బాబు కీర్తి కండూతి,తెలంగాణ దుర్గతి


Sun,March 10, 2013 12:56 AM


మహారాష్ట్ర అక్రమంగా నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే కన్నా.... ఆ అన్యాయమేదో దశాబ్దానికి పూర్వమే జరిగిపోయిందంటే బాగుంటుంది. 15 ఏళ్ల క్రితమే మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. దానికి శంకుస్థాపన జరిగి 10 ఏళ్లు దాటిపోయాయి.. అప్పట్లో ఈ రాష్ట్రాన్నేలుతున్నది ఘనత వహించిన చంద్రబాబు ప్రభుత్వమే! ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఒకరు బోరున ఏడ్చాడు! తెలంగాణ ఎడారైపోతుందన్నారు! ఈ సోయి 15 ఏళ్ల నుంచి 10 ఏళ్ల క్రితం వరకు ఎక్కడికి పోయిందో అర్థం కాదు! సుప్రీం తీర్పుతో తెలంగాణకు కొత్తగా నష్టం జరిగిందేమీలేదు. జరగాల్సిన నష్టం ముందే జరిగిపోయింది. బాబ్లీ కేటాయింపుల నియంవూతణకు త్రిసభ్య కమిటీ వేయడం ఒకరకం గా మేలే జరిగింది. ఆ కమిటీకి జ్యుడీషియరీ అధికారాలను అప్పగించేలా ఒత్తిడి తేవాల్సిన అవస రం మాత్రం ఉన్నది. ఇక నిర్మాణం జరిగిన ఏ ప్రాజెక్టునూ కూలగొట్టాలని ఏకోర్టు చెప్పదు. అలా చెప్పిన దాఖలా మన దేశంలోనే కాదు, ఏ దేశంలోనూ లేదు. కర్ణాటక కట్టిన ఆలమట్టిని ముఖ్యమంవూతిగా వున్న చంద్రబాబు కూలగొట్టించగలిగాడా? సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుకు కేటాయించిన నీటి వాటా గురించి చూద్దాం. బాబ్లీకి సుప్రీం కేటాయించిన నీరు 2.74 టీఎంసీలు. బాబ్లీ ప్రాజెక్టు 1.09 టీఎంసీల నీటిని వాడుకోవచ్చని మనం (మన రాష్ట్రం) ఏనాడో ఒప్పుకున్నామనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. మనం అనుకున్నదానికంటే సుప్రీంకోర్టు ఆ ప్రాజెక్టుకు 1.65 టీఎంసీల నీటిని మాత్రమే అదనంగా కేటాయించిందని మనం గమనించా లి. అంటే, ఒకటిన్నర టీఎంసీల నీటి నష్టం వల్ల మొత్తం తెలంగాణే ఎడారైపోతుందంటే ఈ భూమండలం మీద ఎవరైనా నమ్మగలరా? మహారాష్ట్ర బాబ్లీ ప్రణాళిక సిద్ధం చేసుకున్ననాడే ఈ టీడీపీ శాసన సభ్యుడు చంద్రబాబు ముందు ఏడ్చివుంటే... బాబ్లీ కథ ఇంతదాక వచ్చేది కాదు కదా! చంద్రబాబునాయుడికి తెలిసినన్ని పబ్లిసిటీ ట్రిక్కులు మరో రాజకీయ నాయకుడికి తెలుస్తాయనుకోలేం! చంద్రబాబు అధికారం కోల్పోయాక ఈ టీడీపీ శాసన సభ్యుడికి కొత్త పాత్ర అప్పగించాడు. ఆ పాత్రలో ఆయన జీవిస్తున్నాడో లేదో మనకు గత కొన్నేళ్లుగా కనిపిస్తూనే వున్నది! తొమ్మిదేళ్లపాటు రైతును, వ్యవసాయాన్ని ముంచిన పసుపు కండువాను చూస్తే ప్రజలు భయపడతారని చంద్రబాబుకు బాగా తెలిసిపోయింది! చంద్రబాబు పుక్కిడి పబ్లిసిటీకి పసు పు కండువాలు మాసి పోయాయి! పసుపు కండువాకు రైతు వ్యతిరేక ముద్ర ఏనాడో పడిపోయింది! అందుకే, పసుపు కండువాలను పక్కన పడేసి, ఈ ఏడుపు గొట్టు సభ్యుడి చేత గ్రీన్ కండువాలను వాడుకలోకి తెప్పించాడు! ఆకుపచ్చ రంగు రైతుకు చిహ్నం. ఆకు పచ్చ కండువాల ముసుగులో ఎల్లో కోవర్టులను పంపి రైతును మరోసారి మోసం చేయోచ్చనే తెలివితేటలు ఇంకా తెలంగాణలో సాగుతాయనుకోవడమే చంద్రబాబు భ్రమ! తన తొమ్మిది ఏళ్లపాలనలో చంద్రబాబు ప్రదర్శించిన పబ్లిసిటీ తెలివితేటలను, వాటి వల్ల ప్రజలకు జరిగిన శాశ్వత నష్టాలను ఒకసారి తిరిగి గుర్తుకు తెచ్చుకుంటే... ఇవాళ ఆకుపచ్చ కండువా రాజకీయం మతలబు ఏమిటో ఇట్టే తెలిసిపోతుంది!

