చట్టాలు కాదు, విధానాలు మారాలి


Sat,October 6, 2012 03:56 PM

anna-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaఅవినీతికి అవకాశాలు ఏ విధానంలో ఎక్కువ ఉంటే ఆ విధానాన్నే ఆశ్రయించడం, అదే గొప్పదని పొగడడం మనం చూసిందే!.. రెండు దశాబ్దాలలో లక్షలాది కోట్ల ప్రభుత్వ ఆస్తులు, భూములు అమ్మకం పేర అన్యాక్రాంతమైనాయి. బహుళజాతి కంపెనీలకు ఉదారంగా ఫలహారంగా పంచిపెట్టారు. కనిపించని మెగా స్కాంలకు ఇవే కేరాఫ్ అడ్రస్‌లుగా మారాయి. పార్లమెంటు అధికారానికి ఢోకాలేదని ప్రభుత్వం లోక్‌పాల్ బిల్లు తెస్తున్నది. అన్నా హజారే ‘జన్‌లోక్‌పాల్’ కావాలంటూ దీక్షలతో పోరాటానికి దిగారు. ప్రధా ని, సుప్రీంకోర్టుతో సహా అందరూ లోక్‌పాల్ పరిధిలోకి రావలంటున్నది హజారే ప్రతిపాదిత జన్‌లోక్‌పాల్. మన రాజ్యాంగం ప్రకారం ఈ దేశానికి పార్లమెంటే సుప్రీం. ఆ రాజ్యాంగ పరిధిని సైతం దాటి ఒక సంస్థకు దేశంపై సర్వాధికారం కట్టబెట్టడం సాధ్యం కాదంటున్న న్యాయకోవిదుల వాదనలూ ఉన్నాయి. అవినీతిలో కూరుకుపోతున్న ఈ దేశానికి లోక్‌పాల్ వంటి ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ తప్పక అవసరమే.

కానీ అది మన రాజ్యాంగ పీఠికను ప్రశ్నించ కూడదు! హజారే కోరుతున్న కోరలు కలిగిన లోక్‌పాల్ బిల్లే కావాలనుకున్నా, ముందు ప్రభుత్వ లోక్‌పాల్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనివ్వవచ్చు. హజారే బృందం ఆ బిల్లు లో అన్ని పార్టీల సభ్యుల చేత తాము కోరుతున్న సవరణల ప్రతిపాదనలను సూచించి ఒత్తిడి పెంచవచ్చు. ప్రభుత్వ లోక్‌పాల్‌ను అనుమతిస్తూనే అందులో చేయాల్సిన సవరణల కోసం ప్రయ త్నించవచ్చు. కాబట్టి ప్రభుత్వం తెస్తు న్న లోక్‌పాల్ బిల్లును వ్యతిరేకించే కన్నా దానిలో సవరణల కోసం అన్ని పార్టీలపై ఒత్తిడి తెచ్చే కార్యక్షికమాన్ని హజా రే ఎంచుకుని ఉంటే బాగుండేది.

కానీ ఆయన అలా చేయకుండా, ఏకంగా దీక్షకు దిగి దేశంలో ఒక సంచలనం సృష్టించాలనుకున్నారేమో తెలియ దు!హజారే కోరుతున్న జన్‌లోక్‌పాల్‌తోనైనా దేశంలో అవినీతి అంతమవుతుందా? అంటే అనుమానమే. అవినీతికి పాల్పడితే అంగాలు తొలగించే దేశాల్లో, మరణశిక్షలు వేసే దేశాల్లో అవినీతి అంతం కానప్పుడు, జన్‌లోక్‌పాల్‌తో అవినీతి అంతమవుతుందనే నమ్మకం ఎందరికుంది? నేటి విచ్ఛలవిడి మెగా అవినీతికి మూలం మనం అనుసరిస్తున్న ఆర్థిక ‘విధానం’లో ఉన్నది.‘చట్టం’వేరు, ‘విధానం’ వేరు. హజారే కోరుతున్నది కొత్త చట్టం తప్ప,కొత్త విధానం కాదు. చట్టం విధానం చట్రంలోనే పనిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే విధానాన్ని చట్టం అనుసరిస్తుంది. హజారే విధానాన్ని గాలికి వదిలి, చట్టం కోసం పోరాడుతున్నారు. జన్‌లోక్‌పాల్ రేపు అవినీతిని బట్టబయలు చేస్తుంది. అంతే తప్ప విచ్ఛలవిడి అవినీతికి కారణమవుతున్న నయా ఉదారవాద విధానాన్ని మార్చలేదు. కాబట్టి విచ్ఛలవిడి అవినీతికి అవకాశం లేని ఆర్థిక ‘విధానం’ కోసం హజారే పోరాడితే కొంత సార్థకత దక్కేది. దేశం 64 ఏళ్లలో మొదటి 44 ఏళ్లు సాధారణ అవినీతికి గురైంది. గత ఇరవై ఏళ్లుగా వ్యవస్థీకృతమైన అవినీతికి బలిఅవుతోంది.

