.

ఉచిత విద్యుత్, సస్తాబియ్యం లాంటి తాత్కాలిక ఎరలతో మొద ట్లో ఎన్టీఆర్ తెలంగాణ ప్రజల్ని తన వశం చేసుకున్నారు. ఏడేళ్లు పాలించిన ఎన్టీఆర్ తెలంగాణలో ఒక్కటంటే ఒక్కటైనా శాశ్వత అభివృద్ధి పని చేపట్టిందిలేదు. సాగునీటి కోసం చెరువులు, పెండింగ్ ప్రాజెక్టులు చేపట్టి ఉంటే,సస్తా బియ్యం పథకం అవసరం చాలా మేరకు తప్పేది. ఉచిత విద్యుత్ అవసరమూ చాలా తగ్గేది. తెలంగాణ రైతు దైన్యాన్ని సొమ్ము చేసుకోవాలనుకున్నారు తప్ప వారికి గౌరవ జీవితాన్ని అందిద్దామని ఆయన ఏనాడూ అనుకోలేదు. ఇకపోతే, 1995 -2004 వరకు సాగిన చంద్రబాబు పాలన ఏకంగా తెలంగా ణ గ్రామ రాజకీయాలను ఒక వృత్తిగా మార్చేశాయి. ప్రజాదరణ లేని చంద్రబాబు తెలంగాణ గ్రామాలను టార్గెట్ చేశాడు. రాజకీయ ఆశావాహులను సృషించుకోవడమే పనిగా పెట్టుకొని ప్రభుత్వ పథకాలు ప్రకటించాడు. నీటి సంఘాలు, పాల సంఘాలు, పాఠశాల సంఘాలు... ఇలా అనేక సంఘాలను గ్రామాలపైకి వదిలారు. పార్టీ క్యాడర్‌ను పెంచుకోవడానికి/తినిపించడానికి చిత్తశుద్ధిలేని పథకాలను గ్రామాలపైకి వదిలారు. గ్రామీణ పథకాలన్నీ పచ్చ చొక్కాల బతుకుదెరువు పథకాలుగా మారిపోయాయి. అలాగే తెలంగాణ గ్రామాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం రాజకీయాలు దోపిడీలో పోటీపడ్డాయి తప్ప అభివృద్ధిలో కాదు. వేలాది ఇండ్లు కట్టకున్నా కట్టినట్టు చూపగలిగేవారే కాదు. తెలంగాణలో 84 లక్షల కుటుంబా లు ఉంటే, 91 లక్షల తెల్లరేషన్ కార్డులు ఉండేవి కావు. 30 ఏళ్ల యువకులకు, కోటీశ్వరులకు సైతం పింఛన్ కార్డులు ఉండేవి కావు.

కాంగ్రెస్, తెలుగుదేశం వైరుధ్య రాజకీయాలు పోటీ పడింది అభివృద్ధిలో అయివుంటే తెలంగాణ గ్రామాలు ఇలా ఉండేవి కావు. చాలా మేరకు నీటి సంఘాలు రైతు కోసం కాకుండా, గ్రామీణ రాజకీయ నిరుద్యోగులకు పనికొచ్చాయి. పనులు తెచ్చుకోవడం, పంచుకోవడమే చాలా మేరకు వాటి పనిగా మారింది. దానితో తెలంగాణ చెరువులు, కుంటలు నిర్జీవమైనాయి. అలాగే ఇసుక మాఫియాతో గ్రామ రాజకీయాలు లాలూచీ పడుతూనే ఉన్నాయి. వాగులు, వంకలలో ఇవాళ ఇసుక లేక భూగర్భ జలాలు అడుగంటాయి. దీనితో వాగులు కిందికి, చెరువులు పైకి అయ్యాయి. అయినా కాల్వల మరమ్మతుల పేర నీటి సంఘాలు ప్రజాధనాన్ని మెక్కడం మాత్రం ఆగలేదు. ప్రభుత్వ పథకాల కైంకర్యానికి అలవాటు చేసిన తెలుగుదేశం, కాంగ్రె స్ విధ్వంసక రాజకీయాల నుంచి తెలంగాణ గ్రామాలకు విముక్తి కల్పించాలి. ఆంధ్రా పార్టీలు తమ పార్టీల క్యాడర్ బతుకుదెరువుల కోసం తెలంగాణ గ్రామాల సంక్షేమాన్నే పణంగా పెట్టాయి. తెలంగాణ గ్రామీణ రాజకీయాలలో ఆంధ్రాపార్టీలు ప్రవేశపెట్టిన దోపిడీ వైరస్‌ను పారద్రోలి, చైతన్యాన్ని తేవాలి. 35 ఏళ్లలో గ్రామాల అభివృద్ధి, సంక్షేమంలో జరిగిన విధ్వంసపూరిత అవినీతే పరోక్షంగా తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఒక బలమైన కారణమైంది. అందు కే ఈ విషయాన్ని తెలంగాణ ఇంటిపార్టీ ప్రభుత్వం కూడా సీరియస్‌గానే తీసుకొని పని చేస్తున్నట్లు కనిపిస్తున్నది.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పుడు అనేక గ్రామీణాభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రకటించింది.ఈ పథకాల అమలు ఒక అగ్ని పరీక్ష. గత 35 ఏళ్లుగా ఆంధ్రాపార్టీలు ప్రవేశ పెట్టిన అవినీతి వైరస్‌ను పారద్రోలే మార్గాలు వెతకాలి. ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం కాలం చెల్లిన పార్టీగా మారిపోయింది. ఇక కాంగ్రెస్ బతికున్నా నిర్జీవమైయున్నది. ఆ రెండు పార్టీలు గ్రామాల్లో పాదుకొల్పిన దోపిడీ రాజకీయానికి చరమ గీతం పాడటానికి ఇదే సరైన సమయం కూడా.

