నీళ్లపైనా ఆంక్షలేనా?


Tue,December 31, 2013 12:36 AM

తెలంగాణ కొట్లాట మొదటి నుంచీ నీళ్ల కోసమే. ఆ నీళ్లపైనే నియంవూతణ విధిస్తే వచ్చే తెలంగాణ ఎవరి కోసం, ఎందుకోసమని తెలంగాణ గ్రామా లు నిలదీస్తున్నాయి. తెలంగాణ నీళ్లపై కేంద్రం నియంవూతణను బేషరతుగా ఎత్తేయాలి.
బిల్లులో తేవలసిన మిగతా సవరణలతోపాటు నీటిపై నియంవూతణ ఆంక్షలను తొలగించే సవరణ కూడా తెచ్చితీరాలి.


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు (ఏపీ పునర్విభజన-2013 డ్రాఫ్ట్‌బిల్లు) తెలంగాణ పైనే కొన్ని ఆంక్షలు విధించ డం విచిత్రం! తెలంగాణ ఇస్తూనే ముందటి కాళ్లకు బంధంగా కొన్ని ఆంక్షలు విధించాలనుకోవడంలో అర్థం లేదు. గవర్నర్ కు ఉమ్మడి రాజధానిపై పదేళ్లపాటు ప్రత్యేకాధికారాలు, ఉమ్మడి హైకోర్టు, గోదావరి, కృష్టా నదులపై కేంద్రం అజమాయిషీ, విద్యుత్ రంగం లో నింబంధనలు, అప్పులు ఆస్తుల పంపకాలను జనాభా ప్రాతిపదికన పంచటం, ఉన్నత విద్యను ఐదేళ్లవరకు యథాతథంగా కొనసాగించటం.... లాంటివన్నీ తెలంగాణ పునరుజ్జీవనానికి అవరోధాలే. వాటి సవరణలు జరిగితే తప్ప వచ్చే తెలంగాణకు అర్థముండదు.

తెలంగాణ పోరాట ప్రాతిపదికనే నిధులు, నీళ్లు, నియామకాలు, వాటిపైన ప్రత్యక్ష, పరోక్ష ఆంక్షలు పెట్టి తెలంగాణ ఇస్తే....అదనంగా ఒరిగేది ఒక అసెం బ్లీ, ఒక సెక్ర ఒక ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు మాత్రమే! అయితే ఈ బిల్లులో తెలంగాణపై ఉన్న ఆంక్షలను టీఆర్‌ఎస్ మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నది. బిల్లులో సవరణలు చేసే దాకా పట్టుదలగా పోరాటం చేస్తామంటున్నది. అయితే తెలంగాణలో బతుకుతున్న మిగతా పార్టీలు, వాటి ప్రజావూపతినిధులు కూడా అంతే చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరాన్ని ఆ పార్టీలకు తెలంగాణ సమా జం గుర్తుచేస్తున్నది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బిల్లులోని అభ్యంతరాలపై సవరణలు కోరుతూ ప్రధానికి ఇప్పటికే లేఖ రాశారు. కలిసి కొట్లాడుదామని తెలంగాణ కాంగ్రెస్ నాయకుల దగ్గరికి వెళ్లా రు. తెలంగాణలో బతుకుతున్న ఇతర పార్టీలను కూడా కలిసిరావాలని కోరుతున్నారు. తెలంగాణ జర్నలిస్టుల ఫొరం (టీజేఎఫ్) అధ్యక్షలు అల్లం నారాయణ కూడా చొరవ తీసుకొని తెలంగాణ ప్రజావూపతినిధులందరినీ సమావేశపరిచారు. వారి లో సమన్వయం కోసం కృషి చేశా రు.ఇప్పటికైనా తెలంగాణలో ఉన్న పార్టీలన్నీ బిల్లు లో సవరణల కోసం పార్లమెంటులో పోరాడాలి.
ముఖ్యంగాబిల్లులోఉన్న అభ్యంతరాలలో ‘గోదావరి, కృష్ణా నదుల నీటిపై నియంవూతణను కేంద్రం తన అజమాయిషీలో ఉంచుకోవడం’ తీవ్రమైన విషయం. రెండు జీవనదుల అంశం ఈప్రాంత ప్రజ ల జీవితాలతో ముడిపడి ఉన్నందున దీనిపై తెలం గాణ సమాజమంతా తీవ్రంగా ఆలోచించాలి.

