టీడీపీదే వేర్పాటువాదం


Sun,September 1, 2013 11:28 PM


చంద్రబాబు ‘వస్తున్నా మీ కోసం ‘యాత్రను ప్రజలు ఆదరించలేదు. ఇపుడు మరో యాత్ర పెట్టుకున్నారు. అది తెలుగు ఆత్మగౌరవ యాత్రనట!గతంలో చంద్రబాబుతో పోటీ పడి యాత్ర చేసిన జగన్మోహన్‌డ్డి చెల్లెలు షర్మిల కూడా తానూ ఓ బస్సు యాత్ర చేస్తుందట! మొత్తం మీద కాంగ్రెస్‌పార్టీ సీడబ్ల్యూసీలో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయగానే ఆంధ్రాపార్టీల అసలు రూపాలు మరొక సారి బయటపడ్డాయి. చంద్రబాబు, జగన్‌బాబులు ఆంధ్రా బాబులే అయినా ఒక విషయంలో తేడా ఉంది. మాట తప్పని మడమ తిప్పని వాళ్లమంటూ మొన్నటిదాకా ఊదరగొట్టుకున్న జగన్‌పార్టీ ఏకబిగిన మడమ తిప్పింది, మాట తప్పింది. తమ పార్టీని సీమాంవూధకే పరిమితం చేసుకుంటామని చెప్పకనే చెప్పింది. జగన్‌పార్టీ అక్కడి ప్రజలను రెచ్చగొట్టి తెలంగాణను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తునదనడంలో అనుమానం లేదు.సీమాంవూధలో జరుగుతున్న కల్పిత ఉద్యమాల వల్ల, వచ్చే తెలంగాణకు జరిగే నష్టమేమీ లేదు. వైయస్‌ఆర్‌సీపీ ఆంధ్రాపార్టీకి ఉండే లక్షణాన్ని దాచిపెట్టుకోవడం లేదు. బహిరంగంగా ఇక్కడ తెలంగాణ ప్రాంతాన్ని వదిలేసుకుని, అక్కడ సీమాంవూధవూపజలను రెచ్చగొడుతున్నది. కాబట్టి వైయస్‌ఆర్‌సీపీ ఇపుడు తెలంగాణకు బహిరంగ విరోధి. కానీ తెలుగుదేశంపార్టీ తటస్థ ముసుగులో విరోధి పాత్ర పోషిస్తున్నది. కనిపించే శత్రువు కన్నా ‘నటించే’ శత్రువు మరింత ప్రమాదం.

2008లో చేసిన తీర్మానానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని చంద్రబాబు చెపుతూనే, మరోవైపు సీమాంవూధలో తమ పార్టీ చేత ‘సమైక్య’ ఉద్యమాన్ని నడిపిస్తూనే ఉన్నారు. వెనకటికి ఆయన మామ ఎన్టీఆర్ సినిమాలలో రెండు వేషాలు (డబుల్ యాక్షన్ ) వేసేవాడు. ఇపుడు ఆయన అల్లుడు రెండు రూపాలతో లేదా రెండు నాల్కలతో నాలుగేళ్లుగా డబుల్ యాక్షన్ చేస్తూనే ఉన్నాడు! తెలుగుజాతి పేర నటిస్తూ 30 ఏళ్లుగా తెలంగాణను వంచిస్తూ వస్తున్న ఆంధ్రాపార్టీ ఇంకా వంచనలు మానుకోవడం లేదు ‘తెలుగుదేశం పార్టీ’ పేరులోనే తెలంగాణ విధ్వంసం ఉంది. దాని పుట్టుక సైతం తెలంగాణ విధ్వంసం కోసమే! తెలంగాణ అభివృద్ధినే కాదు రాజకీయ స్వతంవూతాన్ని కబళించింది! తెలంగాణకు సస్తాబియ్యం, సబ్సిడీ కరెంటు ఎరలు వేసి, శాశ్వత అభివృద్ధిని సీమాంవూధకు తరలించింది! ఎన్టీఆర్ 610 జీవో తెచ్చింది, అంధ్రాలో ఉన్న గుప్పెడు మంది తెలంగాణ ఉద్యోగులను తరిమేయడానికి తప్ప, తెలంగాణలో ఉన్న లక్షలాది ఆంధ్రా అక్రమ ఉద్యోగులను పంపించడానికి కాదు!తెలుగుజాతికి అవమానం అంటూ కూటనీతితో, ఎన్టీఆర్ తెలంగాణ రీజినల్ కౌన్సిల్‌ను రద్దు చేశాడు! హైదరాబాద్‌లో ,తెలంగాణలో సీమాంవూధుల భూ ఆక్షికమణలకు తలుపు తెరవడానికే అయన తెలంగాణ రీజినల్ కౌన్సిల్‌ను రద్దు చేశాడు.1969 ఉద్యమంలో వెళ్లిపోయిన ఆంధ్రా అక్రమ ఉద్యోగులు, తెలుగుదేశం పుట్టాక తిరిగి హైదరాబాద్‌కు చేరడం మొదలు పెట్టారు. మళ్లీ రెండింతల అక్రమ ఉద్యోగులకు చోటుదక్కిందంటే అది తెలుగుదేశం రాజకీయ ప్రస్థానమే కారణం. 1983 నుంచి హైదరాబాద్ మళ్లీ ఆంధ్రా కాలనీగా మారడం మొదలైంది. మద్రాసుకు తాగునీటి పేర, తెలంగాణ పొందాల్సిన కృష్ణా నీటిని రాయలసీమకు మళ్లించే పథకానికి ఎన్టీఆర్ శ్రీకారం చుట్టాడు. అల్లుడు అమలు చేశాడు. ఆ తర్వాత ఎన్టీఆర్, చంద్రబాబుల కూటనీతిని వైయస్ (పోతిడ్డిపాడు ద్వారా) మరింత నడిపించిన సంగతి తెలిసిందే.

