బలమైన నేతృత్వమే రక్ష


Thu,July 17, 2014 01:23 AM

తెలంగాణలో కేంద్రం బుల్డోజ్ విధానంతో ఆంక్షలను చట్టబద్ధం చేస్తున్నది. పోలవరం ముంపు మండలాలను ఆంధ్ర రాష్ట్రం లో కలుపుతూ రాజ్యసభలో మోడీ సర్కార్ తీర్మానం చేసింది. ఇంకా కృష్ణా,గోదావరిపై అంక్షలు సమస్య వున్నది. అప్పులు-ఆస్తుల పంపకం జరుగుతూనే ఉన్నది. ఉమ్మడి రాజధానిపై గవర్నర్ ఆధికారాలు, ఉమ్మడి హైకోర్టు, ఉమ్మడి విద్య ఇలా అనేక ఆంక్షలతో కూడిన తెలంగాణకు మోడీ ఏ మేరకు న్యాయం చేయగలరనేదే ప్రశ్న. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశానికి ప్రధాని అయితే, రాష్ర్టాల సమస్యలు, అందునా కొత్తగా ఏర్పడ్డ రాష్ర్టాలకు ఉండే సమస్యలు అర్థమవుతాయనుకున్నాం.

ముఖ్యం గా 58 ఏళ్ల పాటు దోపిడీకి గురైన తెలంగాణ ప్రాంతం పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారనుకున్నాం. విభజన బిల్లులో తెలంగాణకు జరిగిన అన్యాయాలు తొలగిపోతాయనుకున్నాం. కానీ ప్రధానిగా తెలంగాణ వంటి ఒక కొత్త రాష్ర్టానికి ఆయన చేస్తున్నదేమిటి? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తన ఆంధ్ర రాష్ర్టానికి న్యాయం కోరుకోవడం కన్నా, తెలంగాణకు అన్యాయం చేయాలని మోడీకి కోరుకున్నవే ఎక్కువ ఉన్నాయి. తన మంచి కోసం కాకుండా, ఎదుటివాడి చెడును కోరుతున్న చంద్రబాబు సిఫార్సులకే అధిక ప్రాధాన్యమిచ్చి తెలంగాణకు అన్యా యం తలపెడుతుండడమే ప్రధానిగా మోడీ చేస్తున్న పొరపాటు. పోలవరం ముంపు మండలాలను ఆంధ్ర రాష్ట్రంలో విలీనానికి చట్టబద్ధత కల్పించడం కావచ్చు. హైదరాబాద్‌పై గవర్నర్ ప్రత్యేక అధికారాల విషయమే కావచ్చు. బడ్జెట్‌లో మొండిచెయ్యి చూపడమే కావచ్చు. నాయుడు ద్వయం(చంద్రబాబు, వెంకయ్య) మాటలు మోడీ ఎన్నివిన్నా.. రాజ్యాంగాన్ని కాదని తెలంగాణకు అన్యాయం చేయడం ఆయన వల్ల కాదనేది కూడా అంతే నిజం. అన్యాయం జరిగితే రాజ్యాంగముంది, న్యాయవ్యవస్థ ఉన్నది. పార్లమెంటు సుప్రీమే అయినా, అది ప్రజాభిప్రాయాలను బుల్డోజ్ చేయడానికి లేదని గమనించాలి.

