సమాఖ్య స్ఫూర్తిని మరిచిన మోడీ


Wed,July 9, 2014 07:01 PM

రాష్ట్ర విభజన బిల్లు 8వ షెడ్యూల్‌లో ఉమ్మడి రాజధానిపై గవర్నర్‌కు ఉండే అధికారాల గురించి చెప్పిందేమిటి? ఇవాళ కేంద్రం పంపిన సర్క్యులర్‌లో ఉన్నదేమిటి? బిల్లులోఉన్న ఉమ్మడి రాజధాని శాంత్రిభద్రతలపై ఆ మాత్రపు గవర్నర్ బాధ్యతలనే తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తుండగా.. కేంద్రం గవర్నర్‌కు మరిన్ని అధికారాలు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగా సర్క్యులర్ పంపడాన్ని కేంద్రం ఎలా సమర్థించుకోవాలనుకున్నదో తెలియదు. బిల్లులో రాజధాని శాంతిభద్రతల పట్ల గవర్నర్‌కు బాధ్యత ప్రస్తావన తప్ప ఆధికారం ప్రస్తావన లేదు. అలాగే రాజధాని పోలీసు వ్యవస్థ మొత్తం గవర్నర్ చేతిలో ఉంటుందని బిల్లు లో ఎక్కడాలేదు. కానీ కేంద్రం పంపిన సర్క్యులర్‌లో రెండు కమిషనరేట్లు, రంగారెడ్డి జిల్లా పోలీసు ఉన్నతాధికారులంతా గవర్నర్‌కు పరిస్థితుల నివేదికలు ఇవ్వాలని వారు గవర్నర్‌కే జవాబుదారీగా ఉంచాలని అడగడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసలు రాష్ట్ర పరిధిలోని శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్ ద్వారా కేంద్రం నడపాలనుకోవడమే ఫెడరల్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధం.

అయినా రాజధానిలో బతుకుతున్న ఇతర ప్రాంతాల వారికి, అలాగే సీమాం ధ్ర నుంచి వచ్చి బతుకుతున్న సగటు జీవులకు లేని భయం చంద్రబాబుకు ఎందుకు కలుగుతున్నది? తెలంగాణ ఉద్యమకాలం నుంచే కేసీఆర్ ఒక మాట స్పష్టంగా చెపుతూ వచ్చారు.బతకడానికి వచ్చిన వారితో పేచీలేదు, తెలంగాణ ఆస్తులను, ఉద్యోగాలను అక్రమంగా కొల్లగొట్టిన వారితోనే పేచీ- అని.రాజధానిలో అన్ని ప్రాంతాల వారు హాయిగా బతకొచ్చని ఇప్పటికీ చెపుతున్నారు.కాబట్టి రాజధానిలో ప్రాంత వివక్ష అనేది ఒక అభూత కల్పన. అక్రమ ఆస్తులు కూడబెట్టినవారు తెలంగాణ ప్రభుత్వ చట్టబద్ధ చర్యలకు భయపడడం సహజ పరిణామం. దాన్ని శాంతిభద్రతల సమస్యగా చూపే ప్రయత్నం అక్రమార్కులు నిరంతరం చేస్తూనే ఉంటారు. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలో కలుగజేసుకోవడమే అభ్యంతరకరం.పైగా చంద్రబాబు లేఖకు స్పందిస్తున్నట్లుగా కేంద్రం సర్క్యులర్ పం పడం మరింత దారుణం.

తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి రాజధాని శాంతిభద్రతల విషయంలో ఎక్కడైనా విఫలమైనా, వివక్ష చూపినా గవర్నర్ జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ విభజన బిల్లు ఆమోదం పొంది 7నెలలు గడుస్తున్నా...కొత్త ప్రభుత్వం ఏర్పడి 6వారాలు గడుస్తున్నా రాజధానిలో శాంతి భద్రతల సమ స్య తలెత్తిన సంఘటన ఎక్కడా లేదు. గురుకుల్ భూములలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించాలని గతంలోనే కోర్టు తీర్పులున్నాయి. వాటి ఆధారంగానే ప్రభుత్వం చట్టబద్ధంగా వాటి కూల్చివేతలు చేయగలిగింది. అంతే తప్ప దాన్నెవరైనా శాంతిభద్రతల సమస్య అనగలరా? అక్రమ కట్టడాలను చట్టబద్ధంగా కూల్చివేతలు చేస్తే అది శాంతిభద్రతల సమస్య అవుతుందా? ఘనత వహించిన చంద్రబాబు నిఘంటువులో దానికి అర్థమేముందో మనకు తెలియదు.