మనది ఆరంభంలో మిశ్రమ ఆర్థిక విధానం. అప్పుడు సాధారణ అవినీతి చూసి గుండెలు బాదుకునేవాళ్లం. దేశం నాశనమైపోతున్నదనే వాళ్లం. ఈ క్రమంలోనే అభివృద్ధి పేరుతో మన పాలకులు, అమెరికా-పాశ్చాత్యుల ప్రతిపాదిత ప్రపంచీకరణను తెచ్చారు.అన్ని సమస్యలకు అదే పరిష్కారమని చెప్పారు. రెండు దశాబ్దాలు గడిచాయి. సమానత్వం కాస్తా పోటీతత్వంగా మారిపోయింది. అవినీతి మరింత సరళీకృతమైంది. ఆర్థికంగా దేశం రెండు ముక్కలైంది.సంపన్నుల ఇండియా, పేదల భారత్‌గా విడిపోయింది. పాలకులు, పారిక్షిశామికవేత్తలు, బడా వ్యాపారవేత్తలు, బహుళజాతి కంపెనీలది ఒక పార్శమైతే, పాలిత ప్రజలది మరొకటి అయ్యింది. దీనికి రెండు దశాబ్దాలలో పెరిగిన అవినీతే కారణం.

ఒకప్పుడు అవినీతికి పాల్పడితే చేతికి మరకలైనా అంటేవి. కానీ సరళీకరణ పుణ్యమాని ఇప్పుడు చేతులకు ఆ మరకలు కూడా అంటడం లేదు. 2జి స్పెక్ట్రంలో 1,66,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటున్నాం. కానీ సాక్ష్యం ఏది? 2001 స్పెక్ట్రం లైసెన్సుల కేటాయింపు ధరల ఆధారంగానే 2008లో 2జి స్పెక్ట్రం లైసెన్సుల కేటాయింపులు జరిపామని రాజాతో పాటు ప్రభుత్వమూ చెప్పింది. 2008లో ఉన్న మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని మాత్రమే మనం లక్షా 66వేల కోట్ల అవినీతి జరిగిందంటున్నాం. అది ఊహాజనితమే తప్ప సాక్ష్యమెక్కడ? దేశంలో సెల్‌ఫోన్ వ్యవస్థ విస్తరణ కోసం గతంలో వాజపేయి ప్రభుత్వం, సెల్యులర్ కంపెనీలు చెల్లించాల్సిన ₹1300 కోట్లను రద్దు చేసింది. ఆ రోజు దాన్ని ఎవరైనా అవినీతి అన్నారా? ఉన్నతస్థాయిలో మెగా అవినీతి సరళతరం కావడానికి కారణమేమిటో గుర్తించలేకపోతున్నాం. హద్దుల్లేని సరళీకృత ఆర్థిక విధానమే మెగా స్కాం లకు ప్రాణం పోస్తున్నది. వాజపేయి నుంచి మన్మోహన్ ప్రభుత్వాల దాకా, సమాచార సాధన సంపత్తి కేటాయింపుల్లో పాల్పడిన చేతికి మరకలంటని మెగా స్కాంలే ప్రబల సాక్ష్యం!
అవినీతికి అవకాశాలు ఏ విధానంలో ఎక్కువ ఉంటే ఆ విధానాన్నే ఆశ్రయించడం, అదే గొప్పదని పొగడడం మనం చూసిందే! విదేశీ పాలకుల పొగడ్తల సర్టిఫికెట్లు మెడలో తగిలించుకుని ఊరేగిన పాలకులూ మనకున్నారు. పీవీ కాలంలో మన్మోహన్, వాజపేయి కాలంలో చంద్రబాబు విదేశీ పాలకుల చేత అదే పనిగా పొగిడించుకున్నారు. రెండు దశాబ్దాలలో లక్షలాది కోట్ల ప్రభుత్వ ఆస్తులు, భూము లు అమ్మకం పేర అన్యాక్రాంతమైనాయి. బహుళజాతి కంపెనీలకు ఉదారంగా ఫలహారంగా పంచిపెట్టారు. కనిపించని మెగా స్కాంలకు ఇవే కేరాఫ్ అడ్రస్‌లుగా మారాయి.

ప్రత్యేక ఆర్థిక మండళ్లది (సెజ్‌ల) ఇంకో బాగోతం. ఇది దేశ సార్వభౌమాధికారాన్నే అమ్మేసే బాగోతం. అవి చేసే ఉత్పత్తులు, వ్యాపారాలను పర్యవేక్షించే అధికారం ప్రజా ప్రభుత్వాలకుండదు. సెజ్‌లకు కేటాయించిన భూమిపై ఈ దేశం తన అధికారాన్నే కోల్పోతుంది. ఇంతటి దుర్మార్గమైన సెజ్ చట్టం ఉద్యోగాల కోసమే తెచ్చామని చెప్పు కొస్తారు. పాలకుల పథకాల రచనంతా మెగా స్కాంల కోసమే అయిపోయింది. చివరకు మరుగుదొడ్ల కోసం కూడా మన పాలకులు (చంవూదబాబు ప్రభుత్వం) ప్రపంచబ్యాంకు నుంచి అప్పులు తెచ్చారు. నిజంగా ఈ దేశం కనీస వసతులు కూడా కల్పించుకోలేని స్థితిలో ఉందా? వనరులు అమ్మేయడం, వసతుల పేరిట అప్పులు తేవడం మన పాలకులకు సరళీకృత ఆర్థిక విధానాలే నేర్పాయి.