‘తలాపునా పారుతుంది గోదారీ... మనకేమో మిగులుతుంది ఎడారీ’-అనే పాట తెలంగాణ నీళ్ల వేదనకు ఒక నిదర్శనం. ఆ నీటి వేదనకు ఒక పరిష్కా రం దొరికిందనుకున్నాం. కానీ, బిల్లులోని 84, 85, 86, 87 క్రమ సంఖ్యలు గోదావరి, కృష్ణా జీవనదులపై ఆంక్షలు పెడుతున్నాయి. అవి తెలంగాణ బతు కు ఆశకు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి.

తెలంగాణకు ప్రకృతి ప్రసాదించిన జలవనరులపై కూడా ఆంక్షలుంటే.. ఇక వచ్చే తెలంగాణకు అర్థమేమిటో? రెండు నదులపై అపెక్స్ కౌన్సిళ్లు ఏర్పాటు చేసి, కేంద్రమే నియంవూతిస్తుందట! ఉమ్మడి రాష్ట్రం లో తెలంగాణకు ట్రిబ్యూనళ్లు కేటాయించిన నీళ్లకే ఇంతవరకు దిక్కులేదు! రేపు తెలంగాణ రాష్ట్ర నీళ్ల వాడకంపై కూడా కేంద్రమే అజమాయిషీ చెలాయి స్తే.. ఒక్క ప్రాజెక్టు కట్టుకోవడానికైనా తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ ఉంటుందా? కృష్ణా నదిలో ఉమ్మ డి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీలలో తెలంగాణకు 298 టీఎంసీలు చెందాలని ట్రిబ్యునల్ చెప్పింది. గోదావరి నదిలో ఉమ్మడి రాష్ట్రానికి కెటాయించిన 1480 టీఎంసీల నీటిలో తెలంగాణ కు 900టీఎంసీలు చెం దాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. అంటే రెండు నదులపై మొత్తం 1198టీఎంసీల నీటిని వాడుకునే హక్కును తెలంగాణ ఇప్పటికే కలిగిఉన్నది. అందు లో మహా అయితే కొద్దిపాటి టీఎంసీలకు మించి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాడుకోగలుగుతున్నదిలేదు. అంటే మిగిలిన దాదాపు 1000 టీఎంసీలకు పైగా నీటిని చట్టబద్ధంగా తెలంగాణ వాడుకోగలిగే హక్కును కలిగివుంది.

అలాంటి హక్కును సద్వినియోగం చేసుకోవడానికే కదా మనం ప్రత్యేక రాష్ట్రా న్ని కోరుకుంటున్నది.1200టీఎంసీల నీటిపై హక్కు లు కలిగి ఉండి కూడా 57 ఏళ్లుగా ఉమ్మడి రాష్ట్రంలో వంచనకు గురయ్యాం. అలాంటి స్వేచ్ఛను తిరిగి నియంవూతిస్తూ తెలంగాణ నీళ్ల హక్కులను కేంద్రమే తన నియంవూతణలోకి తీసుకుంటానపడం అన్యాయం. కేంద్ర అజమాయిషీలో కొనసాగే అపెక్స్ కౌన్సిళ్ల అనుమతి లేనిదే, రేపటి తెలంగాణ ప్రభుత్వాలు రెండు నదులపై ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేవనే విషయం అందరం గ్రహించాలె. రెండు నదులపై కేంద్రం విధిస్తున్న ఆంక్షలు పరోక్షంగా సీమాంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకే ఉపయోగపడతాయి. మరి తెలంగాణ హక్కులు కలిగిన నీళ్లపై ప్రాజెక్టులు కట్టకోవడానికి తెలంగాణ ప్రభుత్వాలకు రేపు కేంద్రం అనుమతులివ్వకపోతే ఏం చేయగలం? ఇప్పటివరకు ఏ రాష్ట్ర నీటి హక్కులపై నియంవూతణ విధించని కేంద్రం.. ఇపుడు తెలంగాణ నీటి హక్కులపై మాత్ర మే నియంవూతణ విధించాలనుకోవడం అప్రజాస్వామికం.