‘నేను ఎన్నికల్లో మాత్రమే రాజకీయాలు మాట్లాడుతాను, మిగతా కాలమంతా అభివృద్ధి గురించే మాట్లాడతాను. ప్రతిపక్షాలకు అభివృద్ధి పట్టదు, రాజకీయాలే పడతాయి’ - ఈ మాటలు ఎప్పుడో విన్నట్టున్నది కదా! 1995- 2004 దాకా ఈ రాష్ట్రాన్నేలిన పబ్లిసిటీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారివే! అసెంబ్లీలో ప్రతిపక్షా ల సవాళ్లను ఎదుర్కోలేనపుడు పైన చెప్పిన వాక్యాలను ముఖ్యమంవూతిగా చంద్రబాబు తన జవాబులో చెప్పేవాడు! తొమ్మిది ఏళ్ల కాలంలో పై వాక్యాలను ఆయన పలకివుండని అసెంబ్లీ సెషన్ బహుశా ఏదీ జరిగి వుండదనుకుంటా! కానీ ప్రజలు అదే చంద్రబాబుకు గత ఎనిమిదేళ్లుగా ప్రతిపక్షం గతి పట్టించారు! ఇపుడేమో దిక్కుతోచని చంద్రబాబు, ఒకప్పుడు తాను చెప్పిన సూత్రాన్ని తానే ఉల్లంఘించి తన రికార్డును తానే బద్దలు కొట్టుకుంటున్నాడు! ఎన్నికల్లో మాత్రమే రాజకీయాలు చేయాలన్న చంద్రబాబు అధికారం పోయిన మరుసటి రోజు నుంచే రాజకీయాలు మొదలు పెట్టాడు. చంద్రబాబు పాలనా కాలమంతా పుక్కిడి పబ్లిసిటీకే ఖర్చయిపోయింది! ముఖ్యమంవూతిగా మొదటి రెండేళ్లు ఆయన పడ్డ పబ్లిసిటీ తపన అంతా ఇంతా కాదు! ఠక్కున హైదరాబాద్‌లోని ఏ మూలనో సందర్శించేందుకు వెళ్లేవాడు. దానికి ‘ఆకస్మిక తనిఖీ’ ఆనే పేరు కూడా మీడియా చేత పెట్టించుకునేవాడు. దానికి బలం చేకూర్చేందుకు ఆయన ఆస్థాన పత్రిక ఒకటి వుండనేవుండే! తనిఖీలో ఆయన వెంట బస్సులో ఓ 50 మంది మీడియా ప్రతినిధులు వెంట ఉండాల్సిందే! ఆకస్మిక తనిఖీలో ఓ ప్రభుత్వోద్యోగి సస్పెన్షన్ తప్పనిసరి జరిగేది. తెల్లారి ఆస్థాన పత్రికలన్నీ తాటి కాయలంత అక్షరాలతో బాబుగారి ఆకస్మిక తనిఖీ వార్తను సంచలనం చేసిపె వారం గడిస్తే చాలు సస్పెండైన ఉద్యోగి మళ్లీ తన సీటులో కనిపించేవాడు! చంద్రబాబు తన కోసం అమలు చేసుకున్న షార్ట్ కట్ పబ్లిసిటీ అది! మొదటి రెండేళ్లు చంద్రబాబు ఈ షార్ట్‌కట్ పబ్లిసిటీనే నమ్ముకున్నాడు!

