పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా..


Mon,July 15, 2013 03:21 AM


కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయంతో పనిలేదు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొం దే వరకు ఒక్క కాంగ్రెస్‌నే కాదు, ఏ పార్టీని నమ్మేదిలేదు. తెలంగాణ ఇంటిపార్టీని ఆగమాగం చేయడానికి కుతంవూతాలు సాగుతున్న కాలమిది. ఇలాంటి సంధికాలంలోనే తెలంగాణ తన రాజకీయ అస్తిత్వ జవసత్వాలను మరిం త బలోపేతం చేసుకోవాలె. కాంగ్రెస్ నిర్ణయాలను చూసి భ్రమపడితే, తెలంగాణ రాకముందే, తెలంగాణ రాజకీ య అస్తిత్వం కనుమరుగయ్యే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ ఫీలర్స్‌ను కాలానికి వదిలేయాలె. కాంగ్రెస్ నిజాయితీని కాలమే తేలుస్తుంది.కాబట్టి ఇలాంటి సంధి సమయంలోనే తెలంగాణ తన రాజకీయ అస్తిత్వాన్ని కాలానికి వదిలేయకూడదు. పదమూడేళ్లుగా నిర్మాణం చేసుకున్న రాజకీయ అస్తిత్వాన్ని, పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందే వరకు నిలబెట్టుకోవాలి. పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా తెలంగాణ తన రాజకీయ అస్తిత్వం చాటుకోవాలె. పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుడి నుంచి, పార్లమెంటు సభ్యుడి దాకా తెలంగాణ తన రాజకీయ విశ్వరూపాన్ని ప్రదర్శించాలె. తెలంగాణ ఇంటిపార్టీని మట్టుపెడితే, తెలంగాణను ఇక శాశ్వతంగా అడ్డుకున్నట్లేననే వ్యూహంలో బయటి పార్టీలు ఉంటాయి. అలాంటి బయటి రాజకీయశక్తులకు అవకాశం ఇవ్వకూడదు. పల్లెలే తెలంగాణకు పట్టుగొమ్మలు. రాజకీయ అస్తిత్వానికి ప్రాణ వాయువులు. ఆ పప్లూల్లోనే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. పల్లె పునాదుల బలంపైనే రేపటి ఇంటిపార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. ఇవాళ యాచించినా కాంగ్రెస్ తెలంగాణ ను ఇవ్వకపోతే, రేపు శాసించి తేగలిగేది తెలంగాణ రాజకీయ శక్తే. అందుకే నేటి పంచాయతీ ఎన్నికలను ఇంటిపార్టీ చాలా సీరియస్‌గా తీసుకోవాలె. ప్రజలకు ఒక బలమైన సందేశం ఇవ్వాలె.

పల్లె నుంచి పార్లమెంటు దాక మన గొంతు వినిపించే రాజకీయ శక్తిని నిలిపి గెలిపించుకోవాలనేదే ఆ సందేశం కావాలె. అది తెలంగాణ పల్లెల్లోని ప్రతి గడపకు చేరాలె. పార్లమెంటు ఎన్నికల్లోనే కాదు, పంచాయతీ ఎన్నికల్లోనూ తెలంగాణ వాదానికే ఓటేయాలనే పట్టుదల పల్లెల్లో పెంపొందించాలె. ఆం ధ్రా, ఢిల్లీ పార్టీలను పల్లెల నుంచి తరిమేసే సరైన సమ యం పంచాయతీ ఎన్నికలే. సర్పంచ్‌లతో మొదలుపెట్టి, పార్లమెంటు సభ్యుల దాకా తెలంగాణ ప్రజల రాజకీయ నిర్ణయం మారబోదని చాటిచెప్పాలె. అలాంటి అవకాశా న్ని పంచాయతీ ఎన్నికలు మోసుకొస్తున్నాయి. రాజకీ య పరిణతి చెందిన తెలంగాణ ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలె. 45 ఏళ్లుగా తెలంగాణ రాజకీయ అనాథగా బతికింది. బయటిపార్టీలు రాజ్యమేలుకున్నాయి. తెలంగాణను తన వేలుతోనే తన కంటిని పొడిపించాయి. 13 ఏళ్ల నుంచి తెలంగాణకు ఇంటిపార్టీ ఉన్నది. అయినా శత్రువు పార్టీ ల నడుమ తెలంగాణ ఇంటిపార్టీ ఒంటరి పోరాటం చేస్తూ వస్తున్నది. ఇవాళ తెలంగాణకు ఉన్నది ఒక్కపార్టీ యే. దాన్ని కాపాడుకుం రేపటి తెలంగాణకు ఒక దశ దిశ. బయటిపార్టీలు తెలంగాణలో ఇంటిదొంగలను పెం చిపోషించాయి. మళ్లీ అలాంటి ఇంటిదొంగల వ్యవస్థకు పంచాయతీ ఎన్నికల్లో పునాదులు పడితే...రేపు మళ్లీ తెలంగాణ ఏమవుతుందో..పతి తెలంగాణ పల్లెవాసి ఆలోచించాలె. పల్లెల్లో తెలంగాణ రాజకీయ అస్తిత్వానికి బలమైన పునాదులు వేయాలె.ఆ పునాదులే రేపటి తెలంగాణ సాధనకు, పునర్నిర్మాణానికి వెయ్యేనుగల బలమవుతాయి. ఇంటిపార్టీ ఇంటిపార్టే- ఢిల్లీపార్టీ ఢిల్లీపార్టే. ఆంధ్రాపార్టీ ఆంధ్రాపార్టే! తెలంగాణకు సర్పంచ్ నుంచి మొదలు కుంటే పార్లమెంటు సభ్యుడి వరకు ఇంటిపార్టీ వాడే ఎందుకు ఉండాలో అర్థమై మూడున్నరేళ్లు అయింది. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఇంటిపార్టీ అవసరం ఏమి టో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఆత్మ ను పల్లె నుంచి పార్లమెంటు దాకా చాటి తెలంగాణ సాధించుకుందాం!

-కల్లూరి శ్రీనివాసరెడ్డి

35

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