ఎప్పుడైనా కేంద్రంలో సీమాంధ్ర నేతల మాటలకు తలొగ్గే ప్రభుత్వాలే ఉంటాయి. ఎందుకంటే ధనబలం, మందబలం ఉంది కాబట్టి! అలాగే పెట్టుబడిదారుల ప్రాంతం కాబట్టి! కేంద్ర పాలకులను తమ గుప్పిట్లో పెట్టుకొని తెలంగాణ కొత్త ప్రాజెక్టులకు అనుమతులు రాకుండా వారు అడ్డు కోగలుగుతారు. సీమాంవూధకు మరిన్ని అక్రమ జలాలను తరలించుకు పోగలుగుతారు! అందుకే రెండు నదులపై కేంద్ర అజమాయిషీ గండాన్ని బిల్లులోనే తుంచేయాలి. అన్యాయానికి గురైన ప్రాంతంగా తెలంగాణకు ఏ న్యాయం జరగాలన్నా, బిల్లులోనే జరగాలి తప్ప, తర్వాత న్యాయాన్ని ఆశించడం అత్యాశ. కేసీఆర్ తన ‘విజన్’లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరందించేందుకు కృషి చేస్తామన్నారు. కేసీఆర్ కూడా ఆ రెండు జీవనదులలోని 1200 టీఎంసీల తెలంగాణ నీటి వాటాను దృష్టిలో పెట్టుకునే తన విజన్ ప్రకటించా రు. రేపటి తెలంగాణ మిగతా వెయ్యి టీఎంసీల నీళ్ల ను తానే వాడుకోగలిగినపుడే, తెలంగాణలో కోటి ఎకరాలు పచ్చని పొలాలుగా మారుతాయి. తెలంగాణ గ్రామాలు పునరుజ్జీవనం పొందగలుగుతా యి. తెలంగాణ గ్రామీణ నిరుద్యోగులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు లభిస్తాయి. గ్రామీణ వృత్తులు తిరిగి అధునిక రూపంలో చిగురిస్తాయి. వట్టిపోయిన గ్రామాలు పసిడి పంటలతో తిరిగి విలసిల్లుతాయి. ఆకు పచ్చని తెలంగాణే అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. తెలంగాణ గ్రామీణ జీవితాలే కాదు, సమస్త తెలంగాణ అభివృద్ధి రెండు జీవనదులపై (కృష్ణా, గోదావరి) ఆధారపడిఉంది. పారే జీవనదులే మనిషి సౌభాగ్యానికి మూలాలు. అలాంటి జీవనదులపై ఆంక్షలు ఉంటే, వాటి నీటిని వాడుకునేదెట్లా? తెలంగాణ సౌభాగ్యమయ్యేదెట్లా?

తెలంగాణ కొట్లాట మొదటి నుంచీ నీళ్ల కోసమే. ఆ నీళ్లపైనే నియంవూతణ విధిస్తే వచ్చే తెలంగాణ ఎవరి కోసం, ఎందుకోసమని తెలంగాణ గ్రామా లు నిలదీస్తున్నాయి. తెలంగాణ నీళ్లపై కేంద్రం నియంవూతణను బేషరతుగా ఎత్తేయాలి. బిల్లులో తేవలసిన మిగతా సవరణలతోపాటు నీటిపై నియంవూతణ ఆంక్షలను తొలగించే సవరణ కూడా తెచ్చితీరాలి. లేదంటే వచ్చే తెలంగాణలోనూ వట్టిపోయిన వ్యవసాయమే కొనసాగే ప్రమాదం ఉన్నది.

-కల్లూరి శ్రీనివాస్‌డ్డి

225

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ        


country oven

Featured Articles