ఢిల్లీ పార్టీలనూ నమ్మరు


Mon,June 10, 2013 12:01 AM


నిజాం కాలేజీ మైదానంలో రెండు సభలు. ఒకటి తెలంగాణ ఇంటి పార్టీ ది, మరొకటి జై తెలంగాణ అంటున్న (ఢిల్లీ) పార్టీది. 57 ఏళ్ల చరిత్ర పుణ్యమా అని... మంటికైనా ఇంటోడు కావాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిజాం కాలేజీ మైదానంలో ఇంటిపార్టీ అవసరమేమిటో వివరించి చెప్పారు. మరుసటిరోజే ఢిల్లీపార్టీ(బీజేపీ)సభ జరిగింది. జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సిం గ్ అంతా రొటీనే మాట్లాడారని చెప్పాలె. అయితే కొత్తగా తెలంగాణ ప్రజలకు తమ పార్టీ పట్ల ఉన్న అనుమానాన్ని దూరం చేసే ప్రయత్నం చేయబోయారు! రాజ్‌నాథ్‌సింగ్ ఏమన్నారంటే...‘యదీ బీజేపీకో క్లియర్ మెజారిటీ నహీ మిల్తీ... బహనో ఔర్ భాయియో, హమ్ ఉస్ పార్టీసే అలయెన్స్ నహీ కరేంగే జో పొలిటికల్ పార్టీ తెలంగాణ బనానేకా విరోధ్ కర్తీ హై. హమ్ ఉస్‌కే సాథ్ కిసీ ప్రకార్‌కా సమ్‌ఝాతా నహీ కరేంగే’ (ఒకవేళ బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోయినా మేము తెలంగాణ వ్యతిరేక పార్టీలతో ఏవిధమైన పొత్తు పెట్టుకోబోము) అని అన్నారు. సరే ఆ మాట మీదనైనా బీజేపీ నిలబడుతుందనే నమ్మకం ఎవరికైనా వుందా? మేము ఆధికారంలోకి వస్తే ఆయోధ్యలో రామాలయం కట్టితీరుతాం అని బీజేపీ అధికారంలోకి(1998) వచ్చేదాకా చెప్పిన విషయాన్ని ఎవరైనా మర్చిపోగల రా? మేము ఆధికారంలోకి వస్తే లాభాల్లో వున్న ప్రభుత్వరంగ కంపెనీలను అమ్మబోము, నష్టాలలో వున్న కంపెనీలను మాత్రమే అమ్ముతామని ఈ దేశ ప్రజలకు భరోసా ఇచ్చిన బీజేపీ...అధికారంలోకి వచ్చాక ఏమి చేసిందో తెలియ దా? నష్టాల్లో వున్న కంపెనీలను వదిలేసి లాభాల్లో వున్న కంపెనీలనే అమ్మిన విషయం తెలియదా? ఈ విషయంలో అప్పటి ప్రధాని వాజ్‌పేయి, ఉపవూపధాని అద్వానీలను మీడియా ప్రశ్నిస్తే ఏమి చెప్పారో తెలుసా? నష్టాల్లో వున్న కంపెనీలను ఎవరూ కొనడానికి రావడం లేదు, అందుకే లాభాల్లో వున్న కంపెనీలను అమ్ముతున్నామన్నారు! ఇంతకుమించిన వంచన ఇంకేమైనా వుందా? దేశ ఆస్తులను కాపాడుతామని చెప్పి వాటిని అమ్మడానికి ఒక మంత్రినే నియమించినవారు....రేపు తెలంగాణను మర్చి, తెలంగాణ వ్యతిరేకులను దరిచేర్చుకోరంటే ఎవరైనా నమ్ముతా రా? ఒకవేళ తెలంగాణ వ్యతిరేకుల మద్దతు తీసుకోమనే నిబద్ధత బీజేపీకి వుండి వున్నా... ఎన్నికల తర్వాత ఏర్పడే సంఖ్యాశాస్త్రానికి లొంగని రాజకీయ పార్టీ ఈ దేశంలో ఏదైనా వున్నదా? అలా లొంగబోమని చెపుతున్న రాజ్‌నాథ్‌సింగ్ మాటలు రాజకీయ ప్రకటనలకు పనికొస్తాయి తప్ప ప్రజలు నమ్మడానికి మాత్రం పనికిరావు.