ఇవాళ అనేక పేద వర్ధమాన దేశాల అవినీతి సొమ్ముతో స్విస్ బ్యాంకు లు నిండిపోయాయి. ప్రపంచ మార్కెట్లలో ద్రవ్య చెలామణి మందగించింది. బహుళజాతి కంపెనీల లాభాలు టార్గెట్లు చేరలేకపోతున్నాయి. అందుకే కాబోలు ఇతర దేశా ల్లో దాచుకున్న భారతీయుల సొమ్ము పై పన్ను చెల్లించమని మాత్రమే మన్మోహన్ సర్కార్ అడుగుతుందట. అంతేతప్ప ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో లెక్కలు అడగదట! అవినీతి సొమ్మును మార్కెట్‌లో చెలామణిలోకి తేవడానికి మాత్రమే మన్మోహన్ సర్కార్ పరిమితం కావడం గమనార్హం.

అనేక దేశాలకు సరళీకృత విధానాలను నేర్పింది అమెరికా యూరప్ దేశాలే. ఇప్పుడు ప్రపంచవ్యాప్త అవినీతిపై ఇవి ఆందోళన చెందుతున్నాయి. బహుళజాతి వ్యాపారాలు మందగించాయి. అమెరికా యూరప్‌ల ఆర్థిక వ్యవస్థలూ బలహీనపడ్డాయి. ఫలితమే ప్రపంచవ్యాప్త నల్లధనంపై వారి కన్ను పడింది. ఇటీవల ‘వికీలీక్స్’ అనే సంస్థ అనేక దేశాల రహస్యాలను బయటపెట్టింది. అమెరికా రహస్యాలను బయటపెట్టింది. నల్లధనాన్ని మార్కెట్లోకి తెచ్చి లబ్ధి పొందడమే అమెరికా లక్షంగా వికీలీక్స్ ఈ పని చేయిం చింది. ఆయా దేశాల పాలకుల రహస్యాలను వికీలీక్స్‌తో బయటపెట్టించి నల్లధనాన్ని మార్కెట్లకు తరలించటమే దాని ఉద్దేశం. ఈజిప్టులో కావచ్చు , లిబియాలో కావచ్చు, రేపు భారత్‌లో కావచ్చు. పాత అవినీతి పాలకులు తరిమేయబడవచ్చు కానీ వచ్చే కొత్త పాలకులు అవినీతి పాలకులు కారనే గ్యారంటీ ఎక్కడుంది? కాబట్టి మారాల్సింది పాలకులు కాదు. విధానం మారాలి.


అన్నా హజారే చేపట్టిన ఉద్యమానికి అది ప్రేరణ అయిందనడంలో అనుమానం లేదు. పాశ్చాత్య పెట్టుబడిదారీ విధాన చట్రం లో భాగంగా మనం జన్‌లోక్‌పాల్ వంటి చట్టాలు తెచ్చినా ఈ మెగా స్కాంలు ఆగేవి కావు. పరిష్కారం మనం ఎలాంటి ఆర్థిక విధానం అనుసరిస్తున్నామనే దానిపైనే ఆధారపడి ఉంది. స్వావలంబనను ఇచ్చే ఆర్థిక విధానమే చాలా మేరకు అవినీతి అదుపుకు ఓ పరిష్కారం. ఆయా దేశాలకు వనరులు, మానవ సంపద, భౌగోళిక సంపద ప్రకృతి ప్రసాదించిన వరాలు. అవి తమ దేశ ఆర్థిక విధానానికి సాధనాలు కావాలి. ఆయా దేశాల ఆర్థిక అనారోగ్యానికి, అవినీతికి అలాంటి స్వాలంబనే సర్వరోగ నివారిణి కాగలుగుతుంది.

అన్నా హజారే ‘రాలె గాంవ్ సిద్ది’ని స్వావలంబన గల గ్రామంగా మార్చారు. అలాంటి ఆర్థిక విధానలేమి కారణంగానే ఇవాళ దేశం అవినీతి కూపంగా మారిపోయిందని ఆయన ఎందుకు గుర్తించలేకపోతున్నారు? కేవలం లోక్‌పాల్ బిల్లుతోనే మెగా దోపిడీ, మెగా స్కాంలు ఆగిపోయేవి కావు. విచ్ఛలవిడి అవినీతిని ప్రేరేపిస్తున్నవి సరళీకృత ఆర్థిక విధానాలు. ఆ విధానాన్ని పునఃపరిశీలన కోసం, ప్రత్యామ్నాయ స్వావలంబఆర్థిక విధానం కోసం పోరాడితే ఆయన చేస్తున్న అవినీతిపై పోరాటం సార్థకమవుతుంది.

-కల్లూరి శ్రీనివాస్‌డ్డి


TOP News






35

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