కరీంనగర్ సెగ - ఢిల్లీ కదలిక


Mon,November 12, 2012 12:09 AM

కేసీఆర్ యుద్ధ ప్రణాళిక ప్రకటించగానే ఢిల్లీ పాలకుల్లో మళ్లీ కదలిక మొదలయింది. హోంశాఖ నెలవారి ప్రగతి నివేదిక సందర్భంగా సుశీల్‌కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలు ఆ విషయాన్ని ధృవపరుస్తున్నాయి. ఒత్తిడి వుంటేగానీ ఢిల్లీ పాలకులు కదలరని మరోసారి రుజువైంది. ‘ఇన్నాళ్లు వేచి చూశారు. ఇంకా కొన్ని నెలలు వేచిచూడండి’ అని షిండే చేసిన వ్యాఖ్యల్లో నిజమెంత? షిండే మళ్లీ కొన్ని నెలలు ఆగమంటున్నారు! మరో డెడ్‌లైన్‌లోకి తెలంగాణను లాగుతున్నట్లున్నారు. డెడ్‌లైన్ ప్రకటనలకు కరీంనగర్ సదస్సు ఇప్పటికే డెత్ లైన్ గీసింది. ఇంకా డెడ్‌లైన్‌లతో బుజ్జగిద్దామనుకుంటే సాధ్యమయ్యే పని కాదు. నిజాయితీ చర్చలకు తెలంగాణ ప్రజలు ఎప్పుడూ వ్యతిరేకులు కారు. కేసీఆర్ హస్తినలో గడిపిన నెలరోజుల కాలమే అందుకు నిదర్శనం. మరికొన్ని నెలలు ఆగమనడంలోని మర్మం ఏమైనా కావచ్చు. చర్చల్లో నిజాయితీ అవసరం. కరీంనగర్ సెగ నిజంగానే ఢిల్లీ ప్రభువులకు తగిలిందా? ప్రకటించిన డెత్ లైన్‌కు బ్రేకు వేయాలనే కుతంవూతమేమైనా అందులో దాగివుందా? సంధి రాయబారం ఇప్పటికే ఓ దఫా ముగిసింది. యుద్ధం ప్రకటించబడ్డది.

ఒకవేళ చర్చల కోసం మళ్లీ పిలిస్తే ఇటు యుద్ధం కొనసాగిస్తూనే అటు చర్చలకు వెళ్లవచ్చు. కానీ మునుపటిలాగా యుద్ధవిరమణ చేసి చర్చలకు వెళ్లే అవకాశం మా త్రం లేదని చెప్పాలి.
నెలరోజుల పాటు చర్చల కోసం కేసీఆర్ హస్తినలోనే వు న్నప్పుడు షిండే నోట ఒక్క సానుకూల మాటరాలేదు. క నీసం చర్చలు జరుగుతున్న ట్లు కూడా ఆయన ఒప్పుకోలే దు. పైగా వెక్కిరింత వ్యాఖ్యలు చేశారు. వయలార్‌లు, ఆజాద్‌లు దాదాపుగా ఆ వ్యాఖ్యలే చేశా రు. ‘ఇక్కడ ఏమీ జరగడం లేదన్నారు. జరుగుతున్నదని ఎవరు అన్నారో వారినే అడగండన్నా రు. ఇపుడేమో- ఇన్ని ఏళ్లు ఆగారు, ఇంకా కొన్ని నెలలు ఆగండి-అని ఎవరికి చెపుతున్నారు? గోడలకా, టీవీ కెమెరాలకా? ప్రకటించిన యుద్ధా న్ని మోసపు మాటలతో ఆపడం సాధ్యం కాదు. తెలంగాణ వచ్చే దాక యుద్ధ విరమణ వుండదనే కేసీఆర్ నిర్ణయానికి భంగం కలిగించడం ఇంకా సాధ్యం కానిపని. కేసీఆర్ ఇప్పటికీ చర్చలకు తెర దించలేదు. చర్చలు జరిగినా యుద్ధం మాత్రం ఆపేది లేదని నిర్ణయానికొచ్చారు. ఢిల్లీ ఇంకా ముసుగులో గుద్దులాట మానటంలేదు. చెప్పేదేదో కేసీఆర్‌ను ఢిల్లీకి పిలిచినపుడే చెప్పివుంటే కాంగ్రెస్ పరువు కొంతైనా మిగిలేది! తన పార్టీనే త్యాగం చేస్తానన్నాక కూడా కేసీఆర్ నుంచి వారు ఆశిస్తున్నదేముందని! ఈ తాత్సరం దేనికి?
షిండే చేసిన వ్యాఖ్యలు గమనిద్దాం-అఖిల పక్ష సమావేశం ఇప్పటికే ఒక సారి ముగిసిందన్నారు. అనధికార చర్చలు కూడా ముగిసాయన్నారు.

ఇక నిర్ణయం పార్లమెంటు సమావేశాలకు ముందుగానీ, ఆతర్వాతగానీ వెలువడవచ్చు. షిండే చేసిన వ్యాఖ్యలు నిజంగా అసక్తి కరమైనవే. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అందులో ఎంత చోటువున్నదనేది ప్రశ్న. షిండే వ్యాఖ్యలపై కొంత లోతైన అవగాహన కూడా అవసరమే. తెలంగాణ నిర్ణయం అనుకూలంగా వెలువడినా అది ఎప్పటిలోపు వెలువడితే, 2014 ఎన్నికల లోపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడగలుగుతుంది? రాష్ట్ర విభజన ప్రక్రియకు సుమారు 15 నెలల కాలం పట్టొచ్చని న్యాయకోవిదులంటున్నారు. సాధారణ ఎన్నికల ప్రకటనకు ఇంకా 16 నెలలు మాత్రమే మిగిలివున్నాయి. ఈ డిసెంబర్ 31లోపు సానుకూల నిర్ణయం వస్తేగానీ, సాధారణ ఎన్నికల లోపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడదన్నమాట! మరి షిండే చెపుతున్నదేమిటీ? కొన్ని నెలలు వేచి వుండమంటున్నారు. ‘కొన్ని’ అనే పదానికి రెండు నెలలకు తక్కువ కాకుండా ఎన్నినెలలైనా అని మనం చెప్పుకోవచ్చు.