చంద్రబాబుకు 1996 లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్త పబ్లిసిటీకి కాలం కలిసొచ్చింది. కేంద్రంలో వాజపేయి ప్రభుత్వాన్ని 13 రోజుల్లో పడగొట్టి అది నా గొప్పతనమే అని ఉచిత పబ్లిసిటీని సృష్టించుకున్నాడు. తృతీయ ఫ్రంట్ (యూఎఫ్) ఏర్పాటు రాత్రికి రాత్రే జరిగింది. కర్ణాటక ముఖ్యమంవూతిగా వున్న దేవేగౌడను దేశానికి ప్రధానిని చేసిన ఘన కీర్తిని కొట్టేయాలనుకున్నాడు. దేవేగౌడ పేరు చంద్రబాబే ప్రతిపాదించారనే పబ్లిసిటీ ఆస్థాన పత్రిక అప్పటికే కావలసినంత చేసిపె ప్రధానిగా దేవేగౌడ తన సొంత రాష్ట్రంలో పెండింగ్‌లో వున్న ‘ఆలమట్టి’ ప్రాజెక్టుకు అనుమతులిస్తూ మొదటి సంతకం పెట్టాడు! ఆలమట్టి నిర్మాణం చకచకా పూర్తయింది. నిబంధనలను పక్కనపెట్టి కావలసినంత ఎత్తుగా కూడా నిర్మాణం జరిగిపోయింది! ఒక్క తెలంగా ణే కాదు యావద్ రాష్ట్రం ఎవరూ ఊహించలేని స్థాయిలో కృష్ణా నీటిని శాశ్వతంగా కోల్పోయింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ఎన్నడైనా డెడ్‌స్టోరేజీకి చేరుకున్నట్లు విన్నా మా? 1998 కన్నా ముందు వరకు ఆ రెండు ప్రాజెక్టులు వర్షాలు ఉన్నా, లేకున్నా నీటి మట్టాలు అడుగంటిన వార్తలు ఏనాడూ లేవు! 1998 నుంచే ఆ రెండు ప్రాజెక్టులు సగటు వర్షాలు నమోదైనా కూడా నీటి మట్టాలు అడుగంటిన వార్తలు ఎందుకు వింటున్నాం? కర్ణాటక ఆలమట్టి నిర్మాణమయ్యాక ఆ రెండు ప్రాజెక్టులకు పట్టిన దుర్గతి అది! ఇది ఎవరి పుణ్యం అందాం? చంద్రబాబు తన మద్దతు ఉపసంహరిస్తానని బెదిరించి వుంటే... దేవేగౌడ దిగివచ్చేవాడు కాదా? ఆలమట్టి నిర్మాణాన్ని ఆపేవాడు కాదా? దేవేగౌడకు కూడా తెలుసేమో.... ఇది మూణ్నాళ్ల పదవి అని! తుమ్మితే పడిపోయే ప్రభుత్వంపై ఏ ప్రధానికీ ఆశలు వుండవు. అలాగే దేవేగౌడ కూడా, పదవి ఉన్నంత కాలంలోనే తన రాష్ట్రానికి కావలసిన పనులన్నీ చక్కబెట్టుకోవాలనుకున్నాడు! మరి అపర తెలివితేటలు కలిగిన చంద్రబాబు నీళ్ల దోపిడీ కోసం ఎదురుచూస్తున్న కర్ణాటక ముఖ్యమంవూతిని ఈ దేశానికి ఎలా ప్రధానిని చేసినట్టు? బాబు గారికి అప్పట్లో పుక్కిడి పబ్లిసిటీ ఆరాటం తప్ప ఇంకేమైనా కనిపించేదా? తెలంగాణతో పాటు ఆంధ్రావూపాంతానికి కూడా బాబుగారి కీర్తి కండూతి నష్టం చేసిపెట్టిందనడంలో అనుమానం లేదు. ప్రాంతాల వారి లెక్కలో చూసినపుడు కృష్ణా నీటిని చాలా మేరకు శాశ్వతంగా కోల్పోయింది తెలంగాణే! ఎందుకంటే, కృష్ణా నది నీటిని పోతిడ్డి పాడు నుంచి తెలుగుగంగ పేరుతో చెన్నై తాగునీటి కోసం అంటూ రాయలసీమకు తరలించే కార్యక్షికమాన్ని ఎన్టీఆర్ అప్పటికే చేసిపెట్టిన విషయం తెలిసిందే! (ఆతర్వాత వైఎస్ పుణ్యమా అని పోతిడ్డిపాడు నుంచి నీటి దోపిడీ మరింత పెరిగింది). కృష్ణా నది తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రవేశిస్తుంది. కానీ ఆ జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాకపోవడమే అందుకు నిదర్శ నం! కాబట్టి ఇవాళ శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల డెడ్‌స్టోరేజీల దుస్థితి కన్నా... మహబూబ్‌నగర్ జిల్లాకు, నల్గొండ జిల్లాకు రావల్సిన కృష్ణానీటినే బాబు కీర్తి కండూతి ఎక్కువగా మింగేసింది!