రెండు బెడ్‌రూంలతో కూడిన ఇల్లు లాంటి బృహత్ పథకాలను ప్రభుత్వం చేపట్టబోతున్నది. ఈ పథకం అమలు ఒక యజ్ఞం లాం టిది. అది కేసీఆర్ రాజకీయ ప్రతిష్ఠతో ముడిపడి ఉంది. ఇల్లు లేని వారి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో నిజానిజాలు తెలుసుకోవాలి. అందులో జరిగే ప్రతి పొరపాటుకు సంబంధిత అధికారినే బాధ్యుణ్ణి చేయాలి,అక్రమం జరిగితే కఠినమైన శిక్ష ఉండేలా విధానం రూపొందించాలి. దాని వల్ల రాజకీయ జోక్యమే కాకుండా, అవినీతి అవకాశాలు కూడా బాగా తగ్గుతాయి. నిజమైన లబ్ధిదారులకు మేలు జరుగుతుంది. అడ్డగోలుగా బోగస్ రేషన్‌కార్డులు, అనర్హులకు పింఛన్‌ల వ్యవహారాలు సైతం తెలుగుదేశం, కాంగ్రెస్‌లు చేసి పెట్టిన పాప ఫలితాలే. కోటీశ్వరులకు సైతం తెల్లరేషన్ కార్డులు, పింఛన్ కార్డులు ఇచ్చిన ఘనత రాజశేఖరరెడ్డిదైతే&నీటి సంఘాలను నెలకొల్పి నిధుల దోపిడీని, ఇసుక దోపిడీని నేర్పిన ఘనత చంద్రబాబుది. తెలంగాణ గ్రామాలలో క్యాడర్ కోసం ఆంధ్రా పార్టీలు చేసిన ఇలాం టి విధ్వంస పూరిత అవినీతిని వివరించి చెప్పడం అంత సులభం కాదు.
నీటి సంఘాల పరిస్థితిపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధ్యయనం చేయాలి.ప్రతి గ్రామంలోని చెరువులు, కుంటలు, నీటి లభ్యతపై సమగ్ర రిపోర్టు తయారు చేయాలి. రాజకీయాలకతీతమైన రీతిలో ప్రభుత్వమే గ్రామంలోని ఉత్తమ రైతు ను నీటి సంఘానికి అధ్యక్షుడుగా నామినేట్ చేయాలి. అయినా ఆంధ్రాపార్టీలు గ్రామాలలో ప్రవేశ పెట్టిన దోపిడీ వైరస్‌ను పూర్తిగా పారద్రోలడం ఇప్పుడు సాధ్యమేనా అనే అనుమానం రావచ్చు.అధికారులు, ప్రజాప్రతినిధుల నిజాయితీ సంగతి ఎలా ఉన్నా, వారిపై నిఘా పెట్టగలవారు ఇవాళ తెలంగాణ గ్రామాలలో చాలా మందే ఉన్నారు. ఉద్యమ స్ఫూర్తి గ్రామాలలో ఇంకా బతికేవుంది. తెలంగాణ పునర్నిర్మాణంలోనూ దాన్ని ప్రభుత్వం ఉపయోగించుకోవాలి.

kalluriఇవాళ తెలంగాణలోని ప్రతి గ్రామంలోనూ కనీసం పది మంది కేసీఆర్‌లుంటారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును వారు కనిపెడుతూనే ఉంటారు. అలాంటి సామాజిక చైతన్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి. తెలంగాణ గ్రామాలలో ఆంధ్రా పార్టీలు నేర్పిన రాజకీయ అవినీతిని అంతమొందించి, నూతన రాజకీయ చైతన్యాన్ని పునర్నిర్మించాలి. గ్రామాభివృద్ధిలో తెలంగాణ ముద్ర అడుగడుగున కనపడాలి. ఈ విషయాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏమేరకు గుర్తించగలిగితే, ఆ మేరకు పథకాల ఫలితాలు ప్రజలకు అందుతాయి. ప్రభుత్వం ఆశిస్తున్న తీరుగా రాష్ట్రం అభివృద్ధిపథాన ముం దుకు పోతుంది.

546

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