తెలంగాణం


Fri,November 15, 2013 12:18 AM

తెలంగాణకు ఇంటిపార్టీ అనివార్యం
‘తెలంగాణను ఎవరి కోసం ఇస్తున్నారు? నష్టపోతున్న తెలంగాణ ప్రజల కోసమా? దోచుకున్న సీమాంవూధుల కోసమా? 60 ఏళ్ల సీమాంధ్ర దోపిడీని చట్టబద్ధం చేయాలనుకుంటున్నా రా?’ అని జీఓఎంను తెలంగాణ ఇంటిపార్టీ ఆధినేత సూటిగా ప్రశ్నించగలిగారు. అంతేసూటిగా మరో పార్టీ ప్రశ్నించగలిగిందా? ఇవాళ చంద్రబాబు ఏం డిమాండ్ చేస్తాడు, రేపు ఏమని మాటమారుస్తాడు అనే విషయంలో అందరికన్నా తెలంగాణ ప్రజలకే బాగా తెలుసు. కాబట్టి చంద్రబాబుపార్టీ ఇవాళ తెలంగాణలో చెల్లని పార్టీ. జగన్‌పార్టీ తెలంగాణకు విడాకులు ఇచ్చిన పార్టీ! చంద్రబాబు, జగన్‌బాబుల 23 జిల్లాల రాజ్యకాంక్ష కాటికి పోయినా పోయేదికాదు. కాకపోతే కొన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగానే మాట్లాడుతున్నాయి.

10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాల్సిందే అని బీజేపీ, సీపీఐ జీఓఎంలో చెప్పాయి. కానీ అదే సమయంలో సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలన్నాయి. అ న్యాయం జరిగితేనే కదా న్యాయం చేయాలని అడుగుతాం! అలాంటపుడు సీమాంవూధకు ఏం అన్యాయం జరిగిందని ఆ రెండు పార్టీలు న్యాయం చేయాలంటున్నాయి?అంటే తెలంగాణకు అనుకూలంగా ఉన్న పార్టీలు సైతం దోపిడీదారుల గొంతెమ్మ కోర్కెల ను అంగీకరిస్తున్నాయనుకోవాలా? ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే తెలంగాణ ఇంటిపార్టీ తప్ప,ఇంకో పార్టీ తెలంగాణపై అంతా సూటిగా చెప్పలేకపోయాయని! అందుకే మంటికైనా ఇంటోడు కావాలనే తెలంగాణ నానుడిలో ఎంత నిజముందో అందరూ గమనించాలె.


పదేళ్లపాటు ఉమ్మడి రాజధానివల్ల, పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించడం వల్ల తెలంగాణకు జరిగే నష్టం పట్ల ఇంటిపార్టీ కాస్త సంయమనం పాటించింది. కానీ దాన్ని సీమాంధ్ర నేతలు అలుసుగా తీసుకున్నారేమో తెలియదు. ‘మాది మాకే మీది మాకే’ అనే ఆటవిక వాదనలను మొదలుపెట్టారు. అలాగే అన్యాయాలు చేసిన వారి గొంతెమ్మ కోర్కెలకు ఢిల్లీలో ప్రాధాన్యం పెరుగుతున్నట్లు లీకు వార్తలు వెల్లడవుతూ వచ్చాయి. అందుకే, ‘దేశం లో ఇప్పటి దాకా 28 రాష్ట్రాలు ఎలా ఏర్పడ్డాయో, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అలాగే ఏర్పాటు చేయాలని జీఓఎంకు కేసీఆర్ నిర్మొహమాటంగా చెప్పివచ్చారు.