ఇప్పటి మహారాష్ట్ర బాబ్లీ పట్ల నిర్లక్షానికి కూడా ఆయన కీర్తి కక్కుర్తే కారణమంటే అతిశయోక్తి కాదు! అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వంలో శివసేన కూడా భాగస్వామి. బాబ్లీని వ్యతిరేకిస్తే కేంద్రంలో ప్రభుత్వం పడిపోతుందేమేననే భయం వాజపేయి కన్నా చంద్రబాబుకే ఎక్కువ ఉండె! కారణం? కేంద్రంలో పుక్కిడి మెప్పులు, అంతర్జాతీయంగా పుక్కిడి ప్రచారం చేజారిపోతుందనే భయం చంద్రబాబుది! చంద్రబాబు సన్యాసం తీసుకున్నా.... ఆయన పబ్లిసీటీ కక్కు ర్తి కోసం జరిగిన నష్టాలు పోయేవి కావు, జరగబోయే నష్టాలూ ఆగే వి కావు! అవి శాశ్వత నష్టాలు ! ఆయన పుక్కిడి ప్రచార ఆరాటానికి తెలంగాణ ఇప్పటికే భారీ మూల్యాలను (ఆల్మట్టి, బాబ్లీ లాంటి శాశ్వత నష్టాలను) చెల్లించింది! బయటి రాష్ట్రాల్లో కట్టిన ప్రాజెక్టులను కూలగొట్టడం మనకుగానీ, మన రాష్ట్ర ప్రభుత్వానికిగానీ సాధ్యం కాదు! కానీ మన రాష్ట్రంలోనే కడుతున్న పోలవరాన్ని, పులిచింతలను కూలగొట్టడం మనకు సాధ్యమే! అలాగే పోతిడ్డిపాడు నుంచి జరుగుతున్న జల దోపిడీని ఆపేయడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమే! చంద్రబాబు తరపున తెలంగాణ ఎమ్మెల్యేలు బాబ్లీపై ఏడ్చే ఏడ్పులో నిజాయితే వుంటే... మనం పోలవరం ఆపడానికి ఏడువాలి! పోతిడ్డిపాడు జల దోపిడీని అడ్డుకునేందుకు ఏడువాలి! దానికో సార్థకత వుంటది! కానీ పక్క రాష్ట్రంలోవున్న బాబ్లీ ప్రాజెక్టును కనీళ్లతో అడ్డుకోవడం ఎవరికైనా సాధ్యమేనా? ఆ పుక్కిడి ఏడ్పులను ఎందుకు వృథా చేసుకుంటున్నట్లు? రాష్ట్రంలోపలి అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఆ కన్నీళ్లను ఉపయోగించొచ్చు కదా!

-కల్లూరి శ్రీనివాస్‌డ్డి

35

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