ఒంటరిపోటీ ఒక అనివార్యత


Fri,April 5, 2013 12:20 AM


కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో ఎవరికీ తెలియని పరిస్థితి.యూపీఏకు బయటి నుంచి మద్దతిస్తున్న ములాయం యూపీ లో తమ ప్రభుత్వం పాపులారిటీ దిగజారిపోకముందే లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు రావాలని ఆయన కోరుకుంటున్నాడు.మూడో వూఫంట్ తరఫున ప్రధాని కావాలనుకుంటున్నాడు. కాబట్టి ములాయం మద్దతు ఉపసంహరణ, మధ్యంతర ఎన్నికలు అనివార్యం కాబోతున్నాయం బాగుంటుంది. కాబట్టి యూపీఏ తెలంగాణను తేల్చే అవకాశాలు ఇక దాదాపు లేవం బాగుంటుంది. రెండో దఫా బడ్జెట్ సమావేశాలపై ఆశలు పెట్టుకోవడం కూడా అత్యాశే నంటే తప్పు కాదు. ఆశించే సమయం అయిపోయింది. ఇంకా ఆశించడం మంచి ది కాదని కేసీఆర్ ఇప్పటికే ఒక నిర్ణయానికొచ్చినట్లున్నారు. అదొక మంచి పరిణామం. పార్టీ సంస్థాగత వ్యవస్థపై దృష్టి సారించడం మొదలుపెట్టారు. మధ్యంతర ఎన్నికలు వస్తే గిస్తే అక్టోబర్ లేదా నవంబర్‌లో రావచ్చు. ఈ లోపల పార్టీని సంసిద్ధం చేయడం కేసీఆర్ లాంటి సమర్థ నాయకునికి కష్టమైన పనేమీ కాదు. టీఆర్‌ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని కరీంనగర్ డిక్లరేషన్‌లోనే కాకుండా, ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలోనూ కేసీఆర్ ప్రకటించారు. ఉద్యమ పార్టీ ఒంటరిగానే పోటీ చేయాల్సిన అవసరం, అందుకు గల కారణాలు తెలుసుకుందాం.

నాలుగు దశాబ్దాలకు పైగా తెలంగాణ రాజకీయ అనాథగా బతికింది. తెలంగా ణ రాజకీయ అనాథ బతుకును బయటి పార్టీలు సొమ్ము చేసుకుంటూ వచ్చాయి. రాష్ట్రంలో ఇపుడున్న పార్టీలలో టీడీపీ, వైయస్ కాంగ్రెస్ రెండూ పక్కా ఆంధ్రా అజమాయిషీలో వున్న ప్రాంతీయ పార్టీలని బహుశా తెలియని వారెవరూ వుండ రు. మిగిలిన పార్టీల సంగతి ఏమిటి? కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం ఈ నాలుగు పార్టీలు జాతీయపార్టీలు. అయినా అవన్నీ కూడా ఆంధ్రా అజమాయిషీలో కొనసాగుతున్నవే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రధాన పార్టీగా ఆంధ్రా అజమాయిషీలో కొనసాగడంలో ఆశ్చర్యంలేదు. కానీ మిగిలిన మూడు పార్టీలు తెలంగాణలో బతుకుతూ ఆంధ్రా అజమాయిషీలో నడుస్తుండడమే అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం! . ఓట్లు, సీట్లు తెలంగాణలో..అజమాయిషీ మాత్రం ఆంధ్ర నేతల చేతు ల్లో! బీజేపీ ఒంటరిగా పోటీ చేసిన ప్రతిసారీ తెలంగాణ నుంచి మాత్రమే! అది అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నది! ఇప్పటి అసెంబ్లీలోనూ ఆ పార్టీకి ప్రాతినిధ్యం వున్నదంటే అది తెలంగాణ ప్రాంత పుణ్యమేనని గమనించాలి! కానీ ఇవాళ పేరుకు అధ్యక్షుడు తెలంగాణ వాడే కావచ్చు, అతను ఓ ఆంధ్రా నేత ఆశిస్సులతో మాత్రమే అధ్యక్షుడయ్యాడని బహుశా తెలియనివారుండరు. ఉభయ కమ్యూనిస్టులదీ అదే పరిస్థితి. ఆ రెండుపార్టీలు సీట్లు గెలిచేది తెలంగాణలో, ఆధిపత్యం మాత్రం ఆంధ్రా నేతల చేతుల్లో! బయటిపార్టీల వల్ల తెలంగాణకు పట్టిన ఈ దుర్గతి ఈనాటిది కాదు, ఐదున్నర దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న దుర్గతి అది! తెలంగాణ గంజితాగి బతుకుతున్న పార్టీలు సైతం తెలంగాణ అజమాయిషీలో కొనసాగలేకపోతున్నాయంటే, తెలంగాణ రాజకీయంగా ఎందుకు అనాథగా మారిపోతూ వస్తున్నదో అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం.తెలంగాణను మనసావాచా వ్యతిరేకించే టీడీపీతో ఆంధ్రా ప్రాంతంలో పొత్తుకు సన్నద్ధమవుతున్న సీపీఐకి తెలంగాణ ఇంటిపార్టీతో పొత్తు ఎలా కుదురుతుంది? విరోధి మిత్రుడు కూడా విరోధియే అనేది యుద్ధ నియమం. అలాంటి నియమం ఎన్నికల్లోనూ వర్తిస్తుందని గమనించాలి! సీపీఐ తెలంగాణలో ఉద్యమపార్టీ పొత్తు తో సాధించే బలాన్ని, రేపు చంద్రబాబుకు అప్పగిస్తే ఏమిటి పరిస్థితి? అంతెందు కు మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఓటింగ్ జరిగితే టీడీపీకే ఓటేస్తామని సీపీఐ ప్రకటించింది! రేపు టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకొని, ఎన్నికల తర్వాత టీడీపీకే మద్దతిస్తామంటే తెలంగాణ పరిస్థితి ఏమిటి? దీన్నే కోవర్టు రాజకీయం అంటారు. ఇలాం టి కోవర్టు పొత్తులకు ఒప్పుకుంటే నష్టపోయేది తెలంగాణ, లాభపడేది చంద్రబాబులు, జగన్‌బాబులే!

