నగరంలో తెలంగాణ


Sun,April 28, 2013 11:41 PM

మొ న్న జిహెచ్‌ఎమ్‌సీ, నిన్న ఆర్టీసీ, ఇవాళ జలమండలి కార్మిక సంఘాల ఎన్నికల్లో తెలంగాణవాదం విజయకేతనం ఎగరేయడం నగరప్రజల మారిన రాజకీయ దృక్పథాన్ని చాటుతున్నాయి.
హైదరాబాద్‌లో తెలంగాణవాదం లేదని అడ్డం, నిలువు వాదించే వారిని చాలా మందినే చూసివుంటాం. కానీ ఇవాళ వారు వెనకాముందు ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో తెలంగాణవాదం బలంగా లేదేమో అనుకునేలా ఉద్యమపార్టీకూడా అనుకు న్నది. దేనికైనా కాలం కలిసిరావాలె.
తెలంగాణ వాదం లేదనుకున్న హైదరాబాదే ఇవాళ వెయ్యేనుగల బలాన్ని సంతరించుకున్నది. ఇవాళ తెలంగాణ ఓటు పోలరైజ్ అయింది. నగరంలో ‘అడ్డగుట్ట’ లాంటి తెలంగాణ బస్తీలు లెక్కకుమించివున్నాయి. ఇంతకాలం ఈ బస్తీలను ఆంధ్రా, ఢిల్లీ పార్టీలు రాజ్యమేలుకున్నాయి. ఇపుడు వాటికి కాలం చెల్లిపోయింది. తెలంగాణ మధ్యతరగతి బస్తీలు, వాడలు కోకొల్లలు. తెలంగాణ వాదం నిండుకొనివున్న మధ్యతరగతి ప్రజలు, చిరుద్యోగులు, చిన్న వ్యాపారులు, ఆటోడ్రైవర్లు నగర రాజకీయాలను శాసించే స్థితిలో వున్నా రు. అలాగే ఇవాళ ఉన్నది ఒకప్పటి హైదరాబాద్ కాదు, ఇపుడది గ్రేటర్ హైదరాబాద్. పరిధి పెరిగింది. పెరిగిన పరిధిలోనూ తెలంగాణ ప్రజలే అధికం.

ఒకోసారి మన శక్తి ఏమిటో మనకే తెలియని అంధకారంలో వుండిపోతుంటాం! ఆంధ్రా మీడియా చేసే వంకర ప్రచారాలను నమ్ముతూవుంటాం!అందులో కూరుకుపోతుంటా ము. ఉద్యమ పార్టీ పుట్టి 12ఏళ్లు గడుస్తున్నా, గత మూడున్నరేళ్లలోనే హైదరాబాద్‌లో తెలంగాణ ఓటు సమీకృతం కాగలిగింది. తాము పెంచిపోషించిన ఒకప్పటి హైదరాబాద్ రాజకీయానికి, మూడేళ్లలో పోలరైజ్ అయిన హైదరాబాద్ రాజకీయానికి తేడాను గమనించిన ఆంధ్రాపార్టీలు, ఢిల్లీపార్టీలు ఇవాళ హడలిపోతున్నా యి. నగరంలో తెలంగాణ జనాభా 65 నుంచి 70 శాతం పై మా మిగిలిన జనాభాలోనూ సింహభాగం హిందీ, మరాఠీ, కన్నడ భాషీయులే. ఇక మిగిలిందెంత? 5 నుంచి 8 శాతంలోపున్న సీమాంధ్ర జనాభా ఆధారంగా నగరంలో తెలంగాణ వాదంలేదనే వక్ర భాష్యాలకు కాలం చెల్లిపోయింది.

దశాబ్దాలుగా నగరాన్ని మత రాజకీయాలకు నిలయంచేసి సీమాంవూధరాజకీయాలు రాజ్యమేలాయి.‘మూసీ’నదికి ఆవల పాతనగరం, ఈవల కొత్తనగరం అనే విభజన రేఖను సీమాంధ్ర ప్రభుత్వాలు గీసిపెట్టాయి. స్థానిక రాజకీయాల నుంచి తెలంగాణ వాదా న్ని వేరు చేసే కుట్రను 4 దశాబ్దాలుగా అమలు చేశాయి. 69 ఉద్యమాన్ని అడ్డుకోవడానికి మతవాద మజ్లిస్‌కు ప్రాణం పోసింది బ్రహ్మానందడ్డి అయితే, ఆపరంపర చంద్రబాబు, రాజశేఖర్‌డ్డిల దాకా కొనసాగింది. నిజానికి ముస్లింలు వేరు, మజ్లిస్ వేరు. ఖాసీం రజ్వీ వేరు, షోయబుల్లాఖాన్ వేరు. అలాగే అభ్యుదయ ముస్లిం సమాజం తెలంగాణ ఉద్యమానికి ఏనాడూ దూరంగా లేదు. కానీ ఆంధ్రాపార్టీలు ముస్లింలు మజ్లిస్ సొత్తు అన్నట్లు వంకర భాష్యాలతో ప్రచారం చేసి పెట్టాయి.


పాతబస్తీ ముస్లిం సమాజంలో వున్న మత రాజకీయాన్ని పారదోలి ఒక ఆదర్శరాజకీయాన్ని ప్రవేశ పెట్టే ప్రయత్నాన్ని ఉద్యమపార్టీ చేసింది.ఇవాళ పాతబస్తీ ముస్లిం సోదరులకు మతరాజకీయాల విముక్తి కల్పించి, తెలంగాణ జనజీవన స్రవంతిలోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగానే మహమూద్‌అలీ లాంటి వారిని రాజ్యాధికారంలోకి తేవాల్సిన అవసరాన్ని ఎవరూ కాదనలేరు. మహబూబ్‌నగర్‌లో ఉద్యమపార్టీ అభ్యర్థి ఇబ్రహీం అనుకోకుండా ఓడిపోయివుండవచ్చు.

అభ్యుదయ, అభివృద్ది కాముక రాజకీయాన్ని హైదరాబాద్‌లోనూ నిర్మాణం చేయాల్సిన అవసరం వుందనే విషయం కేసీఆర్ కు తెలుసు. అందులో భాగంగానే పాతబస్తీకి చెందిన ఆజంపురా వాసి మహమూద్ అలీ ఇవాళ ఉద్యమపార్టీ ప్రజావూపతినిధి కాగలిగారు. అలాగే, ఉద్యోగుల నాయకుడు స్వామీగౌడ్ ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి ఉద్యమ పారీ పట్టభవూదుల ఎమ్మెల్సీ కాగలిగారు. స్వామీగౌడ్ కూడా హైదరాబాద్ వాసే. ఇవాళ ప్రజాకాంక్షకు కులంగానీ, మతంగానీ, గోత్రంగానీ అన్నీ తెలంగాణే! ఆ విషయాన్ని హైదరాబాద్‌కు చెందిన మహమూద్‌అలీ, స్వామీగౌడ్‌లను ఎంపిక చేసి చాటగలిగిన కేసీఆర్ రాజకీయ పరిణతి గొప్పది. ఆంధ్రపార్టీలు పెంచిపోషించిన మతరాజకీయాలను హైదరాబాద్ నుంచి పారదోలగలిగే శక్తి తెలంగాణ వాదానికే వున్నది. నగరంలో ఇప్పటికే రూపుదిద్దుకున్న తెలంగాణ రాజకీయాన్ని మరింత బలంగా నడపాల్సినఅవసరమున్నది.

-కల్లూరి శ్రీనివాస్‌డ్డి

35

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