మోడీ తన గతానుభవాలను ఏమేరకు గుర్తుంచుకొని పాలిస్తున్నారో తెలియడంలేదు. 2001-2014 వరకు మోడీ గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ కొనసాగింది. అప్పట్లో గుజరాత్ అభివృద్ధికి కేంద్రం సహకరించడంలేదని దుమ్మెత్తిపోసిన మోడీయే, ఇవాళ అదే పనిచేయాలనుకుంటున్నారా? తెలంగాణ ప్రజల డిమాండ్‌లు ఎప్పుడూ న్యాయమైనవే తప్ప అన్యాయమైనవి కావు. తమ పార్టీని తెలంగాణ ప్రజలు ఎందుకు ఆదరించలేదో ఆత్మవిమర్శ చేసుకోలేని మోడీ, ఇపుడు తెలంగాణ పట్ల వివక్ష చూపడం మంచిదికాదు. తెలంగాణ 58ఏళ్లు రాజకీయ స్వతంత్రాన్ని కోల్పోయి నిర్జీవమై అభివృద్ధికి దూరమైంది. ఆంధ్రాపార్టీలనే కాదు, ఢిల్లీ పార్టీలను ఆదరించిన తెలంగాణ ప్రజలకు ఏనాడూ న్యాయం జరగలేదు. బీజేపీ సైతం తెలంగాణలో 4ఓట్లు సంపాదిస్తూ కూడా ఆంధ్రాపార్టీల ప్రాపకానికే ప్రాధాన్యమిస్తుంది. మొన్నటి ఎన్నికల్లోనూ అదే పని చేసింది. తెలంగాణేతర పార్టీలను ఎన్నుకొని మరోసారి రాజకీయ బందీలు కాకూడదనే తెలంగాణ ప్రజలు రాజకీయ స్వతంత్రాన్ని గెలిపించుకున్నారు.

ఇవాళ మోడీ సర్కార్ తెలంగాణకు సహకరించలేకపోతున్న తరుణంలో.. ధీరత్వం కలిగిన నేతృత్వాన్ని తెలంగాణ రాష్ట్రం కలిగిఉండడం ఒక శుభపరిణామం. చిత్తశుద్ధి, దార్శనికత, పట్టుదల ఉన్న నాయకుడు ఉంటే చాలు.. ఎన్ని ఆటంకాలేర్పడినా పాలనా సామర్థ్యాన్ని చాటుకోగలుగుతాడు. అలాంటి నాయకులను చాలా అరుదుగా చూస్తుంటాం. వర్తమాన కాలంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను 15 ఏళ్లుగా చూస్తున్నాం. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీని చూశాం. ఇవాళ ఆయనే దేశానికి ప్రధాని కూడా అయ్యారు. నవీన్ పట్నాయక్, నరేంద్రమోడీలు ముఖ్యమంత్రులుగా కొనసాగిన 14ఏళ్ల కాలంలో పట్టువదలని విక్రమార్కుడిలా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపారు. ఒక పాలకుడు మంచిపాలన అందించడం ఎంత కష్టమో.. ఒక ఉద్యమ నేత గమ్యా న్ని ముద్దాడడం అంతకన్నా కష్టం.

ఈ దేశంలో ముఖ్యమంత్రులుగా నవీన్ పట్నాయక్‌కు, నరేంద్రమోడీకి ఎంత కీర్తి దక్కిందో, ఉద్యమ నేతగా కేసీఆర్‌కు అంతకు మించిన కీర్తి దక్కింది. బహుశా రెండేళ్ల క్రితం కావచ్చు ఒక అమెరికన్ యూనివర్సిటీ భారతదేశంలో ప్రజలను అత్యంత ప్రభావితం చేయగలుగుతున్న నాయకుడెవరు?-అనే అంశంపై సర్వే నిర్వహించింది. అందులో మొదటి స్థానం మోడీకి లభిస్తే, రెండో స్థానం కేసీఆర్‌కు దక్కింది. ప్రజలను ప్రభావితం చేయడంలో ఒక ప్రాంత నాయకుడికి జాతీయ స్థాయిలో రెండో స్థానం దక్కడం మనం ఎన్నడూ చూడలేదు. అంటే మోడీకి లభించిన ఆదరణ కంటే కేసీఆర్‌కు లభించిన ఆదరణ మరింత గొప్పదని చెప్పాలి. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీ ఈ దేశ నలుమూలల చేసిన ఎన్నికల ప్రచార ప్రభావాన్ని చూశాం. దేశంలో ఆయన ప్రభావాన్ని అడ్డుకోగలిగిన వారు కేసీఆర్, నవీన్ పట్నాయక్, జయ, మమత మాత్రమే. జయ, మమతలు వరుసగా కరుణానిధి, సీపీఎంతో ఉన్న వైరుధ్య రాజకీయాలతో పోటీ పడి గెలుపొందారు. కానీ కేసీఆర్, నవీన్ పట్నాయక్‌లు మాత్రం ఏకోన్ముఖ నేతలుగా గెలుపొంది అధికారం చేపట్టారు. దార్శనికత, పట్టుదల, చిత్తశుద్ధి గల కేసీఆర్, నవీన్ పట్నాయక్ లాంటి పాలకుల పాలనా సామర్థ్యాన్ని ఎవరూ తగ్గించలేరని గమనించాలి.