తెలంగాణ సొంత రాజకీయం 2001లో ప్రారంభమైంది. అడుగడుగునా దాని రాజకీయ ప్రస్థానాన్ని తెలుగుదేశం అడ్డుకుంటూనే వచ్చింది. 2009లో పొరపాటున పొత్తు పెట్టుకున్నందుకు తెలంగాణ ఇంటిపార్టీకి వెన్నుపోటు పొడిచి తన నిజస్వరూపం మరోసారి బయట పెట్టుకుంది. రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయపార్టీలన్నిటినీ తెలంగాణకు వ్యతిరేకంగా తయారు చేస్తూవచ్చింది. అది బీజేపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు! రాజకీయ విరోధి అయిన కాంగ్రెస్ పార్టీని కూడా చివరిదాకా తెలుగుదేశం ప్రభావితం చేస్తూవచ్చింది. రాష్ట్రంలో మూడు ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం బతుకుతున్నదంటే, అది చంద్రబాబు సహకారం వల్లనే ! ఆ సహకారాన్ని అడ్డుపెట్టి ఇంతకాలం కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుండా మేనేజ్ చేశాడనడంలో అనుమానం లేదు. తెలంగాణ ఇంటిపార్టీ అధినేత రాజకీయ వ్యూహంవల్ల,నాలుగు ఏళ్లుగా నడుస్తున్న ఉద్యమాల ప్రభావం వల్ల, కాంగ్రెస్‌కు తన ప్రయోజనాలు కూడా ఇమిడి ఉన్నందు వల్ల తెలంగాణ ఏర్పాటును ఒప్పుకోక తప్పలేదు. ఇపుడు మళ్లీ చంద్రబాబు-‘తెలుగు జాతి’కి కాంగ్రెస్ చిచ్చు పెట్టిందంటున్నారు. భారత ప్రభుత్వం తెలంగాణను ప్రకటించి నాలుగేళ్లయింది. మూడుసార్లు అఖిల పక్ష సమావేశాలు జరిగాయి. అన్నింటిలోనూ చంద్రబాబు పార్టీ తన అభివూపాయాలను వెలుబుచ్చింది. మొన్న కాంగ్రెస్ తన నిర్ణయాన్ని ప్రకటించినపుడు కూడా, ఆంధ్ర రాష్ట్రానికి కొత్త రాజధాని కోసం నాలుగు లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్ కూడా చేశారు. కానీ మరుసటిరోజే తన నాలుక మళ్ళేశాడు. చంద్రబాబు అహంభావానికి ఆయన వ్యాఖ్య అద్దం పడుతున్నది. ‘తెలుగుజాతి స్టేక్‌హోల్డర్ల’ తో చర్చించారా?’ అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇంతకీ తెలుగుజాతి స్టేక్‌హోల్డర్లు ఎవరు? చంద్రబాబు దృష్టిలో తెలుగుదేశంపార్టీ యజమానులు తెలుగుజాతి స్టేక్‌హోల్డర్లు అన్నమాట? అంటే నందమూరి, నారావారి కుటుంబాలు తెలుగుజాతికి యజమానులు! కావూరీ, లగడపాటి లాంటి ఆంధ్రా పెట్టుబడిదారి లాబీ కూడా అందులో భాగమనుకోవచ్చేమో! తెలుగుజాతి స్టేక్‌హోల్డర్‌గా తనకు తాను ప్రకటించుకుంటున్న చంద్రబాబు రాజకీయం...తెలంగాణ అస్తిత్వాన్ని కాలరాసే కుట్రకు నిదర్శనం!

