తిలక్‌బాటలో స్వరాష్ట్రం సాధిద్దాం


Wed,October 10, 2012 07:36 PM

ప్రజలు ఏది సాధించుకోవాలన్నా, సంఘటితమై పోరాడాలన్నా వారి డిమాండ్‌కు వెయ్యేనుగుల బలమిచ్చే ‘నినాదం’ కావాలె. ఆ నినాదం ఇవ్వగలిగే నాయకుడు కావాలె. చరివూతలో అలాంటి నినాదాలను, నాయకులను చూడవచ్చు. బాలగంగాధర్ తిలక్ స్వరాజ్యం నా జన్మహక్కు ’ అని గర్జించిన మొదటితరం యోధుడు. ఆయన ‘స్వరాజ్య’ స్పురణను తట్టిలేపగలిగారు. సాంస్కృతిక సందర్భాలనూ ఉద్యమాలుగా మలచగలిగిన అరుదైన నాయకుడాయన. 1893లో నేటి మహారాష్ట్రలోని పుణేలో గణేశ్ ఉత్సవాలను ఒక సార్వజనిక ఉత్సవంగా, జాతీయ ఉద్యమంగా మార్చగలిగారు. అందుకే అది దేశ స్వాతంత్య్ర పోరాట చరివూతలో చెరగని ముద్రవేయగలిగింది.

బ్రిట్‌ష్ పాలకులకు ప్రజలు భయకంపితులయ్యే కాలమది. ఇంటిదొంగలే విదేశీ పాలకుని పంచన చేరాక సామాన్య ప్రజలకు భయం తప్ప భద్రత ఎక్కడ? ప్రజల భయాన్ని తొలగించడానికి, బ్రిటిష్ పాలనకు ఆర్థిక దిగ్బంధం సృష్టించడానికి ప్రజలను సంఘటిత పరచాలని భావించిన తిలక్ గణేశ్ ఉత్సవాలను సార్వజనిక ఉత్సవాలుగా మలచబూనాడు. గణేశ్ మండపాలు 12 ఏళ్లలో గ్రామక్షిగామానికి విస్తరించాయి. ప్రతి మండపం స్వదేశీ ఉద్యమ కేంద్రంగా మారింది. గణేశ్ ఉత్సవాలు అయిపోగానే కార్యకర్తలను స్వదేశీ ఉద్యమాల వైపు మళ్లించేవారు. ఈ స్వదేశీ ఉద్యమం విదేశీ వస్తు బహిష్కరణకు శ్రీకారం చుట్టి, స్వాతంవూత్యోద్యమానికి ప్రధాన భూమికను పోషించింది. నేటి గణేశ్ ఉత్సవాలు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒత్తిడి తేవడానికి సాధనం కావాలె. ఆనాడు తిలక్ ఇచ్చిన ‘స్వరాజ్య’, ‘స్వదేశీ’ నినాదం ప్రజలను ఎలా కదిలించి ముందుకు నడిపిందో 12ఏళ్లుగా కేసీఆర్ చేస్తున్న ‘స్వరాష్ట్ర’ నినాదం కూడా తెలంగాణ ప్రజలను అలా గే కదిలించింది, నడిపిస్తున్నది. ఎప్పుడో 1970లో ‘ఇక రాదులే’ అనే నిరాశా వాదంలో కూరుకుపోయిన తెలంగాణ సమాజాన్ని 30 ఏళ్ల తర్వాత మళ్లీ తట్టి లేపగలిగారాయన..
1948 వరకు ప్రపంచంలోనే తెలంగాణ సుసంపన్న ప్రాంతం. అలాంటి సంపదను, సర్వస్వాన్ని తెలంగాణ ఈ దేశానికి ధారపోసింది. విలీనమై ఈదేశ ప్రతిష్టను కాపాడింది. కాబట్టి మనం ఏ కోణంలో చూసినా తెలంగాణ ఈ దేశానికి రుణపడిలేదు. ఈ దేశమే తెలంగాణకు రుణపడి వుంది. అయినా ఈ దేశం తెలంగాణ రుణం తీర్చింది లేదు సరికదా.. ఉమ్మడి రాష్ట్రంలో వంచనకు బలిచేసి, ఈ దేశానికి తన సర్వస్వాన్ని త్యాగం చేసిన తెలంగాణ, ఇవాళ స్వరాష్ట్రం కోసం పోరాడాల్సి రావడం, పక్క ప్రాంతం ఒప్పుకుం స్వరాష్ట్రం ఇస్తామని ఢిల్లీ పాలకులు షరతులు పెట్టడం ఘోరం. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజల కోసం మాత్రమే కాదు, ఈ దేశానికీ అవసరం.