ఒకోసారి నిర్బంధాలే పట్టుదలను పెంచుతాయి. ఉద్యమం నడపడంలో చూపి న ధీరత్వం, సమర్థ పాలన అందించడంలోనూ అంతకు రెండితల ధీరత్వాన్ని చూపాలనే పట్టుదల కేసీఆర్‌లో మనకు 6 వారాల ఆయన పాలనా తీరులోనే కనిపిస్తున్నది. కొత్తగా ఏర్పడిన రాష్ర్టాన్ని అర్థం చేసుకునేందుకు పాలకుడికి కనీ సం ఒక ఏడాదైనా పడుతుంది. కానీ కేసీఆర్ 40 రోజుల్లో సమీక్షలు జరిపిన తీరు చూస్తే ఆయన ఎంత వేగవంతంగా పని చేస్తున్నారో మనకు కనిపిస్తున్నది. సహజంగా ఆ పట్టుదల 14ఏళ్లు ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్‌లో ఉంటుంది. 14ఏళ్లు గా తెలంగాణ నదులు, నీళ్లు, నిధులు, వ్యవసాయం, విద్య, వైద్యం, ఉపాధి వంటి అన్ని రంగాలపై నిపుణులతో గంటల తరబడి చర్చించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. ఇవాళ తెలంగాణలో ఏ మూలలో ఏ వాగు ఉన్నది లాంటి భౌగోళిక నైసర్గిక స్థితిగతులను, నిధులు, నీళ్లు విద్య, వైద్యంలో తెలంగాణ స్థితిగతులను నోట్ చూడకుండా నోటితో చెప్పగలనేత కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ ఒక విజనరీ మాత్రమే కాదు. రాజనీతిజ్ఞుడు కూడా. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా -న్యాయం చేస్తే ఆదరిస్తాం, మద్దతిస్తాం, అన్యాయం చేస్తే వ్యతిరేకిస్తాం అనేదే కేంద్రం పట్ల మొదటి నుంచీ కేసీఆర్ వైఖరి.

దేశంలో తెలంగాణ రాజకీయానికి ఎవరూ శత్రువులు కారు. సహకరించే వారంతా మిత్రులే, వ్యతిరేకించే వారు మాత్రమే విరోధులు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా గుజరాత్‌ను ఒక మోడల్ స్టేట్‌ను చేయగలిగానని చెప్పుకున్న మోడీ.. ఇవాళ తెలంగాణ పట్ల తానెలా వ్యవహరిస్తున్నారో చెప్పగలరా? తనకో నీతి, ఇతరులకో నీతి ఎన్నటికీ పనిరాదు. ఒకవేళ ఈ దేశ సమగ్రాభివృద్ధి కాంక్ష మోడీలో ఉంటే, తెలంగాణపై ఉంచిన అడ్డగోలు ఆంక్షలను తొలగించేందుకు సహకరించాలి. తెలంగాణ వంటి ఒక కొత్త రాష్ట్రం కేసీఆర్ లాంటి ఒక విజనరీ పాలకుణ్ణి కలిగి ఉన్నందుకు అభినందించాలి. దేశంలో తెలంగాణ రాష్ట్రం మరో మోడల్ స్టేట్ కావడానికి సహకరించాలి. అలాకాకుండా, తనకు జరగాల్సిన మంచిని వదిలేసి, ఎదుటి వాడి చెడు కోసం చంద్రబాబు చేసే సిఫార్సులకే ప్రాధాన్యమిస్తే.. తెలంగాణ ప్రజల దృష్టిలో మాత్రమే కాదు, ఈ దేశ ప్రజల దృష్టిలోనూ మోడీ అప్రతిష్ట మూట కట్టుకుంటారనడంలో అనుమానం లేదు.

671

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ        


country oven

Featured Articles