ఎవరి కోసం ‘ఆధార్’?


Fri,February 8, 2013 10:29 PM

ఆధార్ కార్డుపై చాలా స్పష్టంగా మనకు ఓ సూచన కనిపిస్తున్నది. అది పౌరసత్వ గుర్తింపు కార్డు(citizen card) కాదని! స్వయాన ఈ దేశ ప్రణాళికా సంఘం వైస్‌చ్మైన్ అహ్లూవాలియా సైతం ఇది గుర్తింపు కార్డు కాదని చెబుతున్నాడు! ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ కార్డు ఎవరి కోసం? ఆ మధ్య ఈ కార్డు అమెరికా కోసం అని కొన్ని పత్రికల్లో వార్తా కథనాలు కూడా వచ్చాయి. అవి ఉబుసుపోని కథనాలని చాలా మంది నమ్మలేకపోయారు. కానీ కొంత కాలం పోతే గానీ ఆ కార్డు నిజంగానే అమెరికా అవసరాల కోసమే జారీ చేస్తున్నారని మాత్రం నమ్మకం కుదురుతున్నది. గ్యాస్ కు, రేషన్ కార్డుకు ఇలా అనేక ప్రజల అనివార్య అవసరాలకు ముడిపెట్టి ‘ ఆధార్’ లేనిదే నీకు బతుకే లేదనే భయవూబాంతులు సృష్టించబడ్డాయి. అందరూ కలలో కూడా ‘ఆధార్’ కోసం కలవరిస్తున్నారు.


గ్యాసులేని ఇల్లును ఈ కాలంలో ఎవరైనా ఊహించగలరా? అలాంటి నిత్యావసర గ్యాస్‌కు లింకు పెట్టి ‘ఆధార్’ను అనివార్యం చేయబూనిన మన ప్రభుత్వా ల అతి తెలివిని చూసి అమెరికా తప్పక మురిసిపోతుండవచ్చు. ముఖ్యంగా మూడో ప్రపంచ దేశాల ప్రజల వివరాలను రికార్డు చేసి ఇచ్చే పనిని అయా దేశాల పాలకులకు అప్పగించినట్లు విశ్లేషకుల అభివూపాయం. ఎంతై నా ప్రపంచ పోలీసు కదా! ప్రపంచంలో జీవించే ప్రతి జీవి వివరాలు దానికి కావాలి మరి! అమెరికాకు హాని తలపెట్టిన వాడు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా ఇట్టే పట్టేయడం కోసం కావచ్చు. ఈ విషయం మన పాలకులు ఎందుకు దాచిపెడుతున్నారు? ఆ విషయమేదో ప్రజలకు బహిరంగంగా చెప్పొచ్చు కదా! అలా చెబితే ఈ దేశ సార్వభౌమత్వ డొల్లతనం బయటపడుతుందనే భయం కావచ్చు. ఎలాగూ సార్వభౌమాధికారం పరాయిల కోసమే పని చేస్తున్నదని అర్థమై చాలా కాలామైం ది. గ్యాస్‌కు, రేషన్ కార్డుకు లింకు పెట్టి ప్రజలను పీడించడమెందుకు? ఆధార్ కార్డు ప్రభుత్వ సంక్షేమ కార్యక్షికమాల అమ లు కోసమని మరికొందరు చెపుతున్నారు. ఈ దేశ పౌరులకు ఓటు హక్కు ఎలాగూ వుంది. దానికి సంబంధించిన గుర్తింపు కార్డుపై... మన ప్రభుత్వం ఆధార్ కార్డుపై పెట్టినంత శ్రద్ధపెట్టగలిగితే, దేశం అనేక రకాల ప్రయోజనాలు పొందగలుగుతుంది. ఈ దేశంలో చొరబాటుదారులు ఓటరు కార్డు పొందగలుగుతున్నా పట్ట ని మన ప్రభుత్వాలు... ఆధార్ కార్డును మాత్రం పకడ్బందీగా వేలిమువూదలు, కళ్ల ఆనవాళ్లను సైతం సేకరిస్తుండడం గమనార్హం. దేశ ప్రయోజనాల పట్ల లేని శ్రద్ధ... ప్రపంచ పోలీసు అప్పగించిన పనిపై చూపుతున్న మన ప్రభుత్వాలనేమందాం?

దేశంలో దాదాపు నకిలీ ఓటర్లు సుమారు 10 శాతానికి పైబడి వున్నారని అంచనా. ఈ దేశంలో 2- 4 శాతం ఓట్లతోనే ప్రభుత్వాల తలరాత లు మారుతుంటాయి. అలాంటపుడు 10 శాతం వున్న చొరబాటుదారులు లేదా నకిలీ ఓటర్లే ఈ దేశ భవిష్యత్తును, ప్రభుత్వాల ఏర్పాటును పరోక్షంగా శాసించగలిగే స్థితిలో ఉండడానికి గల కారణాల గురించి ఎన్న డూ పట్టని మన ప్రభుత్వాలు... ‘ఆధార్’ను మాత్రం గ్యాస్‌కు, రేషన్ కార్డుకు, పింఛనుకు లెంకె పెట్టి ముక్కు పిండి అమలు చేస్తుండడమే ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం. ఈ శ్రద్ధ నకిలీ ఓటర్లను తొలంగించడం పట్ల, చొరబాటుదారులను గుర్తించడం పట్ల పెడితే బాగుంటుంది. నిజమైన ప్రజలు ఓటరుగా నమోదు చేసుకునేలా ...గ్యాస్‌కుగానీ రేషన్‌కార్డుకుగాని లంకె పెడితే బాగుంటుంది కదా! ఆ పని మన ప్రభుత్వాలు ఎందుకు చేయడంలేదు? ప్రభుత్వ సంక్షేమ కార్యక్షికమాల అమలుకు ఓటరు కార్డు సరిపోతుంది. అలాగే దేశంలో వీసా గడువులు ముగిసినా ఇక్కడే వుండిపోతున్న వారిని ఎప్పటికప్పుడు పంపించేసే ఒక బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. సరిహద్దుల వెంట దేశంలోకి ఎవరు చొరబడినా.. అందుకు సరిహ ద్దు భద్రతాధికారులనే బాధ్యులను చేస్తూ, వారికి కఠినమైన శిక్షలు అమలు చేస్తే చొరబాటుదారుల బెడద కూడా దానంతట అదే తగ్గుముఖం పడుతుంది. ఈ దేశం ఇన్ని రకాలుగా నష్టపోతున్నా పట్టని మన ప్రభుత్వాలు... అమెరికా అవసరాల కోసమో, మరొకరి అవసరాల కోసమో... ఆధార్ లేనిదే బతకడానికి వీలులేదన్నంతగా ప్రజలను భయకంపితులను చేస్తుండడం నిజంగా సిగ్గు చేటైన విషయం.

-కల్లూరి శ్రీనివాస్‌డ్డి

35

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