రేపటి విజన్ ఒక నిజం


Thu,June 20, 2013 03:18 AM

అందరూ తెలంగాణ కోరుతున్నామని చెప్పేవారే! జానాడ్డి, జైపాల్‌డ్డి నుంచి మొదలుకుంటే, ఎర్రబెల్లి, మోత్కుపల్లి, రేవంత్‌డ్డి దాకా అందరూ తెలంగాణ బిడ్డలమని చెప్పుకునే వారే! కానీ ఆ బిడ్డలు తమ తెలంగా ణ ఆదాయ వ్యయాల గురించి ఏనాడైనా పట్టించుకొన్నారా? బయటిపార్టీలలో బతకనేర్చిన నేతలకు ఇంటిసోయి పడుతుందా? తన కడుపు నిండితే చాలనుకు నే ఇలాంటి ఇంటిదొంగల వల్లనే తెలంగాణ ఆదాయం, ఆంధ్రాలో వ్యయంగా మారింది. కేసీఆర్ మాటల్లోనే చెప్పాలంటే ‘సొమ్మొకడిది సోకొకడిది’ అయింది. ఇంటిపార్టీ వాడికి వుండే సోయి, బయటిపార్టీలో కొనసాగుతున్న జానాడ్డికో, ఎర్రబెల్లికో ఎందుకు వుంటది?

తెలంగాణ ఉద్యమ (ఇంటిపార్టీ)పార్టీ కార్యకర్తల శిక్షణాతరగతులలో... నేటి తెలంగాణ ఆదాయం, రేపటి తెలంగాణ పునర్నిర్మాణం గురించి, ఆపార్టీ అధినేత కేసీఆర్ తన ఉపన్యాసాలలో వివరంగా చెపుతూవచ్చా రు. 57 ఏళ్లలో జరిగిన అన్యాయాల గురించిఅందరికీ తెలిసిన విషయాలు కొన్నే. కానీ వెలుగుచూడని నిజాలను కూడా కేసీఆర్ వెలికితీశారు, తీస్తునేవున్నారు. నిపుణుల చేత నిరంతరం పరిశోధిస్తూ, నిజాలను తెలుసుకుంటూ తెలంగాణ భవిష్య పునర్నిర్మాణం పట్లనే ఆయన నిరంతర ధ్యాస. అది ఆయనలో వున్న ఆసక్తి పట్టుదలను నిరూపిస్తాయి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2013-14 బడ్జెట్ లెక్కల ప్రకారం తెలంగాణ ఆదాయం 47వేల కోట్లు, సీమాంధ్ర ఆదాయం రూ.15 వేల కోట్లు మాత్రమే నని కేసీఆర్ బల్లగుద్ది చెపుతున్నారు. అవి నిజాలుకానట్లయితే, ఈ సీమాంధ్ర మీడియాగానీ,పార్టీలు గానీ ఇప్పటిదాకా నోరు మూసుకొని కూర్చునేవేనా? తెలంగాణ ఆదాయం సీమాంధ్ర కన్నా రెండు రెట్లకు పైగా ఎక్కువ. ఆ విషయం స్వయంగా కిరణ్‌కుమార్‌డ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెటే చెపుతున్నది. అది కేసీఆర్ కల్పించి చెపుతున్నది కాదు. ఆ విషయం సీమాంధ్ర నేతలకు తెలుసు. ఇంకా వివరంగా చెప్పాలంటే- తెలంగాణ ఆదాయం లేకపోతే సీమాంధ్ర బతకలేదనే విషయం సీమాంవూధపార్టీలకు ఎప్పటి నుంచో తెలుసు. తెలియనిదల్లా సీమాంవూధపార్టీలలో కొనసాగుతున్న తెలంగాణ ప్రజా ప్రతినుధులకే. ఎందుకంటే వారు బానిస రాజకీయాలలో బతుకుతూ వస్తున్నారు కాబట్టి. వారికి తెలంగాణ ఆదాయం గురించి తెలుసుకునే తాపవూతయం, తెలిసినా పట్టించుకునే సోయి వుండదు.

తెలంగాణ నుంచి వస్తున్న 47వేల కోట్ల ఆదాయం నాలుగు శాఖల(అమ్మకపు పన్ను, ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్టు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్) నుంచి మాత్రమే. ఇంకా అడవులు, నదుల నుంచి ఇసుక లాంటి పన్నేతర ఆదాయం (non tax income) తెలంగాణ నుంచే 8వేల కోట్లు వస్తున్నది. తెలంగాణ ఆదాయాన్ని బట్టి కేంద్రం కేటాయించే డివెల్యూషన్స్‌భగాంట్స్ , పన్నుల వాటా తోడైతే తెలంగాణ నికర ఆదాయం 80వేల కోట్లకు పైమాటే. అలాగే తెలంగాణకున్న ఆదా యం పైన కేంద్రంగానీ, ఇతర ఆర్థిక సంస్థలుగానీ 20శాతం వరకు అప్పులు కూడా ఇవ్వగలుగుతాయి.

