తెలంగాణకు తిరుగులేని సంతకం


Wed,October 10, 2012 05:46 PM

ఢిల్లీ యాత్ర ముగించుకొని వచ్చిన కేసీఆర్‌లో ఆత్మవిశ్వాసమే కనిపించింది. మొదటి విడుత చర్చలు సఫలమయ్యాయన్నారు. మరో విడుత చర్చలతో తెలంగాణ వచ్చేస్తుందన్నారు. ఢిల్లీ ప్రయత్నాలు సఫలమయ్యాయా విఫలమయ్యాయా అనేది ప్రశ్న కాదు. ముందు కూడా సఫలమవుతాయా లేదా అనేది కూడా పక్కన పెడితే.. తెలంగాణ వంటి ఒక మైనారిటీ ప్రాంతానికి ద్విముఖ వ్యూహం అవసరమని గుర్తించి ఆ దిశగా పనిచేస్తున్న కేసీఆర్... వ్యూహాత్మకంగానైనా, లేదా స్వీయ అస్తిత్వ బలంతోనైనా తెలంగాణ ను సాధించిపెడతారనే నమ్మకం సగటు తెలంగాణవాదికి వుందనడంలో అనుమానం లేదు. తెలంగాణ ఉద్యమపార్టీ అధినేత పట్ల అపోహలు, అపార్థాలు సృష్టించి ప్రజల్ని పక్కదారి పట్టించే సీమాంధ్ర కోవర్టు పార్టీల ప్రయత్నాలు ఇంకా కొనసాగుతాయనుకోలేం.

బక్కపలుచని మనిషి. కానీ మానసిక బలవంతుడు. 12 ఏళ్లుగా బరువైన బాధ్యత మోస్తున్నా డు. ఎగుడు దిగుడులు చూసినోడు. మనోధైర్యం చెదరని వాడు. సహనం, నిబ్బరం, నిబాయింపు, తెగింపు కలగలసిన మనిషి. ఎప్పుడో 1970లో ఇక రాదులే అనుకొని నిరాశలో కూరుకుపోయిన తెలంగాణ సమాజాన్ని 30 ఏళ్ల తర్వాత తట్టి లేపగలిగిన అసలు సిసలైన ఉద్యమ అధినేత ఆయన. అంతా అయిపోయిందనే నిరాశ ఆయన జీవన డైరీలో ఎక్కడా కనిపించదు. నేటి ఓటమిని రేపటి విజయంగా మలుచుకోగల వ్యూహ సంపన్నుడు.

కేసీఆర్ ఉద్యమాన్ని చేపట్టిననాడు ఆయన వెంట పట్టెడుమంది లేరు. ఇవాళ పుట్టె డు మందయ్యారు. జై తెలంగాణ నినాదం పలకని ఊరుగానీ, వాడగానీ, మనిషిగానీ వున్నాడా? నేను తెలంగాణ ప్రాంతం వాడినని చెప్పుకుంటే బతకలేనేనేమోననే ఆత్మన్యూనతా భావ స్థితి నుంచి, నేను తెలంగాణ వాడినేనని సగర్వంగా తలెత్తుకొని బతికే స్థాయికి తెలంగాణ సమాజాన్ని చేర్చగలిగిన అరుదైన నాయకుడాయన. తెలంగాణ పదం నిషేధింపబడ్డ అసెంబ్లీలో సగర్వంగా చట్టబద్ధంగా తెలంగాణ పదాన్ని పలికించిన తెలంగాణ మొదటి ముద్దుబిడ్డ ఆయన. ఇంటా బయటా తెలంగాణకు ఆత్మగౌరవాన్ని ఇప్పటికే సాధించిపెట్టాడు. ఆయన మాటా-బాటా తెలంగాణ ఆత్మ ను ఆవిష్కరిస్తాయి. ఏమో.. కేసీఆర్ తెలంగాణ సాధిస్తాడా అనే అనుమానాలు అప్పుడూ ఇప్పుడూ వున్నాయి. కానీ ఆయన ఎక్కడ మాట్లాడినా, ఆయన ఉపన్యా సం విన్నా.. అప్పటిదాకా అనుమానంలో వున్నవాడికి సైతం నమ్మకం ఏర్పడాల్సిం దే! ఆయన ప్రసంగాలు విన్న ప్రతి తెలంగాణవాడికి కేసీఆర్ తన వాడు, తన ఇంటివాడనే స్ఫురణ తప్పక కలిగిస్తుంది. అందుకే తెలంగాణ ఆత్మకు కేసీఆర్ ప్రతి రూపం గా కనిపిస్తాడు.