బీజేపీ అవసరాలు ఏసమయంలో ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేరు. అయి నా...తెలంగాణలో ఉన్నవే 17 లోక్‌సభ స్థానా లు. అందులో పొత్తులతో బయటి పార్టీలకు సీట్లు పంచిపెడితే ఇంటిపార్టీకి మిగిలే ఆ సంఖ్యతో రేపు ఢిల్లీలో కొత్త ప్రభుత్వానికి అనివార్యతను సృష్టించడం ఎలా సాధ్యం? తెలంగాణ సాధనకు ప్రతి లోక్‌సభ స్థానం ప్రాణవూపదమైనది. పొత్తులతో బయటి పార్టీలకు పంచిపెట్టి తనకు తాను మరోసారి తెలంగాణ మోసపోవడం సాధ్యం కాదు! కాబట్టి తెలంగాణ ఇంటిపార్టీ 13 నుంచి 15 స్థానాలకు తగ్గకుం డా సొంతంగా గెలిచినపుడే, రేపు ఢిల్లీలో ఎవ రి ప్రభుత్వం ఏర్పడినా తెలంగాణను సాధించగలిగే అవకాశాలుంటాయి. నమ్మకంలేని బయటిపార్టీలతో పొత్తులు పెట్టుకొని ఎన్నికల తర్వాత భంగపడేకన్నా, ఇపుడు నిర్ద్వందంగా తిరస్కరించడంలోనే తెలంగాణ హితం వుందనడంలో అనుమానం లేదు. తెలంగాణ ప్రజలకు సంబంధించినంత వరకు...తెలంగాణలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలు రాహుల్, మోడీల కోసంకాదు. ఈ దేశానికి ఎవరు ప్రధాని అవుతారనేది తేల్చడానికి అంతకన్నా కాదు. ఈ ప్రాంత ప్రజలు రాబోయే ఎన్నికల్లో ప్రాధాన్యమిచ్చేది స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని చాటుకొని తెలంగాణను తెచ్చుకోవడానికి మాత్రమే అందరూ గమనించాలె.ఆంధ్రా అజమాయిషీ కలిగిన పార్టీలు జైతెలంగాణ అన్నా అనకున్నా .... తమంతట తాముగా తెలంగాణను తేవాలనే తెగువ ఆపార్టీలకు వుండదనేది జగమెరిగిన సత్యం! అయినా ఇవాళ తెలంగాణ మునుపటిలాగ రాజకీయ అనాథ కాదు. తెలంగాణకు ఇవాళ ఒక ఇంటిపార్టీ పార్టీ వుంది. అది తెలంగాణ ప్రకటనను తేగలిగింది. బయటి పార్టీల పుణ్యమా అని వచ్చిన తెలంగాణ ఆగిపోయింది. ఆగిపోవడానికి ఒక్క కాంగ్రెస్ మాత్రమే కారణంకాదు, తెలంగాణలో బతుకుతున్న అన్ని రాజకీయపార్టీలూ ఆంధ్రా అజమాయిషీలో కొనసాగుతుండడమే అందుకు అసలు కార ణం. అలాంటి పార్టీలతో వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని ఇంటిపార్టీ పోటీ చేస్తే తిరిగి పాత కథే ముందుకొస్తుంది తప్ప తెలంగాణ రాదు.

