మాయావతే మన ప్రధాని అభ్యర్థి


Sun,February 24, 2013 10:47 PM


తెలంగాణ ఏర్పాటు చేయాల్సిందే’అని బీఎస్‌పీ అధినేత్రి మాయావతి మరోసారి గళమెత్తి చెప్పారు. జాతీయ నాయకురాలిగా ఆమెకు దేశ రాజకీయాల్లో ప్రత్యేకస్థానమున్నది. దేశంలో బీజేపీలాంటి పార్టీలు గళం వినిపిస్తున్నా మాయావతి గళానికున్న ప్రత్యేకతను ఎవరూ కాదనలేరు. తెలంగాణ ఉద్యమంలో ఆమె అందించిన పరోక్ష చేయూతను అభినందించాలి.ఈదేశానికే మోయలేని భారంగా మారిన ఉత్తరవూపదేశ్‌ను నాలుగు రాష్టాలు చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అసెంబ్లీలు కోరితే ఆయా రాష్ట్రాల విభజనను పరిశీలిస్తామనే కాంగ్రెస్, బీజేపీల తప్పించుకుని తిరిగే ధోరణిని ఆమె పరీక్షకు నిలబెట్టింది. కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ఓవైపు తెలంగాణను ప్రకటించి, మరోవైపు అసెంబ్లీ తీర్మానం కావాలన్నది. ఒక రాష్ట్ర విభజనకు అసెంబ్లీ తీర్మానం అక్కరలేదని రాజ్యాంగం చెపుతున్నా,అదే కావాలని గతంలో బీజేపీ,ఇప్పుడు కాంగ్రెస్ కోరాయి. మరి ఉత్తరవూపదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని మాయావతి ప్రభుత్వం పంపిన అసెంబ్లీ తీర్మానాన్ని అధికారంలో వున్న కాంగ్రెస్‌గానీ, ప్రతిపక్షంలో వున్న బీజేపీగానీ పట్టించుకోకపోవడమే ఇక్కడ చర్చనీయాంశం. ఆంధ్రవూపదేశ్ విభజనకు అసెంబ్లీ తీర్మానం కావాలంటారు! జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రానికో నీతిని అవలంబిస్తున్నాయనడానికి అదో నిదర్శనం.అందుకే వారి ద్వంద్వ నీతిని దేశ ప్రజల దృష్టికి తెచ్చిన మాయావతిని మనం అభినందించాలి.

కేంద్రంలో ఏపార్టీ అధికారంలో వున్నా, అక్కరలేని అసెంబ్లీ తీర్మానం కావాలంటూ కాలం గడుపుకుంటున్నాయి. అందుకే యూపీ విభజన కోసం అప్పటి మాయావతి ప్రభుత్వం పంపిన అసెంబ్లీ తీర్మానం తెలంగాణ ప్రజలకు ఒక బ్రహ్మా స్త్రం లాంటిది. ఉత్తరవూపదేశ్‌కు ఒక నీతి,ఆంధ్రవూపదేశ్‌కు మరో నీతి? ఏపీవిభజనను అడ్డుకునేందుకే సాధ్యంకాని అసెంబ్లీ తీర్మానం కావాలంటున్నారు.యూపీ విభజనను కూడా అడ్డుకునేందుకే అసెంబ్లీ తీర్మానం పంపినా అటకెక్కించారు. యూపీ అసెంబ్లీ తీర్మానాన్ని అమలులో పెట్టని కేంద్రం, ఏపీ అసెంబ్లీ తీర్మానాన్ని ఏ నైతికతతో కోరుతున్నట్లో అందరూ ఆలోచించాలి. అయినా ఏపీ విభజనకు అసెంబ్లీ తీర్మానం కావాలంటే రాజ్యంగంలో ఆర్టికల్ 3 కు వున్న విలువ ఏమిటి? అసెంబ్లీ తీర్మానం కావాలనడమంటే, తెలంగాణ ప్రజల హక్కులను సీమాంధ్ర నాయకులకు అప్పగించారనుకోవాలా? ఒకవూపాంత ప్రజల హక్కులను మరో ప్రాంత నాయకులకు అప్పగిస్తే ఈ దేశ ప్రధాని తెలంగాణ ప్రజలకు ఏమవుతారు? తెలంగాణ ప్రజలు తమ సార్వభౌమాధికారాన్ని కేంద్రానికి అప్పగించారు తప్ప సీమాం ధ్ర నాయకులకు అప్పగించలేదనే సోయిలో ఢిల్లీ ప్రభువులున్నారా? ఇన్ని రకాలుగా తెలంగాణ ప్రజల పట్ల అనైతికంగా ప్రవర్తిస్తున్న ఢిల్లీ పాలకుల తీరు ఇవాళ బజారు కెక్కిందంటే అందులో పరోక్షంగా మాయావతి శ్రేయమూ వుందని చెప్పక తప్పదు.