బీజేపీ తెలంగాణ ఇచ్చే కాలం దాటిపోయి పన్నెండేళ్లయింది. అయినా తెలంగాణ ఇవ్వడం జాతీయపార్టీలకే సాధ్యమని ఊదరగొడుతున్నారు. అది కూ డా బిజేపీ లాంటి జాతీయ పార్టీకే సాధ్యమంటున్నా రు. నిజంగానే జాతీయ పార్టీలకే సాధ్యమైతే టీఆర్‌ఎస్ పుట్టేదే కాదు కదా! తెలంగాణకు ఓ ఇంటి పార్టీ పుట్టడానికి ఎవరు కారకులో బీజేపీయే చెప్పాలె. ముఖ్యంగా దేశంలో బలహీన పడ్డ తర్వాత మళ్లీ జై తెలంగాణ అంటున్న బీజేపీయే ఆత్మపరిశీలన చేసుకోవాలె. గతంలో చంద్రబాబు మద్దతువల్ల తెలంగా ణ ఇవ్వలేకపోయామని ఇపుడు అంటున్నారు. కానీ అధికారంలో ఉన్ననాడు ఏమన్నారో గుర్తుందా? ‘హైదరాబాదే తెలంగాణలో వున్నాక ఇంకా తెలంగాణ ఎందుకు’ అని అద్వానీ అన్నారు. తెలంగాణ ఏమైంది అని మీడియా అడిగితే, ‘తెలంగాణ ఎక్కడ వుండాలో అక్కడే వుందని అప్పట్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక బీజేపీ ప్రముఖుడు వెక్కిరించారు! అధికారంలో వున్ననాడు చంద్రబాబు అడ్డుకుంటున్నాడని అద్వానీగానీ, వెంకయ్యగానీ ఒక్కనాడైనా చెప్పారా? ఆరోజు చెప్పకుండా చంద్రబాబు అడ్డుకున్నాడని ఈ రోజు చెప్పడమెందుకు? అలాగే ఆరోజు చంద్రబాబు మద్దతు తీసుకున్న బీజేపీదే బలహీనత కాదు. మద్దతిచ్చిన చంద్రబాబుకు కూడా బలహీనత వుంది. ఆరోజు వాజ్‌పేయిని కాకుండా సోనియాగాంధీని ప్రధానిని చేసేందుకు చంద్రబాబు కాంగ్రెస్‌కు మద్దతిచ్చేవాడా? అది చంద్రబాబుకున్న బలహీనత కాదా? అలాంటి చంద్రబాబు బలహీనతను సొమ్ము చేసుకొని ఉత్తరాది మూడు రాష్ట్రాలతోపాటు నాలుగవ రాష్ట్రంగా తెలంగాణను ఇవ్వగలిగేవారు కదా! సారాంశం ఏమిటంటే, రాష్ట్రంలో బీజేపీని ఆంధ్రా అధిపత్యానికి కట్టబెట్టి, తెలంగాణ పట్ల కపట నాటకాలాడుతూ వస్తున్న బీజేపీ తనంతట తానుగా తెలంగాణ ఇవ్వదనే విషయం తెలంగాణ సమాజానికి ఆనాడే అవగతమైంది. అందుకే తెలంగాణకు ఓ ఇంటిపార్టీ (టీఆర్‌ఎస్) పుట్టక తప్పింది కాదు. స్వీయ రాజకీయ అస్తిత్వంతో తప్ప ఏ బయటి పార్టీతో తెలంగాణ సాధించుకోలేమని తెలంగాణ సమాజం తెలుసుకోగలిగింది. అందుకే ఇవాళ తెలంగాణ సమాజం మంటికైనా బీజేపీ ఉనికి ఈ మాత్రమైనా రాష్ట్రంలో వున్నదంటే అది తెలంగాణ ప్రాంత పుణ్యమే. కానీ దాని జాతీయ నాయకత్వం రాష్ట్రాన్ని మొదటి నుంచి ఆంధ్రా నాయకుల ఆధిపత్యానికే అప్పజెపుతూ వస్తుంది.

ముఖ్యంగా రాష్ట్రంలో టీడీపీ పుట్టినప్పటి నుంచి అది మరింత ఎక్కువైంది. తెలుగుదేశాన్ని నడుపుతున్న ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకుడికే రాష్ట్ర బీజేపీపై ఆధిపత్యాన్ని అప్పగించింది. అందుకే అపుడైనా ఇపుడైనా ఆ నాయకుడు చెప్పిందే వారికి వేదం! ఈ తంతు వాజ్‌పేయి నుంచి నేటి దాకా నడుస్తూ వస్తున్నదే. రేపు కొత్తగా మారబోయేది కూడా ఏమీలేదు.ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ వాడేకదా అని అనుకోవచ్చు. ఆయన ఎవరి శిష్యుడు కావడం వల్ల ఆధ్యక్షుడయ్యాడో తెలియనివారుండరు. ఈ రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ (అప్పటి జనసంఘ్) మొదటి శాసన సభ్యుడు తెలంగాణ నుంచి (1967)సీ జంగాడ్డి. అలాంటి జంగాడ్డి నేటికీ బీజేపీకి అధ్యక్షుడు కాలేకపోయాడెందుకు? రాష్ట్రంలో టీడీపీని శాశ్వత మిత్రపార్టీగా మార్చుకోవాల ని భావిస్తూ వస్తున్న కాలం నుంచి బీజేపీ ఒరిజినల్ క్యాడర్ ఆ పార్టీకి దూరమైంది. బీజేపీ ఒరిజినల్ క్యాడర్ తెలంగాణను కోరుకుంది, రాష్ట్రంలో ఆపార్టీ బలపడాలని కోరుకుంది. కానీ ఏం జరిగింది? ఆంధ్ర పెత్తనంలో కొనసాగుతున్న బీజేపీ తనంతట తాను తెలంగాణ ఇవ్వజాలదని తేలిపోయింది. తెలంగాణలో ఆ క్యాడర్ చాలామేరకు టీఆర్‌ఎస్‌లో చేరడమో లేదా టీఆర్‌ఎస్ సానుభూతిపరులుగా, ఓటుబ్యాంకుగా మారిపోవడమో జరిగింది. బీజేపీలో ఇప్పటికీ ఒరిజినల్ క్యాడర్ ఏమైనా మిగిలివున్నా... వారంతా అనామకులై వున్నా రు. అందుకే ఇవాళ బీజేపీ క్యాడర్ బేస్ పార్టీ కాకుండా ఆంధ్రా బేస్‌పార్టీగా మిగిలిపోయింది.