అంటే తెలంగాణ ఆదాయం + కేంద్ర పన్నుల్లో వాటా+ కేంద్ర గ్రాంట్లు + తెలంగాణకు లభించగలిగే అప్పులు కలిపితే తెలంగాణ వార్షిక బడ్జెట్ ఒక లక్ష కోట్లు దాటుతుంది. రేపటి తెలంగాణ పునర్ నిర్మాణాన్ని ఎంత గొప్పగా అమలు చేసుకోవచ్చో, అక్షరాలా లక్ష కోట్ల తెలంగాణ బడ్జెటే స్పష్టం చేస్తుంది. పదవుల కోసం కలలు కనేవారు వేరు. తన ప్రాంతం కోసం కలలు కనేవారు వేరు. 57 ఏళ్ల తెలంగాణలో తన ప్రాంతం కోసం కలలు కన్న నాయకులను మనం ఎంత మందిని చూశాం? ఇవాళ కేసీఆర్‌లో అలాంటి నాయకుణ్ణి చూస్తున్నామనడంలో అనుమానం లేదు. సొంత రాజకీయ శక్తితో తెలంగాణను తెచ్చుకోవడమే కాదు, రేపటి తెలంగాణ పట్ల ఒక విజన్ కలిగివుండడం కూడా ఆ రాజకీయ శక్తికి అంతే అవసరం. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య తెలంగాణ సమాజానికి అందించగలిగే శక్తిసామర్థ్యాలపై కొందరికి అనుమానం కలగొచ్చు.

కులమతాలకతీతమైన విద్యను కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా అందించుకోగలమన్న కేసీఆర్ ఒక్కమాట చాలు....రేపు తెలంగాణోడు ప్రపంచస్థాయిలో ఒక గొప్ప నిపుణుడు కావడానికి! ఆవిషయాన్ని ఆర్థిక నిపుణులతో, అనుభవం కలిగిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో చర్చించాకే కేసీఆర్ ఉచిత విద్యపై ప్రజలకు మాట ఇస్తున్నారనడంలో అనుమానం అక్కరలేదు. అపారమైన ఆదాయం కలిగిన తెలంగాణ ప్రభుత్వం రేపు తప్పక పిజీవరకు ఉచిత విద్యను అందించ గలదని స్వయాన ఆర్థికనిపుణులే చెపుతున్నా రు. వారితో చర్చించాకే కేసీఆర్ ప్రజలకు మాట ఇస్తున్నారని గమనించాలె. అలాగే రేపటి సాగునీటి ప్రాజెక్టులు, సాగునీటి లభ్యత, వ్యవసాయం, సంక్షే మం, ఉద్యోగాలపై కేసీఆర్ చెపుతున్న మాటలు ఆయన సొంతంగా చెపుతున్న కవిత్వాలు కావు, ఆర్థికవేత్తలతో చర్చించాకే చెపుతున్న వాస్తవాలని, ఆచరణ సాధ్యాలని మనం గమనించాలె. ఆసక్తి, ఆశయం ఉన్నోడు ఏదైనా సాధిస్తాడు. అతడే తన ప్రాంతానికి ఓ విజన్‌ను అందించగలుగతాడు, అమలూ చేయగలుగుతాడు.

రేపు తెలంగాణ వచ్చాక కనీసం కొత్తగా లక్ష ఉద్యోగాలైనా కల్పించాల్సివుంది. అది ఎలా సాధ్యం అని వంకర మాట్లాడేవారే కాకుండా అనుమానిస్తున్నవారు కూడా వున్నారు. అది ఎలా సాధ్యమో కూడా కేసీఆర్ తన విజన్‌లో చెపుతున్నా రు. ఆ ఉద్యోగాలు ఎక్కడ దాక్కొని వున్నాయో తెలుసుకోవాలంటే మనం ఏపీ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ తాజా లెక్కలు చూడాలె. ఈ లెక్కల ప్రకారం ప్రాంతాల వారిగా ఉద్యోగస్తులు పొందుతున్న జీతాలు, పెన్షన్ల వివరాలు తెలుసుకుంటే సరిపోతుంది. దాని ద్వారా రేపటి తెలంగాణలో లక్ష ప్రభుత్వోద్యోగాలు కల్పించడం ఆసాధ్యం కాదని ఎవరైనా చెప్పగలగుతారు.

