తెలుగుజాతికి ఎన్టీఆర్ ప్రతీకా?


Wed,December 12, 2012 10:36 PM

పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి అనుమతించారు. ఆ అనుమతి సాధించిన కీర్తి కోసం ఆయన కుటుంబం బజారుకెక్కింది. ఆ క్రెడిట్ మాదం మాదనే వాదనలతో ఈ రాష్ట్రం వారి సొత్తైనట్లు బిల్డప్‌లిచ్చుకుంటున్నారు.

అసలు పార్లమెంటులో ఎవరి విగ్రహాలు పెడతారు?, అలాంటి వ్యక్తులకు ఎలాంటి ప్రఖ్యాతి వుంటే పెడతారు?అనే నిబంధనలు సగటు పౌరుడికి తెలియదు. ప్రభుత్వంలో వున్న వారి రాజకీయ అవసరాలను బట్టి విగ్రహాలను పెట్టుకుంటూపోతున్నారని మాత్రం తెలుసు. అలాంటి విగ్రహాలతో కొంత కాలానికి పార్లమెంటు ఆవరణ సరిపోతుందా అనేది ప్రశ్న. మహాత్ముడు జాతిపితగా కొలవబడుతున్నారు. ఆయనతోపాటు మొదటి తరంలోని దేశభక్తి, విశిష్టత కలిగిన వారి విగ్రహాలు ఇప్పటికే 1baba వరకున్నట్లు తెలుస్తున్నది. ఇక పార్లమెంటు లోపల ఇంకా అనేక మందివి చిత్రపటాలు కూడా వున్నా యి. గడిచిన 30 ఏళ్లలో దేశం మెచ్చదగ్గ విశిష్టతను సాధించిన రాజకీయ నాయకుడు ఎవరైనా వున్నారా? ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏ ఆధారంగా పెట్టడానికి కేంద్రం అనుమతించిందనేదే సగటు పౌరుడికి కలిగే సంశయం.
పార్లమెంటు భారతీయాత్మకు ప్రతీక.

అక్కడ పెట్టే విగ్రహాలకు కూడా అంతే విశిష్ట త వుండాలి. పార్లమెంటు ఆవరణలో ఎవరిదైనా విగ్రహం పెట్టాలంటే, అతడు కనీసం విస్త్రుత ప్రజోపాకారం చేసివుండాలి. తాను పాలించిన రాష్ట్రంలోని ఒక ప్రాంత అస్తిత్వాని కే ఎసరు పెట్టిన ఎన్టీఆర్ ప్రతిమను పార్లమెంటులో పెట్టడ మే సగటు తెలంగాణ వాసికి అశ్చర్యం వేస్తున్నది. తెలంగా ణ ప్రజల అస్తిత్వాన్నే కనుమరుగుచేయాలనుకున్నవాడు. జాతీయగీతాలను సైతం మరిపిస్తూ ప్రతి పాఠశాలలో ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ అనే సీమాంధ్ర గీతాన్నే జాతీయగీతంగా పాడించారు. అటు దేశ స్పురణను, ఇటు తెలంగాణ అస్తిత్వాన్ని మరిపించి తన ప్రాంత ఆధిపత్యాన్ని తన రాజకీయాధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనుకున్నారాయన.

ఆయన రాజకీయంగా కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకిస్తే తప్పు లేదు. ఢిల్లీ అధికారాన్ని సవాలు చేయడాన్నే హీరోయిజంగా ప్రచారం చేసుకున్నారు. ఒక పార్టీ పట్ల వ్యతిరేకత వేరు, దేశాన్ని పాలించే వ్యవస్థ పట్ల వ్యతిరేకత వేరు. ఎన్టీఆర్ వ్యతిరేకత రెండోదానికి సంబంధించినది. ఢిల్లీ వ్యవస్థను అయన ప్రజల కోసం వ్యతిరేకించలేదు. తనరాజకీయం కోసం, రాష్ట్రంలో అప్పటికే దశాబ్దాల తరబడి పీడించబడుతున్న తెలంగాణను మైమరిపించడం కోసం తెలుగు ఆత్మగౌరవాన్ని తెరమీదికి తెచ్చాడు. అటు ఢిల్లీని గానీ , ఇటు తెలంగాణ ప్రాంతాన్ని గానీ ఎన్టీఆర్ ఏనాడూ గౌరవించింది లేదు. పాపులర్ స్కీములే కొలమానాలు అయితే, అలాంటి స్కీములు తెచ్చిన వాళ్లందరి ప్రతిమలు పార్లమెంటులో పెట్టాలంటే ఎన్టీఆర్‌లాంటి వారు చాలా మంది వున్నారు. ఒక సినిమా నటుడిగా ఎన్టీఆర్‌ను అభిమానించేవారు చాలా మంది వుంటారు. ఎన్టీఆర్ విగ్రహానికి తెలంగాణ ప్రజలేమీ వ్యతిరేకులు కారు.