అంటే ఎన్నికలలోపు తెలంగాణ తేలుతుందా లేదా అనేది అనుమానమే. ఏర్పడవచ్చు, ఏర్పడకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. అంటే కాంగ్రెస్ ఇంకా సస్పెన్సే కొనసాగిస్తున్నదని అర్థం. రాజకీయంగా ఆంధ్రవూపదేశ్ రాష్ట్రాన్నే కోల్పోయే దుర్దశ వెంటాడుతున్నా కాంగ్రెస్ పెద్దల తీరు మాత్రం మారకపోవడమే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం.

ఎన్నికలు తరుముకొస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నుంచి బయట పడాలని కాంగ్రెస్ బలంగానే భావిస్తున్నదనడంలో అనుమానం లేదు. అందులో భాగంగా తెలంగాణ విషయంలోఅది ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నదనడంలో అనుమానం లేదు. అయితే అది ఏనిర్ణయం తీసుకోనున్నదనేదే కీలకం. కాంగ్రెస్ సీమాంవూధలో దాదాపు తుడిచేసుకుపోయింది. కనీసం తెలంగాణలోనైనా అది బతికి బట్టకట్టాలంటే తెలంగాణ ఇస్తే గానీ దాని ఉనికి కాపాడుకోవడం సాధ్యం కాదు. తెలంగాణ ఇవ్వకపోతే రాష్ట్రంలో ఒక్క ఎమ్‌పీ సీటు గెలిచే పరిస్థతి కూడాలేదు. మరి రాహుల్‌ను ప్రధానిని చేస్తానని సోనియాజీ ఏ ఆధారంగా కలలు కంటున్నారు? ఏదో ప్యాకేజీతోనో, కౌన్సిల్‌తోనో తెలంగాణ ప్రజల్ని బుజ్జగించే ప్రయత్నం ఆమె చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అది సాధ్యమయ్యే పనికాదు. తెలంగాణ ప్యాకేజీలను చూసింది. అభివృద్ధి కమిటీలను చూసింది. చరి త్ర నిండా ఉల్లంఘనలను అనుభవించింది. అలాంటి ప్రయ త్నం మరోసారి చేస్తే కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు శాశ్వతంగా బొందపెడతారనే విషయం దగ్గరే సోనియా పునరాలోచలో పడినట్లు తెలుస్తుంది. అందుకే ఈ కాలయాపన అని కూడా వినపడుతున్నది. హైదరాబాద్‌తో కూడిన 1956 అక్టోబర్ 31 నాటి తెలంగాణ తప్ప మరేదానికి మేము అంగీకరించమని కేసీఆర్ ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలకు చెప్పివచ్చానన్నారు. అంతకు మించి ఒక్క ఇంచు కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేసీఆర్ ఇప్పటికే అనేకసార్లు ప్రకటించారు కూడా.

కరీంనగర్ డిక్లరేషన్ సెగ ఢిల్లీకి ఇప్పటికే తాకింది. కాంగ్రెస్ అధిష్ఠానంలో వస్తున్న కదలికలను చూసి సంబరపడాల్సిన పని లేదు. అయితే.ఢిల్లీ నుంచి పిలుపు వస్తే మాత్రం ఎత్తిన కత్తి దించకుండానే చర్చలకు వెళ్లాల్సిందే. చర్చలు చర్చలే! సమరం సమరమే! మునుపటి లాగా ఒకదాని కోసం మరొక దాన్ని పక్కన పెట్టి వెళ్లి మోసపోకూడదని కేసీఆర్ ఇప్పటికే తెలుసుకున్నారు. మరోసారి అలాంటి తప్పిదం కోసం కాంగ్రెస్ పాచికలు వేసినా, మరోసారి మోసపోవడానికి కేసీఆర్ ఏమీ అమాయకుడు కాదు. తెలంగాణ తేగలిగే చర్చలకు కూడా డిసెంబర్ 31లోపే అవకాశం ఉన్నది. ఆ తర్వాత ఏ చర్చలకు పిలిచినా వాటికి అర్థం వుండదు. తెలంగాణను తేల్చకపోతే మాత్రం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ తల రాతను తప్పక మారుస్తారు. కరీంనగర్ డిక్లరేషన్ ఆచరణాత్మకంగా అమలు ఇప్పటికే మొదలైంది. బానిస రాజకీయాలకు తెలంగాణ చరమగీతం పాడబోతున్నది. స్వీయ రాజకీయ అస్తిత్వ జెండాను ఎగరేయబోతున్నది. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఆ జెండానే శాసించబోతున్నది. తన రాష్ట్రాన్ని తానే తెచ్చుకోబోతున్నది. పూటకో మాట మాట్లాడే షిండేలు, ఆజాద్‌లు, వయలార్‌ల వ్యాఖ్యలు కాలానికి నిలబడతాయా, లేక కొట్టుకుపోయి కాంగ్రెస్‌నే ముంచుతాయా అనేది కాలమే తప్పక నిర్ణయించనుంది.

-కల్లూరి శ్రీనివాస్‌డ్డి

35

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