రాజకీయ అవసరాలు ఎలాంటివైనా మాయావతిలో ఈ దేశం పట్ల కాంగ్రెస్, బీజేపీల కన్నా కొంత మెరుగైన దార్శనికత ఉందనే చెప్పాలి. ఆమె ఉత్తరవూపదేశ్ రాష్ట్ర విభజనను కోరుతూ తీర్మానం చేయడాన్ని ఎవరు ఎలా చూస్తున్నారో తెలియదు. ములాయంసింగ్‌ను, కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టడానికే ఆమె ఆ తీర్మానం తెచ్చారనేవారు లేకపోలేదు. నిజమే కావచ్చు, అంతమావూతాన ఆమె పార్టీ బలంగావున్న ఉత్తరవూపదేశ్ రాష్ట్రాన్ని కేవలం ప్రత్యర్ధి పార్టీలను ఇరుకున పెట్టేందుకే విభజించడానికి సిద్ధపడ్డారని మాత్రం ఎవరూ అనుకోలేరు. ఈ దేశంలో ఆరు పెద్ద రాష్ట్రాలున్నాయి. అవి యూపీ, ఏపీ, బీహార్, బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు. దేశంలో సగానికి మించిన భూభాగాన్ని, సగానికి మించిన పార్లమెంటు స్థానాలను ఈ రాష్ట్రాలే ఆక్రమించి వున్నాయి. ఈ రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు బలంగా లేవు. ప్రాంతీయపార్టీలదే హవా.యూపీలో బీఎస్పీ, ములాయం పార్టీ, ఆంధ్ర ప్రదేశ్‌లో టీడీపీ, జగన్‌పార్టీ, బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సీపీ, తమిళనాడులో ద్రవిడ పార్టీలు. ఈ ఆరు రాష్ట్రాలే ఇవాళ దేశానికి గుదిబండలు, అభివృద్ధికి ఆటంకాలు. పాలనా సౌలభ్యం లేక ప్రజలు అల్లాడుతున్న రాష్ట్రాలు. పెట్టుబడిదారుల దోపిడీకి నిలయాలు. అవినీతికి కేరాఫ్ అడ్రస్‌లు. అక్రమ చొరబాటుదారులకు, టెర్రరిస్టులకు నిలయాలు. ఇంతటి ఘోర పరిస్థితులు కలిగిన ఆరు రాష్ట్రాలు ఈ దేశం ఇలా వుండకపోతే ఎలా వుంటుంది? పెద ్దరాష్ట్రాలను పెద్ద ప్రాంతీయ పార్టీలు తమ గుప్పిట్లో పెట్టుకొని ఆటలాడుతున్నాయి.

కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా తమ మద్దతును అనివార్యం చేస్తున్నాయి. దేశానికి గుది బండలుగా మారిన ఉత్తరవూపదేశ్, ఆంధ్రవూపదేశ్, బెంగాల్, మహారాష్ట్రల విభజనలను అడ్డుకుంటున్నది ఎవరోకాదు. ఆయారాష్ట్రాలను తమ సామ్రాజ్యాలుగా భావిస్తున్న ములాయంసింగ్, చంద్రబాబు, మమత, థాకరేలేననే విషయాన్ని మనం గమనించాలి. ఇలాంటి వారిని చూసినపుడు, మాయావతి నుంచి ఉత్తరవూపదేశ్ విభజన కోసం తీర్మానాన్ని ఆశించగలమా? తనపార్టీ బలంగా వున్న ఒక విశాల రాష్ట్రాన్ని విభజించాలని ఏపార్టీ నాయకుడైనా కోరుకోగలడా? అదే మాయావతి విశిష్టత! ఒక పెద్ద రాష్ట్రంలో వున్న ఏదైన పెద ్దప్రాంతీయ పార్టీ ఆ రాష్ట్ర విభజనను కోరుతూ తీర్మానం చేసిందా లేక ఆ తీర్మానానికి కనీసం మద్దతు తెలిపిన జాడ వుందా? ఇచ్చిన మాటను వెనక్కి తీసుకున్న చంద్రబాబు ఎక్కడా విశాల దేశ ప్రయోజనాలను చూడగలిగే మాయా వతి ఎక్కడా? రాజ్యకాంక్షతో విభజనను వ్యతిరేకించే చంద్రబాబుకు, ములాయంకు ఈ దేశం పట్ల ఒక దార్శనిక దృష్టి కోణం కలిగిన మాయావతికి ఎక్కడైనా పోలిక వుందా? నక్కకూ, నాగలోకానికి వున్నంత తేడాపాంతీయ నాయకుల సంగతి పక్కన పెట్టినా, అనేక మంది జాతీయ నాయకుల కన్నా మాయావతికి ఈ దేశంపట్ల ఎంతో కొంత మెరుగైన దార్శనిక స్వభావం వుందనడంలో అనుమానం లేదు.