బిల్లులో చెప్పినట్లు ఉమ్మడి రాజధాని ప్రాంతం లో నివసించే ప్రజలందరి ప్రాణ, ఆస్తి, స్వేచ్ఛ, భద్రతలను కాపాడే గవర్నర్ బాధ్యతలకు ఎక్కడైనా భంగం కలిగిన సంఘటన జరిగిందా? గుమ్మడి కాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు చంద్రబాబు, కొందరు సినీ పెట్టుబడిదారులు, కబ్జాదారులు ఎందుకు జడుసుకుంటున్నారు? కేంద్రాన్ని ఎందుకు ఉసిగొల్పుతున్నారు? అయినా అక్రమాస్తులను ప్రభుత్వం స్వాధీ నం చేసుకోవడాన్ని సమాజంలోని ప్రతి ఒక్కరూ హర్షిస్తారు. కానీ ఇక్కడ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్రపూరితంగా కేంద్రాన్ని పక్కదారి పట్టించి వందిమాగాదుల అక్రమ ఆస్తులను కాపాడుకోవాలనుకోవడమే ఒక దారుణం. సరేవారి అక్రమాస్తులను కాపాడుకునేందుకు వారు కేంద్రంపై వత్తిడి తెచ్చి నా.. కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి ఓ సర్క్యులర్ పంపుతూ, గవర్నర్‌కు మరిన్ని అధికారాలను కట్టబెట్టాలని చెప్పడమే మేధావి లోకాన్ని సైతం ఆలోచింపజేసిన విషయం.
గురుకుల్ భూములలోని అక్రమ కట్టడాల కూల్చివేత చట్టబద్ధం కానపుడు గవర్నర్ జోక్యం చేసుకునే అవకాశం ఉంది. అయితే, గవర్నర్‌కు అవి చట్టబద్ధమైన కూల్చివేతలేనని తెలుసు కాబట్టి ఆయన జోక్యం చేసుకోలేదని మనం గమనించాలి.

గత ప్రభుత్వాలిచ్చిన భూములలో వాడుకొని భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏ ప్రజా ప్రయోజనాలను దష్టిలో ఉంచుకొని భూములు కేటాయించబడ్డా యో, ఆ ప్రయోజనాల కోసం ఆ భూములు వినియోగించబడనపుడు ఏ ప్రభుత్వమైనా ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవల్సిందే. దాన్ని కూడా శాంతిభద్రతల సమస్యగా భావిద్దామా? అక్రమ నిర్మాణాలు. కేటాయించిన భూములను దుర్వినియోగం చేయడాన్ని ఈదేశ ప్రధాని నరేంద్రమోడీ, ఈ దేశ హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సమర్ధిస్తారా? ఒక రాష్ట్ర రాజధాని శాంతిభద్రతలను గవర్నర్ కు అప్పగించడం ఈ విశాల భారతదేశంలో ని ఏ రాష్ట్రంలో జరగలేదు. మరి తెలంగాణ రాష్ట్ర రాజధాని శాంతిభద్రతల ను గవర్నర్‌కు ఎందుకు అప్పగిద్దామనుకుంటున్నారు? ఆ దుష్ట సంప్రదాయాన్ని తెలంగాణలో ఎందుకు ప్రయోగించాలనుకుంటున్నారు? అది తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని అవమానించడమే అవుతుంది. తెలంగాణ ఇంతకాలం దోచుకోబడ్డ ప్రాంతం.

ఇపుడది తనను తాను పాలించుకుంటున్నది. జరిగిన దోపిడీని చట్టబద్ధంగా వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నది. దోపిడీని వెలికి తీయకుండా ఉండేందుకే గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు అప్పగించాలనుకుంటున్నారా అని సగటు పౌరుడికి అవరిస్తున్న అనుమానానికి కేంద్ర పాలకులు జవాబు చెప్పగల రా? చట్టబద్ధ పాలనలో భాగంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని అవమానించడం మోడీ సర్కారుకు మంచి పరిణామం కాదు. అక్రమ ఆస్తుల రక్షణ కోసం, అక్రమ నిర్మాణాల రక్షణ కోసం గవర్నర్‌కు ఎవరూ అధికారాలివ్వరు. ఈ విషయంలో కేంద్రం తప్పటడుగు వేయకుండా జాగ్రత్త పడుతుందా లేదా చూడాలి. ఎందుకంటే, ఎన్నికలకు ముందు, కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో తాము పారదర్శకంగా పని చేస్తామని మోడీ ఈ దేశ ప్రజలకు మాటిచ్చారు. రాష్ర్టాల హక్కులను కాపాడతామన్నారు. ఫెడరల్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తామన్నా రు. ఎన్నికల ముందు మోడీ చెప్పిన మాటలకు కట్టుబడి పని చేయాలి. రాష్ట్ర విభజన బిల్లులో తెలంగాణ రాష్ర్టానికి అనేక అన్యాయాలు జరిగాయి.

అం దులో ఉమ్మడి రాజధాని ఒకటి. ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు శాంతిభద్రతల పర్యవేక్షణ అధికారాలివ్వడం మరొకటి. శాంతిభద్రతలు రాష్ర్టాల పరిధికి సంబంధించినవి. వాటిలో గవర్నర్ జోక్యం చేసుకోవడం ఫెడరల్ స్ఫూర్తి కి మంచి పరిణామం కాదు. కాబట్టి విభజన బిల్లులో ఉన్న ఉమ్మడి రాజధాని శాంతిభద్రతల అంశంలో గవర్నర్ జోక్యాన్ని తొలగించి.. మోడీ ఈదేశ ప్రజలకిచ్చిన ఫెడరల్ స్ఫూర్తి హామీని నిలబెట్టుకోవాలి. ఎన్నికల్లో ఈ దేశ ప్రజలకు తానిచ్చిన ఫెడరల్ హామీని ఇపుడు మోడీ ఇపుడు మరిచారా, మరువలేదా అనేది తేలాలంటే.. గవర్నర్ అధికారాల కోసం పంపిన సర్క్యులర్ కథను ఆయన సుఖాంతం చేయడంపైనే అధారపడివుందని చెప్పాలి.

846

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ        


Featured Articles