ఆయన ప్రతిమ పార్లమెంటులో ఒక సినిమా నటుడని పెట్టడంలేదు. రాష్ట్రంలో ఒక పాపులర్ నాయకుడుగానే గుర్తించి పెడుతున్నారు. ఈ రాష్ట్రంలో తెలంగాణ పట్ల వివక్షను గుర్తించని పాలకుడి విగ్రహం అక్కడ పెడుతున్నారనేదే సగటు తెలంగాణ వాడి అభ్యంతరం. పార్లమెంటులో తెలంగాణ విశిష్ట వ్యక్తుల విగ్రహం ఒక్కటి కూడా ఎందుకు లేదనేదే ప్రశ్న.

ఎన్టీఆర్ ఒక సినిమా నటుడిగా శేష జీవిత కాలంలో రాజకీయ పార్టీని స్థాపించి రాజ్యాధికారాన్ని అనుభవించారు. సినిమా నటుడిగా ప్రజల ఆదరణ తన రాజకీయ ప్రాబల్యానికి పనికొచ్చింది తప్ప ఆయన సినీజీవిత కాలంలో చేసిన దేశసేవ అంటూ ఏమీలేదు. ఆయన రాజకీయాల్లో జీవించింది 13 ఏళ్లే. ఆ మాత్రపు రాజకీయ జీవిత కాలానికి, పార్లమెంటు ఆవరణలో విగ్రహం పెట్టి మూల్యం చెల్లించడాన్ని మనం ఏకోణంలో చూసినా సమంజసం కాదు. 50 ఏళ్ల రాజకీయ జీవితాన్ని నిజాయితీగా గడిపి న వారు లేకపోలేదు. ఆయన కాంగ్రెస్ ఢిల్లీ రిమోట్ కంట్రోల్ రాజకీయానికి వ్యతిరేకంగా ఆంధ్రవూపదేశ్‌లో ఓ ప్రాంతీయ రాజకీయపార్టీని స్థాపించారు. కానీ రాష్ట్రంలో తెలంగాణ అస్తిత్వానికే ఎసరు పెట్టాడాయన. తెలంగాణ హక్కులను కాలరాశారు.

అప్పటిదాకా వున్న తెలంగాణ అభివ్రుద్ధి బోర్డును రద్దు చేశాడు. క్రుష్ణా నది నీళ్లను తెలంగాణకు దక్కకుండా మద్రాసుకు, రాయలసీమకు తెలుగుగంగ పేర మళ్లించాడు.సస్తాబియ్యం, సబ్సిడీ కరెంటు పేర తెలంగాణ ప్రజలను జోకొట్టాడు. తెలంగాణ ప్రాజెక్టులన్నిటీనీ మూలన పడేశాడు. భాషపేర తెలుగు ప్రజలంతా ఒక్క ఊదరగొట్టి తెలంగాణ పై తన రాజ్యాధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు. హైదరాబాద్‌ను ఆంధ్రా ‘కాలనీ’గా మార్చేశాడు. పదే పదే తెలుగు ఆత్మగౌరవాన్ని వల్లె వేసి, తెలంగాణ ఆత్మ ఆయనకు ఏనాడు కనిపించలేదు. 610 జీవో తెచ్చాడు. కానీ అమలును మరిచాడు. ఒక ప్రాంతానికి అన్యాయం చేసిన ఆయన దేశంలో గొప్పోడన్నట్లు పార్లమెంటు అవరణలో ఆయ న ప్రతిమ పెడితే తెలంగాణోడి ఆత్మకు లభించేది గౌరవమా, అగౌరవమా?