2014ఎన్నికల్లో ప్రధాని పదవికి పోటీలో వున్నానని మాయావతి ప్రకటించారు. ఎన్నికల ఫలితాల తర్వాత గానీ ఏప్రభుత్వం ఏర్పడబోతున్నది, ఎవరు ప్రధాని కాబోతున్నారని చెప్పడం ఏ విశ్లేషకుడికి కూడా నేటి పరిస్థితుల్లో సాధ్యం కాని పని. బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ అధికారంలోకి రావాలంటే, ఆ పార్టీ కనీసం 180 స్థానాలు గెల వాలి. అప్పుడే ఇతర పార్టీలు దానికి చేరువవుతాయి, అధికారం చేపట్టగలుగుతుంది. ఇక కాంగ్రెస్ కనీసం 150 స్థానాలు గెలవగలిగినా ఇతర పార్టీలు చేరవై అధికారం చేపట్టే అవకాశం వుంది. ఈరెండు పార్టీలు తమ లక్ష్యం సాధించలేనపుడు ఏమిటి పరిస్థితి? మూడో ఫ్రంట్ పేర ములాయంసింగ్ ప్రధాని అవుతాడా,మాయావతి అవుతుందా? ఇది టార్గెట్ సీట్లను సాధించలేని కాంగ్రెస్, బీజేపీల ఓటమిలపై ఆధారపడివుంటుందని చెప్పొచ్చు. ఇవాళ ప్రధాని పదవి అభ్యర్థులుగా కాంగ్రెస్ తరపున రాహుల్‌గాంధీ, బీజే పీ తరపున మోడీ పేర్లు వినబడుతున్న విషయం తెలిసిందే.
తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోణంలో చూసినపుడు మన కు ఫలానా వారు ప్రధాని అయితేనే తెలంగాణ వస్తుందనడానికి ఏమాత్రం అవకాశం కనిపించదు. రాహుల్‌గాంధీ ఇప్పటి వరకు తెలంగాణ శబ్దం పలికినట్లు కూడా మనం ఎక్కడా చూడలేదు. సరే రాహుల్‌గానీ, మోడీగానీ ఎన్నికల సభల్లో ఆ విషయం చెపుతుండొచ్చు.

అప్పుడు ఓట్ల అవస రం కాబట్టి ఎవరైనా చెప్పగలుగుతారనుకుందాం. వెయ్యి బలిదానాలు జరిగినా ఉలుకని పలుకని రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా తెలంగాణ ఆత్మఎలా స్వీకరిస్తుందో కాలమే నిర్ణయించనుంది. సుష్మా, అరుణ్‌జైట్లీలు తెలంగాణ గురించి మాట్లాడి వుండడం ప్రామాణికం కాదు. ఇక మాయావతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. ఆమె ప్రధాని అభ్యర్థిగా రేసులో ఉన్నానని ఇప్పటికే ప్రకటించుకున్నారు. తెలంగాణను ఇవ్వాల్సిందేనని చెపుతూనే ఉన్నారు. ప్రధాని రేసులో వున్న అభ్యర్థుల విషయానికొస్తే అందరికన్నా మాయావతే తెలంగాణ ప్రజలకు బాసటగా నిలబడుతున్న నాయకురాలు అని మాత్రం చెప్పొచ్చు. ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరి అవసరం ఏమిటి, ఎవరి బలహీనత ఏమిటి అనేదానిపైనే ప్రభుత్వంపధాని నిర్ధారణ జరుగుతుంది. కాబట్టి మాయావతి ప్రధాని అవుతారా కాదా అనేది ముఖ్యంకాదు. తెలంగాణకు జాతీయ స్థాయిలో బలమైన మద్దతుదారుగా ఇంతకాలం నిలబడుతూ వస్తున్న మాయావతి ప్రధాని పదవి పోటీలో వుండడాన్ని ప్రతి తెలంగాణవాది గర్వంగా భావిస్తున్నాడని మాత్రం చెప్పగలం. తెలంగాణ కాంగ్రెస్ ఇస్తుందా బీజేపీ ఇస్తుందా అనేది ప్రశ్నకాదు. 2014లో వారికి తెలంగాణ స్వీయ అస్తిత్వ (ఇంటిపార్టీ) పార్టీ మద్దతు అనివార్యం అవుతుందనడంలో అనుమానంలేదు. అప్పుడు తెలంగాణ దానంతటదే వస్తుం ది. కాకపోతే మాయావతిలాగ దేశాన్ని విశాల దృష్టి కోణంతో చూడగలిగే స్వభావం ఈ దేశానికి కాబోయే ప్రధానికి ఎంతైనా అవసరం అనేది కాదనలేని సత్యం !

-కల్లూరి శ్రీనివాస్‌డ్డి

35

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