2009 డిసెంబర్ 9 నాడు వచ్చిన తెలంగాణ ఏర్పాటు ప్రకటనపై హైదరాబాద్‌లో చంద్రబాబు ఏరకంగా స్పందించాడో.... మరుసటిరోజు రాజ్యసభలో వెంకయ్యనాయుడు కూడా అక్షరం అక్షరం పొల్లుపోకుండా అలాగే స్పందించా రు. తమిళనాడు చిందంబరం, కర్ణాటక మొయిలీ కలిసి ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటారా? అర్థరాత్రి ప్రకటిస్తారా అని చంద్రబాబు నోట వెలువడ్డ వ్యాఖ్యలే తిరిగి రాజ్యసభలో వెంకయ్య నోట వెలువడ్డాయి. చంద్రబాబు, వెంకయ్య ఆత్మలు ఒక్క రాజ్యసభ సాక్షిగా మనకు అర్థమైంది.1998 నుంచి 2004 వరకు కేంద్రంలో అధికారంలో వున్నప్పుడు వెంకయ్య మాట్లాడిన వంకర మాటలే నేటికీ తెలంగాణకు శాపాలుగా వెంటాడుతున్నా యి. అప్పట్లో ఆయన హైదరాబాద్ వచ్చినప్పడల్లా మీడియా ఆయన్ను తెలంగాణ గురించి అడిగేది. ఆంధ్రవూపదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే తెలంగాణ ఇస్తామనేవారు.అసెంబ్లీ అభివూపాయాన్ని రాష్ట్రపతి కోరుతారు. ఆ చొరవ కేంద్ర క్యాబినెట్ తీసుకుంటే జరుగుతుంది. అవన్నీ వదిలేసి అసెంబ్లీ తీర్మానం పంపితే తెలంగాణ ఇస్తామని మెలిక పెట్టింది ఈ వెంకయ్యనాయుడే! వెంకయ్య అందించిన ఈ సూచననే తెలంగాణ ప్రకటన చేసి న నాడు కాంగ్రె స్ కూడాఅనుసరించి అసెంబ్లీ తీర్మానం కోరిందని మనం మర్చిపోకూడదు. ఇవాళ తెలంగాణ ప్రకటన వచ్చాక కూడా అగిపోయిందంటే వెంకయ్య చేసిన ఒకప్పటి వంకర మాటలే బలమైన కారణమయ్యాయనే విషయా న్ని మనం ఎలా మర్చిపోగలం? ఇటీవల పార్లమెంటులో కేసీఆర్‌కు స్పీకర్ ఇచ్చిన ఒక్క నిమిషం సమయాన్ని కూడా అద్వానీ లాంటి బీజేపీ నాయకుడు అడ్డుకున్నాడంటే... ఆపార్టీని తెలంగాణ ప్రజలు ఎలా నమ్మాలో రాజ్‌నాథ్‌సింగే చెప్పివుండాల్సింది కదా!

తెలంగాణ ప్రజలు బీజేపీనే గెలిపించారనుకుందాం. రేపు తెలంగాణలో సాధించిన విజయాలను బీజేపీ చంకలో పెట్టుకొని, చంద్రబాబును, జగన్‌బాబును భుజాల మీద ఎత్తుకుంటే తెలంగాణ వస్తదా? జాతీయపార్టీలకు దేశ రాజకీయ సమీకరణల కన్నా తెలంగాణ ముఖ్యం కాదు. ఎన్నికల ముందు ఓట్లకు గాలం వేసేందుకు ఇప్పటిదాకా అన్ని పార్టీలు చేసినట్లుగానే రాజ్‌నాథ్‌సింగ్ కూడా మరోసారి చేస్తున్నారని చెప్పాలె. ఆయన మాటలను తెలంగాణ ప్రజలు ఆ రకంగానే స్వీకరిస్తారనడంలో అనుమానం లేదు. సగటు తెలంగాణ వాసి మదిలో ఇవాళ ఏముందో తెలియంది కాదు. తెలంగాణలో ఇంటి పార్టీ గెలిస్తేనే బీజేపీ తెలంగాణ ఇవ్వగలుగుతుంది. తెలంగాణలో బీజేపీ గెలిస్తే అది ఆంధ్రాపార్టీలకు వరమవుతుందని వాళ్లకు తెలుసు. ఇవాళ తెలంగాణ సమాజం మరోసారి రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేదు.

-కల్లూరి శ్రీనివాస్‌డ్డి

35

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