ఎన్నికల్లో తెలంగాణ ఇంటిపార్టీ ఒంటరిగా పోటీ చేయడమనేది చరిత్ర నేర్పిన పాఠం. ఎవరైనా దాన్నొక అనివార్యతగా స్వీకరించాలె తప్ప అపోహపడొద్దు. ఇంటిపార్టీ ఒంటరిగా పోటీ చేస్తే, ఉద్యమాన్ని సమర్థిస్తున్న ఇతర పార్టీల సంగతేమిటనే మీమాంస లేకపోదు. గత చరిత్ర బట్టిచూసినా, వర్తమాన చరిత్ర చూసినా బయటిపార్టీల అవసరాలు ఢిల్లీలో మరోలా వుంటున్నాయనేది కాదనలేని సత్యం. ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఆలోచించినపుడు, తెలంగాణ ఇంటిపార్టీ ఒంటరిగా ఎందుకు పోటీ చేయాలో మనకు అర్థమవుతుంది. ఉద్యమానికి మద్దతిస్తున్న బయటిపార్టీల వ్యవహారాలు ఎప్పుడూ ఒకేలా ఉండలేకపోతున్నాయనేకన్నా ఉండలేవు అంటేనే బాగుంటుంది. హైదరాబాద్‌లో ఒకలాగా, ఢిల్లీలో ఒకలాగా వుంటుంటాయి. సీపీఐ, బీజేపీ విషయంలో ఇటీవలి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఆ మధ్య లోక్‌సభలో కేసీఆర్ మాట్లాడటానికి స్పీకర్ ఒక నిమిషం సమయం ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ప్రశ్నోత్తరాల సమయంలో ఇతరులకు సమయం కేటాయించడం ఇదేమి సాంప్రదాయమంటూ బీజేపీ నేత అద్వానీ అడ్డుకున్నారు. సీపీఐ ఎంపీలు కూడా మౌనంగా వున్నారు. హైదరాబాద్‌లో కిషన్‌డ్డి జై తెలంగాణ అంటాడు, లోక్‌సభలో అద్వానీ ఇదేమి సాంప్రదాయమంటూ అడ్డుకుంటాడు! కాబట్టి బయటిపార్టీలు ఉద్యమాన్ని సమర్థిస్తున్నా, వారి అవసరాలు మారుతూనే వుం టాయని గమనించాలి! కాబట్టి తెలంగాణ ఇంటిపార్టీ ఒంటరిగా పోటీ చేయడమనేది ఒక అనివార్యత తప్ప అదేదో ఉద్యమాన్ని సమర్థిస్తున్న ఇతర పార్టీలపై కత్తిగట్టి మాత్రం కాదని నిజమైన తెలంగాణ వాది ఎవరైనా సరే అర్థం చేసుకోగలుగుతారు!

వచ్చిన తెలంగాణ ఆగిపోయిననాడు, అందరు కలిసి పోరాడి తిరిగి తేవడానికి ఏర్పడిందే జేఏసీ! అది ఎన్నికల పొత్తుల కోసం ఏర్పడిందని నేననుకోను! నిజం చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం లో తమ భాగస్వామ్యాన్ని చాటుకోవడానికి జేఏసీ ఇతర పార్టీలకు ఉపయోగపడ్డది. బీజేపీ చిత్తశుద్ధి దేశ రాజకీయ సమీకరణలపై ఆధారపడివుంటుంది తప్ప కేవలం తెలంగాణకే కట్టుబడివుండజాలదు. ఇవాళ తెలంగాణకు కట్టుబడి వుందనుకున్నా...ఎన్నికల తర్వాత దాని చిత్తశుద్ధి మారిబోదని చివరకు అద్వానీ కూడా గ్యారంటీ ఇవ్వలేడు! రిస్క్ తీసుకోవడానికి ఇది వ్యాపారం కాదు ! వెయ్యి బలిదానాలు జరిగిన తెలంగాణ ఇంకా రిస్క్ తీసుకోవడం సాధ్యం కాని పని! నిజంగానే రేపు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితే, తెలంగాణ ఇంటిపార్టీ కూడా దానికే మద్దతు ఇస్తుంది. తెలంగాణ తెచ్చుకుంటుంది. ఇంకా బయటిపార్టీల మీద భరోసా పెట్టుకొని తన భవిష్యత్తును తానే గాలిలో దీపంలాగ మార్చుకోజాలదు. ఏదిఏమైనా తెలంగాణ ఇంటిపార్టీ తీసుకున్న ఒంట రి పోటీ నిర్ణయం, తెలంగాణ రాజకీయ భష్యత్తుకు అత్యంత కీలకమైన నిర్ణయం. అభినందించాల్సిన నిర్ణయం.

-కల్లూరి శ్రీనివాస్‌డ్డి

35

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ        


country oven

Featured Articles