తెలంగాణ అస్తిత్వాన్ని ధ్వంసం చేయడానికి, దాని సంపదను దోపిడి చేయడానికి పుట్టిన పార్టీయే ‘తెలుగుదేశం’! తెలంగాణ అస్తిత్వాన్ని కాలరాసేందుకు, భారతదేశ అస్తిత్వాన్ని ప్రశ్నించేందుకు ‘తెలుగుదేశం’ పేరుతో పుట్టిన ఈ ఆంధ్రాపార్టీకి తెలంగాణ అస్తిత్వం పట్ల ఇప్పటికీ కసి కనిపిస్తూనే ఉన్నది. 1969 తెలంగాణ ఉద్యమాన్ని వేర్పాటువాద ఉద్యమం అని ఎవరూ అనలేదు! కానీఇవాళ తెలంగాణ ఉద్యమానికి వేర్పాటువాద ముద్ర వేయడాన్ని గమనిస్తే ‘తెలుగుదేశంపార్టీ’ పుట్టుకవల్ల జరిగిన నష్టం ఏమిటో అర్థంఅవుతుంది. తెలుగుజాతి ఆత్మగౌరవ నినా దం ఎన్టీఆర్‌కు, చంద్రబాబుకు ఓట్లు కురిపించి ఉండవచ్చు. కానీ ఈ రాష్ట్ర ప్రజల మస్తిష్కాలలో రాజకీయంగా ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం ఒక దేశంగా మారిపోయింది. తెలుగు ప్రజలలో భారతదేశం-ఆంవూధవూపదేశ్ మధ్య కనిపించని మానసిక విభజనను సృష్టించి బతికింది తెలుగుదేశం! దాని దుష్పరిణామమే.. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వేర్పాటువాదం అనే ముద్ర వేయ డం. వేర్పాటువాదం, సమైక్యవాదం అనే పదాలు దేశ విభజన కు సంబంధించి వాడుతారు. ఇవాళ రాష్ట్ర విభజనకు వాడుతున్నారంటే, అందుకు కారణం ఆంధ్ర ప్రదేశ్ అంటేనే ఒక దేశమనే మనస్తత్వాన్ని తెలుగుదేశం పార్టీ పాదుకొల్పి పెంచడమే కాదా? భారత దేశంలో సగభాగాన్ని ఆక్రమించి అభివృద్ధిని కుంటు పరుస్తున్న ఆరు పెద్ద రాష్ట్రాలను విభజించి పాలనా సౌలభ్యం, సారూప్యం గల ఆదర్శ రాష్ట్రాలను ఏర్పాటు చేయడం ఈ నాటి దేశ అవసరం. ఈ విధంగా ఆంధ్రవూపదేశ్ విభజన ను కోరుతున్న తెలంగాణ వూపజలు వేర్పాటువాదులా? లేక భారతదేశ భావనను ప్రశ్నిస్తూ ఏర్పడిన తెలుగుదేశంపార్టీ నాయకులు వేర్పాటు వాదులా? వేర్పాటు వాదమే సిద్ధాంతంగా పుట్టిన తెలుగు దేశం పార్టీ ఇవాళ మళ్లీ తెలుగు జాతి ఆత్మగౌరవం పేరుతో యాత్ర చేపట్టింది. ఇది తెలంగాణ అస్తిత్వానికే కాదు, భారత దేశ భావనకు కూడా ఎసరు తెచ్చే యాత్ర. దేశ సమైక్యాన్ని కోరే వారెవరైనా, ఏప్రాంతం వారైనా చంద్రబాబు పట్ల అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు ఏర్పడితే అవి దేశానికి, స్థానిక ప్రజలకూ ప్రయోజనకరం! కానీ ఆంధ్రవూపదేశే కొనసాగితే..చంద్రబాబులు, జగన్‌బాబులకు మాత్రమే ప్రయోజనం తప్ప తెలుగు ప్రజలకు, దేశానికీ కాదు!

- కల్లూరి శ్రీనివాస్‌డ్డి

88

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ        


country oven

Featured Articles