చేనుకు పట్టే తెగులును ఎలా నివారించాలో రైతు ఆలోచిస్తా డు. ‘చేను’ తెలంగాణ అయితే..‘తెగుళ్లు’ సీమాంవూధపార్టీలు! వాటి ని పారదోలి తెలంగాణ భవిష్యత్తును నిర్మించాల్సిన బాధ్యత తెలంగాణ ఇంటిపార్టీదే! మనం కోరుకుంటున్న సంపూర్ణ తెలంగాణ సిద్ధించాలన్నా, వచ్చిన తెలంగాణ పునర్నిర్మాణం సాఫీగా జరగాలన్నా తెలంగాణ ఇంటిపార్టీ పాత్ర అనివార్యం.అయితే, తెలంగాణ ఏర్పాటు జరిగాక తెలంగాణ ఇంటిపార్టీ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందా? అనే అనుమానం చాలామందిలో లేకపోలేదు. ఈ విషయంలోనూ కేసీఆర్ అనేక సార్లు స్పష్టత ఇచ్చారనే చెప్పాలి. ఏ షరతులు లేకుండా మనం కోరుకుంటున్న సంపూర్ణ తెలంగాణ ఇవ్వగలిగితే, విలీనం కోసం కాంగ్రెస్ ఆహ్వానిస్తే .. అపుడు తెలంగాణ ప్రజల అభివూపాయాలు ఎలా ఉంటే అలా నడుచుకుంటామనేదే కేసీఆర్ అభిమతంగా ఉన్నట్లు తెలుస్తున్నది. నిక్కచ్చిగా ప్రజల అభివూపాయానికి అనుగుణంగా తప్ప, తనకు తానుగా కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని ఎవ రూ అనుకోవడంలేదు. తెలంగాణ తేవడమే ముఖ్యం కాదు.

ఆంధ్రాపార్టీలను తరిమేయడమూ అంతే ముఖ్యం. తెలంగాణ తనకు తాను పరిపాలించుకుంటే తప్ప జరిగిన అన్యాయాలు తొలగిపోవు. తెలంగా ణ 57 ఏళ్లు బయటిపార్టీల పాలనతో నలిగిపోయింది. అన్యాయాలకు గురైంది. రేపు తెలంగాణ వచ్చాక కూడా అవే బయటిపార్టీలు పాలించాలని ఏ తెలంగాణ వాడు కోరుకోవడంలేదు. ఒకవేళ రేపటి తెలంగాణలో బయటిపార్టీల పాలన కొనసాగితే దోపిడీ ఆగిపోదు. పోతిడ్డిపాడు అక్రమ తూములు మూసుకుపోవు. జలదోపిడీ ఆగిపోదు. తెలంగాణ పునర్నిర్మాణం ఎలా జరగాలో తెలంగాణోడే నిర్ధారించగలగాలి. తెలంగాణ పునర్నిర్మాణాన్ని బయటిపార్టీల చేతిలో పెడితే... ఇప్పటి దోపిడీకి లైసెన్స్ ఇవ్వడమే. బయటిపార్టీలను ఎదుర్కొని తన అభివృద్ధిని తానే నిర్దేశించుకునే రాజకీయ స్వతంవూతాన్ని శాశ్వతంగా కలిగి ఉండాలంటే...

ఇంటిపార్టీ కొనసాగాలి, పాలించాలి. బయటిపార్టీలు తమ అధిష్ఠానాల ఆదేశాలకు కట్టుబడి నడుచుకుంటాయి. పోతిడ్డిపాడు అక్రమ తూముల నుంచి రాయలసీయ ప్రాజెక్టులకు నీళ్ల వదలండని జాతీయ పార్టీల లేదా ఆంధ్రాపార్టీల అధిష్ఠానాలు ఆదేశిస్తే బయటిపార్టీల ముఖ్యమంవూతులు వదులుతారు! అదే తెలంగాణ ఇంటిపార్టీ ముఖ్యమంత్రి ఉంటే వదులుతాడా? ఇంటిపార్టీకి, బయటిపార్టీకి ఉండే తేడాఅంటే అదే మరి! అలాంటి బయటిపార్టీల ఉనికి తెలంగాణ సమాజం ఎంతమాత్రం కోరుకోవడంబలేదు. కీడెంచి మేలెంచాలనే సూత్రా న్ని నమ్ముకొని ముందుకు సాగడమే ప్రస్తుతం ఇంటిపార్టీ ముం దున్న కర్తవ్యం.

-కల్లూరి శ్రీనివాసరెడ్డి

155

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