పెద్ద రాష్ట్రాల్లోని అసమానతలు దేశానికి శాపాలుగా మారుతున్నాయి. అలాగే పెద్ద రాష్ట్రాల విచ్చలవిడి పాలనలతో దేశం అంతర్గతగా అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాల జోక్యాలకూ గురవుతున్నది. ముఖ్యంగా ప్రపంచీకరణ తర్వాత విదేశీ జోక్యాలు మరింత పెరిగిపోయాయి. చంద్రబాబులు, ములాయంలు, మమతలు, జయలలితలు, కరుణానిధులు, ప్రాంతీయ పార్టీలతో రాష్ట్రాలను సామంత రాజ్యాలుగా ఏలుతుండడానికి కారణం అవి పెద్దవి కావడమే. మరీ పెద్దగా ఉండకుండా సగటు పరిణామం గల రాష్ట్రాల నుంచి అలాంటి బెడద ఏనాడూ లేదు. ప్రపంచ బ్యాంకు జోక్యాలు, దాని పరోక్ష జోక్యాలు పెద్ద రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయి. సగటు రాష్ట్రాలు ఢిల్లీ పాలకుల పరిధి దాటి పనిచేయలేవు. దేశ సార్వభౌమత్వానికి జరుగుతున్న అనర్థాలను దూరం చేయాలంటే తెలంగాణ వంటి సగటు రాష్ట్రాల ఏర్పాటు అవసరం.
దేశానిదైనా, ప్రాంతానిదైనా పీడన పీడనే! తెలంగాణ పీడిత ప్రాంతం. ఎనిమిది ఏళ్లు రాష్ట్రంగా కొనసాగిన తెలంగాణ, అక్రమంగా ఆంధ్రా ప్రాంతంతో విలీనం చేయబడ్డది. ఈ ప్రాంతానికి రాజ్యాంగం ఇచ్చిన హామీలన్నీ ఉల్లంఘించబడ్డాయి. ఉమ్మడి రా ష్ట్రం తెలంగాణ ప్రజలను రెండో శ్రేణి పౌరులను చేసింది.12 ఏళ్లుగా తెలంగాణ మలిదశ ఉద్యమం కొనసాగుతున్నది. మూడేళ్లుగా ప్రజా ఉద్యమంగా మారింది. కేసీఆర్ ఆమరణ దీక్షతో తెచ్చిన ప్రకటనను బయటి పార్టీలు అడ్డుకున్నాయి. తెలంగాణ ప్రజలకున్న రాజకీయ హక్కునే అవి పాతరపె బ్రిటిష్ కాలంలో ఇంటిదొంగల బెడద ఉన్నట్లుగానే, ఇప్పుడు తెలంగాణ కు ఇంటిదొంగల బెడద తప్పింది కాదు. ఉద్యమాన్ని దొంగదెబ్బ కొట్టేందుకే బయటిపార్టీలు ఇంటిదొంగలను అస్త్రాలుగా ఉపయోగిస్తున్నాయి. అయినా నాటి ‘స్వదేశీ’ నినాదానికి తిలక్ ఎలా స్పూర్తి ప్రదాతగా ఉన్నరో, నేడు తెలంగాణ ‘స్వరాష్ట్ర’ డిమాండ్‌కు కేసీఆర్ కూడా స్పూర్తి ప్రదాతగా వున్నారు. అందుకే తెలంగాణ డిమాండ్ సాధించే చివరి అంకానికి చేరుకోగలిగింది.

ఓవైపు తెలంగాణ మార్చ్ జరగబోతున్నది. ఇంకో వైపు ఢిల్లీ పాలకుల సంకేతాలను అందుకొని తెలంగాణ సాధించగలిగే అవకాశాలను కేసీఆర్ కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు తెగింపు ఉద్యమం ఎంత అవసరమో, వ్యూహాత్మక ప్రయత్నాలు కూడా అంతే అవసరం. ఢిల్లీ సంకేతాలు తెలంగాణ తేగలగాలన్నా, తెలంగాణ మార్చ్‌తో ఢిల్లీపాలకులపై ఒత్తిడి పెరగాలన్నా గణేశ్ ఉత్సవాలు అందుకు అద్భుతంగా ఉపయోగ పడగలగాలె. యావత్ తెలంగాణ గణేశ్ ఉత్సవాలకు పేరెన్నికగన్నది. ముఖ్యంగా మూడు దశాబ్దాలుగా గణేశ్ ఉత్సవ మండపాలకు తెలంగాణ 10జిల్లాలు, ప్రతి గ్రామం నిలయమైనాయి. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ వేలాది గణేశ్ మండపాలతో ప్రపంచ గుర్తింపునే పొందింది. ఇంత గొప్ప సార్వజనికోత్సవం తెలంగాణ స్వరాష్ట్ర పోరాటానికి ఉపయోగపడాలి. ఇప్పటికే యువత తెలంగాణ ఉద్యమంలో ముందుంది. అదే యువత గణేశ్ మండపాల నిర్వహణలోనూ ముందున్నది. కాబట్టి గణేశ్ ఉత్పవాలు, నిమజ్జన ఊరేగింపులు ఉద్యమ స్పూర్తిని మరింత రగిలించాలె. జై గణేశా నినాదానికి , జై తెలంగాణ నినాదమూ తోడు కావాలె. తెలంగాణ వ్యాప్తంగా ఆ నినాదాలు మారుమోగాలె. ఆనాడు గణేశ్ ఉత్సవాలు ‘స్వదేశీ’ఉద్యమాన్ని నిర్మించాయి. ఈరోజు అవే గణేశ్ ఉత్సవాలు ‘స్వరాష్ట్ర’ ఉద్యమానికి తిరుగులేని బలాన్నివ్వాలె.

- కల్లూరి శ్రీనివాస్‌డ్డి

35

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ



        


country oven

Featured Articles