కేసీఆర్‌ను పొగిడే వారి సంగతి పక్కన పెడదాం. తెగిడే వారు సైతం అయనలో తెలంగాణ ఆత్మను చూసి గర్వపడతారనడంలో అనుమానం లేదు. ఆయ న భౌతిక స్వరూపం, వ్యవహారిక హావభావాలు, ఆత్మీయ పలకరింపులు, మీడియా తో మాట్లాడే తీరు, ఉపన్యాసాలు.. ఇలా ఆయన యాస, భాషా అన్నీ ప్రజల గుండె ల్లో తెలంగాణకు ప్రతీకలుగా చెరగని ముద్రను వేసుకున్నాయంటే అతిశయోక్తి కాదు.

తెలంగాణ ఏర్పాటును ఆయన ఎప్పుడో అనివార్యం చేయగలిగారు. అది ఇప్పు డా, ఎప్పుడా అనేది మాత్రమే తేలాల్సివుంది. అందరిలాగా ఆయన ఆగమాగం ఎప్పుడూ కాడు. రక్తపు బొట్టు కింద పడకుండా ఇప్పటిదాకా ఉద్యమాన్ని నడుపుకొస్తున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియపై విశ్వాసం వుంచి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో జత కట్టి ఒక రకంగా మోసపోయారు, మరోకంగా ఆ పార్టీల చేత జై తెలంగాణ అని అనిపించాడు. ఇవాళ ఆ రెండు పార్టీల ద్వంద్వ నీతిని ప్రజా కోర్టులో నిలబెట్టగలిగా డు. వ్యూహం ఉన్నవాడు ఎన్నటికీ చెడిపోడంటే ఇదే కావచ్చు! అంతేకాదు రాష్ట్రంలో బలమున్న పార్టీలను, బలంలేని పార్టీలను అన్నిటికీ తెలంగాణ అనివార్యతను సృష్టించగలిగాడు. అంతటి చాణక్యనీతి తెలిసిన ఉత్తమ రాజకీయవేత్త ఢిల్లీకి ఉత్తిత్తిగా పోలేదని సీమాం ధ్ర నేతలు గ్రహించారు. ఆయన ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు అడ్డంకులు సృష్టించారనడంలో అనుమా నం లేదు. కేసీఆర్ తెస్తారనుకున్న తెలంగాణకు తాత్కాలిక ఆటంకం ఏర్పడి వుంటుందని సగటు తెలంగాణవాదికి అర్థం కానిది కాదు. ఒకవేళ ఢిల్లీ పాలకులు మోసం చేస్తే మరుక్షణమే కేసీఆర్ యుద్ధం ప్రకటిస్తారని కూడా ప్రజలకు తెలుసు.

తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వం ఎంత అవసరమో, వ్యూహాత్మకత కూడా అంతే అవసరం. అవసరాన్ని బట్టి రెండింటిని వాడుతూ ముందుకు సాగితేగానీ తెలంగాణ లక్ష్యం నెరవేరదు. అట్లా నడవగలిగిన సమర్థ నాయకుణ్ణి ఇవాళ తెలంగాణ కలిగివుంది. వ్యూహాత్మక ప్రయత్నం చేయడానికి 2012 లోపు వరకు అవకాశం వుంది. అప్పటికీ తేలకపోతే స్వీయ రాజకీయ అస్తిత్వ బలంతో 2014 తదుపరి సాధించుకునే అవకాశం ఎలాగూవుంది. 2012లోపు సాధించే అవకాశాల కోసమే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పొచ్చు. 2014 సాధారణ ఎన్నికలు దగ్గర పడితే సాధించడం సాధ్యం కాదని కేసీఆర్‌కు తెలుసు. అందుకే ఆలోపు తన వ్యూహాత్మక శక్తితో సాధించాలని అనుకుంటున్నారని చెప్పొచ్చు. కేసీఆర్ వ్యూహాత్మక పోరాటం కొందరికి అర్థం కాకపోవచ్చు, తెలంగాణ సాధారణ ప్రజలకు మాత్రం అర్థమవుతున్నదనడంలో అనుమానం లేదు. కేసీఆర్ ఢిల్లీ ప్రయత్నాలను ఒక ప్రయత్నంగా స్వీకరించాలే తప్ప, అవి తెలంగాణను తేలేవనే అపశకునం అక్కర లేదు!