ఏపీ ట్రెజరీ రికార్డుల ప్రకారం రాష్ట్రంలో తాజాగా ఉద్యోగుల జీతాలకు, పెన్షన్లకు మొత్తం 44, 230 కోట్లు ఖర్చు అవుతున్నది. ఇందులో సీమాంధ్ర ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు రూ. 28,610 కోట్ల చెల్లింపులు జరుగుతున్నాయి. తెలంగాణ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేవలం రూ. 15, 650 కోట్ల చెల్లింపులు జరుగుతున్నాయి. ఒకవేళ మనం జనాభా పరంగా చూసినా సీమాం ధ్ర ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు రూ. 25653 కోట్లకు మించకూడదు. కానీ వారు పొందుతున్నది రూ.28,610 కోట్లు. అంటే అదనంగా సీమాంధ్ర ఉద్యోగులు పొందుతున్న జీతాలు, పెన్షన్లు రూ. 2957 కోట్లు. అలాగే తెలంగాణ జనాభా పరంగా చూస్తే తెలంగాణ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు కలిపి రూ. 18,576 కోట్లు వుండాలె. కానీ తెలంగాణ ఉద్యోగుల జీతా లు, పెన్షన్లు పొందుతున్నది రూ. 15 650 కోట్లు మాత్రమే. అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారమే జీతాలు ,పెన్షన్లలోనూ తెలంగాణ రూ.2956 కోట్లు నష్టపోతున్నది. ఇది ప్రభుత్వ ట్రెజరీ లెక్కల ఆధారంగా తెలంగాణకు అధికారికంగా జరుగుతున్న నష్టం.

అనధికారికంగా తెలంగాణలో రెండున్నర లక్షల సీమాంధ్ర ఉద్యోగులున్నారని ఒక అంచనా వుంది. దాన్ని మనం పక్కనపెట్టి చూసినా, అనేక కమిటీలకు, కమిషన్లకు లభించిన సమాచారం మేరకు లక్ష మంది సీమాంధ్ర ఉద్యోగులు అక్రమంగా తెలంగాణలో ఉద్యోగాలు చేస్తున్నరు. ఈ విషయాన్ని అధికారిక రిపోర్టులు ఇప్పటికే చెప్పాయి. అంటే వీరి సంఖ్య తెలంగాణ ఉద్యోగులలో కనీసం 25 శాతం వుం టుంది. అంటే తెలంగాణకు లభిస్తున్న జీతాలు, పెన్షన్ల మొత్తంలో 25 శాతం సీమాంధ్ర అక్రమ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఉన్నాయన్నమాట. అంటే, తెలంగాణఖాతాలో సీమాంధ్ర అక్రమ ఉద్యోగులు పొందుతున్న జీతాలు, పెన్షన్లు రూ. 3905 కోట్లు. ఇవాళ నికరంగా నిజమైన తెలంగాణ ఉద్యోగులు పొందుతున్న జీతాలు, పెన్షన్లు రూ.11,715 కోట్లు మాత్రమేనని మనం గమనించాలె.

జనాభాపరంగా తెలంగాణ ఉద్యోగులు రాష్ట్ర ఉద్యోగుల జీతాలు పెన్షన్లలో 42 శాతం పొందాలి. ఆ లెక్కన తెలంగాణ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు రూ. 18576 కోట్లు వుండాలి. జనాభా శాతంలో తెలంగాణ ఉద్యోగుల జీతాలు పెన్షన్లను రూ2956 కోట్లు నష్టపోతున్నది. ఇక సీమాంధ్ర అక్రమ ఉద్యోగుల జీతాలు , పెన్షన్లతో రూ. 3905 కోట్లు నష్టపోతున్నది. ఇటు జనాభాపరమైనా శాతంలో, అటు సీమాంధ్ర అక్ర మ ఉద్యోగులతో తెలంగాణ జీతాలు, పెన్షన్లలో రూ. 6861 కోట్లు నష్టపోతున్న ది. చివరకు ఉద్యోగుల జీతాలు పెన్షన్లలోనూ ఇంత అన్యాయం జరుగుతున్నా అడ్డుకోలేని కొందరు, రేపు తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలు ఎక్కడ కల్పిస్తారని ఎద్దేవా చేస్తుంటారు. తెలంగాణకు ఇప్పటిదాకా ఉద్యోగుల జీతాలలో జరుగుతూ వస్తున్న అన్యాయాన్ని అడ్డుకోగలిగితే చాలు, ఒక్క లక్ష ఉద్యోగాలే కాదు, మరో లక్ష ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది.
రేపు తెలంగాణ ఏర్పడితే లక్షల ఉద్యోగాలొస్తాయనేది వెటకారం కాదు. రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీ రికార్డుల్లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు చెపుతున్న నిజమది. కేసీఆర్ ఏదీ ఆషామాషీగా చెప్పడు. ప్రభుత్వరికార్డులను తెలుసుకొని, నిపుణులతో చర్చించే ఆయన రేపటి తెలంగాణను రచిస్తున్నాడనే విషయం కాదనలేనిది.

-కల్లూరి

శ్రీనివాసడ్డి

35

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ        


country oven

Featured Articles