ఇప్పటికే ఇటు రాష్ట్ర రాజధానిలో, అటు దేశ రాజధానిలో సీమాంధ్ర నేతల విగ్రహా లు లెక్కకు మించి వెలిగిపోతున్నాయి. తమ ఆధిపత్య దర్పాన్ని చాటుకుంటున్నాయి. పార్లమెంటులో టంగుటూరి ప్రకాశం, ఎన్‌జీ రంగా బొమ్మలున్నాయి. హైదరాబాద్‌లో వారి ప్రతిమలకు లెక్కేలేదు. ‘ఆంవూధవూపదేశ్’తో సంబంధం లేని ‘టంగుటూరి’ విగ్రహం అసెంబ్లీ రోడ్డు చౌరస్తాలో వెలిగిపోతున్నదంటే, వారి ఆధిపత్యం ఏ స్థాయిలో ఉన్నదో చెప్పకనే చెబుతున్నది. 352 ఎకరాలు గల బంజారా హిల్స్‌లోని పార్క్‌కు కాసు బ్రహ్మానందడ్డి పేరు తగిలించారు. ఎన్టీఆర్ మరణించి కూడా 55 ఎకరాల పార్కును తనది (ఎన్టీఆర్ గార్డెన్) చేసుకున్నాడు. చివరకు వారి కీర్తి కండూతికి కూడా తెలంగాణ భూసంపదనే వాడుకున్నారు. సీమాంవూధుల ఆధిపత్య కీర్తిని హైదరాబాద్‌కే పరిమితం చేయకుం డా పార్లమెంటు దాకా విస్తరిస్తున్నారు. వారి కీర్తి కిరీటాలను ఒక్కసారి తొలగించి చూస్తే పీడించ పడుతున్న తెలంగాణ కనిపిస్తుంది, వారి కీర్తి వెనకాల ‘వివక్ష’ అపకీర్తి కనిపిస్తుంది.

రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణలో భాగంగానే ఎన్టీఆర్ విగ్రహానికి పార్లమెంటులో చోటుదక్కుతున్నది. పార్లమెంటులో విగ్రహం పెడితే గిడితే అందులో తెలంగాణ ఆత్మ వుండాలి. అది ఎన్టీఆర్ ప్రతిమలో వుండదు. సరికదా పార్లమెంటులో ఆ ప్రతిమ తెలంగాణ ఆత్మను, అస్తిత్వాన్ని వెక్కిరిస్తుంది తప్ప ఆవిష్కరించదు. ఎన్టీఆర్ విగ్రహం అక్కడ పెట్టక తప్పదనుకుంటే, తెలంగాణ ఆత్మను ఆవిష్కరించే విశిష్ట వ్యక్తి విగ్రహం కూడా అక్కడ పెట్టక తప్పదు. పార్లమెంటులో తెలంగాణ ఆత్మను ఆవిష్కరించ గలిగే విశిష్ట వ్యక్తులకు తెలంగాణలో కొదవలేదు. పివీ నర్సింహరావు మొదలు తెలంగాణ సిద్దాంత కర్త జయశంకర్ వున్నారు. ప్రాంత వివక్షపై కనుమూసేదాక పోరాడిన కాళోజీ వున్నారు. ఎన్టీఆర్‌లాగ విళ్లలో ఏ ఒక్కరు ఇంకో ప్రాంతానికి అన్యాయం చేసినవారు కారు.

తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటిన వారు. ఇంకా చెప్పాలంటే ప్రాంత వివక్షలేని భారత సమాజం కోసం వాళ్ళు పోరాడిన వారు. ఢిల్లీ వ్యవస్థను వ్యతిరేకించి తెలుగు ఆత్మగౌరవం అని తెలంగాణ ఆత్మనే కనుమరుగుచేయజూసిన ద్వంద నీతిని అడ్డుకున్న జయశంకర్, కాళోజీల కన్నా తెలంగాణ ప్రజలకు ఎన్టీఆర్ గొప్పోడు కాదు. ఈ దేశానికి ఎన్టీఆర్ కన్నా తెలంగాణ ఆత్మ గొప్పది. ఎందుకంటే.. ఈ దేశ స్వాతంత్రం కన్నా 13 నెలలు ఆలస్యంగా స్వతంత్రం పొందింది తెలంగాణ. బ్రిటిష్ పాలకులు నిజాం రాజుకు స్వయం ప్రతిపత్తి ఇచ్చి హైదరాబాద్ రాజ్యాన్ని నిజాం స్వతంత్ర రాజ్యం గా ప్రకటించుకున్నాడు. అది ప్రజలకు ఇష్టం లేదు. భారత్‌లో విలీనం కావాలనుకున్నారు. దాన్ని గమనించిన నైజాం తన సైన్యాన్ని, రజాకార్లను ప్రజలపైకి వుసిగొలిపాడు.

నిజాంను ఎదిరించిన తెలంగాణ ప్రజలు భారత్‌లో తమకు తాము విలీనం కావాలనుకున్నారు కాబట్టే భారత సైన్యాలు ఇక్కడకు రాగలిగా యి. హైదరాబాద్ భారత్‌లో విలీనం గొప్పతనం సర్దార్‌ప మరెవరిదో కాదు. స్వయాన అది తెలంగాణ ప్రజల గొప్పతనం. నిజంగా ఆరోజే తెలంగాణ ప్రజలు ఏ నిజాంకో.. ఇంకొకరికో జైకొట్టివుంటే ఇవాళ భారత దేశ స్వరూపం ఏరకంగా వుండేదో! అదీ ఈ దేశంలో తెలంగాణ గొప్పతనం. అంతేకాదు కోట్లాది నగదు ఖజానాతో తెలంగాణ ఈ దేశంలో విలీనమైంది. ఈ దేశం కోసం తెలంగాణ తన సర్వస్వాన్ని త్యాగం చేసింది. ఈ దేశ అస్తిత్వాన్ని కాపాడింది. అందుకే ఈ దేశానికి తెలంగాణ రుణపడిలేదు.

ఈ దేశమే తెలంగాణకు రుణపడివున్నది. అటు దేశభక్తిలోగానీ, ఇటు ప్రాంత అస్తిత్వం పట్లగానీ తెలంగాణ ఏనాడు రాజీ పడలేదు. కానీ అటు ఢిల్లీని ఎదిరించి, ఇటు ఇంకో ప్రాంత అస్తిత్వానికే ఎసరు పెట్టిన వారిలో ఢిల్లీ పాలకులకు ఇవాళ ఏమి కనిపిస్తున్నదో తెలియదు! ఈ దేశ అస్తిత్వాన్ని నిలబెట్టిన తెలంగాణ ఆత్మను పార్లమెంటు ఆవరణలో ఆవిష్కరించకుండా, తెలంగాణ అస్తిత్వాన్నే గుర్తించని వ్యక్తి విగ్రహం పెట్టడం సమంజసం కాదు. తెలంగాణ విశిష్ట వ్యక్తుల విగ్రహ స్థాపన కోసం తెలంగాణ ఉద్యమకారులు ఒత్తిడి తేవాల్సిన అవసరం వున్నది.

దేశంలో తెలంగాణ ఆత్మకులేని గౌరవం, ఒక సినిమా నటుడి రాజకీయానికి లభిస్తుండడం విచిత్రం! తెలంగాణను ఎన్నికలలోపు తెచ్చే సూచనలు కనుమరుగవుతున్నా యి. తెలంగాణ రాజకీయాలు ఇంకా చైతన్యవంతంగా, సమరశీలంగా రూపొందాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. రాష్ట్ర సాధనోద్యమంతో పాటు, ఆత్మగౌరవ పరిరక్షణ పట్ల కూడా తెలంగాణ సమాజం సోయితో మెలగాలి. ఆలోపల కనీసం పార్లమెంటులో తెలంగాణ ఆత్మను ఆవిష్కరించే ప్రతిమ కోసమైనా పోరాడాల్సిన అవసరాన్ని గుర్తిద్దాం!

-కల్లూరి శ్రీనివాస్‌డ్డి


35

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