ఉద్యమాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే సాధనాలు. అయినా రాజకీయ ప్రక్రియ అనివార్యం. నేటి అవకాశవాద రాజకీయాల్లో అధికారంలో ఉన్నవారి అవసరాలను సొమ్ము చేసుకొని లక్ష్యాన్ని సాధించడం కూడా రాజకీయ ప్రక్రియలో ఒక భాగమే. కేసీఆర్ 12 ఏళ్లు అలాంటి ప్రయత్నాలు చేశారు. అంతమావూతాన వాటిని విఫల ప్రయత్నాలుగా తేల్చేస్తే అది అజ్ఞానమే అవుతుంది. ఆంధ్రవూపదేశ్ రాష్ట్రంలో తెలంగాణ మైనారిటీ ప్రాంతం. చట్టసభల్లో సీమాంధ్ర పైచేయిలో వుంది. దేశంలో అవకాశవాద రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. మైనారిటీ ప్రాంత ఆకాంక్షలను కాలరాసి కేంద్రం మెజారిటీ ప్రాంతానికి కొమ్ముకాస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అలాంటపుడు మైనారిటీ ప్రాంత నాయకుడికి వ్యూహాత్మకత అవసరం. సమయాన్ని బట్టి ప్రయత్నం చేయాల న్నా, కుదరకపోతే వాతలు పెట్టాలన్నా.. తెలంగాణ వంటి మైనారిటీ ప్రాంత నేతకు అదును చూసి చేయాల్సిన పనులు పనులవి! కేసీఆర్ ఆదిశగానే పని చేస్తున్నారనడంలో సందేహంలేదు.

64 ఏళ్ల నుంచి తెలంగాణలో బతుకుతూ వస్తున్న రాజకీయ పార్టీలు ఈ ప్రాంతానికి న్యాయం చేసే వుంటే.. ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం మనగలిగే దేనా? ఏర్పడినా.. ఉల్లంఘనలు, అన్యాయాలు జరుగుతుంటే ఊరుకునేవేనా? అందుకే కదా మంటికైనా ఇంటోడు కావాలన్నట్లు తెలంగాణకు టీఆర్‌ఎస్ రూపంలో ఓ ఇంటిపార్టీ పుట్టక తప్పింది కాదు. మంచైనా చెడైనా తెలంగాణకు ఓ ఇంటిపార్టీ వుందనే భరోసా ప్రజల్లో ఏర్పడ్డది. దానికి సమర్థుడైన వ్యూహాత్మక నాయకుడున్నాడు. రాష్ట్రంలో మైనారిటీ ప్రాంత నేతగా తెలంగాణ సాధించడానికి అనేక అవరోధాలు తప్పవు. వాటిని మొండిగా ధైర్యంగా ఎదుర్కొంటూ వస్తున్న నాయకుడి అవసరం అనివార్యం. తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి కూడా కేసీఆర్ సిద్ధపడ్డారని వార్త. నిజమే 56 ఏళ్ల నిర్బంధ తెలంగాణ కు విముక్తి కల్పించేందుకు తన పార్టీని కూడా త్యాగం చేయడానికి కేసీఆర్ సిద్ధపడ్డారని చెప్పొచ్చు .అది తన ప్రాంతం కోసం కేసీఆర్‌లోని రాజకీయ త్యాగశీలతను చాటిచెపుతోంది. మనం ఏరంకంగా చూసినా కేసీఆర్ తెలంగాణకు ఒక ఐకాన్! కంప్యూటర్‌లో ఐకాన్ నొక్కనిదే ఏదీ ఓపెన్ కాదు! అలాగే కేసీఆర్ లేని తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ అయినా జై తెలంగాణ అంటుందని మనం ఆశించగల మా? ఎన్ని పార్టీలు జైతెలంగాణ అన్నా, అవి కేసీఆర్ అనేవాడు ఒకడున్నాడు అనే భయంతో మాత్రమే అనగలుగుతున్నాయనడంలో ఎంత నిజముందో... తెలంగాణ ఎప్పుడు వచ్చినా పట్టువదలని విక్రమార్కుడిలాంటి కేసీఆర్ వ్యూహ సమర్థతతోనైనా రావాలి లేదా ఆయన నాయకత్వంలోనే స్వీయ రాజకీయ అస్తిత్వ బలంతో 2014 తర్వాతనైనా రావాలి అనడంలో కూడా అంతే నిజం వుంది. ఇంకా చెప్పా లంటే ఆయన తెలంగాణకు తిరుగులేని సంతకం.

-కల్లూరి శ్రీనివాస్‌డ్డి

35

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